referendum
-
Sonia Gandhi: ఫలితాలు ప్రధానికి నైతిక ఓటమే
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గిస్తూ తాజా లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ప్రజాతీర్పు ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ, నైతిక ఓటమికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఒక జాతీయ పత్రికలో రాసిన సంపాదకీయంలో మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై సోనియా విమర్శలు సంధించారు. ‘‘ ఎన్నికల ప్రచారంవేళ తానొక దైవాంశ సంభూతుడిని అన్నట్లు స్వయంగా ప్రకటించుకుని 400 సీట్ల ఖాయమని భ్రమలో గడిపిన ప్రధాని మోదీకి జూన్ 4న వెల్లడైన ఫలితాలు ప్రతికూల సంకేతాలు చూపించాయి. విభజన, విద్వేష రాజకీయాలు, మోదీ పరిపాలనా విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు నాటి ఫలితాల్లో వెల్లడైంది. ఏకాభిప్రాయం ఉండాలని మోదీ వల్లెవేస్తారుగానీ ఆచరణలో అవేం ఉండవు. స్పీకర్ ఎన్నికలు ఇందుకు తార్కాణం. డెప్యూటీ స్పీకర్ పదవి విషయంలో విపక్షాల సహేతుక విజ్ఞాపనను పట్టించుకుంటే స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వానికి మేం సంపూర్ణ మద్దతు ఇస్తామని ‘ఇండియా’ కూటమి స్పష్టంచేసింది. అయినాసరే మోదీ వైఖరి మారలేదు. 17వ లోక్‌సభలోనూ డెప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించలేదు’’ అని అన్నారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు రాలేదు ‘‘రాజ్యాంగంపై ఎన్డీఏ దాడి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే లోక్‌సభ తొలి సెషన్లోనే ఎమర్జెన్సీ అంశాన్ని మోదీ సర్కార్ పదేపదే ప్రస్తావించింది. పారీ్టలకతీతంగా, పక్షపాతరహితంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కూడా అదే బాటలో పయనిస్తూ ‘ఎమర్జెన్సీ’పై తీర్మానం చదవడం దిగ్భ్రాంతికరం. నాటి ఎమర్జెన్సీకి కారణమైన ఇందిరాగాం«దీని ఆనాడు ప్రజలు తిరస్కరించినా తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీతో గెలిపించారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు కూడా రాలేదు’’ అని సోనియా అన్నారు. ఆ మూడు చట్టాల అమలు నిలిపేయాలి ‘‘పార్లమెంట్లో దారుణమైన భద్రతావైఫల్యాన్ని ఎలుగెత్తిచాటినందుకు అక్రమంగా ఇరుసభల్లో 146 మంది విపక్ష సభ్యులను బహిష్కరించారు. వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన మూడు నూతన నేర బిల్లులను ఎలాంటి చర్చ జరపకుండానే ఏకపక్షంగా చట్టాలుగా ఆమోదింపజేసుకున్నారు. బిల్లులను సంస్కరించాల్సిఉందని, చర్చ జరగాలని ఎందరో న్యాయకోవిదులు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే వీటిపై సమగ్ర చర్చ జరగాలి. అప్పటిదాకా ఈ నేర చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలి’’ అని సోనియా అన్నారు. నీట్ లీకేజీలపై ప్రధాని మాట్లాడరా? ‘‘లక్షలాది మంది యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం వెలుగుచూస్తే మోదీ మాట్లాడరా? పరీక్ష పే చర్చా అంటూ తరచూ విద్యార్థులతో మాట్లాడే మోదీ ఈసారి ఎందుకు అదే విద్యార్థులకు మరోసారి పేపర్ లీక్ కాబోదని భరోసా ఇవ్వలేకపోతున్నారు? దారుణ నిర్లక్ష్యానికి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఎన్సీఈఆర్టీ, యూజీసీ, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు గత పదేళ్లలో ఎంతగా పడిపోయాయో ఇట్టే అర్థమవుతోంది’’ అని అన్నారు. -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనమెక్కడో తెలుసుకుందాం..