క్విడ్ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు
హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మంగళవారం మూడు చార్జ్షీట్లు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్కు సంబంధించిన ఈ మూడు చార్జ్షీటులు వేసింది. నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందున... సీబీఐ ఈ ఛార్జ్షీటులను గగన్ విహార్లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయితే ఎనిమిది, తొమ్మిది తేదీలు సెలవులు కావటంతో సీబీఐ అధికారులు నేడు చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ సీబీఐ అయిదు చార్జ్ షీట్లు దాఖలు చేసింది. కాగా సీబీఐ డిఐజి వెంకటేశ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి 15 నెలలుగా జైల్లో ఉన్నారు.