
న్యూఢిల్లీ: గత స్పెక్ట్రం కొనుగోళ్లకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం వల్ల టెల్కోలపై గణనీయంగా ఆర్థిక భారం తగ్గుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ సీవోఏఐ తెలిపింది. దీనితో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి నిధుల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొంది.
2022కి ముందు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం సంస్థలు బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలన్న నిబంధన నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
దీనితో ప్రధానంగా వొడాఫోన్ ఐడియాకు భారీగా ఊరట లభించనుంది. వొడాఫోన్ ఐడియా రూ. 24,747 కోట్ల బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉండగా, దానికి గడువు కూడా ముగిసిపోయింది. అటు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోకి కూడా ఊరట లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment