వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. సోమయాజులు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సోమయాజులుకు ప్రముఖుల నివాళులు
Published Sun, May 20 2018 12:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement