quid pro quo case
-
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బాబు.. మొన్నటివరకు విర్రవీగారు.. ఇప్పుడేమైంది..
ఇంతకాలం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు ఏమని అంటుండేవి? ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వెంట్రుక కూడా పీకలేరని, వారేమిటి? స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు కూడా ఏం పీకుతారు? అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. పైగా ఎదురు డబాయించడం. వాళ్లను బ్యాన్ చేస్తా! వీళ్లను బ్యాన్ చేస్తా? నేను గెలిచాక పోలీసుల సంగతి చూస్తా! జగన్‌కు ట్రీట్మెంట్ ఇస్తా అంటూ ఇష్టారీతిన బెదిరించడం చంద్రబాబుకు అలవాటైంది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే అంతలా మాట్లాడుతుంటే, అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిస్సహాయంగా చూస్తూ ఉంటారా? ఈ సరికే అనేక కేసులలో చంద్రబాబు అండ్ కో ఏ రకంగా నిందితులో జగన్ అసెంబ్లీలోనే తెలియచెప్పారు. అప్పట్లో చంద్రబాబుకు న్యాయ వ్యవస్థలో ఉన్న బలం ఆధారంగా కేసులు ముందుకు వెళ్లకుండా నెగ్గుకు రాగలిగారు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! అప్పుడప్పుడు ఆయనకు కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన పై వచ్చిన అవినీతి అభియోగాల మీద విచారణకు వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా తమను ఏమీ పీకలేరని టీడీపీ నేతలు సవాల్ చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది. రాజధాని భూములలో క్విడ్ ప్రోకో జరిగిందని చెబుతున్న కేసులో ఆస్తుల జప్తునకు సిఐడీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో టీడీపీ నేతలు గగ్గోలు పెట్టడం ఆరంభించారు. అమ్మో! ఇంకేముంది ఇదంతా రాజకీయ వేధింపే అంటూ ప్రచారం ఆరంభించారు. వారికి మద్దతు ఇచ్చే పత్రిక ఒకటి జగన్ టీడీపీ నేతలను వేటాడమన్నారని ఏకంగా కథనాన్ని రాసింది. మరో టీడీపీ పత్రిక చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లును జప్తు చేశారని పేర్కొంది. అదేదో చంద్రబాబుకు సంబంధం లేని భవంతి అని జనం అనుకోవాలన్నది వారి తాపత్రయం కావచ్చు. అసలు ప్రభుత్వం చేసిన అభియోగం ఏమిటి? రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్‌కు ప్రభుత్వపరంగా లాభం చేసి, ప్రతిఫలంగా చంద్రబాబు ఆయనకు చెందిన ఇంటిని పొందారన్నది ఆరోపణ. దీనినే క్విడ్ ప్రోకో అంటారు. గతంలో ఒక వ్యక్తిగా జగన్ పరిశ్రమలు పెడితే, వాటిలో ఎవరైనా పెట్టుబడులు పెడితేనే చంద్రబాబు బ్యాచ్ క్విడ్ ప్రోకో అంటూ ఆరోపించేది. దానికి సోనియాగాంధీ కూడా తోడై అక్రమ కేసులు పెట్టి ఆయనను నెలల తరబడి జైలులో ఉంచారు. మరి చంద్రబాబు ఏకంగా కొందరికి అనుచిత లబ్ది చేకూర్చి ఒక భవంతిని తీసుకుంటే ఏమనాలి? బహుమతి అని వినసొంపైన పేరు పెట్టినా, దానినే లంచం అని కూడా అంటారు కదా! ఈ ఇంటికి సంబంధించి చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా మాట్లాడారు? ఒకసారి ఇది ప్రభుత్వ భవనం అని, పూలింగ్ లో వచ్చిందని, తను సీఎంను కనుక అందులో ఉంటున్నానని అన్నారు. ఈ ఒక్క భవనాన్ని మాత్రమే ఉంచుతామని, మిగిలిన నదీతీర భవనాలను తొలగించి టూరిజం అభివృద్ది చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఆయన పదవీకాలంలో ఆ పనిచేయలేదు. నిజానికి అసలు ఆయన ఉంటున్న కట్టడమే అక్రమ నిర్మాణం. నదీ తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించిన కట్టడం. గతంలో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వస్తే అప్పటి టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవలో తిరుగుతూ ఈ అక్రమ కట్టడాలన్నిటిని తమ ప్రభుత్వం కూల్చి వేస్తుందని చెప్పారు. ఈ కట్టడాల వల్ల నది ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబే అందులో నివాసానికి దిగేసరికి ఎక్కడివారక్కడ నోరు మూసుకోవలసి వచ్చింది. హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడడానికి రాత్రికి, రాత్రే చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఇది. పర్యావరణవేత్లలు చెప్పినా, అధికారులు చెప్పినా, అదే అక్రమ కట్టడంలో ఉండడానికి చంద్రబాబు ఇష్టపడ్డారు. అప్పట్లోనే చంద్రబాబు ఈ ఇంటిని తీసేసుకున్నారని ప్రచారం జరిగేది. ఇంటి యజమాని లింగమనేని రమేష్ కూడా తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని ప్రకటించారు. అది చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద బహుమతిగా పొందారని, కోట్ల రూపాయల విలువైన ఆ భవంతిని ఆయన అలా పొందడం చట్ట విరుద్దమని సీఐడీ కేసు పెట్టి , భవనాన్ని జప్తు చేసింది. లింగమనేని రమేష్‌కు చంద్రబాబు ఏ రకంగా ఉపయోగపడ్డారు? ముందస్తు సమాచారం ద్వారా రమేష్‌కు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరించారని, అమరావతి రాజధాని గ్రామాల చుట్టూరా రింగ్ రోడ్డు ప్లాన్ వేసినప్పుడు రమేష్ భూములు ప్రభుత్వ భూ సమీకరణలో పోకుండా అలైన్ మెంట్ లో మార్పులు చేశారని సీఐడీ ఆరోపణ. చంద్రబాబుకు కుటంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి చెందిన భూమి పోకుండా, రింగ్ రోడ్డు పక్కనే తమ భూమి ఉండేలా ప్లాన్ మార్చుకున్నారన్నది మరో అభియోగం. హెరిటేజ్ సంస్థ కూడా ముందస్తుగానే కంతేరు ప్రాంతంలో 14 ఎకరాల మేర కొనుగోలు చేసింది. అది అప్పట్లోనే వివాదాస్పదం అయింది. చంద్రబాబు అద్దెకు ఉంటున్నందునే ఆ ఇల్లు ను జప్తు చేశారన్నట్లుగా టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఉత్త పుణ్యానికి చంద్రబాబు ఆ ఇంటిని పొందారన్నది ఆరోపణ. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది ప్రభుత్వ భవనమని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక అది ప్రైవేటు బిల్డింగ్ అని అసెంబ్లీలో చెప్పడం విశేషం. ప్రభుత్వ భవనం అయితే దానిని ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసి ఉంటుంది. లేదా ప్రతిపక్ష నేత హోదాలో దానిలో ఉంటున్నానని చెప్పవచ్చు. అలాకాకుండా మళ్లీ లింగమనేనికి ఎలా వెళుతుంది? ఒకవేళ నిజంగానే లింగమనేని నుంచి అద్దెకు తీసుకుని ఉంటే, సంబందిత అద్దె లావాదేవీలు ఎందుకు చూపించలేదు? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం దొరకడం లేదు. ఆయన తరపున కొందరు టీడీపీ నేతలు మాత్రం యథా ప్రకారం ఇదంతా కక్ష అని విమర్శిస్తూ మాట్లాడారు. నారాయణ సమీప బంధువులు లేదా ఆయన విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బంది పేరుతో ముందుగానే భూములు కొనుగోలు చేయించి, ఆ తర్వాత అధిక లాభం పొందాలని నారాయణ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించినవారిని సీఐడీ విచారించింది. వారు తమ సాక్ష్యాలలో ఆ భూములు నారాయణవేనని వెల్లడించారట. తాజాగా ఈ లావాదేవీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రెండున్నర ఎకరాల వాటా ఉందని వార్త వచ్చింది. చంద్రబాబు, పవన్ లు ఇద్దరికి లింగమనేని సన్నిహితుడు కావడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం మార్పు చేసిన అలైన్ మెంట్ కనుక అమలు అయి ఉంటే వేల కోట్ల రూపాయల లబ్ది వీరికి అక్రమంగా జరిగి ఉండేదని సీఐడీ అంచనా వేసింది. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పాలి. హైదరాబాద్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గాను భూ సేకరణ జరిగింది. ఆ టైమ్ లో తెలుగుదేశం నేతలు పలు ఆరోపణలు చేస్తుండేవారు. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తో పాటు కొందరు టీడీపీ నేతలకు చెందిన భూముల గుండా రింగ్ రోడ్డు వెళ్లిందని, తద్వారా వారికి నష్టం వాటిల్లేలా చేశారని ఈనాడు మీడియా కథనాలు ఇచ్చేది. అలాగే రామోజీరావుకు చెందిన కొంత భూమి కూడా పోయిందని అంటారు. దాంతో ఆయన ఆగ్రహానికి లోనై అవుటర్ రింగ్ రోడ్డులో గద్దలు అంటూ చెలరేగిపోయి బోలెడు స్టోరీలు ఇచ్చేవారు. అయినా ఆనాటి ప్రభుత్వం వాటిని ఎదుర్కొని అధికారుల సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించి వారి సందేహాలను నివృత్తి చేసే యత్నం చేసింది. అప్పట్లో అన్ని స్టోరీలు రాసిన ఈనాడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అలైన్ మెంట్ మార్పు, అస్సైన్డ్ భూముల కుంభకోణం వంటివాటికి మద్దతు ఇచ్చేలా వార్తలు ఇస్తుండడం విశేషం. ఇక ఈ కేసు ఏమవుతుందన్నది ఆసక్తికరం. ఎసీబీ న్యాయమూర్తికి ఈ జప్తు సమాచారం ఇచ్చి ఆయన అనుమతి పొంది ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ప్రభుత్వం పెట్టిన 1944 నాటి చట్టం ప్రయోగిస్తారా అని టీడీపీ మీడియా వాపోతోంది. అందులో ఉన్న సెక్షన్ 3 వర్తించదని, కేసు నిలబడదని వాదిస్తోంది. చట్టం ఎప్పటిదైనా అది రద్దు కానంతవరకు అమలు అవుతుంది. మన దేశంలో ఉన్న క్రిమినల్ చట్టాలలో అత్యధికం స్వాతంత్రం రావడానికి పూర్వం నాటివేనన్న సంగతి మర్చిపోరాదు. చంద్రబాబు, లింగమేనేని, నారాయణలపై ఆరోపణలు చేస్తున్నా, అసలు రాజధానే నిర్మాణం కానప్పుడు, రింగ్ రోడ్డే లేనప్పుడు అవినీతి ఎలా అవుతుందని టీడీపీ మీడియా ప్రశ్నించింది. గత ప్రభుత్వం రూపొందించిన దాని ప్రకారం అమలు చేస్తే చంద్రబాబు తదితరులు లాభపడేవారా? కారా? అన్నది ఇక్కడ ప్రశ్న. దొంగతనం జరిగినా, సొత్తు ఏమీ దక్కలేదుగా అంటే చోరీ నేరం కాకుండా పోతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న. కోర్టులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరమైన విషయమే. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన 2 జీ స్పెక్ట్రం , బొగ్గు గనుల స్కామ్ లలో కూడా ఊహజనిత నష్టాల ఆధారంగానే సీబీఐవారు కేసులు పెట్టారన్న సంగతి గుర్తుంచుకోవాలి. రాజధాని భూముల క్విడ్ ప్రోకో కేసులోనే కాకుండా అస్సైన్డ్ భూముల వ్యవహారంలో కూడా టీడీపీ నేతలు చిక్కుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చంద్రబాబు తో సహా టీడీపీ నేతల మూలాలను వైసీపీ ప్రభుత్వం పీకడం మొదలుపెట్టినట్లేనా! తెలుగుదేశం నేతలు ఇంతకాలం ఏం పీకుతారంటూ వేస్తున్న ప్రశ్న జవాబు లభిస్తున్నట్లేనా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ చదవండి: మలుపు తిప్పిన ముఠా! బాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కూ వాటా -
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కుట్ర.. క్విడ్ ప్రోకో!
సాక్షి, హైదరాబాద్: కుట్ర, క్విడ్ ప్రోకో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ రెండు అంశాలపైనే సీబీఐ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎక్సైజ్ పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించి వ్యాపారులకు మేలు చేశారని ఆరోపిస్తున్న సీబీఐ, ఇందులో కుట్ర కోణంతో పాటు క్విడ్ ప్రో కో ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మరోవైపు నిందితులుగా ఆరోపణలెదుర్కొంటున్న వారితో పాటు బినామీ కంపెనీలు సృష్టించి లిక్కర్ టెండర్లు దక్కేలా సిండికేట్ వ్యవహారం సాగించిన చీకటి వ్యక్తులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బయటపెట్టే దిశగా సీబీఐ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చిన ఢిల్లీ సీబీఐ, ఆ జాబితాలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంలో గత నెలలో సోదాలు నిర్వహించింది. సీబీఐ దాడుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు సార్లు సోదాలు నిర్వహించారు. పిళ్లైతో పాటు ఆయన సంస్థ రాబిన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్ బోయినిపల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్, ఆడిటర్ బుచ్చిబాబు, మరో 25 మంది నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాల్లో లభించిన కీలక ఆధారాలతో ప్రముఖులకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. వెలుగులోకి సంచలనాత్మక విషయాలు... రెండు దర్యాప్తు సంస్థల విచారణలో బినామీ కంపెనీల గుర్తింపు, ఆ కంపెనీల టెండర్లు, లంచాలకు ఇచ్చిన నగదు.. ఇలా అనేక సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుట్ర పూరితంగానే ఈ విధంగా వ్యవహరించి కంపెనీలకు లాభం చేర్చేలా చేశారని, అదేవిధంగా భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్టు సీబీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బినామీ కంపెనీలను సృష్టించడంతో పాటు సిండికేట్ రూపంలో తమ వారికి దక్కేలా చేసిన చీకటి నేతలు, ప్రముఖ వ్యక్తులపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రెండు దఫాలుగా నోటీసులు.. అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు ఆయన కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్‌సాగర్, ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన ఆడిటర్ బుచ్చిబాబును మొదటి దఫాలో విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు విశ్వసీనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే విచారణ ఇక్కడ చేస్తారా లేకా ఢిల్లీలో చేస్తారా అన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. వీరితో పాటు రెండో దఫాలో ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీతో పాటు ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన 16 కంపెనీలు, వాటిలోని డైరెక్టర్లు 8మందికి నోటీసులిస్తారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఎక్సైజ్ స్కామ్‌లో ఆరోపణలెదుర్కొంటున్న సిండికేట్‌లోని ఇద్దరు వ్యాపారులు తాము ఈ టెండర్ల వ్యవహారంలో రూ.250 కోట్లకు పైగా నష్టపోయినట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. భారీ నష్టంతో పాటు సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడం ఇబ్బందికరంగా మారిందని ఓ ప్రముఖ నేత వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
క్విడ్‌ప్రోకో కేసు విచారణ 17కు వాయిదా
హైదరాబాద్: క్విడ్‌ప్రోకో, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓఎంసీ కేసుల విచారణను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం క్విడ్‌ప్రోకో కేసులో కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పొందిన తర్వాత ఆయన మొదటిసారిగా కోర్టుకు హాజరు అయ్యారు. గత నెల 23న బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు, కేసు విచారణలో భాగంగా ప్రతి వాయిదాకు హాజరుకావాలని షరతు విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ అనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరు కాలేదు. ఓఎంసి కేసులో గాలి జనార్ధన రెడ్డి, అలీఖాన్, శ్రీనివాస రెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. వారికి ఈ నెల 17వరకు రిమాండ్ పొడిగింది. -
‘క్విడ్ ప్రో కో’ లేనే లేదు
పీఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ ఎదుట ‘జగతి’ వాదనలు కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనాలూ పొందలేదు ఆ ముగ్గురూ ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలు చూపాలని ఈడీకి అథారిటీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల వెనుక ‘క్విడ్ ప్రో కో’ అనేది ఎక్కడా లేదని, వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలూ పొందలేదని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవిగుప్తా చెప్పారు. ఈ ముగ్గురూ అత్యంత సహజమైన వ్యాపార దృష్టితో లాభాలనాశించి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెడితే ఆ కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసును ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ (అడ్జుడికేటింగ్ అథారిటీ) శుక్రవారం విచారించింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముకేశ్‌కుమార్ ఎదుట రవిగుప్తా దాదాపు మూడుగంటల పాటు వాదనలు వినిపించారు. ఆగస్టు 27న విచారణ సందర్భంగా అసంపూర్ణంగా ముగించిన వాదనను కొనసాగిస్తూ.. ఆ వ్యాపారవేత్తలు పెట్టిన పెట్టుబడులతో ప్రభుత్వానికి నష్టమే లేనప్పుడు అసలు ఇది పీఎంఎల్ఏ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నష్టం జరిగిందంటున్న ఈడీ అదెలా జరిగిందో వివరాలు మాత్రం చెప్పడం లేదని అథారిటీ దృష్టికి తీసుకువచ్చారు. జగతిలోకి వచ్చిన పెట్టుబడులు ముడుపులు అవునో కాదో ఈడీ ఆధారసహితంగా చూపకుండా, క్విడ్ ప్రో కోని నిరూపించకుండా ఇష్టానుసారం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు దిగడం అసమంజసమని అన్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి వాటికి తగ్గ షేర్లు పొందారు. వారు నష్టపోయిందే లేనప్పుడు ఇందులో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘పెట్టుబడులను పెట్టినవారిని సంస్థ మోసం చేస్తే అది తప్పవుతుంది కానీ అసలు పెట్టుబడుల్ని తీసుకోవడాన్నే నేరంగా పేర్కొనడం విడ్డూరం..’ అని అన్నారు. నిజానికి ఈ కేసులో ఇన్వెస్టర్లను మోసం చేయడమన్నదే జరగలేదంటూ, అలా చేసినట్టుగా వారెవరూ ఫిర్యాదు చేయని సంగతినీ ఆయన అథారిటీ దృష్టికి తీసుకొచ్చారు. కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి తొలుత ఈ కేసులో నిందితులుగా ఉన్నారని, తర్వాత వారు ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులుగా మారి స్టేట్మెంట్లు ఇచ్చారని రవిగుప్తా తెలిపారు. ఈ కేసు వ్యవహారాలు తలాతోకా లేకుండా నడుస్తున్నాయనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. సొమ్ముకు తగిన షేర్లు పొందారు... ‘‘కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి... ఈ ముగ్గురూ మోసపోయారా అంటే లేనే లేదు. పెట్టిన సొమ్ముకు తగ్గ షేర్లను పొందారు. తమ వ్యాపారాలను భిన్నరంగాల్లోకి విస్తరించుకునే ఉద్దేశంతో వారు స్వీయ నిర్ణయం మేరకే పెట్టుబడులు పెట్టారు. ‘జగతి’లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ముగ్గురికీ చేసిన వాగ్దానాలను అనంతర కాలంలో నెరవేర్చలేదని చెబుతున్నారు. అలాగైతే అది వారికి, సంస్థకు మధ్య వ్యవహారం. దీంట్లో పీఎంఎల్ఏకి సంబంధం ఏమిటి? వారు పెట్టుబడులు పెట్టింది ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగానేనని ఈడీ ఆరోపిస్తోంది. దీనికేమో ఆధారాలు చూపడం లేదు. ఎలా చూసినా ఇది క్విడ్‌ప్రో కో కేసు కానీ, సర్కార్‌కు నష్టం జరిగిన కేసు కానీ కానే కాదు..’’ అని రవిగుప్తా వాదించారు. ఈ వాదనలు ఆలకించిన అథారిటీ... ఈ ముగ్గురు ఇన్వెస్టర్లు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలను చూపాల్సిందిగా ఈడీని ఆదేశించింది. సీబీఐ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తును సాగించి అటాచ్మెంట్లకు దిగినందున ఆధారాల విషయంలో సీబీఐని సంప్రదించాలని సూచించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజు సదరు ఆధారాల వివరాలను తమ ముందుంచాలని ఈడీ తరఫు న్యాయవాది విపుల్కుమార్కు స్పష్టం చేసింది. -
కక్ష రాజకీయమే కూలింది
విశ్లేషణ: జగన్మోహన్రెడ్డిని అసలెందుకు నిర్బంధించవలసి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వకుండా, క్షమాపణ చెప్పుకొనకుండా కాంగ్రెస్ ‘నల్లి’ లాగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోసం కాంగ్రెస్ అధిష్టానం జగన్‌పై కక్ష సాధింపునకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరికి దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వమూ, సీబీఐలే! ‘‘జగన్మోహన్రెడ్డి కంపెనీ ల్లో పెట్టుబడులు పెట్టిన ఎని మిది కంపెనీల్లోనూ లాభ లబ్ధి (క్విడ్ ప్రోకో) ప్రాతిపదికపై ఎటువంటి లావాదేవీలూ జరగలేదు. ‘క్విడ్ ప్రోకో’ ఉన్నట్టు దర్యాప్తులో తేలలేదు. మిగిలిన విషయాలు (ఆదాయపు పన్ను చెల్లింపులు వగైరా అంశాలు) సంబంధిత శాఖలకు నివేదించాం’’ - ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ముందు సీబీఐ దాఖలు చేసిన మెమొరాండం (23.9.2013) వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా లాభ లబ్ధి ద్వారా ‘అక్రమ ఆస్తులను’ ఆర్జించారంటూ సీబీఐ సాగించిన దర్వాప్తు ప్రహసనం చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లయింది. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేయాలనే లక్ష్యంతో సీబీఐని ఇష్టానుసారంగా వాడుకుంది. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతో, రాజ్యాధికారం కోసం తీరని తపనతో ఉన్న ‘దేశం’ అధినేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలపగా సీబీఐ ఎక్కడ లేని అభియోగాలతో జగన్‌పై కొండవీటి చాంతాండంత కేసును తయారు చేసింది. ఇది గ్రహించడానికి పాలక పక్షానికి, ‘గొర్రెదాటు’ పద్ధతిలో ఉన్న కొన్ని ప్రతిపక్షాలకు 16 మాసాలు చాలవు! వెనకటికి మాయ లేడిని ‘బంగారు లేడి’ అనుకుని సీత కోసం శ్రీరాముడు దాని వెంట పరుగులు పెట్టినట్టుగా కాంగ్రెస్‌ను చాలా ‘నిజాయితీ’ గల పార్టీ అనుకుని, దాని ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే సీబీఐ నిష్పాక్షికమైనదని భావించిన వివిధ పార్టీలు జగన్‌పై విరుచుకుపడుతూ వచ్చాయి! కాని, అవి రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అనిశ్చితిని చవిచూడవలసి వచ్చింది. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసే కుట్రలో దేశ ప్రధాన ధాన్యాగారాలలో ఒకటైన ‘అన్నపూర్ణ’ను చెరబట్ట యత్నించి కాంగ్రెస్ బోర్లాపడే స్థితికి చేరింది. రాష్ట్రంలో దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జగన్మోహన్రెడ్డిని అసలెందుకు నిర్బంధించవలసి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వకుండా, క్షమాపణ చెప్పుకొనకుండా కాంగ్రెస్ ‘నల్లి’ లాగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోసం కాంగ్రెస్ అధిష్టానం ‘పిలక తిరుగుడు పువ్వు’ లాగా మెడ చుట్టూ వేళ్లు తిప్పి ‘ముక్కు’ చూపించినట్టుగా జగన్‌పై కక్ష సాధింపునకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరికి దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వమూ, సీబీఐలే! తప్పనిసరై కొన్ని నిజాలు... ఇటీవల ‘2-జీ’ స్కాము సందర్భంగానూ, కోల్గేట్ కుంభకోణంలోనూ పాలకుల వేలిముద్రగా మారిన సీబీఐ విచారణాధికారి ఒకరు ఇరుకునపడ్డారు. ఆ దరిమిలా సుప్రీంకోర్టు కన్నెర్ర చేయడంతో సీబీఐ డెరైక్టర్ తామెలాంటి ఒత్తిళ్లకు లోనుకావలసి వస్తోందో కోర్టుకు సంజాయిషీ చెప్పుకోవలసివచ్చింది. అటు పిమ్మట ‘సుప్రీం’ ఇచ్చిన గుండె ధైర్యంతో, సీబీఐ తన స్వతంత్ర ప్రతిపత్తిని చాటుకొనే దిశగా అడుగులు వేస్తోంది. గుజరాత్లో మోడీ ప్రభుత్వ ఆదేశాలపైన ఇష్రాత్ జహాన్‌ను దొంగ ఎన్కౌంటర్లో హతమార్చడంలో కేంద్ర గూఢచారి సంస్థ (ఐబీ) అధికారికి పాత్ర ఉందన్న ఆరోపణపైన సీబీఐ విచారణకు దిగింది. ఆ విషయమై ఐబీ-సీబీఐల మధ్య సాగిన పరస్పర ఆరోపణల వల్ల ఆ రెండు సంస్థల పరువే కాదు, యూపీఏ ప్రభుత్వం పరువే గంగలో కలిసిపోయింది. ఈ పరిణామాల ఫలితంగా సీబీఐ మిగిలిన తన పరువును సంరక్షించుకునేందుకు కొంత ధైర్యాన్ని చిక్కబట్టుకోవడం జరిగింది. ఫలితంగానే జగన్‌పై కేసుల విషయంలో అది పాలకశక్తుల స్వార్థ ప్రయోజనాల ఒరవడి నుంచి బయటపడాలనుకుని, కొన్ని వాస్తవాలతో ఆఖరి ఛార్జిషీట్లను దఖలు పరచాల్సివచ్చింది. ‘‘భారతీయ చట్టాల ప్రకారం తుది విచారణలో నిందితులు నేరం చేశారో లేదో తేలే దాకా వారు ఏ నేరమూ చేయలేదనే భావించాలి. ఇది ప్రజలు గమనించాలి’’ అంటూ అది కాలు కాల్చుకున్న పిల్లిలా సీబీఐ కోర్టు ముందిచ్చిన ప్రకటనలో ముక్తాయించాల్సి వచ్చింది! కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మిగిలిన ఆరోపణలన్నీ ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ తదితర శాఖల పరిశీలనకు వదిలేశామని చెప్పింది. ‘2-జీ’ స్కాములో సుప్రీంకోర్టు దేశ పరిధుల్లోని రేడియో తరంగాలు సహా సహజ వనరులన్నీ దేశ ప్రజల ఉమ్మడి సొత్త్తేగాని, వ్యక్తిగత లాభార్జన పరుల సొత్తు కాదని రాజ్యాంగ పరంగా ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పింది. అయినా దేశీయ, విదేశీ టెలికాం గుత్త కంపెనీల ఆగడాలు సర్దుమణగలేదు. ఎందుకని? 1991లో మొద లైన ‘ప్రపంచ బ్యాంకు’ ప్రజావ్యతిరేక సంస్కరణలను కాంగ్రెస్, బీజేపీలు రెండూ బేషరతుగా తలకెత్తుకొని ఉదారవాద సంస్కరణలను ప్రవేశపెట్టాయి. విదేశీ మదుపు సంస్థలైన ఎఫ్ఐఐ గుత్తేదారీ వర్గాలకు దేశీయ స్టాక్ మార్కెట్లలో స్వేచ్ఛా జూదానికి దారులు తెరిచారు. చిన్న పరిశ్రమలను, వ్యవసాయాన్ని పండబెట్టారు. భారత ప్రభుత్వం కేవలం ఒక బ్రోకర్‌గా మాత్రమే (ఫెసిలిటేటర్) వ్యవహరించాలని ప్రపంచ బ్యాంకు శాసించింది. పారిశ్రామిక, కార్మిక చట్టాలను సవరించాలని ఆదేశించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ శాసించే దిగుమతులన్నింటినీ దేశంలోకి అనుమతి లభించింది. ప్రజాస్వామ్య వ్యవస్థను లంచగొండి వ్యవస్థగా దిగజార్చింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ హవాలా ట్రేడింగ్‌కూ, మల్టీ నేషనల్ కంపెనీలు ఇండియాలో పన్నులు చెల్లించనక్కరలేకుండా వ్యాపార లావాదేవీలు సాగించడానికి వీలు కలిగించారు. పలితంగా లక్షల కోట్లలో దొంగ డబ్బు చట్టాలకు అందకుండా సరిహద్దులు దాటి స్విట్జర్లాండ్, తదితర గుప్త ధన కేంద్రాలలో మేట వేసుకుంది. అమెరికాలో 400 మంది మహా కోటీశ్వర్లుంటే మన దేశంలో 1500 మంది కోటీశ్వరులూ, మహా కోటీశ్వరులూ పుట్టుకొచ్చారు. ఇదే మన ఆర్థిక వ్యవస్థ ‘బలుపు’నకు బ్రాండ్ మార్క్ అయింది! జగన్ ఎదిగిపోతారనే బెంగతో... ఇలాంటి వ్యవస్థలో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు జగన్‌పై విరుచుకుపడి కుహనా అవినీతి వ్యతిరేక పోరాటం పాలక వర్గాలు ప్రకటించాయి. రుజువుకాని ఆరోపణలతో, జగన్ ప్రమేయమే లేని వైఎస్ హయాము నాటి 26 జీవోల చాటున దాగి ఆయనపై వేధింపులకు దిగారు. కేంద్రంలో రాహుల్ ఎదిగి రాకుండానే జగన్ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని నేతగా ఎదిగిపోతాడేమోనన్న బెంగతో, కచ్చితో జగన్‌పైన కాంగ్రెస్ అధిష్టానం కత్తిగట్టిందని రాష్ట్ర ప్రజల, యువత మనస్సుల్లో ఏర్పడిన అభిప్రాయం. అది ఇప్పట్లో తొలగిపోదు. వ్యక్తిత్వంతో వెలిగే ఏ వ్యక్తి అయినా పాలనా వ్యవస్థకు కూడా స్థిరత్వం అందించగలుగుతాడు. జగన్ లాంటి కొడుకు ‘దేశం’ నిర్మాత అయిన మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు ఒక్కడైనా ఉండి ఉంటే ఎన్టీఆర్ ‘దశమగ్రహం’ చంద్రబాబు ‘వెన్నుపోటు’కు సరిపోటు ఆనాడే పడి ఉండేది! ఎన్ని కేసులు ఉన్నాగానీ రాజ్యాంగం నిర్బంధంలో ఉన్న పౌరులకు సహితం జీవించే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించింది. కుళ్లిపోయిన ఈ పాలనా వ్యవస్థ యువకుడైన జగన్మోహన్రెడ్డిని 16 మాసాల పాటు అనూహ్యమైన ఎత్తుగడలతో ఆ హక్కులు లేకుండా ఇబ్బందుల పాలుచేసింది. అయినా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు (బహుశా దేశ చరిత్రలో కూడా) యుక్త వయస్సులో ఉన్న ఏ మంత్రి కొడుకులోనూ, ఏ ముఖ్యమంత్రి కొడుకులోనూ మనం చూడని, చూడబోని నిబ్బరాన్ని, మనోధైర్యాన్ని, నిర్బంధం మధ్య సైతం చెక్కు చెదరని చిరునవ్వునూ, విషాన్ని సహితం అమృతంలా స్వీకరించగల గరళ కంఠాన్నీ - ఒక్క జగన్‌లో మాత్రమే చూడగలమంటే ఆశ్చర్యం లేదు! కనుకనే కొందరికి అన్నీ ఉంటాయిగాని ‘అసలుది’ మాత్రం ఉండదట! అలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. బహుశా అందుకే ఉద్దండులైన పాశ్చాత్య తత్వవేత్తలైన థోరే, ఎమర్సన్‌ల మధ్య జరిగిన ఒక సంభాషణ అనూహ్యమైన సత్యాన్ని ఆవిష్కరించింది. వ్యక్తులపై అభియోగాలు మోపి అరెస్టు చేసిన 90 రోజులలోనే వారు బెయిల్‌కు అర్హులని ఇండియన్ పీనల్ కోడ్ కోడై కూస్తున్నా ఆ పరిధిని సహితం లెక్కచేయకుండా 16 మాసాల పాటు విచారణ లేకుండా జైలులో నిర్బంధించిన పూర్వరంగంలో నాటి థోరే మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘‘ఏ వ్యక్తినైనా అన్యాయంగా జైల్లో నిర్బంధించే ప్రభుత్వ జమానాలో, న్యాయ ప్రవర్తనుడైన వ్యక్తి స్థానం కూడా ఆ జైలులోనే ఉంటుంది’’ అన్నాడు థోరే వ్యంగ్యంగా. ఈ మాటలను విన్న ఎమర్సన్ ‘‘అదేమిటయ్యా, నీవిక్కడ - జైలులో ఉన్నావేంటి’’ అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. దానికి థోరే... ‘‘నీవూ ఈ జైల్లో ఎందుకు లేవో చెప్పుకో చూద్దాం’’ అని ఎదురు ప్రశ్నించాడు! అంటే, కొన్ని రకాల నిర్బంధాలకు ఎదుటి పక్షం స్వార్థ ప్రయోజనాలు తప్ప మరో కారణం ఉండదు! అంటే, ‘క్విడ్ ప్రోకో’ కాస్తా ‘క్విట్ ప్రోకో’గా మారిపోయిందన్నమాట! నవ్విన నాప చేనే పండింది! అందుకే ఏడుపులూ, వెకిలి వ్యాఖ్యలూ! -
‘పెద్దలు’ పత్రాలిస్తే జగన్‌పై కేసు వేశా: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల వ్యవహారంపై తనకు కొందరు పెద్ద మనుషులు సమాచారమిస్తే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశానని మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు వెల్లడించారు. జగన్ కేసులో ఆధారాల్లేవని సీబీఐ చెప్పిన విషయాలన్నీ నిజమేనన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ ఆస్తులపై శంకర్రావు వేసిన కేసుకు సంబంధించి 8 కంపెనీల్లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఆధారాల్లేవని సీబీఐ పేర్కొన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘‘బాబూ...! అది నేను సొంతంగా వేసిన కేసు కాదు. నీలాంటి పెద్ద మనుషులు కొందరు నా దృష్టికి సమాచారం తీసుకొస్తే కోర్టుకు లేఖ రాశాను. సీబీఐ అనేది స్వతంత్ర సంస్థ. అది రాష్ట్రపతి, ప్రధానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. సీబీఐ చెప్పిన విషయాలన్నీ నిజమే’’ అని బదులిచ్చారు. జగన్ బెయిల్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పాత్ర ఉందన్న టీడీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. -
