వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి సాక్షి మీడియా గ్రూప్ వైఎస్ భారతి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయామని చెప్పారు. సోమయాజులు మరణం తీరని లోటని పేర్కొన్నారు.