చర్లపల్లి, చంచల్ గూడలో జామర్లు: వీకే సింగ్
Published Tue, Sep 30 2014 6:24 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. కరప్షన్ ప్రీ అడ్మిస్ట్రేటివ్ అడ్మిషన్లకు కృషి చేస్తున్నామని వీకే సింగ్ మీడియాకు తెలిపారు.
అవినీతిక అడ్డుకట్ట వేయలేకపోతే పూర్తి బాధ్యత నాదేనని ఆయన అన్నారు. 3 నెలల కాలంలో జైళ్లలో అవినీతిని నిర్మూలిస్తామన్నారు. చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలో జామర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని జైళ్ల శాఖలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యదానం కార్యక్రమం ఖైదీలలో మంచి సత్పలితాలను ఇస్తోందని వీకేసింగ్ చెప్పారు.
Advertisement