సాక్షి, హైదరాబాద్: జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ‘క్విడ్ ప్రో కో’ ఎక్కడా జరగలేదని తాము మొదటి నుంచి చెబుతున్నదేనని ఆ పార్టీ నేతలు డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. సీబీఐ రెండేళ్లపాటు చేసిన దర్యాప్తులో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఎక్కడా తేల్చలేదన్నారు. జగన్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన అనంతరం వారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, హర్షం వ్యక్తం చేశారు. జగన్‌పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తాము మొదట్నుంచి చె బుతున్నప్పటికీ, కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా నోరుపారేసుకున్నాయని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. తమ పార్టీ కుమ్మక్కు అయితే జగన్ ఇన్నాళ్లు జైల్లో ఎందుకుంటారని ప్రశ్నించారు. లావా దేవీలన్నింటికీ ఆదాయపు పన్ను శాఖ ఆధారాలు ఉన్నప్పటికీ ఒక విభాగానికి చెందిన మీడియా, కొందరు నేతలు వాస్తవాలను పూర్తిగా వక్రీకరించారని విమర్శించారు. వ్యాపారవేత్తలైన నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి లాంటి వారిపైనా ఆరోపణలు చేయడంతో పాటు అధికారులపై దుమ్మెత్తిపోశారన్నారు.
అవాస్తవాల ప్రచారం: కొణతాల రామకృష్ణ
Published Tue, Sep 24 2013 3:26 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement