అత్యధిక మున్సిపాలిటీలు వైఎస్ఆర్ సీపీవే | ysrcp leader konathala ramakrishna confident on municipal elections reluts | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 30 2014 2:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వాయిదా వేయాలని తమ పార్టీ కోరడంలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయలేదని చెప్పారు. తమ పార్టీ తరపున వాయిదా వేయమని ఏ ఒక్కరికి విజ్ఞప్తి చేయలేదని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కొణతాల విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను వేధిస్తున్నారని చెప్పారు. వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎలాంటి నేరచరిత్ర లేని పార్టీ వ్యక్తుల్ని పోలీసులు బైండోవర్‌ల పేరుతో అరెస్ట్ చేశారని కొణతాల తెలిపారు. త్వరలో వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తోందని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement