రైలు ఇంజన్‌ ఢీకొని ముగ్గురు మృతి | Rail Accident Take Place aT Vikarabad Railway Station Employees Dead | Sakshi
Sakshi News home page

మూసీ నది బ్రిడ్జిపై ప్రమాదం.. మృతులు రైల్వే ఉద్యోగులు

Published Wed, Jul 22 2020 3:07 PM | Last Updated on Wed, Jul 22 2020 4:09 PM

Rail Accident Take Place aT Vikarabad Railway Station Employees Dead - Sakshi

సాక్షి, రంగారెడ్డి: వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలు ఇంజన్‌ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైలు ఇంజన్‌ హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వస్తోంది. ఇది గమనించి ఉద్యోగులు అక్కడి నుంచి తప్పుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. దాంతో ఇంజన్‌ ఢీకొని ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగులు అక్కడిక్కడే మరణించారు. మృతి చెందిన వారిని నవీన్ (34), శంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement