అక్రమ జామర్స్‌తోనే కాల్‌ డ్రాప్స్‌ | COAI raised concerns about the illegal sales and usage of wireless jammers and repeaters | Sakshi
Sakshi News home page

అక్రమ జామర్స్‌తోనే కాల్‌ డ్రాప్స్‌

Published Wed, Feb 5 2025 8:54 AM | Last Updated on Wed, Feb 5 2025 9:03 AM

COAI raised concerns about the illegal sales and usage of wireless jammers and repeaters

విద్యా సంస్థలు, గృహాలు, కంపెనీల్లో ఏర్పాటు చేసిన అక్రమ జామర్స్, రిపీటర్స్‌తో మొబైల్‌ నెట్‌వర్క్స్‌ సేవల నాణ్యత క్షీణిస్తోందని టెలికం కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (COAI) ప్రభుత్వానికి నివేదించింది. వాటి కారణంగానే వినియోగదారులకు కాల్‌ డ్రాప్స్, డేటా వేగం తగ్గుతోందని తెలిపింది. అక్రమంగా జామర్స్, రిపీటర్స్‌ను వినియోగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా తదితర సంస్థలు సీవోఏఐలో సభ్యులుగా ఉన్నాయి. కాల్‌ డ్రాప్స్‌కు వాటే జామర్స్‌ను ఉపయోగించడం టెలికమ్యూనికేషన్స్‌ చట్టం 2023 ప్రకారం నేరమని, వాటి వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా సీవోఏఐ కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు రాయాల్సిందిగా టెలికం శాఖను అభ్యర్థించింది. ఈ పరికరాలను అమెజాన్‌(Amazon) ఇండియా విక్రయిస్తోందని తెలిపింది. టెలికమ్యూనికేషన్‌ను నిరోధించే ఏదైనా పరికరాలను అక్రమంగా కలిగి ఉంటే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారని సీవోఏఐ వివరించింది.  

తయారీ స్టార్టప్‌లపై ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ దృష్టి

అంకుర సంస్థల కోసం కొత్తగా ప్రకటించిన రూ.10,000 కోట్ల ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ స్కీమ్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) ప్రధానంగా తయారీ, హై–టెక్నాలజీ రంగాలకు చెందిన స్టార్టప్‌లపై దృష్టి పెట్టనున్నట్లు పరిశ్రమలు, అంతర్గాత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్‌ సింగ్‌ భాటియా తెలిపారు. రెండో విడత ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌లు (ఏఐఎఫ్‌), సిడ్బీ మొదలైన వాటితో సంప్రదింపులు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 17,600 సంస్థల మూసివేత..

2016లో రూ.10,000 కోట్లతో ప్రకటించిన తొలి విడత ఎఫ్‌ఎఫ్‌ఎస్, అంకురాల పెట్టుబడుల అవసరాలను తీర్చే ఏఐఎఫ్‌ వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడినట్లు వివరించారు. దీని కింద 1,180 స్టార్టప్‌లకు ఏఐఎఫ్‌ల ద్వారా రూ.21,700 కోట్ల మేర పెట్టుబడులు సమకూరినట్లు పేర్కొన్నారు. తొలి విడత ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ కాలపరిమితి 10 ఏళ్లుగా ఉండగా, హై–టెక్నాలజీ అంకురాల దీర్ఘకాలిక నిధుల అవసరాలను తీర్చే విధంగా కొత్త స్కీము కాలపరిమితిని 14–15 సంవత్సరాలుగా నిర్ణయించవచ్చని భాటియా వివరించారు. డెట్‌ ఫండ్స్‌ను ప్రవేశపెట్టే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement