Konatala Ramakrishna
-
అనితకు చోటివ్వడంపై సీనియర్ల గుర్రు
కొలువు తీరిన కొత్త ప్రభుత్వం సీనియర్లకు షాక్ ఇచ్చింది. పార్టీకి సుదీర్ఘ సేవలందించిన నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఒక్కరికే స్థానం కల్పించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పలుదఫాలుగా మంత్రులు పనిచేసిన గంటా, అయ్యన్నతో పాటు మూడో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారి ఆశలపైనా నీళ్లు చల్లారు. మరోవైపు జనసేన నాయకులకూ ఇదే పరాభవం ఎదురైంది. గ్లాస్ కోటాలో మంత్రి పదవి ఆశించిన సీనియర్ నాయకుడు కొణతాల ఆశలూ గల్లంతయ్యాయి.సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు సహా 24 మంది మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మాత్రమే చోటు లభించడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుండగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనితకు ప్రాధాన్యమివ్వడంపై టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.అయ్యన్న, గంటాకు చెక్ !టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఒకసారి ఎంపీగా, ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మూడుసార్లు మంత్రిగా వ్యవహరించారు. ఈసారీ మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్న అయ్యన్నకు బాబు తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. మంత్రి వర్గంలో చోటు ఇవ్వకపోవడంపై అయ్యన్న కినుక వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒకసారి ఎంపీగా, ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు రిక్తహస్తాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటాకు చంద్రబాబు చెక్ పెట్టారు. అదేవిధంగా.. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఆశించిన వెలగపూడి రామకృష్ణబాబుకు పరాభవం ఎదురైంది. పలుమార్లు పార్టీ కోసం త్యాగాలు చేసి.. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజికవర్గం కోటాలో పల్లాకు రావాల్సిన మంత్రి పదవి కొలుసు పార్థసారధికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అయ్యన్నకు ఇవ్వాలా.. అచ్చెన్నకు ఇవ్వాలా అనే లెక్కల్లో చంద్రబాబు అచ్చెన్న వైపే మొగ్గు చూపడంతో అయ్యన్నపాత్రుడి వర్గం అధిష్టానం వ్యవహారశైలిపై గుర్రుగా ఉంది. మరోవైపు.. ఒకసారి మంత్రిగానూ, ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారు సత్యనారాయణమూర్తిని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. మూడోసారి గెలిచిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు మొండిచెయ్యి చూపించారు. పార్టీ కోసం విధేయంగా ఉన్న వారితోపాటు సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విశాఖ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.గాజు గ్లాసులోనూ అసంతృప్తి జ్వాలజనసేనలోనూ అదే అసంతృప్తి కనిపిస్తోంది. సీనియర్లుగా ఉన్నవారికి కాకుండా కొత్తగా ఎంపికై న వారికి ప్రాధాన్యమివ్వడంపై నాయకులు పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. నలుగురిలో ఒక్కరికై నా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఒక్కరికి ఇచ్చినా మిగిలిన ముగ్గురు మద్దతునివ్వాలని భావించారు. కానీ.. నలుగురికీ చంద్రబాబు, పవన్ ద్వయం మొండి చెయ్యి చూపించింది. సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణకు, పంచకర్ల రమేష్బాబులో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని భావించారు. కానీ.. వారిద్దరికీ అవకాశం కల్పించలేదు.అదేవిధంగా ఆరేళ్లు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉన్నా రాజీనామాతో త్యాగం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణకూ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో నిరాశలో ఉన్నారు. మొత్తంగా సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిన మంత్రివర్గ కూర్పుపై టీడీపీ, జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విశాఖ జిల్లాను విస్మరించడంపై ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
అనకాపల్లి: మూడు పార్టీలు కలిసినా అనకాపల్లిలో ఎదురీత తప్పలేదు. 15 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణను చాలామంది గుర్తు పట్టడం లేదు. దీనికితోడు ఆనాటి ఆయన సోదరుల ఆగడాలు గుర్తుకు తెచ్చుకొని.. ఆ తలనొప్పి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. 2004లో కొణతాలను గెలిపించి మూడు శాఖల మంత్రిని చేసిన వైఎస్సార్ అభిమానులను పక్కన పెట్టి తన సోదరుల సంపద సృష్టికే పరితపించిన కొణతాల.. 2009 ఎన్నికల్లో పరాజయం పాలై అనకాపల్లిని వదిలి విశాఖకు మకాం మార్చేశారు. తనను నమ్ముకున్న క్యాడర్‌ను గాల్లో వదిలేశారు. ఆనాటి కొణతాల వర్గమంతా వైఎస్సార్సీపీలో చేరి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తదితర పదవుల్లో ఉన్నారు. 2019లో గుడివాడ అమర్నాథ్ వెంట నడిచిన వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ గెలుపునకు కృషి చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రజల్లోకొచ్చిన కొణతాల జనసేన పార్టీలో చేరి, టీడీపీ, బీజేపీ పొత్తుతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ క్యాడర్ కరువై విలవిల్లాడుతున్నారు. తమ పాత వర్గమంతా కొణతాల గెలుపు కోసం పనిచేయాలని ఆయన సోదరుడు పెదబాబు కోరినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దీంతో కనీసం కొణతాలకు వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయకుండా గమ్మున కూర్చోవాలని ఆయన తెరవెనుక బెదిరింపులకు దిగుతున్నారట. కొందరు నాయకులకు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. మీ సంగతి చూస్తానంటూ దురుసుగా మాట్లాడుతున్నారట. మీ బెదిరింపులకు ఎవరు భయపడతారని, మా మీద మీ పెత్తనమేమిటని వారంతా ఎదురుతిరగడంతో చేసేది లేక పెదబాబు మిన్నకుండిపోయారట. కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉన్న కాలంలో అనకాపల్లికి చేసిందేమీలేదు. ప్రజలు ఆయన్ను కలిసి సమస్యలు చెప్పుకునే పరిస్ధితి ఏనాడూ లేదు. నియోజకవర్గంలో పాలన, అధికారం మొత్తం ఆయన సోదరులు పెదబాబు, రఘుబాబులదే. వ్యాపారులను బెదిరించి నెలవారీ మామూళ్లతో దోచుకున్నారు. సమస్యలపై వస్తే గంటలపాటు నిల్చోబెట్టేవారు. వారి ఆగడాలతోనే కొణతాల పరాజయం పాలయ్యారని అనకాపల్లిలో అందరూ చెప్పేమాట. తాను గెలిస్తే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని, రాజకీయాల్లో వారి పాత్ర లేకుండా చేస్తానని మద్దతిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కొణతాల ఇచ్చిన హామీ పెదబాబు బెదిరింపులతో మూలకు చేరింది. -
చిక్కడు..దొరకడు
సాక్షి, అనకాపల్లి: కొణతాల రామకృష్ణ.. ఒకప్పుడు రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందారు. అనకాపల్లి నుంచి గెలిచి నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్ర మంత్రిగా వెలగబెట్టినా ప్రజలనే కాదు.. కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోరని పేరు. ప్రతి చిన్న విషయానికి పార్టీ అధినాయకత్వంపై అలగడం.. కొన్ని వారాలు, నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. సహచర నాయకులు వెళ్లి బుజ్జగించడం.. అప్పట్లో అది నిత్యకృత్యం. 2014లో ఓటమి చవి చూశాక అయిదేళ్ల పాటు బయట కనిపించలేదు. మళ్లీ 2019 ఎన్నికల సమయానికి బయటకు వచ్చి హడావుడి చేయాలని ప్రయత్నించారు. ఈసారి ఏ ఒక్క పార్టీ ఈ నేతను పట్టించుకోలేదు. దీంతో ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. పాత పార్టీలు పట్టించుకోవని ముందుగానే గ్రహించిన కొణతాల.. ఈసారి ఎటువంటి దశ దిశ లేని జనసేన వైపు అడుగులు వేశారు. రాష్ట్ర స్థాయి నేత అనే భ్రమలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా వెంటనే జనసేన కండువా కప్పేశారు. అలా చేరారో లేదో.. యథావిధిగా కొద్ది రోజులకే అలక బూనారు. టికెట్‌పై స్పష్టత ఇవ్వలేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు విశాఖ పర్యటనకు వస్తున్నా కలవనని చెప్పి ఇంట్లో కూర్చున్నారు. దీంతో నాగబాబు అతని ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ వెనుకే పవన్ కల్యాణ్ కూడా కొణతాల ఇంటికి వెళ్లి అనకాపల్లి టికెట్‌కు హామీ ఇచ్చేశారు. ఉత్తరాంధ్ర ప్రయోజనాలు తాకట్టు : ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానని కొణతాల ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి ప్రారంభించారు. ఇప్పుడు ఎన్నికల్లో టికెట్ కోసం ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే.. న్యాయస్థానాల్లో కేసులు వేయించి అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రస్తుతం ఆయన చేతులు కలుపుతున్నారు. విశాఖ వద్దు.. అమరావతే ముద్దు అంటున్న జనసేన పార్టీలో చేరి, టికెట్ సంపాదించారు. ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితిని పాడె ఎక్కించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం వేసిన బీజేపీతో జతకట్టి కూటమిలో చేరారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా నీరుగారుస్తున్న ఆ పార్టీతో నిస్సిగ్గుగా చేతులు కలిపారు. రాజకీయంగా భూస్థాపితం కావడం వల్లే చంద్రబాబు వద్ద కొణతాల ఉత్తరాంధ్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఈ ప్రాంత ప్రజా నాయకులు, మేధావులు విమర్శిస్తున్నారు. అనకాపల్లికి ఏం చేశారు? : సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో వివిధ పదవులు నిర్వహించినప్పటికీ సొంత నియోజకవర్గ ప్రజల కోసం కొణతాల చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి.. ప్రజలే కాదు సామాన్య కార్యకర్తలు సైతం ఆయన్ను కలవాలంటే చాలా కష్టమే. తన ప్రాంత ప్రయోజనాల కోసం తాడోపేడో తేల్చుకుందామన్నంత కమిట్మెంట్ ఆయనలో ఎప్పుడూ కనిపించదు. అందుకే రాజకీయాల్లో అంత సీనియర్ అయినప్పటికీ తనకంటూ ముద్ర వేసుకోలేకపోయారు. కొణతాల కోసం జనసేన కనుమరుగు కొణతాల పుణ్యమాని జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు వర్గీయులు బీజేపీలో చేరారు. ఇప్పటికీ కూటమి నుంచి పీలా గోవిందు, పరుచూరి, దాడి వీరభద్రరావులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు కొణతాలకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ.. అందుకు వారికి మనస్కరించడం లేదు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సైతం దాడి, ఆయన తనయుడు డుమ్మాకొట్టారు. చివరకు కొణతాల కోసం జిల్లాలో జనసేన కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది. -
కొణతాల మదిలో ఓటమి భయం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన పొత్తు పాట్లు తారస్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన “టీడీపీ–జనసేన’ పార్టీల విస్తృత స్థాయి ఉమ్మడి సమావేశానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కర్‌రావు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్, వారి వర్గీయులు ఈ సమావేశానికి హాజరవుతారని విస్తృత ప్రచారం చేశారు. సమావేశం చివరి వరకూ అందరూ ఎదురుచూశారు. కానీ వారెవరూ రాలేదు. వీరికి తోడుగా జనసేన నేత పరుచూరి భాస్కర్‌రావు, ఆయన వర్గీయులు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేవలం 150 నుంచి 200 మందితోనే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగడం, జనసేన, టీడీపీ కేడర్ రాకపోవడంతో కొణతాల రామకృష్ణ వర్గీయులు డీలా పడ్డారు. కొణతాల మదిలో ఓటమి భయం టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరుక్షణం నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్‌రావు వర్గీయులైతే పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. నిన్న కాక మొన్న పారీ్టలో చేరిన వారికి టికెట్ ఎలా ఖరారు చేస్తారని ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరికి తోడుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టికెట్ ఆశించారు. టీడీపీ–జనసేన పారీ్టల మొదటి జాబితాలో అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను మాజీ మంత్రి కొణతాలకు ఖరారు చేశారు. దీంతో పీలా, పరుచూరి, దాడి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు కొణతాలకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ.. వారి మదిలో కొణతాలను ఓడించాలనే ఉంది. వ్యతిరేక వర్గంగా ఉన్న పీలా, దాడి వీరభద్రరావులను కొణతాల స్వయంగా కలిసి సయోధ్య కుదుర్చుకున్నారు. అంతేకాకుండా మీడియా ముందు తామంతా కలిసి ఉన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇదే సరైన సమయంగా భావించిన కొణతాల సోమవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అందరం కలిసి ఉన్నారనే సంకేతాన్ని కేడర్‌కు అందిద్దామని ఆశించారు. కానీ విస్తృత స్థాయి సమావేశానికి కీలకమైన దాడి వీరభద్రరావు, పరుచూరి భాస్కర్‌రావుతో పాటు వారి వర్గీయులు సైతం రాకపోవడంతో కొణతాల మదిలో ఓటమి భయం పట్టుకుంది. అనకాపల్లి నియోజకవర్గం జనసేన కేడర్ కూడా పూర్తిగా హాజరు కాలేదు. అలిగిన నాగ జగదీష్ టీడీపీ–జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశాన్ని పీలా గోవింద సత్యనారాయణతో కలిసి కొణతాల నడిపించడంతో పీలా వ్యతిరేకవర్గ నాయకుడైన బుద్ధ నాగజగదీష్ అలకబూనారు. విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన జగదీష్ ను, ఆయన వర్గీయులను పట్టించుకోకుండా పీలాకు ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అనకాపల్లి నియోజవర్గంలో టీడీపీ–జనసేన పొత్తుతో కేడర్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. -
జనసైన్యం.. నైరాశ్యం!
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా జనసైన్యాన్ని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసింది. ఒకపక్క పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వారికి కాదని నిన్నగాక మొన్న చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటు ప్రకటించడం, మరోపక్క పొత్తులో కేవలం 24 స్థానాలే జనసేనకు కేటాయించడం వీరిలో తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. చంద్రబాబు కోసం తమను బలి పశువులను చేశారంటూ వీరు లోలోన రగిలిపోతున్నారు. పరుచూరి భాస్కరరావు ఆరేళ్ల నుంచి అనకాపల్లి సీటును ఆశిస్తూ అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన భారీ మొత్తంలో చేతి చమురు వదిలించుకున్నారు. ఇటీవల నాగబాబు అనకాపల్లిలో నిర్వహించిన సభకు, కశింకోట మండలం విస్సన్నపేట భూముల కేటాయింపు వ్యవహారాల్లో ఆందోళనకు అవసరమైన సొమ్మును ఆయనతోనే ఖర్చు పెట్టించారని చెబుతున్నారు. దీంతో అనకాపల్లి జనసేన అభ్యర్థి ఆయనేనన్న భావన అందరిలోనూ నెలకొంది. ఇంతలో కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన కొణతాలకు అకస్మాత్తుగా సీటు కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా తనను ఆర్థికంగా వాడుకుని అన్యాయం చేశారని అనుచరుల వద్ద చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నట్టు తెలిసింది. అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. పెందుర్తి స్థానాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆశిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరకొర సీట్ల పొత్తుతో తమకు దక్కవన్న భయం వీరిని వెంటాడుతోంది. అలాగే ఇటీవలే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణదీ అదే పరిస్థితి. ఆయన ఇన్నాళ్లూ భీమిలి లేదా విశాఖ దక్షిణ సీటును ఆశిస్తున్నారు. తాజా స్థితితో తానూ ఆశలు వదులుకోవల్సి ఉంటుందేమోనన్న ఆందోళనతో ఉన్నారు. ఇక పవన్ 24 సీట్లకే అంగీకరించడాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కూడా తప్పుబడుతున్నారు. ఇన్నాళ్లూ ఉమ్మడి విశాఖ జిల్లాలో కనీసం నాలుగైదు స్థానాలైనా జనసేనకు కేటాయిస్తారని భావించారు. కానీ పొత్తులో 24 సీట్లే ఇవ్వడం, అందులో ఒకటి కొణతాలకు కేటాయించడంతో రెండో జాబితాలో మరొకరికి మించి ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. అలా ఇచ్చినా గాజువాక లేదా యలమంచిలి స్థానాలను పవన్ సోదరుడు నాగబాబుతో అంటకాగుతున్న సుందరపు బ్రదర్స్‌లో ఒకరికి ఇస్తారు తప్ప పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికి దక్కదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఆ నేతల్లో అంతర్మథనం టికెట్లను ఆశించి ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన నాయకులు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూసి తాము తప్పు చేశామా? అని అనుయాయుల వద్ద అంతర్మథనం చెందుతున్నారు. వ్రతం చెడినా ఫలితం దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర పొత్తుపై జనసేన శ్రేణులు తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు కోసం సీట్ల త్యాగాలు చేసి తమను బలి పశువులను చేశాడని, ఈ కొద్దిపాటి స్థానాలకే చంద్రబాబుకు సరెండర్ అయ్యారని నిప్పులు చెరుగుతున్నారు. తీవ్ర నైరాశ్యం, అసంతృప్తితో వీరు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. జనసేన కార్యాలయాల వైపు కన్నెత్తి చూడడం లేదు. -
అనకాపల్లి: చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం
సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ వదులుకుంది. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు జనసేనకు కేటాయించింది. జనసేన నుంచి ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీకి దింపింది. టీడీపీ కార్యకర్తలను కొణతాల అనేక రకాలుగా వేధించారని ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పని చేయమంటారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు, అనకాపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో జనసేనకు సీటు కేటాయించడంపై పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో పీలా గోవింద్ సమావేశం నిర్వహించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గోవింద్‌పై టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
ఆ ఓట్లు వారి జీవితాల్నే మార్చేశాయి
విశాఖ సిటీ: స్వల్ప ఓట్లు రాజకీయ నాయకుల జీవితాల్నే మార్చేస్తాయి. 1989 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీపడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ (2,99,109) టీడీపీకి చెందిన సమీప ప్రత్యర్థి అప్పల నరసింహ (2,99,100)పై కేవలం 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ రెండుసార్లు స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మశ్రీ 1,267 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజుపై, 2014లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన ధర్మశ్రీ మళ్లీ అదే అభ్యర్థి చేతిలో 905 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పోస్టల్ బ్యాలెట్‌తో తారుమారు 2009లో పీఆర్పీ అభ్యర్థి కోలా గురువులు గెలుపు ఖాయమై సంబరాలు చేసుకుంటున్న తరుణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆయన ఆశలపై నీళ్లు చల్లాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ 341 ఓట్లతో గెలుపొందారు. ద్రోణంరాజు శ్రీనివాస్‌కు 45,971 ఓట్లు రాగా, గురువులకు 45,630 ఓట్లు వచ్చాయి. -
‘ఏపీలో మరో ప్రాంతీయ ఉద్యమం తప్పదు’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రాంతీయ ఉద్యమం తప్పదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలేవీ స్థానికులకు దక్కడంలేదని, ఇక్కడి వనరుల్నిస్థానికేతరులు కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. తక్షణమే ఈ అన్యాయాలను అరికట్టకుంటే ప్రాంతీయ ఉద్యమం ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చిరంచారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్రకు జరుగుతోన్న అన్యాయాలపై విద్యార్ధి, యువజన, ఉద్యోగసంఘాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటుచేసి, పోరాటాన్ని ప్రారంభిస్తామని, స్థానికులకే 85 శాతం ఉద్యోగాలు దక్కాలన్న ఆర్టికల్ 371( డి) అమలయ్యేదాకా గాంధేయ పద్ధతిలో ఉద్యమిస్తామని కొణతాల తెలిపారు. ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, మేధావులు సైతం ఈ పోరాటంలో కలిసిరావాలని కోరారు. -
‘చంద్రబాబు ఘనకార్యం ఏంటో అర్థమైంది’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఉత్తరాంధ్ర చర్చా వేదిక’ డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని, తమ పూర్తి మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులు శనివారం సీపీఎం నేతలను కలిశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు 10 ఏళ్లు అధికారానికి దూరం అయ్యావు. మళ్లీ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావని చంద్రబాబు అడిగాను. మేమిద్దరం కలిసి ఘనకార్యం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఆ ఘనకార్యం ఏమిటో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కు ప్రత్యామ్నాయంగా ‘ప్రత్యేక ప్యాకేజీ’ అన్నారు. అదీ లేదు. రాష్ట్రానికి ‘హోదా’ ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది. దీన్ని వేరే రాష్ట్రాలతో ముడిపెట్టి చూడకూడదు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగకపోగా, మరింత వెనుకబడిపోయాయి.’అని అన్నారు. చేతులు దులుపుకోవాలంటే కుదరదు.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ... నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచారు. చంద్రబాబుకు ఎప్పుడూ మాట మార్చడం అలవాటే. ఇవాళ ఆగ్రహం, రేపు సంతోషం. రాష్ట్రం పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమను టీడీపీ ఇన్నాళ్లు కప్పిపెడుతూ, సంరక్షిస్తూ వచ్చింది. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా మోసం చేసిన తర్వాత, తనదాకా వచ్చిన తర్వాత, ఎన్నికల ముందు చంద్రబాబు కోపాన్ని నటిస్తున్నారు. మొత్తం తప్పునంతటినీ కేంద్ర ప్రభుత్వంపై నెట్టి, చంద్రబాబు చేతులు దులుపుకోవాలంటే కుదరదు. ప్రత్యేక ప్యాకేజీ అని ఇన్నాళ్లు ఊరించారు. అది ఇప్పుడు ఉత్తదే అని తేలింది. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాల్సిందే. కేంద్రంతో పోరాడితేనే రాష్ట్రానికి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాన్ని గత అనుభవాలే చెప్పాయి. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువ.’ అని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుతో సహా, తమ డిమాండ్లన్నింటినీ అమలు చేసేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. -
విభజన హామీలను అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి ప్రధానికి మాజీ ఎంపీ కొణతాల లేఖ అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇక్కడి రింగ్‌రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీలను నిల బెట్టుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన చట్టాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌కు కల్పించాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశా రు. ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టంలో రావలసిన అన్ని సదుపాయాలను కల్పించాలని కొణతాల కోరారు. పన్నుల మినహాయింపునకు దోహదపడే ప్రత్యేక హోదాతోపాటు ఉత్తరాంధ్రకు ఆర్థిక ప్యాకేజీని అందజేయాలని కోరారు. రాష్ట్రంలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు రానున్న పదేళ్లలో ఆర్థికపరమైన ప్యాకేజీలు కల్పించాలని కోరారు. అదేవిధంగా విశాఖపట్నానికి రైల్వేజోన్ ప్రకటిస్తామని విభజన చట్టంలో ఉన్నా అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. విభజన చట్టంలోని హామీలకు అను గుణంగా విద్యాసంస్థలను ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారం భించకపోవడం దారుణమని కొణతాల అన్నారు. -
కొణతాల రామకృష్ణకు సతీ వియోగం
విశాఖ : మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సతీమణి పద్మావతి మరణించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు. కాగా పద్మావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా కొణతాలకు పలువురు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రగిలే జ్వాల!
పక్కా ప్రణాళికతో ఆజ్యం పోస్తున్న అయ్యన్న డిమాండ్ల చిట్టా విప్పుతున్న కొణతాల వర్గం వ్యూహాత్మకంగా లీకులు మంత్రి గంటా వర్గానికి షాక్ విశాఖపట్నం: అనుకున్నంతా అవుతోంది. కొణతాల వర్గం ప్రభావం టీడీపీ వర్గవిభేదాల చిచ్చును మరింతగా రాజేస్తోంది. ఇంకా అధికారికంగా టీడీపీలో చేరకుండానే కొణతాల వర్గం తమ మనసులో మాట బయటపెట్టింది. వచ్చే ఎన్నికల్లో యలమంచిలి, పెందుర్తి ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీ టిక్కెట్లు తమవేనని వ్యూహాత్మకంగా వెల్లడించింది. అయ్యన్న తెరవెనుక ఉండి ఆడిస్తున్న ఈ రాజకీయ నాటకం గంటా వర్గంలో కలవరం రేకెత్తిస్తోంది. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తీవ్రంగా స్పందించగా... మంత్రి గంటా ఆత్మరక్షణలో పడ్డారు. వ్యూహాత్మకం: కొణతాల వర్గం పార్టీలో చేరినా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న గంటా వర్గానికి తాజా పరిణామం షాక్ ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో యలమంచిలి టిక్కెట్టు గండి బాబ్జీదేనని కొణతాల వర్గం వ్యూహాత్మకంగా లీకులిచ్చింది. మునగపాకలో నిర్వహించిన సమావేశంలో కొణతాల రఘునాథ్ మాట్లాడుతూ గండి బాబ్జీ వస్తేనే యలమంచిలి సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానిచండం ప్రాధాన్యం సంతరించుకుంది. గంటా వర్గంలో కీలకమైన పంచకర్ల రమేష్‌బాబు ప్రస్తుతం యలమంచిలి ఎమ్మెల్యేగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు దక్కదని కొణతాల వర్గం చెప్పకనే చెప్పింది. ఈ పరిణామంతో పంచకర్ల రమేష్‌బాబే కాదు మొత్తం గంటా వర్గం బిత్తరపోయింది. పంచర్ల ఎదురుదాడికి దిగారు. అసలు పార్టీలో చేరకుండానే యలమంచిలి టిక్కెట్టు తమదేనని కొణతాల వర్గం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యలమంచిలి నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీ శ్రేణులకు భవిష్యత్తు రాజకీయాలపై ఉప్పందింది. జాబితా ఇంకా పెద్దదే.... మంత్రి గంటా వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మంత్రి అయ్యన్న పక్కా ప్రణాళిక అమలుచేస్తున్నారు. చక్రం తిప్పుతున్నారు. తాను తెరపైకి రాకుండా కొణతాల వర్గంతో కథ నడిపించాలని ఆయన ఎత్తుగడ వేశారు. వ్యూహాత్మకంగా పెందుర్తి, యలమంచిలి అసెంబ్లీ స్థానాలతోపాటు అనకాపల్లి ఎంపీ స్థానాన్ని టార్గెట్ చేస్తున్నారు. గండి బాబ్జీ రాకను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో గండి బాబ్జీ పెందుర్తి మీద కాకుండా మరో నియోజకవర్గంపై కన్నేశారనే లీకులు ఇచ్చింది. తద్వారా ఎమ్మెల్యే బండారును ప్రస్తుతానికి చల్లబర్చవచ్చన్నది అయ్యన్న వర్గం వ్యూహం. కానీ వాస్తవానికి పెందుర్తి, యలమంచిలి రెండు నియోజకవర్గాల్లో తమ వర్గాన్ని బలోపేతం చేయడానికి పావులు కదుపుతోంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కూడా కొణతాల వర్గం నుంచి పార్టీలో చేరేవారికే వచ్చేలా చేయాలన్నది అయ్యన్న వ్యూహం. ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కొణతాల వర్గం, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల మధ్య పూర్తి సఖ్యత ఉంది. ఆ రెండు కుటుంబాల మధ్య వివాహ బంధం ఏర్పడనుంటమే ఇందుకు కారణం. దాంతో గంటా వర్గం నుంచి పెందుర్తి, యలమంచిలి స్థానాలు, అనకాపల్లి ఎంపీ స్థానాన్ని లాక్కోవాలని అయ్యన్న వ్యూహరచన చేశారు. గంటా వర్గం తర్జన భర్జన తాజా పరిణామాలతో గంటా వర్గం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతానికి యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఎదురుదాడి చేశారు. కానీ అయ్యన్న వర్గం పక్కా వ్యూహంతో వెళుతుండటంతో ఏంచేయాలన్నదానిపై మంత్రి గంటా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. తమ వర్గం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే జారుకున్నారు. పాకయరావుపేట ఎమ్మెల్యే అనిత కూడా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు బండారు, పంకచర్ల, ఎంపీ అవంతి శ్రీనివాస్‌లకు వారి నియోజకవర్గాల్లోనే పొగ బెడుతున్నారు. దాంతో తాము ఎలా ఎదురుదాడి చేయాన్నదానిపై మంత్రి గంటా తమవర్గీయులతో తీవ్రంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గ పోరు మరిన్ని ఆసక్తికర మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఎమ్మెల్యే తీరుతో రగిలిన తమ్ముళ్లు
అనకాపల్లి: ఎమ్మెల్యే పీలా తీరుపై తెదేపా శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కొణతాల రామకృష్ణ టీడీపీ చేరుతుండడంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తీరుతో వారు మంగళవారం మరింత రగిలిపోయారు. నూకాంబిక అమ్మవారి కల్యాణమండపంలో జరిగిన జన్మభూమి కార్యక్రమ సమీక్షా సమావేశంలో కుంచంగి ఎంపీటీసీ భాస్కరరావు తన సమస్యను వివరించిన సమయంలో ఎమ్మెల్యే... ఎంపీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీటీసీ భాస్కరరావుపై పట్టణానికి చెందిన ఒక సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలుగుతమ్ముళ్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అప్పటికే కొణతాల చేరిక అంశంపై రగిలిపోతున్న తెలుగుతమ్ముళ్లు తమను చులకనగా చూడడం తగదంటూ గట్టిగా కేకలు వేశారు. ఇదే సమయంలో సమావేశం నుంచి వెళ్లిపోయిన మరో ఎంపీటీసీ తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వరని, తాము చెప్పేందుకు వినేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించరంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. కొణతాల రామకృష్ణ చేరిక విషయంలో అధిష్టాన నిర్ణయం తనకు శిరోధార్యమంటూ ఎమ్మెల్యే పీలా చెప్పడంతో తెలుగుతమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కంగుతిన్న కొణతాల వర్గం .
మునగపాక: ఉద్యమ నేతగా గుర్తింపుపొందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మునగపాక మండలంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడ ంతో నేతలు కంగుతిన్నారు. కొణతాలకు మునగపాక మండలానికి విడదీయరాని బంధం ఉండేది. మారిన రాజకీయాల నేపథ్యంలో ఆయన శుక్రవారం మునగపాకలో నిర్వహించిన ఆత్మీయతా సమావేశానికి ఆశించిన మేరకు ప్రజలు రాకపోవడం కొత్త ఆలోచనకు తెరతీసినట్టయింది. ఒకవైపు టీడీపీ తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వర్గీయులు, మరోవైపు వైఎస్సార్సీపీకి చెందిన బొడ్డేడ ప్రసాద్ వర్గీయులు ఎవరూ సమావేశానికి హాజరుకాకపోవడం విశేషం. దీంతో ఏదో చేద్దామనుకున్న కొణతాల మునగపాక మండలం నుంచి వచ్చిన స్వల్ప జనాన్ని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురికాగా.. ఇలా అయితే రానున్న కాలంలో పరిస్థితులు పట్ల ముఖంలో కదలికలు చెప్పకనే చెప్పాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొణతాల వైఎస్సార్సీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం, కార్యకర్తలకు అందుబాటు లో లేకపోవడంతో పలు అపజయాలు మూట కట్టుకున్న అపవాదును కూడగట్టుకున్నారన్న వాదన లేకపోలేదు. గత నెలరోజులుగా ఏపార్టీలో చేరాలన్న విషయమై సమాలోచన లకు శ్రీకారం చుట్టారు. రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునేందుకు మునగపాకలో ఈనెల 23న ప్రారంభించిన ప్రజాభిప్రాయ సేకరణకు కేడర్ ఉన్న నాయకులు రాకపోవడం విమర్శలకు తావిస్తున్నది. మునగపాక మండలంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడంతోపాటు పార్టీకి పెద్దదిక్కుగా నిలిచిన బొడ్డేడ ప్రసాద్ వర్గం నుంచి ఒక్కరు కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోగా పార్టీ కేడర్ చేజారకుండా ప్రసాద్ తనదైన శైలిలో పావులు కదిపారన్న ప్రచారం సాగుతోంది. సభా నిర్వాహకులు మునగపాకలో ఇం టింటికీ వెళ్లి ప్రచారం చేసినా నిర్వాహకుల బంధువులు, కొంతమం ది రైతులతోపాటు ఇతర గ్రామాలకు చెందిన అరకొర మందితప్పా ఆశించిన మేర సభ విజయం కాలేదని గుసగుసలు ఉన్నాయి. దీనికితోడు అధికార పార్టీ కూడా ఈ సమావేశానికి టీడీపీ నుంచి ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించే సమావే శం మునగపాకలో నిర్వహించి తన సత్తా చాటాలని భా వించిన కొణతాల వర్గీయులకు మింగుడుపడటం లేదు. -
‘కొణతాలను టీడీపీలో చేర్చుకోవద్దు’
అనకాపల్లి రూరల్: గోబ్యాక్.. గోబ్యాక్.. కొణతాల గోబ్యాక్..., మాకొద్దు బాబోయ్.. కొణతాల రామకృష్ణ మాకొద్దు బాబోయ్... అంటూ పట్టణ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీలోకి కొణతాల రామకృష్ణను టీడీపీలో చేర్చుకోవద్దని స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్లో సోమవారం సాయంత్రం ఆందోళన, రాస్తారోకో, దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణ టీడీపీ నాయకుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్టీఆర్ పేరు పెడితే దానిని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి కొణతాల అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. సత్తా, దమ్ము, సిగ్గు ఉంటే ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేయాలని హితవుపలికారు. కబ్జా చేసిన భూములను కాపాడుకోవడానికే కొణతాల అధికార పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం ఆ పార్టీ శ్రేణులు మానవహారం నిర్వహించి, కొణతాల దిష్టిబొమ్మను దహనం చేశారు. బి.ఎస్.ఎం.కె. జోగినాయుడు, కొణతాల శ్రీను, బొలిశెట్టి శ్రీను, గుత్తా ప్రభాకర్ చౌదరి, బొద్దపు ప్రసాద్, వాకాడ కోటి తదితరులు పాల్గొన్నారు. కశింకోటలో రాస్తారోకో కశింకోట: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానాన్ని కోరుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆందోళనకు జెడ్పీటీసీ సభ్యురాలు మలసాల ధనమ్మ, విశాఖ డెయిరీ డెరైక్టర్ మలసాల రమణారావు, ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి, టీడీపీ నాయకుడు పెంటకోట రాము నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో కొణతాల చేరికను తాము అంగీకరించబోమని, తరిమి కొడతామని హెచ్చరించారు. తమ అభిమతానికి విరుద్ధంగా ఆయనను పార్టీలో చేర్చుకుంటే బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లి తీవ్ర నిరసన తెలియజేస్తామన్నారు. కొణతాల చేరిక యత్నాలకు వ్యతిరేకంగా మంగళవారం అనకాపల్లిలో నిర్వహించే సమావేశానికి కార్యకర్తలు,సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ ప్రసాద్, సర్పంచ్ కర్రి దుర్గినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు అద్దంకి సతీష్, మళ్ల సూర్యారావు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
కొణతాలది దిగజారుడుతనం
వైఎస్సార్సీపీ నేతలు బొడ్డేటి ప్రసాద్, అమర్నాథ్ విశాఖపట్నం: కొణతాల రామకృష్ణ మనసులో విషం, మౌనంలో కపటం, నవ్వి దగ్గరకు తీసుకుంటే అందులో విషాదం ఉంటుందన్న విషయం ఆయనతో సావాసం చేసిన ప్రలి ఒక్కరికీ తెలుసని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. నిలువెల్లా విషం నింపుకొన్న కొణతాల తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద విమర్శలు చేయడం దారుణమని పార్టీ అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేటి ప్రసాద్, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లు ‘సాక్షి’కి శనివారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్నదెవరో.. డార్క్ రూమ్‌లో ఉన్నదెవరో.. బ్లాక్మెయిల్ చేసి తన రాజకీయ పనులు చేయించుకునేదెవరో ప్రజలకు తెలుసునన్నారు. వైఎస్ జగన్ జై లు నుంచి బయటకు వచ్చాక ఆయన నిజ స్వరూపం తెలిసిందంటున్న కొణతాల.. ఆ రోజే లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. వేరే పార్టీలో ఉన్నత స్థానాలు పొందడం కోసం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీచేస్తే ఓడిపోతారని కొణతాల ముందే చెప్పారనడం పూర్తిగా అవాస్తవమ న్నారు. ‘‘కొణతాల పట్టుబట్టి మరీ అనకాపల్లిలో తన తమ్ముడు రఘుబాబుకి టికెట్ ఇప్పించుకున్నారు. సర్వేలన్నీ రఘుబాబుకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కేవలం కొణతాల మనసు నొప్పించకూడదని ఆయనకు టికెట్ ఇచ్చారు. మరి తమ్ముడిని కొణతాల ఎందుకు గెలిపించుకోలేకపోయారు’’ అని ప్రశ్నించారు. కొణతాల రాసిన లేఖ ను పార్టీ లీక్ చేసిందనడంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. వైఎస్ జగన్ గురిం చిగానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించిగానీ తప్పుగా మాట్లాడితే సహించేది లేద న్నారు. కొణతాల రాజీనామాను ఆమోదిస్తూ ఆయనకు ఉద్దేశించి తాను రాసిన బహిరంగ లేఖలోని అంశాలకు కట్టుబడి ఉన్నట్టు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. -
'బ్లాక్ మెయిల్ కు పాల్పడేది ఎవరో ప్రజలకు తెలుసు'
విశాఖపట్నం: కోల్డ్ స్టోరేజి, డార్క్ రూమ్ లో ఉండే నాయకులు ఎవరో జిల్లా ప్రజలకు తెలుసునని విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందే నాయకులు ఎవరో కూడా ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. రాష్ట్రంలో ఏ నాయకుడు తిరగని, వెళ్లని ప్రాంతాలకు వైఎస్ జగన్ వెళ్లారు. అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అని అమర్నాథ్ అన్నారు. కొణతాల రామకృష్ణను పార్టీ నుంచి విముక్తి చేయడంతో జిల్లాలో పార్టీకి మంచి రోజుల వచ్చాయని కార్యకర్తలు చెబుతున్నారని ఆయన తెలిపారు. వైఎస్ విజయమ్మను విశాఖ నుంచి నిలబెడితే మూడు జిల్లాలో పార్టీ విజయవకాశాలు పెరుగుతాయని అన్నవారిలో మీరు కూడా ఉన్నారనే విషయం మర్చిపోయారా అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. -
‘కొణతాల’ రాజీనామా ఆమోదం
విశాఖపట్నం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ వెల్లడి విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి కొణతాల రామకృష్ణ చేసిన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదిస్తూ అయిష్టంగానే ఆయన్ను పార్టీ సభ్యత్వం నుంచి విముక్తులను చేస్తున్నట్టు ప్రకటించారని విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తమ అధినేత మొదటినుంచి కొణతాల రామకృష్ణకు ఎంతో గౌరవం ఇచ్చారని చెబుతూ ప్రస్తుతం కూడా అంతే గౌరవంతో అయిష్టంగానే ఆయన రాజీనామాను ఆమోదించారన్నారు. విశాఖపట్నంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... కొణతాల అయిష్టంగా పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. హుదూద్ తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నం జిల్లాలో ప్రజలను ఆదుకునేందుకు, సహాయచర్యలను పర్యవేక్షించేందుకు అధ్యక్షుడు వైఎస్ జగన్ హుటాహుటిన జిల్లాకు వచ్చినా కొణతాల రామకృష్ణగానీ, పార్టీ నేత గండిబాబ్జీగానీ ఆ పర్యటనలో పాల్గొనకపోవడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గండి బాబ్జీని సమన్వయకర్త పదవి నుంచి తొలగించిన కారణంతో కొణతాల పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయడం, ఆ లేఖను ఎల్లో మీడియాకు లీక్ చేయడం సరికాదని పార్టీ అభిప్రాయపడిందని తెలిపారు. కొణతాలతో మాట్లాడేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా ఆయన ఫోన్లకు అందుబాటులో లేకుండాపోవడం... అందుబాటులోకి వచ్చినప్పటికీ సరైన సమాధానం చెప్పకపోవడం సరైన చర్య కాదన్నారు. టీడీపీతో కలసి పనిచేస్తున్న అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై చర్య తీసుకోవాలని కోరుతూ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వంశీకృష్ణ, కంప హనోక్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు అభద్రత ఎందుకు?
-
చంద్రబాబుకు అభద్రత ఎందుకు?
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభద్రతా భావం ఎందుకని రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. మీ కుర్చీకి అయిదేళ్ల వరకు ముప్పు ఏమీ లేనప్పుడు ఎందుకింత అరాచకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుని ఉద్దేశించి ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రక్రియ మంచిదికాదని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పే చంద్రబాబు ప్రతిపక్షమే లేకుండా ఉండాలన్న దురాలోనతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దౌర్భాగ్యపరిస్థితిని చూడలేదన్నారు. అధికారం ఉందిగదా అని టిడిపి నేతలు తెగ రెచ్చిపోతున్నారన్నారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. కార్యకర్తలకు పోలీస్ దుస్తులు వేసి కూర్చోబెట్టండి. ఇక ఈ అయిదేళ్లు ప్రభుత్వం లేదనుకుందాం అని అన్నారు. శాసనసభాపతి నియోజకవర్గంలోనే ఇటువంటి దాడులా? అని ఆయన అడిగారు. టిడిపి నేతలు పద్దతి మార్చుకోవాలని కొణతాల సలహా ఇచ్చారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. In English 'Why is Chandrababu feeling insecure?' -
పరిశీలకులను నియమించిన వైఎస్సార్ సీపీ
-
‘స్థానిక’ ఎన్నికల వైఎస్సార్సీపీ పరిశీలకులు వీరే!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులను నియమించింది. ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, ఎం.ప్రసాదరాజు (శ్రీకాకుళం), పిరియా సాయిరాజ్, సుజయ్ కృష్ణ రంగారావు, కోలగట్ల వీర భద్రస్వామి, బెల్లాన చంద్రశేఖర్ (విజయనగరం), తమ్మినేని సీతారాం, గుడివాడ అమర్నాథ్, బొడ్డేటి ప్రసాద్ (విశాఖపట్టణం), జి.ఎస్.రావు, జ్యోతుల నెహ్రూ, ఐ.రామకృష్ణంరాజు(తూ.గోదావరి), ధర్మాన ప్రసాదరావు, ఆదిరెడ్డి అప్పారావు, ఆళ్ల నాని(ప.గోదావరి), కె.పార్థసారథి, పేర్ని వెంకట్రామయ్య, సామినేని ఉదయభాను (కృష్ణా), కొడాలి నాని (విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్), మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణారావు, వి.బాలశౌరి, భూమన కరుణాకర్‌రెడ్డి(గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎల్.అప్పిరెడ్డి (ప్రకాశం), వి.ప్రభాకర్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి (నెల్లూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్.అమర్నాథ్రెడ్డి (చిత్తూరు), వైఎస్ అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు (వైఎస్సార్ కడప), అనంత వెంకట్రామిరెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, శంకరనారాయణ(అనంతపురం), భూమా నాగిరెడ్డి (కర్నూలు) పరిశీలకులుగా నియమితులయ్యారు. వీరు కాక ఆయా జిల్లాల్లోని ఎంపీలు కూడా స్థానిక ఎన్నికల పరిశీలకులుగా ఉంటారు. కేంద్ర కార్యాలయంలో ఎంవీ మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పర్యవేక్షక విభాగం సభ్యులుగా వ్యవహరిస్తారు. -
ఓటమితో నిరాశ వద్దు
పటిష్ట ప్రణాళికతో ముందుకుసాగుదాం గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి కార్యకర్తలకు అన్ని వేళలా అండ వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కొణతాల రామకృష్ణ అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: ‘ఓడి పోయామన్నది వాస్తవమే. ఇది జీర్ణించుకోలేని అంశమే. అంతమాత్రాన నిరాశ వద్దు. పటిష్ట ప్రణాళికతో భవిష్యత్తును పునర్నిర్మించుకుందాం. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి సత్తా చాటుదాం, విపక్షం అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపిద్దాం’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి పట్టణంలోని వైఎంవీఏ సమావేశ మందిరంలో పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శనివారం జరిగింది. గోపాలపు రం సర్పంచ్ గొర్లి సూరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటమిని విజయానికి మెట్టుగా మలుచుకుని ముందుకుసాగుదామని దిశానిర్దేశం చేశారు. అన్ని సర్వేలు జగన్ సీఎం అవుతారని ప్రకటించాయని, సీమాంధ్రలో ఏ ఒక్కరిని అడిగినా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని భరోఇచ్చేవారన్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు అతి విశ్వాసానికి పోయి ఓటమిపాలయ్యామని విశ్లేషించారు. గ్రామ, బూత్, మండల స్థాయి కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మోడీ గాలి వల్లే టీడీపీ విజయం సాధ్యమైందన్నారు. మోడీ నినాదాన్ని గ్రామ స్థాయికి ఆ పార్టీ నాయకులు తీసుకువెళ్లగలిగారన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా టీడీపీ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉంటూ పటిష్ట ప్రణాళికతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు. నియోజకవర్గ నాయకుడు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) మాట్లాడుతూ 2009లో కొన్ని పొరపాట్లు చేశామని, ఇప్పుడూ మళ్లీ అవే పొరపాట్లు జరిగాయన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసినా గెలుపు ధీమావల్లే ఓటమిపాలయ్యామని చెప్పారు. అధికారం రాకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేస్తామని చెప్పారు. పార్టీ నాయకుడు కొణతాల రఘునాథ్ మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి పనిచేసినా మోడీ ప్రభంజనంలో ఓటమి పాలయ్యామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి కమిటీలతో మళ్లీ పుంజుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ డి.వి.వి.గోపాలరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిశోర్, పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్లలో ఏం చేశారు
ఒక్క ప్రాజెక్టయినా నిర్మించారా? బాబుకు కొణతాల రామకృష్ణ సూటి ప్రశ్న కె.కోటపాడు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టిన చంద్రబాబునాయుడు ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. కె.కోటపాడులో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నపుడు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు పదవిలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్‌గా మార్చేస్తానని మాయమాటలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు విచ్చలవిడిగా బెల్టుషాపులను ప్రోత్సహించారని, వ్యవసాయ దండగ అంటూ రైతులను కించపర్చారని గుర్తు చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యర్థి పార్టీల వారికి సంక్షేమ ఫలాలను అందించారని అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.12వేల కోట్లతో రైతుల రుణాలను మాఫీ చేయించారని అన్నారు. ఆయన హయాంలోనే గోవాడ షుగర్స్ టన్నుకి అత్యధికంగా రూ.2200 మద్దతు ధర ఇచ్చిందని అన్నారు. ఆ మహానేత మరణం తర్వాత వైఎస్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని అన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జగన్ ప్రభంజనంలో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. కె.కోటపాడులో బుధవారం జరిగిన మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో అమర్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహనాలోపంతో దొంగ హామీలను ప్రజలకు చెబుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో చంద్రబాబుకు తెలియదు కానీ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనడం ఆయన అవగాహనా లేమికి నిదర్శన మని అన్నారు. పూడి మంగపతిరావు సూచనల మేరకు కె.కోటపాడు మండలంలో అభివృద్ధి పనులకు పెద్ద పీట వేస్తానని అన్నారు. అనంతరం మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి బూడి ముత్యాలునాయుడు మాట్లాడుతూ కె.కోటపాడు మండలంతోబాటు నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోను పూడి మంగపతిరావు ప్రచారం చేసి తన గెలుపు బాధ్యతను తీసుకోవాలని కోరారు. అనంతరం పూడి మంగపతిరావు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. గవిరెడ్డి సన్యాసినాయుడు, పి.వి.జి.కుమార్, దాట్ల తాతరాజు, రెడ్డి జగన్మోహన్, శ్రీకాంత్ శ్రీను, పార్టీ మండల కన్వీనర్ రొంగలి మహేష్, బోయిదాపు జగదీశ్వరరావు, దాట్ల శివాజీబాబు, బొడ్డు పేరునాయుడు, రెడ్డి బలరాం, నీలిమా వెంకటరావు, దంతులూరి చిరంజీవి రాజు, అవుగడ్డ సోంబాబు పాల్గొన్నారు. -
ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాం
నీల్సన్ సర్వేపై వైఎస్సార్సీపీ నేత కొణతాల సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నీల్సన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన సీట్లకన్నా తమ పార్టీ మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీవీ ప్రసారం చేసిన నీల్సన్ సర్వే ప్రకారం సీమాంధ్రలో తమ పార్టీ 129-133 అసెంబ్లీ స్థానాలు, 19-21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడైందని, అయితే తమ పార్టీ అంచనా ప్రకారం అంతకన్నా ఎక్కువ సీట్లనే తాము గెలుచుకోనున్నామని ఆయన చెప్పారు. 25 లోక్‌సభ స్థానాల్లో, అలాగే 140-150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని కొణతాల చెప్పారు. 2012లో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్రలోని 17 స్థానాల్లో తమ పార్టీ 15 స్థానాలు గెలుచుకుందని గుర్తుచేశారు. -
అత్యధిక మున్సిపాలిటీలు వైఎస్ఆర్ సీపీవే
-
ఏ హామీ నెరవేర్చారో చెప్పండి..: కొణతాల
చంద్రబాబును నిలదీసిన కొణతాల.. హామీలివ్వడం, వాటిని విస్మరించడం ఆయన నైజం ప్రజలపై భారం మోపడం తప్ప చేసిందేమీ లేదు స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించింది బాబే సాక్షి, హైదరాబాద్: ప్రతి ఎన్నికల సందర్భంగా ఇష్టమొచ్చినట్టుగా అనేక వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నైజమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నవరత్నాలు పేరిట పార్టీ ప్రణాళిక విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఎన్నికలకు వాటి సంఖ్య మారుతోందే తప్ప బాబు అమలు చేసింది ఏ ఒక్కటీ లేదని ఆయన తెలిపారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ఎన్ని ఉచిత హామీలిచ్చినా ఫలితముండదని, అది 2009లో నిరూపితమైందని చెప్పారు. కొణతాల పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. - తన తొమ్మిదేళ్ల పాలనలో ఫలానా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని బాబు ధైర్యంగా చెప్పగలిగే అంశం ఒక్కటైనా ఉందా? - ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కిలో బియ్యం రూ.2 పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు. ఖజానాపై నాలుగువేల కోట్ల భారం పడుతోందని తొలిసారి రూ.3.50కు ఆ తర్వాత రూ.5.25కు పెంచారు. - ఇది చాలదన్నట్టు పన్నుల పేరిట ప్రజలపై అదనంగా నాలుగువేల కోట్ల భారం మోపారు. - మద్యపాన నిషేధం విషయంలోనూ అలాగే వ్యవహరించారు. బెల్టు షాపులు పెట్టి ప్రతి కిళ్లీ కొట్టులో మద్యం లభించేలా చేశారు. - వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ను ఎన్టీఆర్ హార్స్పవర్ రూ. 50కే అందజేస్తే దాన్ని రూ.650కి పెంచిన ఘనత బాబుది. - 1999 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. - ఆడబిడ్డ పుట్టగానే రూ.5 వేలు డిపాజిట్ చేయడంతో పాటు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత మంగళసూత్రాలు ఇస్తామన్నారు. చేనేతన్నలకు ఆధునిక మరమగ్గాలు, నాయూ బ్రాహ్మణులకు బ్యూటీ పార్లర్లు, రజకులకు దోబీఘాట్లు, కోటి మందికి ఉద్యోగాలంటూ వాగ్దానాల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చాక ఏకంగా 21 వేల మంది ఉద్యోగులను తొలగించారు. - జన్మభూమి కార్యక్రమం అంటూ రోడ్డు వేసుకోవాలంటే ప్రజలే వేసుకోవాలని, చెరువులు.. కాలువలు రైతులే తవ్వుకోవాలని, చివరకు గ్రామాల్లో దొంగలు పడుతుంటే ప్రజలే కాపలా ఉండాలంటూ చెప్పిన మహానీయుడు చంద్రబాబు. - ప్రత్యేక అధికారుల పరిపాలన తీసుకొచ్చి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనతా బాబుదే. ప్రజా ప్రతినిధులకు చెక్‌పవర్ లేకుండా చేసి వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. అలాంటి వ్యక్తికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు. -
కిరణ్ ఆడలేక మద్దెల ఓడంటున్నారు: కొణతాల
కిరణ్ కుమార్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాల కన్వీనర్లతో జరిగిన విస్తృత సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో ఉన్నప్పుడు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టమంటే మాట్లాడలేదని, ఇప్పుడు తమమీద నిందవేస్తున్నారని మండిపడ్డారు. ''ఆఖరి నిమిషం వరకు ఇదిగో కొడతా, అదిగో కొడతా అన్నారు. పార్లమెంటులో ప్రతాపం చూపించలేదు, అసెంబ్లీలోనూ చూపించలేదు. సుప్రీంకోర్టులో ఆయనొక్కరే కాదు, అందరూ కేసులు వేశారు. అన్నీ కలిపి సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది తప్ప అందులో ఆయన గొప్పతనం కూడా ఏమీ లేదు'' అని చెప్పారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలందరూ ఏదో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అవకాశం వస్తోందని, అందువల్ల పార్టీ శ్రేణులన్నీ పూర్తిస్థాయిలో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చినట్లు కొణతాల తెలిపారు. ఆయనేమన్నారంటే.. ''స్థానిక ఎన్నికల ప్రక్రియ ఇబ్బందికరమే. రిజర్వేషన్లపరంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. అయినా కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నాయి కాబట్టి మేం పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధమయ్యాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో జిల్లా కన్వీనర్లతో సమావేశం ఏర్పాటుచేశాం. అన్ని స్థానాలకూ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఈ అన్ని ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కామన్ సింబల్‌గా కేటాయించారు. కాబట్టి ఆగుర్తుతోనే అందరూ పోటీ చేస్తారు. పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటుచేస్తారు. వాటిని రేపు జిల్లాలకు పంపుతాం. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ పర్యవేక్షణ ఉంటుంది. రేపు అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటుచేసుకుని, అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నాం. ఎన్నికల ప్రచారానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జగన్, విజయమ్మ, షర్మిల పర్యటిస్తారు. ఎవరు ఎక్కడ, ఎప్పుడు తిరుగుతారో చెబుతాం. రాష్ట్రస్థాయిలో పరిశీలకులు ఉంటారు. వాళ్లు కూడా ఎక్కడికక్కడ ఎన్నికల సన్నాహాలను పరిశీలిస్తారు. పార్టీ నిర్మాణం రాష్ట్రంలో బలంగా ఉంది. ఆ విషయం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతోనే తేలిపోతుంది'' అని కొణతాల చెప్పారు. -
ఢిల్లీ డైరెక్షన్లో కిరణ్ దొంగదీక్ష: కొణతాల
కాంగ్రెస్ అధిష్టానం డైరెక్షన్లోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రె డ్డి దొంగదీక్ష చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ విమర్శించారు. బుధవారం విశాఖ జిల్లా నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా ముందు అసెంబ్లీలో తీర్మానానికి నిరాకరించారని ఆరోపించారు. టీబిల్లు అసెంబ్లీకి వచ్చాక ఓటింగ్ పెట్టాలని వైఎస్సార్సీపీ కోరితే పట్టించుకోకుండా కేవలం చర్చకు మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు. సమైక్యవాణి వినిపించేందుకు ప్రధానాస్త్రాలైన ఈ రెండు డిమాండ్లను పక్కన పెట్టి టీబిల్లులో లొసుగులు ఉన్నాయంటూ వెనక్కి పంపడం సిగ్గుచేటన్నారు. కిరణ్, చంద్రబాబులు తెలుగు జాతిని మోసం చేస్తున్నారన్నారు. సీఎం ఢిల్లీ డెరైక్షన్‌లో నడుస్తున్నారని ఆయన చేసే ప్రతిపని సోనియా ఆదేశాల మేరకే అన్నారు. సవరణ చేయకుండా టీబిల్లును కేంద్రం పార్లమెంట్లో ఆమోదిస్తే సీఎం పద వికి రాజీనామా చేస్తాననడం సిగ్గుచేటన్నారు. మరో 40రోజుల్లో ఎన్నికలొచ్చి ఊడిపోయే పదవికి రాజీనామా ఎవడికి కావాలన్నారు. సమైక్యాంధ్రపై సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన వెంటనే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. -
'సీఎం కిరణ్ అందర్నీ నమ్మించారు'
హైదరాబాద్:అసెంబ్లీలో తీర్మానం పెడతామంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అందర్నీ నమ్మించి మోసం చేశారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు కొణతాల రామకృష్ణ విమర్శించారు. సమైక్య తీర్మానంపై కిరణ్, చంద్రబాబులు ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చలో పాల్గొనకుంటే విభజనకు ఒప్పుకున్నట్లేనని ప్రచారం చేస్తున్నారని, తీర్మానం చేయడం అనేది ప్రజాస్వామ్య విధానమని కొణతాల తెలిపారు. మంత్రులు రాజీనామాలు చేయకుండా అడ్డుకున్న సీఎం కిరణ్ ఇప్పుడు ప్రజల్ని మరింత మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చేయాల్సిన సమయంలో ఎందుకు మేధోమథనం చేయకుండా, జనవరి 23 తర్వాత మేధోమథనం చేస్తానని సీఎం కిరణ్ చెబుతుండటం వెనుక కారణమేమిటని కొణతాల నిలదీశారు. విభజన అనంతరం ఏం చేయాలన్న దానిపై చర్చిస్తారా?అని ప్రశ్నించారు. బిల్లులో క్లాజ్వైజ్ సమాచారాన్ని సభ్యులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని కొణతాల తెలిపారు. -
ప్రెస్మీట్లకే చంద్రబాబు పరిమితం: కొణతాల
హైదరాబాద్ : ఆర్టికల్-3పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం సఫలీకృతమైందని ఆపార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. పార్లమెంట్లో అన్ని జాతీయ పార్టీలు ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజనపై స్పష్టత లేని చంద్రబాబునాయుడు రోజుకో లెక్చర్ ఇస్తున్నారని కొణతాల ఎద్దేవా చేశారు. బాబు ప్రెస్మీట్లకే పరిమితం అయ్యారే కానీ, విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం చేయటం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.... పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి దాసోహమై రాష్ట్రంలో సమైక్య నాటకాలేస్తున్నారని కొణతాల వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి వస్తే ... రాజకీయ సంక్షోభాన్ని సృష్టించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని కొణతాల అన్నారు. -
'ఓటర్ల నమోదు ప్రక్రియలో విస్తృతంగా పాల్గొనాలి'
హైదరాబాద్:ఓటర్లు నమోదు ప్రక్రియలో పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ నేతలు కొణతల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ లు విజ్ఞప్తి చేశారు. గడగడపకూ పార్టీని తీసుకువెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ఓటర్లు నమోదు ప్రక్రియ, సమైక్య అంశాలపై సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓటర్లు నమోదు ప్రక్రియలో పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కింది స్థాయి నుంచి అన్ని కమీటీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్క నేత ప్రజలకు అందుబాటులో ఉంటూ సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వారు సూచించారు. -
త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి త్వరలోనే రాష్ట్ర పర్యటన చేస్తారని పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. అఖిలపక్ష సమావేశం కంటే ముందుగానే శ్రీకృష్ణ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కొణతాల అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు తమ పదవుల పరువు తీసేలా ప్రవర్తించారని విమర్శించారు. వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకోవడాన్ని తాము మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
నేడు జిల్లాకు విజయమ్మ
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. తూర్పుగోదావరిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని ఆమె జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. ఆ నియోజకవర్గం నక్కపల్లి వద్ద ఒడ్డిమెట్ట గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని అక్కడి బాధితులను పరామర్శిస్తారు. అనంతరం మెట్టపల్లి వీవర్స్ కాలనీ, యలమంచిలి, కశింకోట మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నారు. అనంతరం ఆమె విశాఖలో రాత్రి బస చేస్తారు. బుధవారం ఉదయం విశాఖ నుంచి బయలుదేరి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. -
'లగడపాటి అసలు స్వరూపం బయటపడింది'
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరద బాధిత ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభ విజయవంతం కావటంతో... కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు బాధపడుతున్నాయని ప్రశ్నించారు. వారు సమైక్యవాదులేనా అన్న అనుమానం కలుగుతుందని కొణతాల అన్నారు. లగడపాటి రాజగోపాల్ అసలు స్వరూపం ఏమిటో మీడియాపై ధ్వజమెత్తిన తీరు అద్ధం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆదివారంనాడు ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పత్రికల్లో రాయలేని భాషను ఉపయోగిస్తూ సాక్షి ప్రతినిధులను దూషించారు. మీదమీదకు వస్తూ వీధి రౌడీలా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఇతర పాత్రికేయులనూ వదల్లేదు. బూతు పంచాంగం వినిపించి సంస్కార హీనంగా ప్రవర్తించారు. లగడపాటి తిట్ల దండకం విన్న మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. -
రాష్ట్రం విడిపోదనే నమ్మకం కలుగుతోంది!
* ‘సమైక్య శంఖారావం’లో ప్రజల స్పందనపై కొణతాల వ్యాఖ్య * సమైక్య స్ఫూర్తిని చాటిన లక్షలాది మంది ప్రజలకు ధన్యవాదాలు * ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు విభజనపై పునరాలోచించాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి వాటాలు, ఒడంబడికలు చేసుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు సమైక్య శంఖారావం సభకు హాజరై చూపిన సమైక్య స్ఫూర్తి రాష్ట్రం విడిపోదనే నమ్మకాన్ని తమలో కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సభను చూసైనా ఢిల్లీ పెద్దలు విభజన నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను, వరదలు అతలాకుతలం చేస్తున్నా లెక్క చేయకుండా సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి వచ్చిన లక్షలాది మంది ప్రజలకు పార్టీ తరపున, అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే రాష్ట్రంగా ఉండాలనే స్ఫూర్తితో సమైక్య శంఖారావానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రకృతి సహకరించకపోయినా ఈ స్థాయిలో జరిగిన సభను తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ చూడలేదని, ఈ సభకు వచ్చిన ప్రజలకు పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి ైవె ఎస్ రాజశేఖరరెడ్డికి, ఎల్బీ స్టేడియం సభలకూ మధ్య అవినాభావ సంబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రి అయినపుడు ఇదే స్టేడియంలో వేదికపై నుంచి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారని, రైతులకు రుణమాఫీ ప్రకటన కూడా ఇక్కడే చేశారన్నారు. ఇపుడు ఆయన తనయుడు జగన్ నిర్వహించిన సభ తరువాత రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే విశ్వాసం ప్రజలకు కలుగుతోందన్నారు. సమైక్య సభకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారని వారు కూడా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నందుకే సమైక్య శంఖారావానికి ప్రత్యేక రైళ్లను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విమర్శలకు కొణతాల స్పందిస్తూ.. పాట్నాలో నరేంద్రమోడీ తలపెట్టిన సభకు 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారని అది కూడా మ్యాచ్ ఫిక్సింగేనంటారా? అని ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవాలి తుపాను, ఇటీవలి వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల కోసం తక్షణమే సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని కొణతాల డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో రోడ్లు దెబ్బతినడమే కాక, రిజర్వాయర్లు నిండి లక్షలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగిందన్నారు. 30 మంది వర్షాల బారిన పడి మరణించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీ పీఠం కదిలేలా శంఖారావం
ఢిల్లీ పీఠం కదిలేలా శంఖారావం ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. రాష్ట్ర విభజనను ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ మాత్రం నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విభజించడానికే ముందుకెళ్తోందని ఆయన అన్నారు. నవంబర్ 15న బిల్లు పంపుతామని దిగ్విజయ్ సింగ్ అంటున్నారని, అంతేతప్ప వారిలో ఏమాత్రం పునరాలోచన కనిపించట్లేదని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ విభజనకు సహకరిస్తున్నాయి తప్ప అడ్డుకోవట్లేదు కాబట్టి సమైక్య శంఖారావం పూరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల ఆలోచనా విధానాన్ని ఢిల్లీకి వినిపించడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు కొణతాల చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో తమ పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపడతాయని, ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని తెలిపారు. ఇక తమ పార్టీ ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలేవీ రాలేదని, అలాంటిది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన సభ కాబట్టి, అన్ని ఆటంకాలు తొలగించుకుని యథావిధిగా జరుపుకొంటామన్న నమ్మకం తమకుందని పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను పార్టీ నాయకుడు తలశిల రఘురాం శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. ఇప్పటికే బ్యారికేడ్ల ఏర్పాటు లాంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. స్టేడియం బయట ఉన్న వారికి కూడా నిరాశ కలగకుండా బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నట్లు రఘురాం చెప్పారు. -
రేపు సమైక్య సభ యధాతధం:కొణతాల
-
కోర్టు అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన
-
కోర్టు అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన
హైదరాబాద్: కోర్టు అనుమతిస్తే ఈ నెల 27, 28 తేదీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధితులను జగన్ పరామర్శిస్తారని తెలిపారు. ఒక వేళ కోర్టు అనుమతి ఇవ్వకపోతే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటిస్తారని చెప్పారు. ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శిస్తారన్నారు. వైఎస్ జగన్ పిలుపు ఇచ్చిన విధంగా ఈ నెల 26న సమైక్య శంఖారావం సభ యథాతథంగా జరుగుతుందని కొణతాల చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శంఖారావం సభపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఆయన సభ జరుగుతుందని స్పష్టం చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి: కొణతాల
హైదరాబాద్: ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయపునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. భారీవర్షాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. ఇప్పటికే లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగిందని తెలిపారు. భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో భారీ నష్టం జరిగిందన్నారు. కర్నూలు మార్కెట్లో భారీ స్థాయిలో పత్తి తడిసిపోయిందని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో వేరుశనగకు తీవ్రనష్టం జరిగినట్లు చెప్పారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో కూడా భారీ నష్టం జరిగిందన్నారు. రిజర్వాయర్ల వద్ద గట్లు తెగి తీవ్రనష్టం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయవలసిన అవసరం ఉందన్నారు. పార్టీ నేతలతో తమ నేత జగన్ మాట్లాడారని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. -
విభజన సజావుగా జరిగేందుకు సిఎం సహకారం:కొణతాల
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వత్తాసు పలుకుతూ రాష్ట్ర విభజన సజావుగా జరిగేందుకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కుర్చీ కాపాడుకోడానికి సమైక్యవాదం ముసుగులో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. విభజన సజావుగా జరిగిపోడానికి ప్రజాప్రతినిధులు రాజీనామాలు ఇవ్వకుండా, రాజకీయ సంక్షోభం రానీయకుండా చేస్తున్నారన్నారు. శాసనసభ ప్రత్యేక సమావేశాలు పెట్టి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేస్తే యూపీఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కిరణ్ సర్కారు అదీ చేయడం లేదన్నారు. విభజనపై అంచెలంచెలుగా కేంద్రం ముందుకు వెళుతుంటే నీరో చక్రవర్తి పడేలు వాయిస్తున్న చందంగా సీఎం తాపీగా హైదరాబాద్‌లో కూర్చొని వారానికో ప్రసంగం చేస్తున్నారని విమర్శించారు. సోనియాను ఎదిరించి సీఎం పదవిత్యాగం చేస్తారని గతంలో చాలామంది భావించారని, కాని ఇపుడు ఆయన నిజ స్వరూపం బయటపడిందని చెప్పారు. సమైక్యవాదాన్ని అణచే కార్యక్రమాలు చేస్తే పదవి ఎంతోకాలం ఉండదని, చరిత్రహీనులుగా మిగులుతారని అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియతో సోనియా నేతత్వంలో ప్రజాస్వామ్యం నేలమట్టమయిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆఖరికి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసే పరిస్ధితి లేకుండా చేశారు. అదే రాజ్యసభ సభ్యత్వానికి హరికష్ణ రాజీనామా చేస్తే 24గంటల లోపు ఆమోదించారన్నారు. మంత్రి విశ్వరూప్ రాజీనామాను ఆమోదించినా, మిగతా మంత్రుల రాజీనామాలు, వైఎస్సార్ సీపీ రాజీనామాలు ఆమోదించకపోవడం దారుణమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర ముసుగులో ఒక మాదిరిగా, ముసుగు తీశాక మరోమాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సేవియర్ ఆఫ్ కాంగ్రెస్‌గా మారారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఓట్లు బదిలీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. సోనియా నేతత్వంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పని చేస్తున్నార ని పేర్కొన్నారు. తనపై సీబీఐ కేసులు లేకుండా, సమైక్యాంధ్రకు జగన్ సీఎం కాకూడదన్న లక్ష్యంతో చంద్రబాబుపై చేతులు కలిపారని ఆరోపించారు. చంద్రబాబుపై కేసులున్నా సీబీఐకి స్టాఫ్లేరని దర్యాప్తు చేయకుండా తప్పించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు దీక్షలో సమైక్యమన్న మాటలేదని, కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటన చేస్తే దాన్ని ఖండించకుండా బాబు నాలుగు లక్షల కోట్లడిగారంటే విభజనను అంగీకరించినట్లేనని కొణతాల చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులతో వైఎస్సార్ సీపీ పొత్తుప్రచారాన్ని ఖండించారు. తమ పార్టీ ప్రతినిధులు సమైక్య శంఖారావానికి మద్దతు పలకాలని రాఘవులును కోరితే దాన్ని రాజకీయకోణంలో రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. సమైక్య శంఖారావం అన్ని ప్రాంతాలకు సంబంధించిందని, ఈ సభ విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీలూ కలిసిరావాలని కోరారు. తెలంగాణలో విభజన కోరుకోవడం లేదని, అభివద్ధిని కోరుతున్నారనడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతత్వంలో జరిగిన ఎన్నికలే తార్కాణమన్నారు. -
కొణతాల రామకృష్ణ మీడియా సమావేశం 11th Oct 2013
-
భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్న వైఎస్ఆర్ సీపీ
-
భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్న వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేడు తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది. అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష భగ్నం నేపథ్యంలో నేడు భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. దీని కోసం ఇవాళ సమావేశమవుతున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా నీరసంగా కనిపిస్తున్నారని పార్టీ నేత వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆయనకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు చెప్పారు. -
ఆ రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయి: కొణతాల
లక్షలాది మంది ప్రజలు రోడ్లెక్కి సమైక్యం కోసం నినదిస్తుంటే పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను విస్మరించి విభజనకు అంగీకరించాయని, ఈ రెండు పార్టీలు త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతాయని వైఎస్సార్ సీపీ నాయకులు కొణతాల రామకృష్ణ అన్నారు. బుధవారం రాత్రి జగన్‌ను పోలీసులు తీసుకెళ్లిన తీరుపై ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అహింసా మార్గంలో దీక్ష కొనసాగిస్తుంటే పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని, గతంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్ష సందర్భంగానూ ఇలాగే వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. సమైక్యాంధ్రకు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు విభజనకు పూనుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాను రాజీనామా చెయ్యరు, ఎవర్నీ చెయ్యనివ్వరని అన్నారు. జులై 25న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు అందరూ రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, కానీ సీఎం దగ్గరుండి విభజన తంతు జరిపిస్తున్నారని అన్నారు. ఓవైపు మంత్రి విశ్వరూప్ రాజీనామా చేస్తే ఆమోదిస్తారు, మిగతా వాళ్లు చేస్తే ఆమోదించరు, హరికృష్ణ రాజీనామా చేస్తే ఆమోదిస్తారు, మిగతా ఎంపీలు చేస్తే ఆమోదించరు..దీన్ని బట్టి చూస్తుంటే పాలక, ప్రతిపక్షాలు ఎంతగా కుమ్మక్కయ్యాయో ఇట్టే చెప్పవచ్చునని అన్నారు. పోలీసులను అడ్డుకున్న నాయకులు జగన్‌ను దీక్షాస్థలి నుంచి పోలీసులు తీసుకెళ్లే సమయానికి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. జగన్‌ను పోలీసులు తీసుకెళుతున్న సమయంలో నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కొడాలి నాని, వైఎస్ అనీల్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు తీవ్రంగా అడ్డుకున్నా పోలీసులు వీళ్లందరినీ పక్కకు నెట్టి జగన్‌ను అంబులెన్సు ఎక్కించారు. దీక్షా ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు కూడా పోలీసులను తీవ్రంగా అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర, జై జగన్ నినాదాలు చేశారు. ఒక దశలో తీవ్రంగా తోపులాట జరిగింది. కార్యకర్తలను, నాయకులను పోలీసులు పక్కకు నెట్టి జగన్‌ను ప్రత్యేక అంబులెన్సులో నిమ్స్‌కు తరలించారు. అర్ధరాత్రి సమయంలోనూ కొంతమంది కార్యకర్తలు నిమ్స్‌కు వెళ్లారు., ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు నిమ్స్ వద్ద మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరును తప్పుపట్టారు. అహింసా మార్గంలో దీక్ష చేస్తున్నా అడ్డుకోవడం తగదన్నారు. -
రాజకీయ దుష్టక్రీడలో జెపి ఓ పావు: కొణతాల
హైదరాబాద్: రాజకీయ దుష్టక్రీడలో లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ ఓ పావుగా మారారని అనిపిస్తోందని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహరాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాధార ఆరోపణల విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జేపీ పోటీపడుతున్నారన్నారు. జగన్ బయటకు రావడంతో కొన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారిస్తే జగన్ త్వరగా నిర్దోషిగా బయటకు వస్తారని కొణతాల చెప్పారు. -
రాజకీయ దుష్టక్రీడలో జెపి ఓ పావు: కొణతాల
-
అవాస్తవాల ప్రచారం: కొణతాల రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: జగన్మోహన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ‘క్విడ్ ప్రో కో’ ఎక్కడా జరగలేదని తాము మొదటి నుంచి చెబుతున్నదేనని ఆ పార్టీ నేతలు డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. సీబీఐ రెండేళ్లపాటు చేసిన దర్యాప్తులో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఎక్కడా తేల్చలేదన్నారు. జగన్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన అనంతరం వారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, హర్షం వ్యక్తం చేశారు. జగన్‌పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తాము మొదట్నుంచి చె బుతున్నప్పటికీ, కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా నోరుపారేసుకున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. తమ పార్టీ కుమ్మక్కు అయితే జగన్ ఇన్నాళ్లు జైల్లో ఎందుకుంటారని ప్రశ్నించారు. లావా దేవీలన్నింటికీ ఆదాయపు పన్ను శాఖ ఆధారాలు ఉన్నప్పటికీ ఒక విభాగానికి చెందిన మీడియా, కొందరు నేతలు వాస్తవాలను పూర్తిగా వక్రీకరించారని విమర్శించారు. వ్యాపారవేత్తలైన నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి లాంటి వారిపైనా ఆరోపణలు చేయడంతో పాటు అధికారులపై దుమ్మెత్తిపోశారన్నారు. -
'జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర'
వైఎస్ జగన్ బెయిల్‌ను అడ్డుకనేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న టీడీపీ అధినేత సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ను ఎదుర్కొనే సాహసం చేయలేక కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కొణతాల ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా, దాన్ని గట్టిగా వ్యతిరేకించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని అంతకుముందు చెప్పారు. రాష్ట్ర సమైక్యతను కాపాడటమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు షర్మిల ‘సమైక్య శంఖారావం’ పేరుతో బస్సుయాత్ర చేపట్టినట్టు చెప్పారు. విశాఖపట్నం నగరంలో నేడు షర్మిల బస్సుయాత్ర సాగనుంది. -
జగన్ ఆరోగ్యం ఎంతో ముఖ్యం: కొణతాల
వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్ష విరమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేడు సమావేశమయింది. ఆరోగ్యం బాగా క్షీణించినందున జగన్‌తో దీక్ష విరమింపజేయాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశానంతరం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో కలిసి కొణతాల రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం దీక్ష విరమించాలని దీక్ష విరమించాలన జగన్‌ను కోరాలని నిర్ణయించినట్టు కొణతాల తెలిపారు. జగన్ ఆరోగ్యం ఎంతో ముఖ్యమని చెప్పారు. పార్టీ ఆమోదించిన తీర్మానాన్ని జగన్‌కు విజయమ్మ అందజేస్తారని తెలిపారు. జైల్లో మొదలుపెట్టిన దీక్షను ఆస్పత్రిలోనూ జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొందని చెప్పారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి కాంగ్రెస్ ఆటలాడుతోందని కొణతాల విమర్శించారు. తమ రాజీనామాలతో కాంగ్రెస్ నిర్ణయం మార్చుకుంటుందని ఆశించామన్నారు. సమన్యాయం కోసం విజయమ్మ దీక్ష చేస్తే భగ్నం చేశారని తెలిపారు. దీంతో జగన్ జైల్లో దీక్షకు దిగారని వివరించారు. జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నందున దీక్ష విరమించాలని కోరారు. -
వైఎస్‌పై నిందలేయడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమతం ఏమిటన్నది ఆయన 2009 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలకు ముందు రోశయ్య కమిటీకి ఇచ్చిన విధివిధానాలు, విచారణాంశాలను పరిశీలిస్తే తెలుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు వైఎస్సార్ బీజం వేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్, టీడీపీ నేతలు నిందలేయడం సరికాదన్నారు. వైఎస్సార్ మనసులో ఏముండేది అన్న విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. కొణతాల సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఒక సీఎల్పీ నేతగా వైఎస్సార్ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల మనోభావాల్ని గౌరవిస్తూ వారిచ్చిన వినతిపత్రాన్ని కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపారని తెలిపారు. దానిపై చర్చించిన సీడబ్ల్యూసీ... దేశం లో ఇంకా గూర్ఖాలాండ్, బోడోలాండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక రాష్ట్రాలు కావాలన్న డిమాండ్ ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తూ... రెండో ఎస్సార్సీని వేయాల్సిందిగా హోం శాఖకు సూచించిందని చెప్పారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండో ఎస్సార్సీ విషయాన్ని గాలికొదిలేసి విభజనకు వైఎస్ బీజం వేశారని దుష్ర్పచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, అయితే అన్ని ప్రాంతాలకు చెందిన భాగస్వాములతో (స్టేక్ హోల్డర్స్‌ను) చర్చించి, వారిని ఒప్పించి న్యాయమైన పరిష్కారం చేయాలని ఆ రోజు అసెంబ్లీలో వైఎస్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ ప్రకటనకు అనుగుణంగా 2009 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలకు ముందు రోశయ్య అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారని, 2009 మార్చి 4వ తేదీన విచారణాంశాలను వెల్లడించారని వివరించారు. విభజన విషయంలో వైఎస్ వైఖరి ఏమిటనేది రోశయ్య కమిటీకి ఇచ్చిన విచారణాంశాలను చూస్తే తెలుస్తుందన్నారు. తాను కూడా రోశయ్య కమిటీలో సభ్యుడిని కనుక విచారణాంశాలు ఏమిటో తనకు తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ నిజంగా వైఎస్‌ను గౌరవించి ఉంటే రెండో ఎస్సార్సీ వేయడం లేదా రోశయ్య కమిటీలోకి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చేసేదని తెలిపారు. వాస్తవం ఇలా ఉండగా వైఎస్ వల్లనే రాష్ట్రం ఈరోజు తగులబడి పోతోందని టీడీపీ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ఒకటికి నాలుగుసార్లు కోరింది చంద్రబాబే దివంగత వైఎస్సార్‌పై విమర్శలు చేసే ముందు టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కొణతాల హితవు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందిగా టీడీపీ 2008లో ప్రణబ్‌ముఖర్జీకి లేఖ ఇవ్వడంతోపాటు, రాష్ట్రాన్ని విభజించాల్సిందిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగుసార్లు కోరారని గుర్తుచేశారు. బాబు చెప్పినందుకే రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన వెంటనే బాబు వత్తాసు పలుకుతూ నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తానని చెప్పిన విషయం మరిచారా? అని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణపై బాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా, నిరంకుశంగా జరిగిన విభజనను నిరసిస్తూ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవులకు రాజీనామా చేసిన విధంగానే చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కోరారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడమే కాక ఎదుటివారిపై బురద జల్లే యత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. విభజనపై చంద్రబాబు మౌనంగా కూర్చోవడం, వాళ్ల ఎంపీలు పార్లమెంటులో గందరగోళం సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం అందరమూ కలిసి పోరాడాలి కానీ ఇలా ఒకరిపై నిందలేయడం సబబు కాదన్నారు. ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్కే అనుకూల పరిస్థితి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
మాది ఒకే వైఖరి
* అన్ని ప్రాంతాలకూ తండ్రిలా సమన్యాయం చేయాలన్నాం * ఆ ప్రకటనకు నేటికీ కట్టుబడి ఉన్నామన్న వైఎస్సార్ సీపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి వైఎస్సార్ సీపీ ప్లీనరీ నుంచి నేటి దాకా ఒకే వైఖరిని అవలంభిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. శనివారం చంచల్‌గూడ జైలులో జగన్మోహన్రెడ్డిని కలిసిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీజీసీ సభ్యులు భూమా నాగిరెడ్డి, శాసనసభపక్ష ఉపనేత ధర్మాన కృష్ణదాస్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతేడాది డిసెంబర్ 28న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రకటించిన వైఖరి నుంచి తాము ‘యూ’టర్న్ తీసుకున్నామని అంటున్న వారి వాదనలో నిజం లేదన్నారు. ఆ నాడు షిండే నిర్వహించిన సమావేశంలో పార్టీ వెల్లడించిన వైఖరిని కొణతాల మరోసారి చదివి వినిపించారు. ‘మా పార్టీ మొదటి ప్లీనరీలో 2011 జూలై 8, 9 తేదీల్లో చెప్పినట్లుగా తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నాం. ఆర్టికల్ -3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా పూర్తి హక్కులు, సర్వధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా, మీరు మా అందరి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం’ అని చెప్పామని వివరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు పరిష్కారం చూపకుండా రాజకీయ స్వలాభం కోసం సర్వనాశనం చేశారని కొణతాల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ పరిపాలనలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం, ప్రతిపక్షం లేనట్టుగా దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయంగా జగన్మోహన్రెడ్డిని అణగదొక్కేందుకే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారని విమర్శించారు. ‘కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే ఎగువ రాష్ట్రాల నుంచి నిత్యం విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. పోలవరం విషయానికొస్తే ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఒడిశా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోంది. అన్నింటినీ అధిగమించి.. ఆఖరుకు సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. అయినా కేంద్ర జలవనరుల శాఖ పోలవరం నిర్మాణంపై ‘స్టే’ ఇచ్చింది. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మన రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం రాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే రాష్ట్రం విడిపోతే.. భవిష్యత్తులో కొత్త రాష్ట్రాల పరిస్థితి ఏంటి?’ అని కొణతాల ప్రశ్నించారు. దీక్షకు అనుమతి అవసరం లేదు జగన్ చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని కొణతాల పేర్కొన్నారు. చంద్రబాబుకు తమ పార్టీని విమర్శించే హక్కు, అర్హత లేవన్నారు. ‘చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండుసార్లు కాపాడారు. విభజన ప్రకటనలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు’ అని కొణతాల ధ్వజమెత్తారు. -
రేపటి నుంచి జైల్లో జగన్ నిరాహార దీక్ష
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి జైల్లోనే నిరవధిక నిరాహార దీక్ష చేపడతారని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా, నిరంకుశంగా నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. చంచల్‌గూడ జైల్లో శనివారం జగన్‌ను కలిసిన అనంతరం కొణతాల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు ఆలోచించలేకపోతున్నాయని బాధపడ్డారని, అలాగే విజయమ్మ దీక్షను భగ్నం చేసిన తీరుపట్ల జగన్ ఆవేదన చెందారని కొణతాల తెలిపారు. జగన్‌ను అణగదొక్కాలన్న కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు సిద్ధమయ్యిందన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, వారికి అండగా ఉండి ధైర్యం నింపేందుకు షర్మిల త్వరలో బస్సుయాత్ర చేపడతారని కొణతాల చెప్పారు. ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్, టీడీపీ మౌనం వహించడం బాధ కలిగించిందని జగన్ అన్నారని, ఈ సమయంలో స్పందించకుంటే రాష్ట్రం ఎడారి అవుతుందని ఆయన తెలిపారని కొణతాల పేర్కొన్నారు. చంద్రబాబు స్పందించకపోవటం దారుణమని, బాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. -
జైలు నిబంధనల ప్రకారమే జగన్ దీక్ష
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రేపటి నుంచి చంచల్‌గూడ జైలులో ఆమరణదీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సిజిసి) సభ్యుడు కొణతాల రామకృష్ణ ప్రకటించారు. ఈ రోజు రామకృష్ణతోపాటు ఆ పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణ దాసు చంచల్‌గూడ జైలులో జగన్మోహన రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో అయిదు రోజుల పాటు నిరాహారదీక్ష చేయడంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు తెలిపారు. ఆమెకు వెంటనే వైద్యం చేయకపోతే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో జగన్మోహన రెడ్డి జైలు నుంచే తల్లితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. జైలు అధికారుల అనుమతితో రూపాయి కాయిన్ బాక్సు నుంచి జగన్ మాట్లాడినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సమస్యను మరింత జఠిలం చేసేవిధంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా జగన్మోహన రెడ్డి జైలులోనే రేపటి నుంచి ఆమరణ దీక్ష ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. జైలు నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకొని దీక్ష చేస్తారన్నారు. -
రెండో ఎస్ఆర్సితో సమన్యాయం: కొణతాల
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న దీక్షకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్ఆర్సి(స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ)ని నియమించి ఉంటే అందరికీ సమన్యాయం జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకాలు పూర్తి చేసిన తరువాత విభజన జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరిగేది కాదని కొణతాల అన్నారు. -
విజయమ్మ దీక్షకు మద్దతు
అనకాపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతు తెలిపేందుకు పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలతో సమీక్షించారు. ఈ నెల 22 నుంచి జిల్లాలో పార్టీ చేపట్టే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేసే బాధ్యత అందరిదీ అన్నారు. బస్సు యాత్రల విషయమై మాట్లాడేందుకు జిల్లా పార్టీ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పార్టీ రాష్ర్ట నేత కొణతాలను కలిశారు. యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్, పార్టీ శ్రేణుల పాత్రపై మాట్లాడారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గ నేతలను కొణతాల ఆరా తీశారు. విజయమ్మ దీక్షకు సంఘీభావంగా నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలన్నారు. పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ మద్దతుదారులను నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటివారంలో అభినందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కొణతాలను కలిసినవారిలో గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, పట్టణ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలసాల కిశోర్, మండల నాయకులు గొర్లి హరిబాబు, సూరిశెట్టి రమణ అప్పారావు చోడవరం నియోజవర్గానికి చెందిన అడపా నర్సింహమూర్తి, సూర్యనారాయణ, కర్రి తమ్మునాయుడు ఉన్నారు.