కొణతాలది దిగజారుడుతనం
వైఎస్సార్‌సీపీ నేతలు బొడ్డేటి ప్రసాద్, అమర్‌నాథ్
విశాఖపట్నం: కొణతాల రామకృష్ణ మనసులో విషం, మౌనంలో కపటం, నవ్వి దగ్గరకు తీసుకుంటే అందులో విషాదం ఉంటుందన్న విషయం ఆయనతో సావాసం చేసిన ప్రలి ఒక్కరికీ తెలుసని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. నిలువెల్లా విషం నింపుకొన్న కొణతాల తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద విమర్శలు చేయడం దారుణమని పార్టీ అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేటి ప్రసాద్, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌లు ‘సాక్షి’కి శనివారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు.
జిల్లాలో కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్నదెవరో.. డార్క్ రూమ్‌లో ఉన్నదెవరో.. బ్లాక్‌మెయిల్ చేసి తన రాజకీయ పనులు చేయించుకునేదెవరో ప్రజలకు తెలుసునన్నారు. వైఎస్ జగన్ జై లు నుంచి బయటకు వచ్చాక ఆయన నిజ స్వరూపం తెలిసిందంటున్న కొణతాల.. ఆ రోజే లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. వేరే పార్టీలో ఉన్నత స్థానాలు పొందడం కోసం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీచేస్తే ఓడిపోతారని కొణతాల ముందే చెప్పారనడం పూర్తిగా అవాస్తవమ న్నారు.
‘‘కొణతాల పట్టుబట్టి మరీ అనకాపల్లిలో తన తమ్ముడు రఘుబాబుకి టికెట్ ఇప్పించుకున్నారు. సర్వేలన్నీ రఘుబాబుకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కేవలం కొణతాల మనసు నొప్పించకూడదని ఆయనకు టికెట్ ఇచ్చారు. మరి తమ్ముడిని కొణతాల ఎందుకు గెలిపించుకోలేకపోయారు’’ అని ప్రశ్నించారు. కొణతాల రాసిన లేఖ ను పార్టీ లీక్ చేసిందనడంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. వైఎస్ జగన్ గురిం చిగానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించిగానీ తప్పుగా మాట్లాడితే సహించేది లేద న్నారు. కొణతాల రాజీనామాను ఆమోదిస్తూ ఆయనకు ఉద్దేశించి తాను రాసిన బహిరంగ లేఖలోని అంశాలకు కట్టుబడి ఉన్నట్టు గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు.