cbi charge sheet
-
బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ
భువనేశ్వర్: అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపిన బాలాసోర్ రైలు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలుస్తూ బాలాసోర్ రైల్వే ప్రమాదంలో 290 మంది మరణానికి కారణమైంది. సిగ్నల్ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తూ అందుక్కారణమైన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లను జూలైలోనే అరెస్టు చేయగా తాజాగా వారిపై హత్యానేరం తోపాటు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారని చార్జిషీటులో అభియోగాలను మోపింది సీబీఐ. బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ వద్ద LC గేటు నెంబర్ 79 సర్క్యూట్ దయాగ్రామ్ ఆధారంగా మరమ్మతు పనులను పర్యవేక్షించిన మహంత అన్ని పనులు పూర్తయిన తర్వాత విధి నిర్వహణలో అలసట కనబరుస్తూ టెస్టింగ్ నిర్వహించాలి. అందులో ఏమైనా వైఫల్యాలు ఉంటే మార్పులు చేసి వాటిని సరిచేయాలి. కానీ మహంత నిర్లక్షయంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్‌లాకింగ్ ఇన్స్టాలేషన్ కూడా ప్రణాళికాబ్యాద్మగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. #BREAKING | Central Bureau of Investigation (CBI) files chargesheet in Balasore Train accident case. #CBI #BalasoreTrainAccident #Balasore #BalasoreTrainTragedy WATCH #LIVE here- https://t.co/6CjsNJ9CEq pic.twitter.com/9rSEOROykp — Republic (@republic) September 2, 2023 ఇది కూడా చదవండి: వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
SC on Viveka Case : పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ : వివేకా హత్య కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్ ఇవ్వాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం.. ఈ వ్యవహారంలో పూర్వపరాల గురించి అడిగింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు గడువు ముగియడంతో.. సిబిఐ తన కౌంటర్ దాఖలు చేయలేదు. సునీత ఏం కోరింది? ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిబిఐ చేసిన దర్యాప్తుకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలంటూ పిటిషనర్ సునీత సుప్రీంకోర్టును అడిగింది. పిటిషనర్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన ఈ వ్యవహారంలో ఈ పరిస్థితుల్లో కేసు డైరీ వివరాలను పిటిషనర్‌కు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. గంగిరెడ్డి లాయర్ ఏం కోరారు? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని, ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశం అని పేర్కొన్న సుప్రీం కోర్టు, సునీత పిటిషన్ తో పాటు గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఏపీ పోలీసులు ఏం కనుగొన్నారు? సిబిఐ ఏం తేల్చింది? వివేకానందరెడ్డి హత్య 15 మార్చి, 2019న జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని కూడా నియమించింది. ఆ కేసును క్షుణ్ణంగా విచారణ చేసిన నాటి ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తమ నివేదికను CBIకి అప్పగించారు. ఈ నేపథ్యంలో అసలు అప్పటి పోలీసులు ఏమని నివేదించారు? ఇప్పుడు తాజాగా CBI దర్యాప్తులో ఏం కనిపెట్టిందన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. CBIకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటీ? ఈ కేసులో రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేయాలి నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలి జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలి అనంతరం ఈ కేసులో తర్వాతి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. -
‘సీబీఐ చార్జిషీట్‌ను చాలెంజ్ చేస్తాం.. ప్రజలకు వాస్తవాలు తెలియాలి’
తాడేపల్లి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశానికి సంబంధించి ఎల్లో మీడియా అంతా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చార్జిషీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అప్పుడు కుట్ర చేశారని, ఇప్పుడు అంతకంటే ఎక్కువ కుట్ర చేస్తున్నారని సజ్జల అన్నారు. బాధితులనే నిందితులుగా చేర్చే కుట్ర జరుగుతుందన్న సజ్జల.. సీబీఐ చార్జిషీట్‌ను కచ్చితంగా చాలెంజ్ చేస్తామన్నారు. ఈ హత్య కేసులో ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉందని, చార్జ్‌షీట్‌లో సంబంధం లేని వ్యక్తులపై కుట్ర జరుగుతుందన్నారు. ఈ రోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘నాడు వివేకా హత్యకు ఎంత కుట్ర చేశారో.. నేడు అంతకంటే ఎక్కువ కుట్ర జరుగుతోంది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. వివేకా హత్య ఘటన వైఎస్ జగన్‌ను బాగా కుంగదీసింది. సత్యదూరమైన, అసంబద్ధమైన కథనాలు ప్రచారం చేస్తున్నారు. హత్య అని తెలియజేసే లేఖను సాయంత్రం వరకూ ఎందుకు బయటపెట్టలేదు. మార్చి 15న ఘటన జరిగినప్పటి నుంచి మే30వరకూ టీడీపీ ప్రభుత్వమే ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కూడా అధికారులు కంటిన్యూ అయ్యారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వివేకా. సీబీఐ చార్జిషీట్ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉంది. ఎంపీ టికెట్ కోసం వివేకా హత్య జరిగిందనే కోణంలో చార్జిషీట్లో కథనం రాయడం పూర్తి అసంబద్ధం. అవినాష్ గెలుపు కోసం చివరి క్షణం వరకూ వివేకా కృషి చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జ్‌షీట్ పేరుతో తప్పుడు కథనాలు, సత్యదూరమైన అసంబద్ధమైన కథనాలు ప్రసారం చేస్తున్నారు. కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీని, ఎంపీ అవినాష్‌ను అప్రతిష్ట పాల్జేసే కుట్ర. ఎల్లో మీడియా అంతా పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తోంది. చార్జిషీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు. ప్రతీదాన్ని రాజకీయం చేయడం టీడీపీకి అలవాటే. వివేకా హత్య వెనుక టీడీపీ హస్తం ఉండి ఉంటుంది. ఈ సోకాల్డ్ చార్జిషీట్ చూసిన తర్వాత అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలని అంతా కోరుకుంటున్నారు’ అని సజ్జల తెలిపారు. -
రుణాల పేరిట రూ.1,285 కోట్ల మోసం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ వ్యాపార సంస్థ బ్యాంకులను రుణాల పేరిట మోసం చేసింది. దాదాపు రూ.1,285 కోట్ల మేరకు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక సమీపంలో ఉన్న గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవే ట్ లిమిటెడ్ సంస్థకు శేరిలింగంపల్లికి చెందిన లక్ష్మీనారాయణశర్మ మేనేజింగ్ డైరెక్టర్‌గా, సీఈవోగా, డైరెక్టర్లుగా ఢిల్లీకి చెందిన అర్జున్‌సింగ్ ఒబెరాయ్, నేహా గంభీర్, గచ్చిబౌలికి చెందిన యశ్‌దీప్‌శర్మలు ఉన్నారు. వీరంతా కలిసి తమ సంస్థ వ్యాపారాభివృద్ధికి రుణం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడాను ఆశ్రయించారు. అడిగిన రుణం భారీగా ఉండటంతో బ్యాంక్ ఆఫ్ బరోడా తనతో పాటు యూబీఐ, కెనరా బ్యాంక్, జమ్మూ కశ్మీర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలతో కలిసి కన్సార్షియంగా ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకుల కన్సార్షియానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నేతృత్వం వహించింది. 2009 నుంచి 2015 వరకు వివిధ దశల్లో గోల్డెన్ జూబ్లీ హోటల్స్ సంస్థ రూ.వందల కోట్ల రుణాలు పొందింది. ఈ రుణాలను అక్రమ మార్గంలో ఇతర సంస్థ లకు మళ్లించినట్లు గుర్తించారు. వీరి చర్యలతో కన్సార్షియానికి మొత్తంగా రూ. 1,285.45 కోట్లు నష్టం వాటిల్లింది. ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ అక్రమాలన్నీ వెలుగు చూశాయి. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ( చదవండి: కరోనా డెంజర్ బెల్స్.. నాలుగు రోజుల్లోనే డబుల్! ) -
ఇండియాకు వెళ్తే నిన్ను చంపేస్తా : నీరవ్ మోదీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పై శనివారం క్రిమినల్ చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మహారాష్ట్ర స్పెషల్ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్‌భాయ్ లాడ్ ను చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ తెలిపింది. 'కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఆశిష్ లాడ్ కూడా ఉన్నారు. కాగా ఈ కేసులో ఆశిష్ లాడ్ అరెస్టవ్వకుండా ఉండేందుకు దుబాయ్ ద్వారా కైరో వెళ్లి తలదాచుకున్నాడు. జూన్ 2018లో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నఆశిష్ లాడ్‌ను తన సోదరుడు నేహాల్ మోదీ ద్వారా నీరవ్ మోదీ ఫోన్లో నువ్వు తిరిగి ఇండియాకు వెళితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని' సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. నీరవ్‌మోదీ మాట్లాడక ముందు అతని సోదరుడు నేహాల్ మోదీ ఆశిష్‌కు యూరోపియన్ కోర్టులో జడ్జి ముందు నీరవ్ మోదీకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ రూ. 20 లక్షలు ఆఫర్ చేశారు. అయితే దీనిని ఆశిష్ లాడ్ తిరస్కరించడంతో నిన్ను చంపేస్తామంటూ నీరవ్ మోదీ బెదిరింపులకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టవ్వకుండా ఉండేందుకు నీరవ్‌మోదీ విదేశాలకు పారిపోయాడు. దీంతో నీరవ్‌మోదీని తిరిగి రావాలంటూ భారతదేశానికి చెందిన పలు దర్యాప్తు సంస్థలు, కోర్టులు సమన్లు జారీ చేసిన తిరిగి రాకపోవడంతో అతనిపై ఫ్యజిటివ్ ఎకనమిక్ అపెండర్ చట్టం కింద పలాయన ఆర్థిక నేరస్తుడిగా పేర్కొంది. నీరవ్ మోదీ ప్రస్తుతం నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అతని మామ మెహుల్ చోక్సీతో కలిసి బ్యాంకుకు రూ .13,570 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నీరవ్ మోదీను ఈ ఏడాది మార్చిలో స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ములాయంకు సీబీఐ క్లీన్చిట్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల్లో వాస్తవం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తును 2013 ఆగస్టు 7న ముగించామనీ, ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆధారాలేవీ తమకు లభించలేదని కోర్టుకు సీబీఐ చెప్పింది. ఈ కేసుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించింది. ములాయం, ఆయన కొడుకు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, మరో కుమారుడు ప్రతీక్ యాదవ్, అఖిలేశ్ భార్య డింపుల్ తదితరులపై అక్రమాదాయ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు విశ్వనాథ్ చతుర్వేది 2005లో పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా 2007లో సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణను నిలిపివేయాలంటూ ములాయం, ఆయన కొడుకులు వేసిన పిటిషన్‌ను 2012లో సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ, దర్యాప్తు కొనసాగించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటికీ డింపుల్ ప్రభుత్వ పదవిలో లేనందున ఆమెపై మాత్రం విచారణ నిలిపేయాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. 2012లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాము విచారణ కొనసాగించగా, అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించారనేందుకు తమకు ప్రాథమిక ఆధారాలేవీ లభించలేదని సీబీఐ తన 21 పేజీల అఫిడవిట్లో పేర్కొంది. 2013 ఆగస్టు 7 నాటికే ఈ కేసులో విచారణను ముగించామంది. ప్రాథమిక ఆధారాలు కూడా లేనందున ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని సీబీఐ తెలిపింది. -
క్విడ్‌ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు
హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మంగళవారం మూడు చార్జ్షీట్లు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్‌కు సంబంధించిన ఈ మూడు చార్జ్షీటులు వేసింది. నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందున... సీబీఐ ఈ ఛార్జ్షీటులను గగన్ విహార్‌లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయితే ఎనిమిది, తొమ్మిది తేదీలు సెలవులు కావటంతో సీబీఐ అధికారులు నేడు చార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ సీబీఐ అయిదు చార్జ్ షీట్లు దాఖలు చేసింది. కాగా సీబీఐ డిఐజి వెంకటేశ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి 15 నెలలుగా జైల్లో ఉన్నారు.