DA somayajulu
-
ఆయన ఓ విజ్ఞాన సర్వస్వం
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్న డీఏ సోమయాజులు ఇప్పుడు భౌతికంగా లేకపోవడం ఓ లోటు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం సోమయాజులు 67వ జయంతి సందర్భంగా విజయవాడలోని దివెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమయాజులు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కీర్తిశేషులు సోమయాజులు ఓ ఎన్సైక్లోపీడియా (విజ్ఞాన సర్వస్వం) అని అభివర్ణించారు. ఆయనకు ప్రతి అంశంపైనా పూర్తి అవగాహన ఉండేదన్నారు. తాను పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో.. పార్టీని ఎలా నడుపుతారో అనే మీమాంస చాలా మందిలో ఉండేదని, ఆ తరుణంలో తాను దేవుడిని గట్టిగా నమ్మానని, ప్రజలు తోడుగా ఉన్నారని గట్టిగా విశ్వసించేవాడినని చెప్పారు. అలాంటి సమయంలో మొట్టమొదటగా తనతో అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులు అని తెలిపారు. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ ఆయన తనకు ఒక గురువులాగా ఉండేవారన్నారు. ప్రతి విషయంలోనూ తనకు సూచనలు, సలహాలు ఇచ్చి నడిపించారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా 2014లో మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగు పెట్టినపుడు, ఆ తరువాత ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ తన ప్రసంగాల వెనుక సోమయాజులు ఉండి నడిపించారని తెలిపారు. ఇప్పుడు సోమయాజులు భౌతికంగా లేక పోవచ్చుకానీ, ఆయన ఎక్కడికీ పోలేదని, మన కళ్లెదుటే ఉన్నాడని చెప్పడానికి ఆయన కుమారుడు కృష్ణను చూసినపుడు తనకు అనిపిస్తుందని వైఎస్ జగన్ తెలిపారు. తండ్రి మాదిరిగానే అన్ని విషయాల మీద కృష్ణకు పూర్తి అవగాహన ఉందన్నారు. సోమయాజులు కుటుంబానికి ఎల్లప్పుడు తనతో పాటు అంతా తోడుగా ఉంటారని తెలిపారు. జగన్ చుట్టూ మంచి వాళ్లున్నారు కార్యక్రమంలో పాల్గొన్న శాంతా బయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చుట్టూ మంచి అజేయ కల్లం, గౌతం సవాంగ్, కృష్ణ వంటి మంచి ఆలోచనలు గల వారున్నారని ప్రశంసించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలకు అన్నీ వివరించి ఉచిత విద్యుత్ హామీకి ఒప్పించగలిగారన్నారు. సోమయాజులు మిత్రుడు మోహన్ కుమార్ మాట్లాడుతూ.. సోమయాజులు ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సోమయాజులు సతీమణి కళ్యాణి, కుమారుడు కృష్ణ, ఆయన సతీమణి సువర్ణ, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. -
సోమయాజులు నాకు గురువు : సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : దివంగత డీఏ సోమాయాజులు తనకు గురువుగా ఉండేవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. డీఏ సోమయాజులు 67వ జయంతిని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగా సోమయాజులు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘సోమయాజులు గారు ఒక లివింగ్ ఎన్సైక్లోపిడియ వంటివారు. ఆయనకు ప్రతి విషయంపై అవగాహన ఉండేంది. మా అందరికి ఆయన క్లాసులు చెప్పేవారు. సొంతంగా పార్టీ పెట్టినప్పుడు నాతో పాటు మొట్టమొదటగా అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులు గారు. ఆయన ఒక గురువుగా నాకు ప్రతీ విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. 2014లో నేను తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు కూడా నా ప్రతి స్పీచ్ వెనకాల ఉండి నన్ను నడిపించిన వ్యక్తి సోమయాజులు అన్న అని గర్వంగా చెబుతున్నాను. కృష్ణను చూస్తే సోమయాజులు అన్న మన మధ్యలోనే ఉన్నట్టుగా ఉంది. కృష్ణకు కూడా అన్ని విషయాలపై అవగాహన ఉంది. తండ్రిని మించిన తనయుడిగా కృష్ణ ఎదుగుతాడు. సోమయాజులు అన్న కుటుంబానికి నాతోపాటు ఇక్కడున్న వారంతా తోడుగా ఉంటారు. ఆయన కుటుంబానికి దేవుడు మంచి చేస్తాడ’ని నమ్ముతున్నట్టు తెలిపారు. కాగా, డీఏ సోమయాజులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన గతేడాది మే నెలలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు కృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సోమయాజులు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితులు, పలువురు ఏపీ రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
సోమయాజులు నాకు గురువు : సీఎం వైఎస్ జగన్
-
నేడు ఆర్థికరంగ నిపుణుడు డిఏ సోమయాజులు జయంతి
-
వైఎస్సార్సీపీ సీనియర్ నేత సోమయాజులు కన్నుమూత
-
వైఎస్సార్సీపీ నేత సోమయాజులు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు డీఏ సోమయాజులు (64) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న సోమయాజులును రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ‘సిటీ న్యూరో సెంటర్’లో చేర్చారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. సోమయాజులుకు తల్లి సుబ్బలక్ష్మి, భార్య కళ్యాణి, కుమారుడు డీఎన్ కృష్ణ ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో (2004–09)ఆర్థిక వ్యవహారాలు, విధానాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించారు. వ్యవసాయ సాంకేతిక మిషన్ డిప్యూటీ చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆర్థిక పరమైన నిర్వహణా వ్యవహారాల్లో అపారమైన అనుభవం గల సోమయాజులుకు రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. వైఎస్సార్ సీపీని స్థాపించిన నాటి నుంచి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. హుటాహుటిన హైదరాబాద్‌కు జగన్ సోమయాజులు మృతి పట్ల పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఉదయం 10 గంటల కల్లా హైదరాబాద్‌కు వచ్చారు. మెహిదీపట్నం రమణమూర్తి కాలనీలోని సోమయాజులు నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. శోకసముద్రంలో ఉన్న కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు సోమయాజులు భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సోమయాజులు మరణం తీరని లోటని, తమ కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయామని భారతీరెడ్డి చెప్పారు. కాగా సోమయాజులు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రశాసన్‌నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, బంధువులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమయాజులు భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న వైఎస్ భారతీరెడ్డి ప్రముఖుల నివాళి సోమయాజులు మరణవార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, నారమిల్లి పద్మజ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎస్.దుర్గా ప్రసాదరాజు, విజయచందర్, పీఎన్వీ ప్రసాద్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్ తదితరులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ఎంపీలు కొణతాల రామకృష్ణ, ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డీకే సమరసింహారెడ్డి, డి.శ్రీనివాస్, సి.రామచంద్రయ్య, టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్టీఐ మాజీ కమిషనర్ సుధాకర్‌రావు, ఐపీఎస్ అధికారి రమేష్‌రెడ్డి, బండ్ల గణేష్ (సినీ నిర్మాత), పారిశ్రామికవేత్త రఘురామరాజు తదితరులు కూడా సోమయాజులు భౌతికకాయం వద్ద నివాళులర్పించి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