అవాస్తవాల ప్రచారం: కొణతాల రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: జగన్మోహన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ‘క్విడ్ ప్రో కో’ ఎక్కడా జరగలేదని తాము మొదటి నుంచి చెబుతున్నదేనని ఆ పార్టీ నేతలు డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. సీబీఐ రెండేళ్లపాటు చేసిన దర్యాప్తులో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఎక్కడా తేల్చలేదన్నారు. జగన్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన అనంతరం వారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, హర్షం వ్యక్తం చేశారు. జగన్‌పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తాము మొదట్నుంచి చె బుతున్నప్పటికీ, కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా నోరుపారేసుకున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. తమ పార్టీ కుమ్మక్కు అయితే జగన్ ఇన్నాళ్లు జైల్లో ఎందుకుంటారని ప్రశ్నించారు. లావా దేవీలన్నింటికీ ఆదాయపు పన్ను శాఖ ఆధారాలు ఉన్నప్పటికీ ఒక విభాగానికి చెందిన మీడియా, కొందరు నేతలు వాస్తవాలను పూర్తిగా వక్రీకరించారని విమర్శించారు. వ్యాపారవేత్తలైన నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి లాంటి వారిపైనా ఆరోపణలు చేయడంతో పాటు అధికారులపై దుమ్మెత్తిపోశారన్నారు. -
‘క్విడ్ ప్రో కో’ లేదు
* 8 కంపెనీల్లో అలాంటి లావాదేవీలు జరగలేదు * సీబీఐ కోర్టుకు నివేదించిన సీబీఐ ఎస్పీ * ‘క్విడ్ ప్రో కో’ ఉన్నట్లు దర్యాప్తులో తేలలేదు * మిగిలిన విషయాలు ఆయా శాఖలకు నివేదించాం * జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో * కోర్టు ఆదేశాల మేరకు మెమో దాఖలు సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎనిమిది కంపెనీల్లో ఎటువంటి ‘క్విడ్ ప్రో కో’ లావాదేవీలూ జరగలేదని సీబీఐ సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. వైఎస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి పురోగతిని వివరిస్తూ మెమో దాఖలు చేయాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు శనివారం సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయా వివరాలతో ఈ మేరకు సీబీఐ ఎస్పీ వి.చంద్రశేఖర్ సోమవారం ఒక మెమోను కోర్టులో దాఖలు చేశారు. తమ దర్యాప్తులో సాండూర్ పవర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీ/బ్రహ్మణీ ఇన్ఫ్రా, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్ కంపెనీల్లో ‘క్విడ్ ప్రో కో’ లావాదేవీలు ఉన్నట్లు తేలలేదని స్పష్టం చేశారు. అయితే ఈ కంపెనీల్లో జరిగినట్లు చెబుతున్న నిబంధనల ఉల్లంఘన, అవకతవకల గురించి, ఆయా అంశాలు ఏయే శాఖల పరిధిలోకి వస్తాయో వాటికి నివేదించినట్లు కోర్టుకు విన్నవించారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు సంబంధించిన వ్యవహారం ఓఎంసీ కేసు పరిధిలోకి వస్తుందని, దానిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని అంశాల్లో దర్యాప్తు పూర్తి చేశామని ఈ మెమోలో పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలు, వ్యక్తుల పెట్టుబడులు, రాంకీ ఫార్మా, వాన్‌పిక్, దాల్మియా, ఇండియా, పెన్నా, రఘురామ్ సిమెంట్స్‌తో పాటు ఇందూ టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జి హబ్ అంశాలకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి 10 చార్జిషీట్లు దాఖలు చేసినట్లు కోర్టుకు నివేదించారు. హౌసింగ్ బోర్డు ద్వారా ఇందూ ప్రాజెక్టు పొందిన ప్రయోజనాలకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేశామని, త్వరలో తుది నివేదిక దాఖలు చేస్తామని తెలిపారు. ఈడీ, ఐటీకి సిఫారసు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), ఆదాయపన్ను శాఖ (ఐటీ)లకు సిఫారసు చేసినట్లు సీబీఐ ఎస్పీ ఈ మెమోలో పేర్కొన్నారు. ఇలా సిఫారసు చేసిన కంపెనీల్లో కోల్‌కతాకు చెందిన ఆర్టిలెలజెన్స్ బయో ఇన్నోవేషన్స్, బేఇన్లాండ్ ఫైనాన్స్, భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్, క్లిఫ్టన్ పియర్సన్ ఎక్స్‌పోర్టు ఏజెన్సీస్, డెల్టన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, గంగా బిల్డర్స్, గ్రవ్మోర్ ఫండ్ మేనేజ్మెంట్, న్యూ ఔట్లుక్ సెక్యూరిటీస్, శక్తి ఇస్పాత్ ప్రొడక్ట్స్, శివలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్, స్టాక్‌నెట్ ఇంటర్నేషనల్, సూపర్ ఫైనాన్స్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్, ఇస్పా షీట్స్, సుగమ్ కమోడీల్, చండ్లియర్ ట్రాకొన్ ఉన్నాయి. -
8 కంపెనీలతో క్విడ్‌ప్రోకో లేదు:జగన్ కేసులో సిబిఐ
-
