ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అయినవారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఆ మృతదేహాల ముందే విలపిస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నవారికి ఈ ఘటనను ఎలా తెలపాలో తెలియని దయనీయ స్థితిలో మరెందరో ఉన్నారు. తన చేతులతోనే కన్న కొడుకు మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లానని చెప‍్తూ ఓ తండ్రి కన‍్నీటి పర్యంతమయ్యారు.
సుగాలి చెన్నైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. ఈ రైలు ప్రమాదంలో సుగాలి పెద్ద కుమారుడు సుందర్‍తో పాటు బామ్మర్ధి దిలీప్ కూడా మరణించాడు. తన చిన్న కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 'మేమంతా తొమ్మిది మందిమి చెన్నైకి బయలుదేరాము. డబుల్ డ్యూటీ చేస్తేనే నెలకు 17,000 సంపాదిస్తాను. ఊర్లో ఉపాది లేక నా కుమారులను కూడా ఏదైనా ఉద్యోగం చేపించాలని చెన్నైకి తీసుకువస్తున‍్నాను. కానీ మృత్యువు ప్రమాదం రూపంలో ఎదురైంది. నా కొడుకు మృతదేహాన్ని నా చేతులతోనే మోయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో బాధితులు కుప్పలుగా పడి ఉన్నారు.' అని సుగాలి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే.. మూడు రైళ్లు..
తపసి సర‍్ధార్(22) హౌరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో వ్యవసాయ కూలీగా ఏడు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్న 11 మంది సభ్యుల్లో ఒకరు. ' అంతా గందరగోళం. అరుపులు, ఏడుపులు వినిపించాయి. నా తలకు ముఖంపై గాయాలయ్యాయి. ఇంకా నాలుగు గంటలైతే మా స్టాప్ వచ్చేది. అమ్మను కలిసేవాడిని.' అని విలపించాడు.
గోపాల్ మిర్దా(40), అతని భార్య అంజు దేవి జార్ఖండ్ గడ్డా జిల్లాకు చెందినవారు. బెంగళూరులోని నర్సరీలో రెండు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్నారు. ' నా కొడుకుని మా అమ్మే చూసుకుంటుంది. ఇటీవల ఆవిడ ఆరోగ్యం బాగుండట్లేదు. అందుకే ఇంటికి వెళ్లి వారిని చూసుకుందామనుకున్నాం. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తలకు గాయాలయ్యాయి.' అని దుఖంతో చెప్పారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు.
ఇదీ చదవండి:Odisha Train Accident: ఈ పాపం ఎవరిది?..ఇది సాంకేతిక సమస్య లేదా మానవ లోపమా?..
Comments
Please login to add a commentAdd a comment