డీఏ సోమయాజులు మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
-
నా హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డీఏ సోమయాజులు మరణం పట్ల పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను సదా స్మరించుకుంటానని అన్నారు. తనకు ఆయన అందించిన మార్గదర్శకత్వం, మద్దతును ఎల్లవేళలా కాపాడుకుంటానని వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. తన హృదయంలో ఎప్పటికీ ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందన్నారు. సోమయాజులు కుటుంబ సభ్యులకు, ఆయనను ప్రేమించే వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. కాగా, డీఏ సోమయాజులు మరణించారని తెలియగానే పశ్చిమగోదావరి జిల్లా నుంచి హుటాహుటిన వైఎస్ జగన్ హైదరాబాద్‌కు వచ్చారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమయాజులు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. Deeply mourn the demise of Sri DA Somayajulu garu, YSRCP leader & former Advisor to Govt of AP. I will forever cherish his guidance & support. He will always have a special place in my heart. My deepest condolences to his family members and loved ones. May his soul rest in peace. — YS Jagan Mohan Reddy (@ysjagan) 20 May 2018 -
సోమయాజులుకు ప్రముఖుల నివాళులు
-
సోమయాజులుకు ప్రముఖుల నివాళులు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. సోమయాజులు మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతలు, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి డీఏ సోమయాజులుతో తమకు విడతీయరాని అనుబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు, ఇతర ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి సహకరించిన వ్యక్తుల్లో సోమయాజులు ఒకరు అని కాకాని గుర్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ వివరాలను క్షుణ్ణంగా విశ్లేసించగల గొప్ప ఆర్థికవేత్త అని అన్నారు. కుటుంబ సభ్యులకు గోవర్ధన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియచేశారు. చిన్నికృష్ణ సోమయాజులుతో తనకు ఉన్న అనుబంధాన్ని సినీ రచయత చిన్ని కృష్ణ గుర్తు చేసుకున్నారు. సోమయాజులుతో తనకు దాదాపు 10ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ప్రజలకు ఉపయగపడే పలు అంశాల గురించి తెలుసుకోవడానికి రాజకీయవేత్తలు, అధికారులు వచ్చేవారని అన్నారు. ఆయన లేని లోటు ఆంధ్రరాష్ట్రానికి తీరనిలోటని అభిప్రాయపడ్డారు. దేశ, రాష్ట్రాలకు నిస్వార్థంగా సేవ చేసిన గొప్ప వ్యక్తి సోమయాజులు అని కొనియాడారు. తన స్క్రిప్ట్ పనుల్లో చాలా సహాయం చేశారని చిన్నికృష్ణ అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకూ సోమయాజులు పలు అంశాల్లో వారికి అండగా ఉన్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఏదైనా విషయం గురించి సమాచారం కావాల్సి వచ్చి ఆయన వద్దకు క్షణాల్లో నిమిశాలల్లో తయారుచేసి ఇచ్చేవారని తెలిపారు. ఆరోగ్యం సహకరిచంచకపోయినా బెడ్ మీద నుంచే తన కుమారుడికి డిక్టేట్ చేసి మరీ పంపించేవారని మేకపాటి గుర్తుచేసుకున్నారు. ప్రజలకు వైఎస్సార్ చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో సోమయాజులు అందించిన సహకారం ఎనలేనిదని అన్నారు. ఆయనను కోల్పోవడం తెలుగు ప్రజల దురదృష్టమని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేశారు. -
సోమయాజులు భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులు
-
సోమయాజులు మరణం తీరని లోటు
-
ఆత్మీయుడిని కోల్పోయాం : వైఎస్ భారతి
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి సాక్షి మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయామని చెప్పారు. సోమయాజులు మరణం తీరని లోటని పేర్కొన్నారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 03.14 నిమిషాలకు తుదిశ్వాస విడించారు. డీఏ సోమయాజులు గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపొందించడంలో కీలక భూమిక పోషించారు. -
హైదరాబాద్‌కు వైఎస్ జగన్
-
సోమయాజులు భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, గోపాలపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని ఆయన.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. మెహిదీపట్నంలోని డీఏ సోమయాజులు నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్.. ఆయన భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం సోమయాజులు కుటుంబసభ్యుల్ని వైఎస్ జగన్ ఓదార్చారు. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా సోమయాజులు నివాసానికి వచ్చారు. సోమయాజులు కుటుంబసభ్యులతో మాట్లాడి.. వారిని ఓదార్చారు. పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు కూడా సోమయాజులు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ప్రశాసన్ నగర్‌లోని ‘మహాప్రస్థానం’ శ్మశానవాటికలో డీఏ సోమయాజులు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. డీఏ సోమయాజులు గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. -
వైఎస్ఆర్సీపీ సలహాదారు డీఏ సోమయాజులు కన్నూమూత
-
డీఏ సోమయాజులు మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గోపాలపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమయాజులు మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. 1953లో ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో సోమయాజులు జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్వొరేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సోమయాజులు గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. -
పోలవరం ఇక రానట్లేనా: వైఎస్సార్సీపీ
కేటాయించిన నిధులు చూస్తే ఆ అభిప్రాయమే కలుగుతోంది సాక్షి, హైదరాబాద్: బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు చూస్తే.. ఇక పోలవరం ప్రాజెక్టు రానట్లేన ని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు అభిప్రాయపడ్డారు. పోలవరానికి వంద కోట్లు కేటాయించినట్లు చెబుతున్నారని ఈ రకంగా కేటాయింపులుంటే ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తికాదన్నారు. బహుశా ఈ విషయంలో కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ముందే ఒక అవగాహనతో ఉన్నాయేమోననే అనుమానాన్ని సోమయాజులు వ్యక్తం చేశారు. పోలవరానికి బీజేపీ వారు ఎలాగూ నిధులు ఇవ్వరనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతున్నట్టుగా ఉందని చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు. జాతీయ హోదా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16,000 కోట్లు ఖర్చవుతాయని, మూడేళ్లలో దీనిని పూర్తి చేస్తామని చెప్పినందున ప్రతి ఏటా కనీసం రూ.6,000 కోట్లు కేటాయించాల్సి ఉందని సోమయాజులు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే వాస్తవిక వ్యయాన్ని ఇస్తామని కూడా కేంద్రం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీకి సంబంధించి ముఖ్యమైన రాజధాని నిర్మాణానికి నిధులేమీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర బడ్జెట్లో తాము కేటాయింపులేమీ చేయకపోయినా విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మాత్రం ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారనీ, అయితే అదెప్పుడూ చెప్పేమాటేనని అన్నారు. గతంలో కూడా తాము బడ్జెట్ పెట్టిన వెంటనే వెళ్లి అడిగితే.. బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా ఏపీకి ఏదో రకంగా నిధులు ఇస్తామన్నారని, ఆ తరువాత అవి కార్యరూపం దాల్చలేదని సోమయాజులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి వచ్చే స్థూల పన్నుల రాబడి లో వాటా, ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘాల నుంచి వచ్చే గ్రాంట్లు.. మొత్తం కలిపి 62 శాతం వరకు రాష్ట్రాలకు తొలిసారిగా ఇప్పుడే బదిలీ అవుతున్నట్లు ఆర్థికమంత్రి చెప్పడం ఎంతమాత్రం సరికాదని సోమయాజులు అన్నారు. గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్రాలకు ఎప్పుడూ 68 నుంచి 71 శాతం వరకు ఆ వాటా ఎప్పుడూ వస్తూనే ఉందని అందులో కొత్తేమీ లేదని వివరించారు. ఏమాత్రం ఆశాజనకంగా లేదు..: జైట్లీ ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదన్నారు. పది నెలల కోసం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం రూ.17.94 లక్షల కోట్లుగా ఉందని, అదిప్పుడు తగ్గి రూ.17.77 లక్షల కోట్లకు చేరుకుందని.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇదెంత మాత్రం మంచి సంకేతం కాదన్నారు. మన ఆర్థికాభివృద్ధిరేటు 8 శాతానికి వెళ్లబోతోందని, ప్రపంచమంతా మనవైపే చూస్తోందనే ఆర్భాటపు మాటలు చెప్పుకోవడం తప్పితే.. ఆచరణలో అదేమీ లేదని బడ్జెట్ లెక్కలను లోతుగా పరిశీలిస్తే అర్థం అవుతోందన్నారు. బడ్జెట్ పరిమాణం తగ్గడం, ప్రణాళికా వ్యయం గత ఆర్థిక సంవత్సరం కన్నా తగ్గి పోవడం ఆర్థికాభివృద్ధి పెరుగుదలకు సంకేతం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఆర్థిక విషయాలను బహిరంగ పర్చకపోవడం సరికాదని సోమయాజులు అన్నారు. ఆర్థిక వివరాలు కావాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాస్తే.. ఆ వివరాలు అడగడానికి జగన్ స్థాయి చాలదనడం, ప్రతిపక్ష నాయకుడికి హోదా లేదని రాష్ట్ర మంత్రి యనమల మాట్లాడ్డం శోచనీయమని చెప్పారు. మన రాష్ట్రం లోటు ఎంత ఉందో, గత ఏడాదిగా నెలకొన్న ఆర్థిక పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి వివరాలు బహిరంగపరిస్తే కేంద్రం నుంచి మనకేమి రావాలో, కావాలో అడిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
'బాధలు చెప్పుకొచ్చిన రైల్వే మంత్రి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు కూడా రైల్వే బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదని వైఎస్ఆర్సీపీ సలహాదారు డి.ఎ.సోమయాజులు చెప్పారు. రైల్వే మంత్రి సదానంద గౌడ తన ప్రసంగంలో కేవలం బాధలే చెప్పుకొచ్చారన్నారు. ప్రజలకేం చేస్తారో చెప్పలేదని, రైల్వేబడ్జెట్ పూర్తి నిరాశ కల్గించిందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన బిల్లులో ప్రస్తావించిన అంశాలెక్కడా బడ్జెట్లో లేకపోవడం దురదృష్టకరం అన్నారు. రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేట్ భాగస్వామ్యమంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని సోమయాజులు ప్రశ్నించారు. -
‘సమైక్య’ పిటిషన్లపై విచారణ 18కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్లను పరిశీలిస్తామని, సవివరంగా విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు భరోసా ఇచ్చింది. రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, పారిశ్రామికవేత్త కె.రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, కె.కృష్ణమూర్తి అనేవ్యక్తి పిటిషన్లు వేయగా వీటిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తొలి పిటిషన్‌కు జతపరిచింది. తాజాగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా గురువారంరాత్రి రిజిస్ట్రీ ప్రధాన పిటిషన్‌కు జతచేసింది. దీంతో మొత్తంగా నాలుగు పిటిషన్లు శుక్రవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే తమ తరఫు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, ఈ దృష్ట్యా 11వ తేదీకి కేసును వాయిదావేయాలని మొదటి పిటిషనర్ రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించడంతో దాన్ని పరిశీలించిన ధర్మాసనం.. మొత్తం పిటిషన్లను తర్వాత విచారిస్తామంటూ మరో కేసు విచారణకు ఉపక్రమించబోయింది. ఈ దశలో సోమయాజులు తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ...‘‘ఈ రోజు(శుక్రవారం) విచారణ కేసుల జాబితాలో 65వ నంబర్‌గా లిస్టయిన రిట్ పిటిషన్ నం.940/2013ని విచారణకోసం ఇప్పటికే మీముందు ప్రస్తావించాం. కేంద్రప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ఇందులో సవాల్ చేశాం. మీరు దీన్ని పరిశీలించాలి’’ అని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రధాన పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని లేఖ అందినందున పిటిషన్లను పరిశీలించలేదని పేర్కొంది. సాల్వే మళ్లీ మాట్లాడుతూ.. ‘‘పిటిషన్‌లోని 26వ పేజీలో మా ప్రార్థన ఉంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్నే మొత్తంగా సవాల్ చేసిన పిటిషన్ ఇది. మీరు చూడండి’’ అని కోరారు. ఈ అభ్యర్థనకు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు సానుకూలంగా స్పందిస్తూ..‘‘పిటిషన్లను మేం పరిశీలిస్తాం. ఈ విషయాన్ని మేం వివరంగా విచారిస్తాం. ఆ మేరకు భరోసా ఇవ్వగలం’’ అన్నారు. విచారణను 11న జరపాలని ప్రధాన పిటిషనర్ తరఫు మరో సీనియర్ న్యాయవాది బి.పి.పాటిల్ కోరగా, 11న వీలుపడదని, 18న విచారిస్తామని చెబుతూ జస్టిస్ దత్తు విచారణను వాయిదా వేశారు. 2013 అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ ఆదేశాలివ్వాలనేది సోమయాజులు పిటిషన్‌లోని ప్రధాన ప్రార్థన. -
తెలంగాణపై నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: సోమయాజులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యుడు డీఏ సోమయాజులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. విభజనపై కేంద్రం తీసుకున్న నిర్హేతుక నిర్ణయంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని, పెద్దఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయని, ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటున్నాయని అందు లో వివరించారు. తెలంగాణ ఏర్పాటుపై అక్టోబర్ 3న కేంద్ర మం త్రివర్గం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాల్సిందిగా కోరారు. రాష్ట్రాల విభజనకు సహేతుకమైన విధానాన్ని రూపొందించే వరకు కొత్త రాష్ట్రాల ఏర్పాటును ఆపాలని విన్నవించారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు కోసం ఎలాంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టకుండా రాష్ట్రపతిని నిలువరించాలని అభ్యర్థించారు. ఆర్టికల్ 3... కేం ద్రంలోని అధికార పార్టీ చేతిలో ఆయుధంగా మారకూడదని, తన రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా రాష్ట్రాలను విభజించేందుకు దోహదపడకూడదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్‌సాల్వే పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక సరైన విధానాల ప్రకారమే రాష్ట్రాల విభజన జరగాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని చూస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరగాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1956 చెబుతోందని వివరించారు. అయితే ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ల ఏర్పాటు సమయంలో ఇది వర్తించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం... వాటి మాతృ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీల్లో విభజనకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని ఆధారంగా తీసుకుందని పిటిషన్లో గుర్తుచేశారు. సర్కారియా కమిషన్ సైతం తన నివేదికలో ఇదే తరహా విషయాన్ని పేర్కొన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. అది ఆర్థికంగా నిలదొక్కుకుంటుందా, పాలన, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగుతాయా అన్న అంశాలను ఒక స్వతంత్ర యంత్రాంగం పరిశీలించాలన్నారు. అంతేతప్ప రాజకీయ కారణాలతో నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు అక్కడే కొలువుదీరాయని వివరించారు. మిగతా రాష్ట్రం.. ముఖ్యంగా సీమాంధ్రలోని అనేక జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని వివరించారు. రాష్ట్రాన్ని విభజిస్తే.. వ్యవసాయాధార ప్రాంతమైన సీమాంధ్రలో రైతులతోపాటు, సామాన్యులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. -
ఢిల్లీలో ప్రగల్భాలు: సోమయాజులు
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత సోమయాజులు ఆరోపణ బాబు లేఖ వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆవేదన సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బుధవారం చేసిన ప్రసంగంలో ఆయన ప్రగల్భాలు చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు విమర్శించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, బాబు తనను తాను పొగుడుకోవడంపై తీవ్రంగా స్పందించారు. తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినట్టుగానే, ఇపుడు గుజరాత్లో నరేంద్రమోడీ కూడా అదే విధంగా చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకోవడం, నరేంద్ర మోడీ అదే వేదికపై వింటూ కూర్చోవడం విడ్డూరంగా ఉందని సోమయాజులు అన్నారు. చంద్రబాబు మాటల్లో ఒక్క నిజం లేదని దుయ్యబట్టారు. ‘తానే ఈ దేశానికి సెల్ఫోన్లు తెచ్చానన్నారు.. తన పాలనలో మిగులు విద్యుత్ ఉండేదన్నారు. తాను ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో ఇపుడు గుజరాత్లో మోడీ అదే విధంగా చేస్తున్నారట.. ఇలాంటి విచిత్రమైన విషయాలు చంద్రబాబు ఎలా చెబుతారో అర్థం కాకుండా ఉంది’ అని విమర్శించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు 1991-96 మధ్య కాలంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి సుఖ్రామ్ సెల్ఫోన్లను ప్రవేశ పెట్టారని సోమయాజులు గుర్తు చేశారు. ఇక మిగులు విద్యుత్ విషయానికి వస్తే... బాబు పాలనలో ఐదారుసార్లు చార్జీలు పెంచడంతో ఎవరూ కొనలేని పరిస్థితుల్లో మిగులు సాధ్యమై ఉండొచ్చు అని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు ఐదారు సార్లు పెంచినందుకే చంద్రబాబును 1999 తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజలు గెలిపించలేదన్నారు. చంద్రబాబుకు తన నిర్వాకం తెలిసి కూడా పచ్చి అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బాబు పాలించిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అవతరించాక ఎన్నడూ లేని విధంగా రూ. 22 వేలకోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని గుర్తు చేశారు. చంద్రబాబుకు అభినందన: తెలంగాణ ఏర్పాటు చేయాలని బాబు లేఖ రాసినందువల్లనే ఈ రోజు రాష్ట్ర విభజన జరుగుతోందని, ఇందుకు ఓ రకంగా చంద్రబాబుకు అభినందనలు తెలపాలని సోమయాజులు వ్యం గ్యంగా అన్నారు. 2008లో ప్రణబ్ కమిటీకి షరతులు లేని లేఖ ఇచ్చింది చాలక, 2009 ఎన్నికల ప్రణాళికలో కూడా తెలంగాణను చేర్చారని, అంతేకాక 2009 డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు మద్దతు పలికారని పేర్కొన్నారు.అలాగే 2012 డిసెంబర్లో కేంద్ర హోంమంత్రి షిండే సమక్షంలో జరిగిన అఖిలపక్షంలో కూడా బాబు తెలంగాణ కావాలని కోరారని అన్నారు. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి తన కోరికకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేయిస్తున్నందుకు బాబును అభినందిస్తున్నానని ఎద్దేవా చేశారు. -
జగన్ రాకతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు
* అందుకే అబద్ధపు ఆరోపణలు వైఎస్సార్ సీపీ నేతలు కొణతాల, సోమయాజులు ధ్వజం * విజయమ్మ ఫోన్ చేశారని సోనియా మీకు చెప్పారా? * చంద్రబాబు అవినీతి, మార్గదర్శి అక్రమాలు జేపీకి కనిపించలేదా? * టీడీపీ, కాంగ్రెస్‌ల క్షుద్ర రాజకీయాల్లో ఆయన పావుగా మారారు * జగన్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితమని సుష్మాస్వరాజే అన్నారు * డీల్ కుదుర్చుకునే అలవాటు చంద్రబాబు, బీజేపీలదే సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిలుపై బయటకు రావడంతో అధికార, ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అందుకనే టీడీపీ, బీజేపీలు ఆయనపై అబద్ధపు ఆరోపణలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యులు డి.ఏ.సోమయాజులు పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయనకు లభించిన అశేష ప్రజాదరణను చూసి కొందరికి చాలా బాధ కలిగి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కూడా జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ ఆడుతున్న క్షుద్ర రాజకీయ క్రీడలో పావుగా మారి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్‌కు బెయిలు వచ్చిన రోజు రాత్రి 12 గంటలకు సోనియాగాంధీకి విజయమ్మ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారని టీడీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం వారికెవరు చెప్పారు? కాల్ డేటా జాబితా ఏమైనా సంపాదించారా...? పోనీ గత రెండేళ్లుగా చంద్రబాబుతో కుమ్మకై్క రాజకీయాలు చేస్తున్నందు వల్ల సోనియాగాంధీయే వాళ్లకు ఈ విషయం చెప్పారా?’ అని వారు సూటిగా ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తయింది కనుకే బెయిల్ ఇచ్చారు టీడీపీకి ఎందుకీ దుస్థితి...? ఎందుకిలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు నిలదీశారు. ‘సీబీఐ జాయింట్ డెరైక్టర్ లకీష్మనారాయణను మేమే బదిలీ చేయించినట్లు... ఆయన ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నట్లు చెబుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’ అని మండిపడ్డారు. ‘లకీష్మనారాయణ సీబీఐ జేడీగా ఉండగా జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఐదు సందర్భాల్లో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు కనుక బెయిల్‌ను మంజూరు చేయవద్దని కోర్టుకు నివేదించారు. వారి న్యాయవాది అశోక్భాన్కూడా ఇదే విషయం చెప్పారు. దర్యాప్తు పూర్తి కాలేదనే ఒకే ఒక కారణంతో వారు జగన్ బెయిల్‌ను అడ్డుకుంటూ వచ్చారు. ఇపుడు దర్యాప్తు పూర్తయింది కనుక జగన్‌కు కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ కోసం జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినపుడు... దర్యాప్తు ముగియలేదని, సమయం కావాలని సీబీఐ కోరింది. వారి అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు నాలుగు నెలల్లోగా దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ గడువును పాటించకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది కాబట్టి... అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు అనుగుణంగా సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. దర్యాప్తు పూర్తయిందని చెప్పింది. దర్యాప్తు ముగిసినందున కోర్టు జగన్‌కు బెయిల్ మంజూరు చేసింది. అసలు విషయం ఇదయితే... ఏమాత్రం బుద్ధి, ఇంగిత జ్ఞానం ఉన్నా జగన్ గురించి ఇలా మాట్లాడరు’ అని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసులని బీజేపీ అగ్రనేతలే అన్నారుగా..? ‘జగన్ గతేడాది అక్టోబర్ 5న బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు 2013 మార్చి లోపుగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. మార్చి తరువాత బెయిల్ పిటిషన్ వేస్తే.. 70 శాతం పూర్తయిన దర్యాప్తులో రూ.1,030 కోట్ల మేర పెట్టుబడుల విషయాన్ని తేల్చామని సీబీఐ చెప్పటంతో మరో 4 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు పూర్తి చేయడంతో బెయిల్ లభించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు? ఎందుకింత దుష్ర్పచారం? ఎందుకిన్ని అబద్ధాలు?’ అని కొణతాల, సోమయాజులు నిలదీశారు. సోనియాతో కుమ్మక్కు అయినందునే జగన్‌కు బెయిల్ వచ్చిందని బీజేపీ నేత నిర్మలా సీతారామన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘జగన్‌పై కేసులు మోపినపుడు బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ స్వయంగా ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని.. జగన్‌ను వెంటాడి వేధించేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించిన సంగతి నిర్మలకు గుర్తు లేదా? ఆ పార్టీకే చెందిన మరో నేత అరుణ్ జైట్లీ చేసిన విమర్శలను మర్చి పోయారా?’ అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. బాబు అవినీతి, ఈనాడుపై కేసుల గురించి మాట్లాడరేం? ‘బీజేపీ నేతలు 1998లో చంద్రబాబుపై వంద ఆరోపణలతో ప్రకటించిన చార్జిషీటును ఆ తరువాత జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ అధినేత మద్దతు కావాల్సి రావడంతో దాన్ని తుంగలో తొక్కిన ఘనత ఆ పార్టీదే. అలా లాలూచీ పడే అలవాట్లు వారికే ఉన్నాయి. బహుశా ఈ విషయం నిర్మలా సీతారామన్‌కు తెలియదేమో?’ అని కొణతాల, సోమయాజులు ఎద్దేవా చేశారు. సుపరిపాలన, పారదర్శకత అని చెబుతూ అవినీతిపై పోరాటం చేస్తున్నానని చెప్పుకునే జయప్రకాష్ నారాయణ్ తీరు మరీ విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిపై పోరుకు బదులు జగన్‌పై జేపీ వ్యక్తిగత పోరాటానికి దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై జేపీ ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. మార్గదర్శి-ఈనాడు సంస్థలపై కేసుల విషయంలో ఎందుకు స్పందించరని నిలదీశారు. నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడ్డ రోజున చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కేసులు కూడా అలాంటివేనని ఆయన్ను కూడా ఉరితీయాలన్నారని ఇపుడు జయప్రకాష్ కూడా జగన్ కేసులు నిర్భయ కేసుల్లాంటివేనని మాట్లాడటాన్ని బట్టి చూస్తే ఏమనుకోవాలన్నారు. బాబు స్టే తెచ్చుకున్నప్పుడు జేపీ మాట్లాడలేదేం? జగన్ కేసులను జేపీ చెప్పినట్లుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలా చేస్తే తొమ్మిది నెలలకే కేసు పూర్తయ్యేదని, జగన్‌కు 16 నెలల పాటు జైల్లో ఉండే అగత్యం తప్పేదని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపై హైకోర్టు విచారణకు ఆదేశిస్తే వాటిపై ఆయన స్టే తెచ్చుకున్నపుడు జేపీ ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. ఐఏంజీ, ఎమ్మార్ కుంభకోణాల్లో బాబు చేసిన నిర్వాకంపై దర్యాప్తు జరిపించాలని జేపీ ఎందుకు డిమాండ్ చేయరని అడిగారు. జగన్‌కు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లలో కలిపి చేసిన ఆరోపణల మొత్తం రూ.1,200 కోట్లు మాత్రమేనని, అవి కూడా పెట్టుబడుల రూపంలో వచ్చినవేనన్నారు. కానీ బాబు చేసిన ఒక్క ఐఎంజీ వ్యవహారంలోనే రూ. 1,200 కోట్ల అవినీతి దాగుందని పేర్కొన్నారు. ఈనాడు-మార్గదర్శి సంస్థలపై ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన ఫిర్యాదుతో దర్యాప్తు జరిగితే ఇది వ్యాపార సంస్థలను భయపెట్టే చర్యగా నాడు జేపీ వ్యాఖ్యానించడాన్ని వారు గుర్తు చేశారు. ‘లెసైన్సు లేకుండా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించడం తప్పు అని రిజర్వు బ్యాంకు నోటీసులు జారీ చేస్తే... ఈనాడుపై జరుగుతున్న రాద్ధాంతం అంతా అంశాల్ని బట్టి కాకుండా చాలా వ్యక్తిగతంగానూ, క్షణికంగానూ అనిపిస్తోందని జేపీ ఆరోజు చెప్పారు. డిపాజిటర్లు ఎవరూ ఫిర్యాదు చేయక పోయినా ఈ కేసును ఎందుకు సృష్టించి పెంచుతున్నారని ఆనాడు జయప్రకాష్ చెప్పారు. మరి ఈ విషయం జగన్‌కు వర్తించదా? జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా? మరి కేసులు ఎందుకు పెట్టినట్లు?’ అని ప్రశ్నించారు. మార్గదర్శి అక్రమాలను సమర్థిస్తూ జేపీ మాట్లాడిన పత్రికా క్లిప్పింగ్‌లను వారు ప్రదర్శించారు. అవినీతి పోరులో జేపీకి చిత్తశుద్ధి ఉంటే అన్నింటిపై విచారణ జరపాల్సింగా కోరాలన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాలను కూడా విమర్శించిన ఘనత జేపీదని వ్యాఖ్యానించారు. -
అవాస్తవాల ప్రచారం: కొణతాల రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: జగన్మోహన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ‘క్విడ్ ప్రో కో’ ఎక్కడా జరగలేదని తాము మొదటి నుంచి చెబుతున్నదేనని ఆ పార్టీ నేతలు డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. సీబీఐ రెండేళ్లపాటు చేసిన దర్యాప్తులో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఎక్కడా తేల్చలేదన్నారు. జగన్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన అనంతరం వారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, హర్షం వ్యక్తం చేశారు. జగన్‌పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తాము మొదట్నుంచి చె బుతున్నప్పటికీ, కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా నోరుపారేసుకున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. తమ పార్టీ కుమ్మక్కు అయితే జగన్ ఇన్నాళ్లు జైల్లో ఎందుకుంటారని ప్రశ్నించారు. లావా దేవీలన్నింటికీ ఆదాయపు పన్ను శాఖ ఆధారాలు ఉన్నప్పటికీ ఒక విభాగానికి చెందిన మీడియా, కొందరు నేతలు వాస్తవాలను పూర్తిగా వక్రీకరించారని విమర్శించారు. వ్యాపారవేత్తలైన నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి లాంటి వారిపైనా ఆరోపణలు చేయడంతో పాటు అధికారులపై దుమ్మెత్తిపోశారన్నారు. -
రాష్ట్రాల ‘వాటా’ ఇవ్వాల్సిందే
ఫైనాన్స్ కమిషన్‌కు వైఎస్సార్సీపీ విజ్ఞాపన పత్రం కేంద్ర పన్నుల రాబడి నుంచి రాష్ట్రాల వాటా బదలాయింపు అంశంపై మా అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించినపద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారికి, సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా విజ్ఞాపన పత్రం ఈ విషయానికి సంబంధించిన రెం డు సమస్యలను ప్రధానంగా చర్చించింది. అవి: కేంద్ర రాబడుల నుంచి రాష్ట్రాల మధ్య పంపకం కావాల్సిన నిధులు ఏవి? ఎంత? కేంద్ర రాబడులలో రాష్ట్రాల వాటా పంపకాన్ని నిర్ణయించే వివిధ అంశాలకు ఏ వెయిటేజీని ఇవ్వాలి? పై రెండు అశాలను చర్చించడంతో పాటూ కేంద్ర ప్రభుత్వం ద్రవ్య వనరులను గందరగోళపరచి దేశాన్ని కనీవినీ ఎరుగని రుణ సుడిగుండంలోకి, విదేశీ మారకద్రవ్య సంక్షోభంలోకి ఈడుస్తున్న తీరు పట్ల మా తీవ్ర ఆందోళన ను కూడా వ్యక్తం చేయదలచుకున్నాం. 1991లో దేశం తీవ్ర విదేశీమారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు సైతం కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) 2.6 శాతం మాత్రమే. నేడది 4.5 శాతం కంటే ఎక్కువే. మొత్తం విదేశీ రుణంలో ఏడాది గడువు స్వల్పకాలిక రుణ భారం 25 శాతానికి చేరి విదేశీమారక పరిస్థితిని విషమింపజేస్తోంది. గత నాలుగేళ్లలో ప్రతి ఏడాది ద్రవ్య లోటు జీడీపీలో 5 శాతానికి పెరిగింది. అందులో 80 శాతం రాబడి లోటును పూడ్చుకోడానికే పోతోంది. ఆశ్చర్యకరంగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కార్పొరేటు రంగానికి అందాల్సిన నిధులను అందకుండా చేస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌తో సంబంధంలేని జూదంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2013 జూలై నివేదిక ఇలా పేర్కొంది: ‘‘పారిశ్రామిక ఉత్పత్తి సూచిక జూన్ 2012లో -2.0 శాతం ఉండగా అది జూన్ 2013లో -2.2 శాతానికి క్షీణించింది. ఏప్రిల్-జూన్ 2012-13లో -0.2 శాతంగా ఉన్న ఈ సూచిక ఏప్రిల్-జూన్ 2013-14లో -1.1 శాతానికి పడిపోయింది.’’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసిక రెవెన్యూ రాబడులు గత ఏడాది అదే కాలంతో పోలిస్తే -1.3 శాతానికి పైగా పడిపోయాయని కూడా తెలిపింది. గత ఏడాది రాబడులు ముందటి ఏడు కంటే 30.6 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ లెక్కన మన దేశం ఎక్కడికి పోతున్నట్టు? దేశం ఎన్నడూ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉండటం ఎరుగం. బొగ్గు, విద్యుత్తులేక దాదాపు 60 శాతం చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఇంచుమించు మూతపడుతున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికం చివరికి వాస్తవ ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 48.4 శాతంగానూ, రాబడి లోటు 55.4 శాతంగానూ ఉంది. ద్రవ్య, రాబడి లోట్లు విపరీతంగా పెరిగిపోవటం ద్రవ్యోల్బణాన్ని మరింత విషమం చేస్తుంది. ఈ ఏడాది కేంద్ర రాబడిలో 50 శాతం రుణాలపై వడ్డీలకే సరిపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిస్థితికి ప్రభుత్వం బహిర్గత కారణాలను చూపుతోంది. కానీ మన దిగుమతులు 50,000 కోట్ల డాలర్లుకాగా, ఎగుమతులు 30,000 కోట్ల డాలర్లు. ఈ లోటు ఎక్కువేం కాదు. కేంద్ర సంక్షేమ పథకాలను (సీఎస్ఎస్) బాధ్యతారహితంగా ప్రవేశపెడుతూనే ఉన్నారు. మరో వంక కేంద్రం రాష్ట్రాలు అవి ద్రవ్యపరమైన బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని (ఎఫ్ఆర్బిఎం చట్టం) ఉల్లంఘించినా శిక్షించాలని భావిస్తోంది. అందుకే 14వ ఫైనాన్స్ కమిషన్ ముందున్న ముఖ్య అంశాల్లో కేంద్ర రాబడులు కూడా ఒకటి. I. కేంద్ర రాబడుల నుంచి రాష్ట్రాల మధ్య పంపకం కావాల్సిన ఏవి? అది ఎంత? కేంద్ర రాబడులలో కస్టమ్స్, ఎక్సైజు డ్యూటీలూ, సర్వీసు, ప్రత్యక్ష పన్నులు మాత్రమే ప్రస్తుతం రాష్ట్రాలకు పంపకం అవుతున్నాయి. సెస్‌లు, సర్చార్జీలతోపాటూ కేంద్ర పన్నే తర రాబడులను కూడా అందులో చేర్చాలని పలు పార్టీలు, రాష్ట్రాలు 13వ ఫైనాన్స్ కమిషన్‌ను కోరాయి. కమిషన్ అందుకు అంగీకరించలేదు. అలాగే అన్ని రెవెన్యూ అకౌంటు బదలాయింపులపైనా సూచనాత్మక సీలింగ్‌ను 50 శాతంగా నిర్ణయించాలని కూడా కోరారు. 13వ కమిషన్ దాన్ని మొత్తం కేంద్ర రెవెన్యూ రాబడులలో 39.5 శాతంగా సూచించింది. కేంద్ర పన్నులలో పంచుకోదగిన నికర రాబడులను 40 శాతంగా నిర్ణయించాలని కోరగా, ఏడాదికి 32 శాతాన్ని మాత్రమే సూచించింది. అంతకంటే ఎక్కువ స్థాయి బదలాయింపులు జరగాలనడానికి ప్రధాన కారణాలు ఇవి: 1. 1991కి ముందు కేంద్ర ప్రభుత్వ రంగం ఆర్థిక వ్యవస్థలో, ప్రత్యేకించి ఉపాధి, రాబడుల కల్పనలో, ప్రాంతీయ సమతుల్యతల సాధనలో కీలక పాత్ర నిర్వహించేది. మన రాష్ట్రంలో బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, హెచ్‌సీఎల్, ఈసీఐఎల్, విశాఖ ఉక్కు తదితర భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసింది. వాటి అనుబంధ యూనిట్లతో కలిసి అవి రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధిని కల్పించాయి. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వ రాబడులను కూడా పెంపొందింపజేశాయి. సీసీఎంబీ, డీఆర్డీఎల్, శ్రీహరి కోట ఉపగ్రహ కేంద్రం మొదలైన పలు ప్రతిష్టాత్మక ఆర్ అండ్ డీ లేబరేటరీలను నెలకొల్పింది. కేంద్రం చొరవ ఫలితంగా రాష్ట్రం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. స్థానిక వ్యాపార, పారిశ్రామిక దక్షత వికసించింది. అయితే ఆ తదుపరి కేంద్రం ప్రభుత్వ రంగ పెట్టుబడుల విస్తరణకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. పారిశ్రామిక లెసైన్సింగ్ విధానాన్ని తొలగించింది. పెట్టుబడులను ఆకర్షించగల ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపైనే పడింది. 1991తో పోలిస్తే రాష్డ్ర ప్రభుత్వా లు అందుకోసం గణనీయంగా అదనపు పెట్టుబడులను పెట్టాల్సివస్తోంది. అంటే కేంద్రం వద్ద 1991 తర్వాత ఎక్కువ మిగులు నిధులు ఉంటున్నాయని అర్థం. అందువలన ఈ కమిషన్ ఉత్తమ మౌలిక సదుపాయల కల్పన, ప్రత్యేక ఆర్థిక మండలాల స్థాపన చేపట్టిన రాష్ట్రాలకూ, శ్రామిక నైపుణ్యం, ఉత్పాదికతల స్థాయిని పెంపొందిపజేసే సంస్థల స్థాపన చేపట్టే రాష్ట్రాలకూ అదనపు బదలాయింపులు జరిగేలా తగు పద్ధతిని ప్రవేశపెట్టవలసి ఉంది. 2. జనాభారీత్యానూ, విస్తీర్ణం రీత్యానూ కూడా మన రాష్ట్రాల్లో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. పైగా ప్రతి రాష్ట్రం లోనూ వివిధ జిల్లాలకు భిన్న అభివృద్ధి స్థాయిలు, మానవాభివృద్ధి సూచికలు, వనరులు ఉన్నాయి. అందువలన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ వనరులకు, ప్రాధాన్యాలకు అనుగుణంగా సొంత సామాజిక ఆర్థిక వ్యూహాలను రూపొం దించుకునే అవకాశం కల్పించాలి. కాని కేంద్రం ఒకే విధమైన కేంద్ర పథకాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతోంది. గంగానదీ మైదానాలలో వ్యవసాయం వర్షాధారం కాదు. కాగా వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న రాష్ట్రాల్లోని నదులు కూడా వర్షాధారమైవదే. ఈ తేడాలను పరిగణనలోకి తీసుకోకుండా జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేస్తోంది. అలాగే రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) పథకం కూడా. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో సగటు వార్షిక వృద్ధి లక్ష్యమైన 4 శాతం రేటును సాధించి, బడ్జెట్‌కు అనుగుణంగా కేటాయింపులను చేస్తున్న రాష్ట్రాలు, చేయని రాష్ట్రాలు అన్న విచక్షణ లేకుండా... జాతీయ ఆహార భద్రత మిషన్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ పథకం కింద వ్యవసాయరంగానికి అంతటా ఒకే విధంగా ప్రోత్సహకాలను అందించడంలోని ఔచిత్యమేమిటో తెలి యదు. వ్యవసాయం స్థానిక పరిస్థితులకు లోబడి ఉండేది. ఉదాహరణకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 322 సేద్య పరిస్థితులున్నాయి. ప్రతిదానికి ప్రత్యేకమైన వ్యూహం, భిన్నస్థా యిల పెట్టుబడులు అవసరం. కాగా మొత్తం దేశానికి కేంద్ర ప్రభుత్వం ఒకే విధమైన ప్రాతిపదికను ఎలా నిర్దేశించిందనేది ఆశ్చర్యకరం. దేశంలోని పలు రాష్ట్రాలకు స్థానిక అవసరాలపై ఆధారపడిన సొంత పేదరిక నిర్మూలన పథకాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ అలాంటి రాష్ట్రాల్లో ఒకటి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అక్కడ ఆహార భద్రత, వృద్ధాప్య పెన్షన్లు, ఆరోగ్య భద్రత, గృహవసతి, ప్రభుత్వ వ్యయంతో విద్య వంటి పలు సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలయ్యాయి. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి, వ్యాట్, మునిసిపల్ పన్నులుగానీ, నీరు, విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలనుగానీ పెంచకుండానే, రెవెన్యూ లోటు లేకుండానే 2004-09 మధ్య అవి అమలయ్యాయి. అందువలన ప్రజల అవసరాలను రాష్ట్రాలే బాగా అర్థం చేసుకోగలుగుతాయి. ఎఫ్ఆర్బీఎంకు లోబడి వ్యయాల ప్రాధాన్యతను నిర్ణయించుకోగల సామర్ధ్యం కూడా వాటికి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో అమలవుతున్న కేంద్ర పథకాలకు స్వస్తిపలికి, వాటికి బదులుగా రాష్ట్రాలకు మరింత ఎక్కువ రాబడి బదలాయింపు చేసే విషయాన్ని కేంద్ర పభుత్వం పరిశీలించాలి. సెస్‌లు, సర్‌చార్జీలు, కేంద్ర పన్నేతర రాబడులను రాష్ట్రాలకు బదలాయించే నిధిలో చేర్చి, కనీసం అందులో 40 శాతాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకునే అంశాన్ని ఈ కమిషన్ పరిశీలించాలని బలంగా కోరుతున్నాం. II. కేంద్ర రాబడులలో రాష్ట్రాల వాటా బదలాయింపును నిర్ణయించే వివిధ అంశాలకు ఏ వెయిటేజీని ఇవ్వాలి? ఈ అంశంపై పదమూడవ పైనాన్స్ కమిషన్ దిగువ వెయిటేజీలను సూచించింది. 13వ పైనాన్స్ కమిషన్ ద్రవ్య సామర్ధ్యపు అంతరానికి అత్యధికంగా 47.5 శాతం వెయిటేజీని ఇచ్చింది. తలసరి రాబడి అత్యధికంగా ఉన్న మొదటి, రెండు రాష్ట్రాలైన హర్యానా, గోవాలను అది ప్రాతిపదికగా తీసుకుంది. ఇది నిధుల బదలాయింపుకు అత్యుత్తమ పద్ధతి కాదని మా అభిప్రాయం. ఈ పద్ధతిలో జీఎస్డీపీలో నిష్పత్తిగా అధిక రాబడులతో మంచి ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రా లను శిక్షించడం జరుగుతుంది. పరిపాలనా లోపాల కారణంగా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రోత్సహకాలు కొనసాగుతూనే ఉంటాయి. తలసరి ఆదాయాల అంచనాలు రాష్ట్రాల వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించజాలవు. ప్రతి రాష్ట్రంలోనూ తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచిక, తదితర పారమితులలో చాలా అంతరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తలసరి పన్నుల రాబడి చాలా ఎక్కువగా ఉంది. అయితే దానికదే వివిధ జిల్లాల ప్రజల మానవాభివృద్ధి సూచికకు హామీని కల్పించజాలదు. ఉదాహరణకు 2012-13లో మహారాష్ట్ర జీఎస్డీపీ రూ.13.72 లక్షల కోట్లు. దేశంలోకెల్లా అతి ఎక్ముక తలసరి ఆదాయంగల (రూ.1,05,000) రాష్ర్టం. కానీ ఆ రాష్టంలోని 35 జిల్లాల్లో 9 జిల్లాల తలసరి ఆదాయం రాష్ట్ర సగటుతోనే కాదు దేశ సగటుతో (2011-12లో రూ.61,656) పోల్చినా త క్కువే. 17 జిల్లాల పరిస్థితి ఒడిశా లేదా బీహార్లంత అధ్వాన్నం. అలాగే ఏపీలోని 23 జిల్లాల్లో 9 జిల్లాల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే తక్కువే. సగటు నికర ఎస్‌డీపీని బట్టి చూస్తే మహారాష్ట్రకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. కానీ ఆ రాష్ట్ర జీడీపీలోని అత్యధిక భాగం కొన్ని పెద్ద పట్టణ ప్రాంతాలలోనే కేంద్రీకృతమై ఉంది. దుర్భరమైన జీవితాలనే గడుపుతున్న అట్టడుగు స్థాయి ప్రజలకు అది చేరడంలేదు. జనాభాలోని అధిక భాగానికి మేలు చేకూరడం లేదు. అలాంటి రాష్ట్రాలకు వాటికి రావాల్సిన వాటాను నిరాకరించడం పెద్ద పొరపాటు. బీహార్ (11 శాతం), ఉత్తరప్రదేశ్‌ల (19.98 శాతం) కంటే మంచి ఫలితాలను సాదిస్తున్న మహారాష్ట్ర (5.28 శాతం), గుజరాత్ (3.8 శాతం), తమిళనాడు (5.04 శాతం), ఆంధ్రప్రదేశ్ (7.04 శాతం) రాష్ట్రాలకు తక్కువ బదాలాయింపులు కొనసాగుతుండటం దురదృష్టకరం. సమానత్వం అంటే ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచడం, ఫలితాలను సాధించలేని రాష్ట్రాలను ప్రోత్సహించడం కారాదు. కానీ దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ వెయిటేజీని 47.5 శాతం నుంచి 20 శాతానికి తగ్గించి, మిగిలిన 27.5 శాతాన్ని జనాభా, విస్తీర్ణం, సామాజిక రంగ వ్యయం, అధిక ప్రణాళికావ్యయం వంటి పారమితులకు కేటాయించాలని కోరుతున్నాం. (1) రాబడుల బదాలాయింపు (టీవోఆర్) పేరా 7లో కమిషన్ 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంది. చాలా కాలంగా కేంద్రం అదే ప్రాతిపదికపై బదలాయిం పులు చేస్తుంది. ఇప్పుడు కమిషన్ ఆ తర్వాత వచ్చిన జనాభాపరమైన మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని పేర్కొంది. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఆ తదుపరి జనాభాపరమైన మార్పులను పరిగణనలోకి తీసుకుంటే భారీ పెట్టుబడులు పెట్టి, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసిన ఏపీ వంటి రాష్ట్రాలకు అది అననుకూలమవుతుంది. దేశ జనాభాలో ఏపీ జనాభా 1971లో 8 శాతం కాగా 2011లో 7 శాతమే. జనాభా నియంత్రణ ముఖ్య కర్తవ్యంగా ఉన్న పరిస్థితుల్లో కమిషన్ ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చితే ఆ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ఇచ్చినట్లు అవుతుంది. ఐరాస మానవాభివృద్ధి నివేదిక పారమితుల దృష్ట్యా భారత జనాభాలో 70-80 శాతం దుర్భర పేదరికంలో నివసిస్తున్నట్టే లెక్క. అందువలన కేంద్ర రాబడుల బదలాయింపులో జనాభాకు 30 శాతం వెయిటేజీని ఇవ్వాలని సూచిస్తున్నాం. (2) ప్రతి రాష్ట్రమూ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం నేటి తక్షణ అవసరం. అధిక పెట్టుబడులు పెడితే జీడీఎస్పీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే రాష్ట్రానికి అధిక రాబడులు ఉండి, ప్రభుత్వ, ప్రభుత్వరంగ వ్యయం పెరగడమని అర్థం. ప్రభుత్వరంగ పెట్టుబడులతో పాటూ ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వ, ప్రభుత్వరంగ వ్యయాలను పెంచి ప్రైవేటు పెట్టుబడులను, జీడీఎస్పీని పెంపొందిపజేయడానికి వీలుగా రాష్ట్రాల రుణ సేకరణను అనుమతించాలి. 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్రం 2003లో ఎఆర్బీఎం చట్టాన్ని చేసింది. 