హైదరాబాద్:ఓటర్లు నమోదు ప్రక్రియలో పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ నేతలు కొణతల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ లు విజ్ఞప్తి చేశారు. గడగడపకూ పార్టీని తీసుకువెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ఓటర్లు నమోదు ప్రక్రియ, సమైక్య అంశాలపై సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓటర్లు నమోదు ప్రక్రియలో పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కింది స్థాయి నుంచి అన్ని కమీటీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్క నేత ప్రజలకు అందుబాటులో ఉంటూ సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వారు సూచించారు.