ఒడిశా: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రైల్వే భద్రతా కమీషనర్ నేతృత్వంలో జరుగుతున్న విచారణలో ఘోర ప్రమాదానికి కారణమైన ఏడుగురు అద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దక్షిణ తూర్పు రైల్వే శాఖ. వీరిలో ఇదే కేసులో అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా దక్షిణ తూర్పు రైల్వే డివిజన్ మేనేజర్ అనిల్ కుమార్ మిశ్రా మీడియా సమావేశాన్ని నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన అధికారులు ఏమాత్రం జాగ్రత్త వ్యవహరించి అప్రమత్తంగా ఉన్నా ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని, వారి నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయనన్నారు. మొదట అరెస్టైన ముగ్గురు, 24 గంటల క్రితం అరెస్టైన మరో ఉద్యోగి తోపాటు మరో ముగ్గురుని సస్పెండ్ చేస్తున్నట్లు అనిల్ మిశ్రా తెలిపారు.
అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లకు మరో నాలుగు రోజుల రిమాండ్ పొడిగించాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే.
జూన్ 2న బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1200 మందికి పైగా గాయపడ్డారు. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటనలో ఎందరో దిక్కులేని వారయ్యారు. ఇంకెందరో నిరాశ్రయులయ్యారు. ఇప్పటికింకా 41 మృతదేహాలను గుర్తించడానికి ఎవ్వరూ రాకపోవడం అత్యంత విచారకరం.
#OdishaTrainTragedy: Seven Railway staff including the three employees, who were earlier arrested, suspended, informs South-Eastern Railway GM Anil Kumar Mishra #Odisha pic.twitter.com/MbL6jHYNsp
— OTV (@otvnews) July 12, 2023
ఇది కూడా చదవండి: కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..?
Comments
Please login to add a commentAdd a comment