ఉన్నత ఆశయాలతో ప్రారంభమైన ‘సాక్షి’ దినపత్రిక కాలక్రమంలో యావత్ సమాజానికి నమ్మకంగా నిలిచిందని సంస్థ చైర్‌పర్సన్ వైఎస్ భారతీ రెడ్డి చెప్పారు. పత్రిక పదో వార్షికోత్సవం పురస్కరించుకుని శనివారం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎడిషన్ సెంటర్లలో ఉత్సవాలు జరిగాయి. ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతీ రెడ్డి కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సాక్షి అన్ని ఎడిషన్ సెంటర్లలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా భారతీ రెడ్డి మాట్లాడుతూ, సంస్థ సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేశారు.