Odisha Train Accident: ఒడిశా పెను విషాదంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా విచారం ప్రకటించారు. ఏకకాలంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన ఒక విషాదం. ఓం శాంతి అంటూ ఆయన ట్వీట్ చేశారు.
“ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగనివ్వకూడదు. ఈ విషాదానికి మూలకారణాన్ని తెలుసుకోవాలి. మానవ తప్పిదమైనా లేదా సాంకేతిక తప్పిదమైనా, ఇంత వినాశనానికి దారితీయకూడదు. రైల్వే ఆపరేషన్‌లోఫెయిల్-సేఫ్ మెకానిజమ్ వ్యవస్థను మరోసారి సమీక్షించుకోవాలి’’ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.
కాగా ఒడిశా బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 261కి చేరింది. అత్యంత ఘోరమైన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ దుర్ఘటనపై సర్వత్రా తీవ్ర సంతాపం వెల్లు వెత్తుతోంది.
A tragedy the scale of which requires the entire country to pause in silent reflection, in memory of those who have lost their lives. Om Shanti🙏🏽 We cannot let such accidents happen again. We must get to the root cause of this tragedy. Whether human or technical error, neither… https://t.co/fxs2k387YG
— anand mahindra (@anandmahindra) June 3, 2023
Comments
Please login to add a commentAdd a comment