8 కంపెనీలతో క్విడ్‌ప్రోకో లేదు:జగన్ కేసులో సిబిఐ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి క్విడ్‌ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించి ఆధారాలు లభించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి చిక్కుముడులు వీడుతున్నాయి. క్విడ్‌ప్రోకోకు సంబంధించి స్పష్టత వస్తోంది. పదింట ఎనిమిది కేసుల్లో ఎలాంటి క్విడ్‌ప్రోకో జరగలేదని దర్యాప్తు సంస్థ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు మెమో రూపంలో వెల్లడించింది. జగన్ ఆస్తుల కేసులో విచారణ పూర్తయిందని సిబిఐ కోర్టుకు తెలిపింది . హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ వివరించింది. మొత్తం పది కంపెనీలకు సంబంధించి దర్యాప్తు చేశామని, ఇందులో ఎనిమిది కంపెనీల్లో క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ వివరించింది. సండూర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్, పివిపి బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్‌లలో క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిబిఐ వెల్లడించింది. దీనితో పాటు 16 కోల్‌కతా కంపెనీలకు సంబంధించి ఇడి, ఐడి మాత్రం దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది. తాజా దర్యాప్తుతో మాజీ మంత్రులు శంకర్రావు, అశోక్ గజపతి రాజు పిటిషన్లపై దర్యాప్తు పూర్తయినట్లు సిబిఐ తెలిపింది. -
'క్విడ్ ప్రోకో కేసులో కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి'
హైదరాబాద్ : క్విడ్ ప్రోకో కేసులో కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి అయ్యిందని సీబీఐ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టుకు తెలియచేశారు. సీబీఐ మెమో ద్వారా ఈ మేరకు కోర్టుకు తెలిపింది. శ్యాం ప్రసాద్ రెడ్డికి సంబంధించిన విషయం మాత్రం తుది నివేదిక ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. కాగా జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది. దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
మంత్రుల పేర్లు లేని ఛార్జిషీట్లు
క్విడ్ ప్రోకో కేసులో ఈరోజు సీబీఐ దాఖలు చేసిన మూడు ఛార్జ్షీట్లలో మంత్రుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ ఛార్జి షీట్లలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి సబితలకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇండియా సిమెంట్స్ కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు. ఆయనను కేవలం సాక్షిగా మాత్రమే పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో మంత్రి పొన్నాలను సిబిఐ రెండు రోజులు విచారించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయితే 8, 9 తేదీలు సెలవులు కావటంతో సీబీఐ అధికారులు ఈరోజు చార్జ్‌షీటు దాఖలు చేశారు. నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నందున గగన్‌విహార్ కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీబీఐ డిఐజి వెంకటేశ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇండియా సిమెంట్స్ ఛార్జిషీటులో వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, శ్రీనివాసన్, ఐఏఎస్ ఆదిత్యనాథ్‌దాస్, శామ్యూల్, రఘురాం, ఇండియా సిమెంట్స్, జగతి, కార్మెల్ ఏసియాలను నిందితులుగా పేర్కొంది. పెన్నాసిమెంట్స్ ఛార్జిషీటులో వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, పెన్నా ప్రతాపరెడ్డి, పీఆర్ ఎనర్జీ, జగతి, కార్మెల్ ఏసియా, పెన్నా సిమెంట్స్, పయనీర్ హోల్డింగ్స్‌లను నిందితులుగా పేర్కొన్నారు. రఘురాం సిమెంట్స్ ఛార్జిషీటులో వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, రఘురాం సిమెంట్స్, జగన్మోహన్, రాజగోపాల్, వీఎన్ ప్రభు, బి.కృపానందం, శంకర్‌నారాయణలను నిందితులుగా పేర్కొంది. 26 జీవోల అంశంలో అభియోగాలు ఎదుర్కొన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీం ఆదేశాల ప్రకారం సీబీఐ ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు వైఎస్ జగన్మోన రెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తెలిపారు. పెన్నా సిమెంట్స్, రఘురాం సిమెంట్స్, ఇండియా సిమెంట్స్‌లపై ఛార్జిషీట్లు దాఖలుచేసినట్లు వివరించారు. మరో 2-3 రోజుల్లో మిగిలిన ఛార్జిషీట్లు దాఖలుచేస్తామని సీబీఐ చెప్పినట్లు తెలిపారు. ఒకే ఒక్క ఛార్జిషీటు మిగిలి ఉందని సీబీఐ తెలిపినట్లు అశోక్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వైఎస్ జగన్మోహన రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. -
క్విడ్‌ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు
-
క్విడ్‌ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు
హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మంగళవారం మూడు చార్జ్షీట్లు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్‌కు సంబంధించిన ఈ మూడు చార్జ్షీటులు వేసింది. నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందున... సీబీఐ ఈ ఛార్జ్షీటులను గగన్ విహార్‌లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయితే ఎనిమిది, తొమ్మిది తేదీలు సెలవులు కావటంతో సీబీఐ అధికారులు నేడు చార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ సీబీఐ అయిదు చార్జ్ షీట్లు దాఖలు చేసింది. కాగా సీబీఐ డిఐజి వెంకటేశ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి 15 నెలలుగా జైల్లో ఉన్నారు.