2008-09 నాటికి రెవెన్యూ లోటును సున్నాకు తగ్గించి, ద్రవ్యలోటు జీడీపీలో 3 శాతం ఉండేట్టు చేయాలని నిర్దేశించింది, రాష్ట్రప్రభుత్వపు ద్రవ్య లోటును ఒక ఏడాది జీఎస్డీపీతో ముడిపెట్టడం సరికాదని మనవి చేస్తున్నాం. ద్రవ్యలోటు నిజానికి రాష్ట్ర రాబడితో ముడిపడి ఉన్నది. ైపైగా రుణ సేకరణపై పరిమితి జీఎస్డీపీకి ప్రామాణిక స్థాయి నిష్పత్తిలో ఉండాల్సిన అవసరమేమీ లేదు. ఇది దృష్టిలో ఉంచుకొని రుణాలను తీసుకోవడానికి అర్హత విషయంలో నేటి ఎఫ్డీ/ జీఎస్డీపీ నిష్పత్తి ఫార్ములాను రద్దుచేసి, రుణాలను రాబ డులకు ముడిపెట్టే విధంగా కమిషన్ కేంద్రానికి మార్పును సూచించాలని కోరుతున్నాం. లేకపోతే కొన్ని రాష్ట్రాలు అనివార్యంగా రుణవలయంలో చిక్కుకుపోతాయి. (3) జీఎస్డీపీలో రాష్ట్ర రాబడుల నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. పన్నుల పెంపుదలపై కంటే ఆర్థిక పునాదిని విస్తరింపజేయడానికి వైఎస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడమే అందుకు కారణం. దేశంలో ఏపీ ప్రణాళికా వ్యయమే గత పదేళ్లుగా దాదాపు అధికంగా ఉంటోంది. 2003-04 2008-09 మధ్య రాష్ట్ర ప్రణాళికా వ్యయం రూ.10,366 కోట్ల నుంచి రూ.32,701 కోట్లకు పెరిగింది. ఇలా దేశ వృద్ధికి దోహదం చేసే రాష్ట్రాలకు సహజంగానే ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. స్వతంత్ర భారతంలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. పేదరిక నిర్మూలన పథకాల అమలులో 2003లో 23వ స్థానంలో ఉన్న ఏపీ నేడు ప్రథమ స్థానంలో నిలిచిందని గవర్నర్ ఇటీవలే పేర్కొన్నారు. నీటిపారుదల, బలహీన వర్గాల గృహవసతి వ్యయాలు రాష్ట్ర ప్రణాళికా వ్యయాలకు చోదకశక్తి అయ్యాయి. రాష్ర్టంలోని నీటిపారుదల ప్రాజెక్టులు రాష్ట్ర అవసరాలు తీర్చడమే గాక దేశ ఆహార భద్రతకు కూడా తోడ్పడుతున్నాయి. అందువలన నీటిపారుదల వ్యయాలు, ఉచిత విద్యుత్తు వ్యయాలలో కొంత భాగాన్ని కేంద్రం స్వీకరించే యంత్రాంగం ఏర్పాటును కమిషన్ సూచించాలని కోరుతున్నాం. నీటిపారుదల, బలహీనవర్గాల గృహవసతి, సంక్షేమపథకాల అమలు కోసం ప్రణాళికా వ్యయాన్ని పెంపొం దింపజేస్తున్న రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర నిధులలో 25 శాతం వెయిటేజీని ఇవ్వాలని కోరుతున్నాం. (1) వ్యవసాయరంగంలోని అల్ప వృద్ధి రేటు, ఉత్పాదకతలో స్తబ్ధత నే డు దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. ఇది వ్యవసాయంపై ఆధారపడ్డ 60 శాతం జనాభా దీర్ఘకాలిక అల్పాదాయ స్థాయిలకు కారణమవుతోంది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల సగటు వార్షిక వృద్ధి రేటు 5.2 శాతం (1981-91) నుంచి సంస్కరణల తదుపరి కాలంలో 2.3 శాతానికి (1991-2012) పడిపోయింది. వ్యవసాయరంగం విఫలమైతే మొత్తగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థే విఫలమవుతుంది. సరిగ్గా అదే జరుగుతోంది. 1991లో 630 జిల్లాల్లో కేవలం 20 జిల్లాలను మాత్రమే నక్సలైటు బాధిత జిల్లాలుగా ప్రకటిస్తే, 2004 నాటికి దాదాపు 200 జిల్లాలను నక్సల్ ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు. రైతుల దీర్ఘకాలిక ఆదాయాలను పెంచడానికి కృషిని ఏదైనా చేస్తే తప్ప సమ్మిళిత వృద్ధిని కాదుకదా, సమగ్ర వృద్ధిని సైతం సాధించలేం. కేంద్ర ప్రభుత్వం 2007లో ఆహార భద్రతా మిషన్‌ను ప్రారంభించినా ఫలితాలు ప్రోత్సహకరంగా లేవు. వ్యవసాయంలో చెప్పుకోదగిన సాంకేతికపరమైన అభివృద్ధి లేదు. దీంతో ఉత్పాదకతను పెంచడానికి ఉన్న ఏకైక మార్గం ఎక్కువగా సాగునీటిని అందుబాటులోకి తెచ్చి రైతుల ఆదాయాలను పెంపొందిపజేయడం మాత్రమే. వైఎస్ ప్రభుత్వం సరిగ్గా అదే చేసింది. మా రాష్ట్రం నీటిపారుదల, రైతులకు సబ్సిడీ విద్యుత్తుపై భారీగా పెట్టుబడులను పెట్టింది. ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం దీనివల్ల బాగా లాభపడింది. 2008-09లో తెలంగాణ ప్రాంతం 80 లక్షల టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసింది. ఉచిత విద్యుత్తు సదుపాయం లేకపోతే ఇది సాధ్యపడేది కాదు. అలాగే రాష్ట్రం కేంద్ర ఆహార నిల్వలకు పూల్‌కు 90 లక్షల టన్నుల ఆహారధాన్యాలను అందించగలిగేది కాదు. 2004-09 మధ్య రాష్ట్రం వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలలో సగటున 6.87 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసింది. 2004లో 136 లక్షల టన్నులుగా ఉన్న ఆహారధాన్యాల ఉత్పత్తి 2009 నాటికి 204 లక్షల టన్నులకు పెరిగింది. పాల ఉత్పత్తిలో రాష్ట్రం రెండవ అతి పెద్ద ఉత్పత్తిదారుగా మారింది. ఉద్యానవన సేద్యం, పశుపోషణ వంటి అనుబంధ రం గాల పురోగతి కొనసాగింది. నేడు రాష్ట్ర మిగులు ఆహార ధాన్యాలు ప్రధానంగా జాతీయ ఆహార భద్రత కోసమే. అందువలన జాతీయ ఆహార భద్రతకు దోహదపడుతున్న రాష్ట్రాలకు కేంద్ర రాబడుల నుంచి కనీసం 5 శాతాన్ని బదాలాయించి ప్రోత్సహించాలని 14వ ఫైనాన్స్ కమిషన్‌ను కోరుతున్నాం. జాతీయ అహార భద్రతకు దోహదపడే ఆహారధాన్యాల ఉత్పత్తికి ఇచ్చే విద్యుత్తు సబ్సిడీలపై రాష్ట్రాల వ్యయాలను పంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. (2) జనాభాలాగే రాష్ట్ర విస్తీర్ణం కూడా పరిపాలనాపరమైన ముఖ్య పారమితి. దీనికి 13వ ఫైనాన్స్ కమిషన్ 10 శాతం వెయిటేజీని ఇచ్చింది. కానీ ఇందులో కనీసం 2 శాతాన్ని దేశ బౌగోళిక విస్తీర్ణంలో 2 శాతం కంటే తక్కువగా ఉండే రాష్ట్రాలకు కేటాయించాలని నిర్దేశించింది. దీంతో దేశ విస్తీర్ణంలో 0.5 శాతంగా ఉన్న రాష్ట్రాలకు 2 శాతం లభిస్తుండగా దాదాపు 9 శాతం విస్తీర్ణంగా ఉన్న ఏపీకి 6 లేదా 7 శాతం మాత్రమే లభిస్తోంది. ఇది పూర్తిగా అన్యాయం. రాష్ట్ర విస్తీర్ణం పెద్దదైతే పరిపాలనా వ్యయా లు, సేవల చేరవేత వ్యయాలు, శాంతిభద్రతల వ్యయాలు చాలా ఎక్కువ. తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అది మరింత ఖర్చుతో కూడుకున్నది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ పారమితి వెయిటేజీని 15 శాతానికి పెంచాలని, 2 శాతం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలకు కనీసం 2 శాతం కేటాయించాలన్న షరతును ఉపసంహరించాలని కూడా కోరుతున్నాం. (3) పరిపాలనా సంస్కరణలు, వికేంద్రీకరణ, ఆర్థిక వృద్ధి, క్రమంలో వాతావరణానికి, పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యమైనవి. 1991 తర్వాత ప్రభుత్వ పరిపాలనలో గుణాత్మకమైన మార్పు సంభవించింది. ఆర్థికాభివృద్ధిని పెంపొందిపజేయడంలో, మానవాభివృద్ధిని పెంపొందింపజేయడంలో రాష్ట్రాల పాత్ర అసాధారణంగా పెరిగింది. దురదృష్టవశాత్తూ దీనికి దన్నుగా నిలిచే మేధో వనరుల సంస్థలను నెలకొల్పుకోలేదు. ఆలాంటి సంస్థలను నిర్మించిన రాష్ట్రాలకు ఈ ఫైనాన్స్ కమిషన్ అదనపు నిధులను ప్రోత్సహకంగా ఇవ్వాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే కేంద్ర రాబడుల్లో వాటాలు ఇలా ఉండాలి. ప్రధాన సూచనలు - ద్రవ్య సామర్ధ్యపు అంతరం వెయిటేజీని 47.5 శాతం నుంచి 20 శాతానికి తగ్గించాలి. మిగిలిన 27.5 శాతాన్ని జనాభా, విస్తీర్ణం, మొత్తం వ్యయంలో, సామాజిక వ్యయంలో నిష్పత్తిగా ప్రణాళికా వ్యయం వంటి పారమితులకు బదలాయించాలి. - రాష్ట్ర బడ్జెట్ల నుంచి ఇచ్చే విద్యుత్ సబ్సిడీలతో జాతీయ ఆహార భద్రతకు దోహదపడే రాష్ట్రాలకు ప్రత్యేక వెయిటేజీని ఇవ్వాలి. - 1971 ప్రాతిపదిక సంపవత్సరంగా జనాభాను లెక్కలోకి తీసుకోవాలి. - ద్రవ్యలోటు ప్రాతిపదికకు సంబంధించిన గీటురాయిని మార్చాలి. దాన్ని జీఎస్డీపీతో ముడిపెట్టరాదు. అందుకు బదులుగా రాష్ట్రాల సొంత రాబడులను రుణాలకు అర్హతగా చేయాలి. - మెరుగైన రాబడుల పెరుగుదల గల రాష్ట్రాలు ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం కోసం మరిన్ని ఎక్కువ నిధులను రుణం తీసుకోవడానికి అనుమతించాలి. - (వైఎస్సార్సీపీ ఈ వినతి పత్రాన్ని శుక్రవారం 14వ ఫైనాన్స్ కమిషన్‌కు అందించింది.)