కంగుతిన్న కొణతాల వర్గం .
మునగపాక: ఉద్యమ నేతగా గుర్తింపుపొందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మునగపాక మండలంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడ ంతో నేతలు కంగుతిన్నారు. కొణతాలకు మునగపాక మండలానికి విడదీయరాని బంధం ఉండేది. మారిన రాజకీయాల నేపథ్యంలో ఆయన శుక్రవారం మునగపాకలో నిర్వహించిన ఆత్మీయతా సమావేశానికి ఆశించిన మేరకు ప్రజలు రాకపోవడం కొత్త ఆలోచనకు తెరతీసినట్టయింది. ఒకవైపు టీడీపీ తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వర్గీయులు, మరోవైపు వైఎస్సార్‌సీపీకి చెందిన బొడ్డేడ ప్రసాద్ వర్గీయులు ఎవరూ సమావేశానికి హాజరుకాకపోవడం విశేషం. దీంతో ఏదో చేద్దామనుకున్న కొణతాల మునగపాక మండలం నుంచి వచ్చిన స్వల్ప జనాన్ని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురికాగా.. ఇలా అయితే రానున్న కాలంలో పరిస్థితులు పట్ల ముఖంలో కదలికలు చెప్పకనే చెప్పాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కొణతాల వైఎస్సార్‌సీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం, కార్యకర్తలకు అందుబాటు లో లేకపోవడంతో పలు అపజయాలు మూట కట్టుకున్న అపవాదును కూడగట్టుకున్నారన్న వాదన లేకపోలేదు. గత నెలరోజులుగా ఏపార్టీలో చేరాలన్న విషయమై సమాలోచన లకు శ్రీకారం చుట్టారు. రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునేందుకు మునగపాకలో ఈనెల 23న ప్రారంభించిన ప్రజాభిప్రాయ సేకరణకు కేడర్ ఉన్న నాయకులు రాకపోవడం విమర్శలకు తావిస్తున్నది. మునగపాక మండలంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండడంతోపాటు పార్టీకి పెద్దదిక్కుగా నిలిచిన బొడ్డేడ ప్రసాద్ వర్గం నుంచి ఒక్కరు కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోగా పార్టీ కేడర్ చేజారకుండా ప్రసాద్ తనదైన శైలిలో పావులు కదిపారన్న ప్రచారం సాగుతోంది. సభా నిర్వాహకులు మునగపాకలో ఇం టింటికీ వెళ్లి ప్రచారం చేసినా నిర్వాహకుల బంధువులు, కొంతమం ది రైతులతోపాటు ఇతర గ్రామాలకు చెందిన అరకొర మందితప్పా ఆశించిన మేర సభ విజయం కాలేదని గుసగుసలు ఉన్నాయి. దీనికితోడు అధికార పార్టీ కూడా ఈ సమావేశానికి టీడీపీ నుంచి ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించే సమావే శం మునగపాకలో నిర్వహించి తన సత్తా చాటాలని భా వించిన కొణతాల వర్గీయులకు మింగుడుపడటం లేదు.