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకునేందుకు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, నేతలు సొంత సర్వేల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో తమ తమ నియోజక వర్గాల్లో పరిస్థితిని, ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. పనితీరు మెరుగ్గా ఉండి గెలుపు అవకాశాలు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ దక్కుతుందని పార్టీ అధి నేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలు ‘థర్డ్ పార్టీ’ సర్వేలు చేయించుకుంటున్నారు. తమ పనితీరు, అదే సమయంలో ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈసారి గట్టిగా టికెట్ ఆశిస్తు న్న బీఆర్ఎస్ నేతలు కూడా సర్వేలపై ఆసక్తి చూపిస్తున్నారు. పథకాలు, పనితీరు ప్రభావంపై అంచనా ప్రభుత్వ పథకాలతో పాటు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఇతర పనులు ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందో ఓ అంచనాకు వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, కింది స్థాయిలో కేడర్ పనితీరు తమ గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకుల పనితీరు పైనా, తమతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారేమైనా దుర్వినియోగం చేశారా అనే కోణంలోనూ సర్వేలు చేయిస్తున్నారు. సర్వేలతో పాటు వివిధ మార్గాల్లో ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు. కేవలం పైపైన సమాచారంతో సరిపుచ్చుకోకుండా లోతుగా విశ్లేషించాలని కన్సల్టెన్సీలను కోరుతున్నారు. ఒక్కో మండలాన్ని మూడు నాలుగు క్లస్టర్లుగా విభజించి ఇన్ఫ్లూయెన్సర్స్ (ప్రభావశీలురు) నుంచి వివరాలు సేకరించేలా చేస్తున్నారు. ఇన్ఫ్లూయెన్సర్స్ కేటగిరీలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, ఉద్యోగులు, ఆర్ఎంపీలు, ఎల్ఐసీ ఏజెంట్లు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు తదితరులను చేర్చి కన్సల్టెన్సీలు శాంపిళ్లు సేకరిస్తున్నాయి. ఎన్నికల మేనేజ్మెంట్ సంస్థలకు ఫుల్ గిరాకీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే సంస్థలకున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని పలు కన్సల్టెన్సీలు పుట్టుకొస్తున్నాయి. సర్వేలతో పాటు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ప్రచారం, ఇతర కార్యకలాపాల కోసం ఎమ్మెల్యేలు సొంతంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నారు. సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ, ఎన్నికల మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్, ప్రచార వ్యూహాల రూపకల్పన, పర్సెప్షన్ మేనేజ్మెంట్ (ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు) తదితర సరికొత్త అంశాలతో ఈ కన్సల్టెన్సీలు రాజకీయ నేతలను ఆకర్షిస్తున్నాయి. ఈ కన్సల్టెన్సీల ద్వారా నియోజకవర్గాల్లో జరిగే కార్యకలాపాలను నేతల కుటుంబ సభ్యులు, సన్నిహితులు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వర్గాల నుంచి అందే సమాచారం కంటే ఈ థర్డ్ పార్టీ సంస్థల నుంచి అందే నివేదికలు శాస్త్రీయంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీ సర్వే నివేదికలపై ఎమ్మెల్యేల ఆసక్తి గతంలో బీఆర్ఎస్కు రాజకీయ వ్యూహాలు, సర్వే సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ దూరమైన తర్వాత ఇతర సంస్థలు తెరమీదకు వచ్చాయి. డిజిటల్ మీడియా వింగ్‌కు చెందిన ఓ నిపుణుడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ సర్వే సంస్థ ప్రస్తుతం బీఆర్ఎస్కు ఎన్నికల కోణంలో విస్తృత సేవలు అందిస్తోంది. ‘కె2 కన్సల్టెన్సీ’గా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న ఈ సంస్థ విపక్ష పార్టీల కన్సల్టెన్సీల కంటే చాలా ముందంజలో ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే నేతృత్వంలోని సంస్థ కూడా సర్వేలు చేసి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కన్సల్టెన్సీల నివేదికలతో పాటు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి తమపై వెళ్తున్న నివేదికల వివరాలు తెలుసుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారు. -
'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత
హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్‌కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్‌ను అధికారికం చేసింది. ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్‌లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి. చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా.. -
రష్యా మరో ఎత్తుగడ.. ఉక్రెయిన్ ప్రాంతాల విలీనానికి ‘రిఫరెండం’
కీవ్: ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో శుక్రవారం రిఫరెండం మొదలు పెట్టింది. లుహాన్స్క్, ఖేర్సన్‌తోపాటు జపోరిజియా, డోనెట్స్క్లోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇది మంగళవారం దాకా కొనసాగుతుందని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వర్గాలు వెల్లడించాయి. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యన్ భాష మాట్లాడేవారే ఎక్కువ. వారంతా రష్యాలో చేరడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలమైన ఉక్రెయిన్ తిరుగుబాటుదారులతోనే ఈ ప్రక్రియ చేయించింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ఓటింగ్ ఈనెల 27న ముగియనుంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 4ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకుని, సరిహద్దులను సవరించుకుంటే, వాటిజోలికి ఎవరూరారని రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతామండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాక వీటిని కాపాడుకునేందుకు అవసరమైతే ఎలాంటి ఆయుధాలనైనా ఉపయోగిస్తామన్నారు. పరోక్షంగా ఆయన అణు హెచ్చరికలు చేశారు. మరోవైపు.. రష్యా ఆక్రమించుకున్న 4 ప్రాంతాల్లో రెఫరెండం చేపట్టడాన్ని ఒక బూటకపు ప్రక్రియగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. రిఫరెండంపై పశ్చిమ దేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం.. భయాందోళనతో దేశం బయటకు! -
రష్యా ఓటింగ్ నిర్వహించనుందా? అప్పుడూ అలానే ఉక్రెయిన్ నుంచి వాటిని లాక్కొంది!
May Vote On Joining Russia: రష్యా గత నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంతేగాక రష్యా ఇటీవలే తన తొలి సైనిక చర్య పూర్తయిందని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో రిపబ్లిక్ భూభాగంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగవచ్చు అని ఉక్రెయిన్‌లోని లుగాన్స్క్ వేర్పాటువాద ప్రాంత అధిపతి లియోనిడ్ పసెచ్నిక్ పేర్కొన్నారు. అంతేకాదు రష్యా ఈ సమయంలో ప్రజలు రష్యన్ ఫెడరేషన్లో చేరడంపై అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయమై రష్యా చట్ట సభ సభ్యుడు లియోనిడ్ కలాష్నికోవ్ మాత్రం ఇప్పుడూ అలా చేసేందుకు సరైన సమయం కాదన్నారు. అయితే ఉక్రెయిన్‌కి తూర్పున ఉన్న స్వయం ప్రకటిత డోనెట్స్క్ లుగాన్స్క్ రిపబ్లిక్లకు రక్షణగా వ్యవహరిస్తోందని రష్యా పేర్కొంది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని రష్యా ఎగువ సభలోని రాజ్యాంగ శాసన కమిటీ అధిపతి ఆండ్రీ క్లిషాస్ అన్నారు. ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాన్ని రష్యా గుర్తించినట్లు ప్రకటించింది కూడా. ఈ ప్రాంతాల అధికారులు తమ రాజ్యాంగాలకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వారిక ఉందని స్పష్టం చేసింది. రష్యన్ మాట్లాడే ప్రాంతాలు 2014లో 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి కైవ్ నియంత్రణ నుంచి వైదొలగాయి. ఫిబ్రవరి 2014లో కైవ్‌లో జరిగిన ప్రజా తిరుగుబాటులో మాస్కో అనుకూల నాయకుడిని తొలగించి, రష్యాలో భాగమవడంపై దక్షిణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే రష్యా క్రిమియాను ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుంది. కాబట్టి మళ్లీ ఇప్పుడూ కూడా రష్యా అలానే చేస్తుందేమోనని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రష్యా పై నోరు పారేసుకోవడమే తప్ప ఉక్రెయిన్‌కి చేసిందేమీ లేదు! ఉక్రెయిన్ ఎంపీ) -
‘వైన్‌షాప్ ఉండాలా.. వద్దా’ అంటూ ఓటింగ్.. ఫలితం ఏంటంటే!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఓటింగ్‌ను నాయకులను ఎన్నుకునేందుకు చేపడతారు. అయితే బేగంపేట గురుమూర్తిలేన్ ప్రాంతంలో మాత్రం వైన్ షాప్ ఉండాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించారు. గుర్తిమూర్తిలేన్‌లో వైన్‌షాపు ఏర్పాటుపై గత కొద్ది రోజులుగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపును ఏర్పాటుచేశామని నిర్వాహకులు చెప్పారు. అయితే దీనిపై ఓటింగ్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్న సందర్భంలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్‌కు అనుబంధంగా ఉన్న ‘హక్కు ఇన్షియేటివ్ అండ్ ఛానల్’ సంస్థను పలువురు స్థానికులు ఆశ్రయించారు. సదరు సంస్థ ప్రతినిధులు శనివారం సిటిజన్ రెఫరెండమ్ పేరుతో గుర్తిమూర్తి లేన్ నివాస, వాణిజ్య కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఓటింగ్ నిర్వహించారు. ‘మీకు మీ ఏరియాలో వైన్ షాపులు ఉండడం ఇష్టమేనా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 1479 మంది ఓటు వేయగా ఆదివారం కౌంటింగ్ ప్రక్రియ జరిపారు. 1415 మంది (95.67 శాతం) ‘నో’ (వద్దు) అని ఓట్ చేయగా, 53 మంది (3.58 శాతం) మంది ‘ఎస్’ (కావాలి) అని ఓట్ చేశారు. 11 ఓట్లు చెల్లలేదు. ఓట్లు వేసిన వారిలో 737 మంది (49.8 శాతం) మహిళలు, 742 మంది (50.16) పురుషులు ఉన్నారు. కోర్టులో పిటిషన్.. ‘హక్కు ఇన్షియేటివ్ అండ్ ఛానల్’ సంస్థ నిర్వహించిన ఈ ఓటింగ్ ఫలితాల ఆధారంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. గతంలో ఇదే సంస్థ సికింద్రాబాద్ ఒకసారి, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వైన్‌షాపుల ఏర్పాటుపై పలు సర్వేలు జరిపినట్లు సమాచారం. నగరంలో ఇది రెండో ఓటింగ్ ప్రక్రియ. -
అక్టోబర్ కల్లా అనుమతులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల సాధన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను, ఇతర అంశాలను మరో వారం, పదిరోజుల్లో కేంద్ర పర్యావరణ శాఖకు నివేదించనుంది. ఎన్జీటీలో కేసులు, కేంద్రం, బోర్డుల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైన అనుమతులు సాధించే ప్రక్రియకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అక్టోబర్ కల్లా ఈ ప్రక్రియ పూర్తి లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం ఇప్పటికే సజావుగా ముగించిన సంగతి తెలిసిందే. ఈఏసీకి సమర్పించే నివేదికలపై కసరత్తు ఈ ప్రాజెక్టు కోసం 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు కూడా అవసరం కానున్నాయి. ఇప్పటివరకు 26 వేల ఎకరాల భూసేకరణ పూర్తికాగా, ఈ నెల 10న ఐదు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ కార్యక్రమం ముగిసింది. దీంతో ఈ వివరాలతో పాటు జీవ వైవిధ్య నిర్వహణ ప్రణాళిక, మత్స్య సంపద పరిరక్షణ, నిర్వహణ, ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, పునరావాసం పునర్నిర్మాణం, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, క్వారీల పునరుద్ధరణ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు సమర్పించనున్నారు. జల, వాయు, శబ్ద నిర్వహణ ప్రణాళికలు, ప్రజారోగ్యం, పారిశుధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ, స్థానిక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు తదితరాలపై వివరాలతో పాటు, వాటిపై వెచ్చించే నిధులపై కేంద్రానికి వివరణ ఇచ్చేలా కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్ శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం అనుభవంతో.. తెలంగాణ తమకు సమర్పించే నివేదికలపై కేంద్ర పర్యావరణ శాఖలోని ప్రాజెక్టుల ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) చర్చించి, ప్రాజెక్టుతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. బ్యారేజీలు, కాలువలు, పంపుహౌస్‌ల నిర్మాణంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. వీటి నిర్మాణాలపై ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ స్పష్టం చేస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ సమయంలో ఈఏసీ పలు సూచనలు చేసింది. ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణ దశలో, నిర్మించిన తర్వాత ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను నివేదించాలని చెప్పింది. అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్మెంట్ను చేపట్టడంతో పాటు దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. దీంతో పాలమూరుకు అనుమతుల విషయంలో.. ఆ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండోదశలో చేపట్టే పనులకు పర్యావరణ అనుమతులపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ, నారాయణపేటలో కార్యక్రమం జరిగింది. ముందుగా అధికారులు ప్రాజెక్టు అవశ్యకత, లాభాలు, వ్యయాల వం టివి ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వివరించారు. అనంతరం వారి అభిప్రాయాలు స్వీకరించారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీచేసి అనుమ తించారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించలేదు. ప్రతి కేంద్రం వద్ద 200 నుంచి 300 మంది పోలీసులు మోహరించారు. వెల్దండలో కలెక్టర్ శర్మన్ అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 8 మండలాల రైతులు పాల్గొన్నారు. తమకు పర్యావరణంపై అవగాహన లేదని, నష్టపరిహారంపైనే ఆందోళన ఉందని రైతులు చెప్పారు. నారాయణపేటలో కలెక్టర్ దాసరి హరిచందన అధ్యక్షతన 9 మండలాల రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైతుల పేర్లను చిట్టీల్లో రాసి డిప్తీస్తూ ఒక్కొక్కరితో మాట్లాడించారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారి పేర్లే తీశారనే ఆరోపణలొచ్చాయి. -
మళ్లీ పుతిన్‌వైపే మొగ్గు
శాశ్వతంగా అధికారంలో కొనసాగడం ఎలాగో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చూసి ప్రపంచ దేశాధినేతలు నేర్చుకోవాలి. రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నా వాటిని అధిగమించి 20 ఏళ్లుగా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారాన్ని అంటిపెట్టుకునే వున్న పుతిన్... ఇకపై అది సాధ్యపడదని గ్రహించి ఆర్నెల్లక్రితం ఏకంగా ఆ నిబంధనలనే సవరించారు. 2036 వరకూ తానే అధ్యక్షుడిగా కొనసాగడానికి వీలుకల్పించే ఆ సవరణలపై వారంరోజులుగా సాగుతున్న రిఫరెండంలో జనం ఆయన్నే విజేతగా నిలిపారు. బుధవారం వెల్లడైన ఫలితాల ప్రకారం పుతిన్ తీసుకొచ్చిన సవరణలకు అనుకూలంగా 77.9 శాతంమంది, వ్యతిరేకంగా 21 శాతంమంది ఓట్లేశారని అధికారులు ప్రక టించారు. 2000 సంవత్సరంలో తొలిసారి దేశాధ్యక్ష పీఠం అధిరోహించిన పుతిన్‌కు ప్రస్తుతం 67 ఏళ్లు. ఇప్పుడున్న నిబంధనల్ని అనుసరించి ఆయన 83 ఏళ్లు వయసు వచ్చేవరకూ అధ్యక్ష పదవిలో ఉండొచ్చు. ఈలోగా మరిన్ని సవరణలు తీసుకొస్తే అంతకుమించి కూడా కొనసాగవచ్చు! వాస్తవానికి ఈ రిఫరెండం మొన్న ఏప్రిల్ 22న జరగాల్సివుంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో దానికి బ్రేకు పడింది. వరసగా రెండు నెలల లాక్డౌన్ తర్వాత కూడా దాని తీవ్రత తగ్గకపోగా ఉగ్రరూపం దాల్చింది. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత కరోనా కేసుల్లో రష్యా మూడో స్థానంలో వుంది. అక్కడ 6,62,000మంది దాని బారినపడగా 9,683మంది మరణించారు. వాస్తవానికి కరోనా కేసుల్ని రష్యా కప్పిపుచ్చుతోందన్న విమర్శలున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రిఫరెండం జరపాలనే పుతిన్ నిర్ణయించారు. జూలై 1న దీన్ని నిర్వహించాలని అనుకున్నా, పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా జనం గుమిగూడతారన్న సాకుతో గత నెల 25నుంచి అక్కడ ఓటేయవచ్చని ప్రకటించారు. మొత్తానికి జనవరిలోనే పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగసవరణలకు అవసరం లేకపోయినా పుతిన్ రిఫరెండం నిర్వహించి జనం కూడా తన వెనకే వున్నారన్న అభిప్రాయం అందరిలో కలిగించే ప్రయత్నం చేశారు. కేవలం తన పదవి కోసమే సవరణలు చేశారన్న అనుమానం రాకుండా పుతిన్ ఇతర నిబంధనలు కూడా చేర్చారు. సామాజిక సంక్షేమ పథకాలను మెరుగుపరచడం, ఆడా మగా మధ్య జరిగే పెళ్లిని మాత్రమే గుర్తించడం, ఎగ్జిక్యూటివ్ అధికారాల్లో మార్పులు తీసుకొచ్చి అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు వుండేలా చూడటం, అంతర్జాతీయ చట్టాలు రష్యా రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోతే అవి వర్తించబోవని చెప్పడం ఇతర సవరణల ధ్యేయం. బలమైన నేతలకు రిఫరెండం అనేది ఒక శక్తిమంతమైన ఆయుధం. సాధారణ ఎన్నికల్లో అయితే ఎన్నో అంశాలు చర్చకొస్తాయి. పాలన తీరెలావుందన్న అంశం చుట్టూ అవి తిరుగుతాయి. కానీ రిఫరెండం విధానం వేరు. అందులో కేవలం అవును, కాదు అనే రెండే ప్రత్యామ్నాయాలుంటాయి. ఎంతటి సంక్లిష్ట సమస్యయినా ఆ చట్రంలో ఒదిగిపోవాల్సిందే. తన సవరణలకు పుతిన్ ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందినా రిఫరెండం మార్గం ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఇదే. వాస్తవానికి రష్యా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో పడింది. దాన్నుంచి ఒడ్డున పడటానికి తీసుకుంటున్న చర్యలు ఫలితాలనివ్వడం లేదు. ఈలోగా కరోనా మహమ్మారి దాన్ని మరింత కుంగదీయడంతో పాటు... ప్రభుత్వ అసమర్థతను బట్టబయలు చేసింది. ఆయన రేటింగ్ గణనీయంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలొస్తే ఆ సమస్యల చుట్టూ చర్చలు సాగేవి. పుతిన్ గడ్డు పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చేది. కనుకనే ఆయన సుస్థిరత, భద్రత కావాలంటే తనకే ఓటేయాలని ఈ రిఫరెండం సందర్భంగా పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలు మొదలుకొని అసమ్మతి వరకూ దేన్నయినా అణచడంలో సిద్ధహస్తుడని రుజువైన పుతిన్‌కు దీటైన నేతను జనం ఊహించుకోగలరా? కనుకనే ‘బలమైన’ నేతను వారు ఎంచుకున్నారు. ఆయన ప్రత్యర్థి నవ్లానీ ఆరోపిస్తున్నట్టు ఈ పోలింగ్‌లో ఏదో మేరకు రిగ్గింగ్ జరిగివుండొచ్చు. అయితే కేవలం అందువల్లే పుతిన్ నెగ్గగలిగారన్నది అవాస్తవం. ఈ రిఫరెండం ద్వారా రష్యాకు తాను తిరుగులేని అధినేతనని పుతిన్ రుజువు చేయ గలిగారు. పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ఉదారవాద వ్యవస్థ తమకు ఆమోదయోగ్యం కాదని, తమ దేశంలో తాము అనుకునేదే చట్టమని ఆయన ఈ రిఫరెండంతో తేల్చిచెప్పారు. పశ్చిమ దేశాల్లో చాలా భాగం ఇప్పుడు స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాయి. కానీ తాము మాత్రం సంప్రదాయంగా వస్తున్న కుటుంబ విలువలకే కట్టుబడి వున్నామని, భగవత్ సృష్టిని ధిక్కరించ బోమని ఈ సవరణలతో పుతిన్ చాటారు. ఇప్పటికే అమెరికాతోపాటు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తది తర దేశాల్లో క్రమేపీ బలం పుంజుకుంటున్న మితవాదులకు పుతిన్ మార్గదర్శకుడవుతారు. ఉదారవాద విధానాలకు తామే ప్రత్యామ్నాయమని వారు చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి జర్మనీకి చెందిన తీవ్ర మితవాదులకు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పారా మిలిటరీ శిక్షణనిచ్చినట్టు ఒక నివేదిక బయటపెట్టింది. ఈసారి సామాజిక మాధ్యమాల్లో పుతిన్ వ్యతిరేక ప్రచారం దీటుగానే సాగింది. పుతిన్ శిబిరం ఆయనకు మద్దతుగా రూపొందించిన వీడియోలకు ప్రత్యర్థి నవ్లానీ గట్టిగా జవాబిచ్చారు. ఇతరత్రా ప్రచారాల విషయంలోనూ అదే జోరు సాగింది. కానీ పుతిన్ బలపడితే పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది వేతనాలు పెరుగుతాయని, బడుల్లో పిల్లలకు ఉచితంగా భోజన వసతి కల్పిస్తారని, శిశు సంక్షేమ పథకాలు అమల్లోకొస్తాయని జనం విశ్వసించారు. వీటిన్నిటికీ కావాల్సిన 8,000 కోట్ల డాలర్ల సొమ్ము ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా అన్న తర్కంలోకి ఓటర్లు పోలేదు. బలమైన అధ్యక్షుడుంటే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయని నమ్మారు. మొత్తానికి మిన్నువిరిగి మీదపడినా పుతిన్‌కు ఇప్పట్లో తిరుగులేదని ఈ రిఫరెండం నిరూపించింది. -
కరోనా వ్యాక్సిన్ వచ్చాకే... మైదానాలకు వస్తాం!
న్యూయార్క్: లీగ్‌లు, ఆటలు ప్రస్తుతానికైతే కోవిడ్ –19 వల్ల జరగట్లేదు. ఒకవేళ త్వరలో ఆటలు మొదలైనా కూడా ప్రేక్షకులు కరువయ్యే అవకాశాలున్నాయి. అమెరికా ప్రజల్లో చాలా మంది కరోనాకు మందు, వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాలకు వెళ్లబోమని చెప్పారు. ఇటీవల అక్కడ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 72 శాతం మంది ప్రస్తుతం ఆరోగ్యకర పరిస్థితులేవీ లేవు కాబట్టి ఆటలకు హాజరు కాబోమని చెప్పారు. 12 శాతం ప్రజలు మాత్రం ఆటలు చూసేందుకు ఆసక్తి కనబరిచినప్పటికీ గ్యాలరీలో సామాజిక దూరం పాటిస్తేనే వెళ్తామని చెప్పారు. కేవలం 13 శాతం మంది మాత్రం ఏదేమైనా ప్రత్యక్ష వీక్షణను ఆస్వాదించేందుకు సిద్ధమేనన్నారు. స్టిల్మన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరిధిలో షార్కీ ఇన్స్టిట్యూట్ ఈ నెల 6,7,8 తేదీల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 762 మంది అభిప్రాయాల్ని సేకరించగా... ఇందులో పాల్గొన్న అమెరికన్లు మాత్రం ఇంతకుముందులా ఆటల కోసం ఎగబడి మైదానాలకెళ్లి చూడాలనుకోవడం లేదని... టీవీల్లో చూసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
‘పోలవరం’పై సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయసేకరణ జరిపించాలని సూచించింది. ప్రజాభిప్రాయసేకరణ విధివిధానాలను అఫిడవిట్లో పేర్కొనాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
గోవుల చట్టం కోసం 8 ఏళ్ల ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను ప్రేమించడంలో, గౌరవించడంలో బహూశ భారత్ తర్వాత ప్రపంచంలో రెండో దేశం స్విడ్జర్లాండే కావచ్చు. వారి జాతీయ చిహ్నం కూడా ఆవులే. ఆవుల విషయంలో అక్కడి రైతులకు ఓ ఆటవిక ఆనవాయితీ ఉంది. వారు ఓ దశలో ఆవుల కొమ్ములను నాటు పద్ధతిలో కత్తిరించి వేస్తారు. స్విడ్జర్లాండ్ మొత్తం మీద 80 శాతం ఆవులకు కొమ్ములుండవు. ఈ అనాచారం ఎందుకొచ్చిందో వారికి కూడా తెలియదుగానీ, కొమ్ములుండడం వల్ల గోశాలలకు స్థలం ఎక్కువ అవసరం పడుతుందని, కొమ్ముల వల్ల ఆవులు కోపతాపాలకు గురవుతాయని, పరస్పరం పొడుచుకుంటాయని, అప్పుడప్పుడు వాటిని సాదుతున్న రైతులనే పొడిచే ప్రమాదం ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఆవుల కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే ఆర్మిన్ కపాల్ అనే రైతు ఈ అనాచారానికి వ్యతిరేకంగా చట్టం తీసుకరావడానికి పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. విజయం సాధించారు. ఫలితంగా ఆయన ప్రతిపాదించిన చట్టంపై రేపు (ఆదివారం) స్విడ్జర్లాండ్ ప్రభుత్వం ‘రిఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ)’ నిర్వహిస్తోంది. రిఫరెండానికి అనుకూలంగా మెజారిటీ ప్రజలు ఓటేస్తే చట్టం ఖాయమవుతుంది. స్విడ్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అవడం వల్ల ఏ అంశంపైనైనా, ఏ పౌరుడైన చట్టాన్ని ప్రతిపాదించవచ్చు. అయితే అందుకు కనీసం లక్ష మంది ప్రజల సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. మన రైతు ఆర్మిన్ కపాల్ లక్షా ఇరవై వేల మంది సంతకాలు సేకరించారు. అయితే ఆర్మిన్ ప్రతిపాదించిన చట్టంలో ఆవుల కొమ్ముల కత్తిరింపుపై నిషేధం కోరలేదు. ఆవుల కొమ్ములను కత్తిరించని రైతులకు, రాయితీగా రోజుకు ఒక్కో ఆవుకు ఒక్క స్విస్ ఫ్రాంక్ అంటే, దాదాపు 70 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలంటూ చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం కోసం ఆర్మిన్ దాదాపు ఎనిమిదేళ్లుగా పౌరుల సంతకాల కోసం కృషి చేస్తున్నారు. చట్టం కోసం చేసే ప్రతిపాదనపై స్విస్ పౌరులు గుడ్డిగా సంతకం చేయరు. ప్రతిపాదనతో పూర్తిగా ఏకీభవించినప్పుడే వారు సంతకాలు చేస్తారు. అందుకే లక్షా ఇరవై వేల సంతకాలు సేకరించేందుకు ఆయనకు అంతకాలం పట్టింది. ఆజానుభావుడిలా కనిపించే ఆర్మిన్కు ఇప్పుడు 67 ఏళ్లు. బవురు గడ్డంతో కనిపించే ఆర్మిన్ రకరకాల దుస్తులు, పలు రకాల టోపీలతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ‘మేము ఆవులను ప్రేమిస్తాం, వాటిని తింటాం’ ‘ఆవు కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే మీరు, ఆవు మాంసాన్ని ఎలా తింటారు? అది క్రూరత్వం కాదా?’ అని జర్మనీ జర్నలిస్ట్ పీటర్ జాగ్గి (ఆమె భారత దేశంలో ఆవులను పవిత్రంగా చూడడంపై జర్మనీలో ఇటీవల ఓ పుస్తకం రాశారు) ప్రశ్నించగా ‘మేము ఆవులను ప్రేమించేమాట నిజమే. వాటి మాంసాన్ని ఇష్టంగా తినే మాట కూడా నిజమే. కొన్ని ఆవులను కబేళాలకు పంపించకపోతే నేడు స్విడ్జర్లాండ్‌లో మనుషులకన్నా ఆవులే ఎక్కువగా ఉండేవి. ఆవుల సంరక్షణను మనుషులమైన మనం బాగా చూసుకుంటాం కనుక, అవి ఆహారంగా మారి మన రుణం తీర్చుకుంటాయి. ఆవులను గౌరవించడం వల్లనే మా దేశస్థులు విమానాశ్రయాల్లో అతిథులను రికార్డు చేసిన ఆవు శబ్దాలతో ఆహ్వానిస్తారు’ అని ఆర్మిన్ అన్నారు. ఆయన మాటల్లో నిజాయతీ ఉందని, భారత దేశంలో గోమాంసాన్ని నిషేధించడంలో నిజాయితీ లేదని ఆమె ఈ సందర్భంగా ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా నేరం చేస్తోంది! ‘నా దష్టిలో ఆవులను అవసాన దశలో కబేళాలకు పంపించడం నేరం కాదు. ఆ దశలో అవి బతికి ఉండడం వల్ల ఎక్కువ బాధను అనుభవించాల్సి ఉంటుంది. గోమాంసాన్ని తినడాన్ని నేరంగా పరిగణించేవారు ఆవు పాలను తాగడం కూడా నేరమే అన్న విషయాన్ని గ్రహించాలి! ప్రకృతి సిద్ధంగా ఆవు పాలనిచ్చేది వాటి సంతానం కోసం. మనుషుల కోసం కాదు. ఈ లెక్కన ప్రపంచమంతా నేరం చేస్తోంది’ అని అమె ‘హోలి కౌవ్స్ ఇండియా (జర్మనీలో)’ పుస్తకంలో వ్యాఖ్యానించారు. -
ఆబార్షన్లపై ఐర్లాండ్‌లో రేపే రిఫరెండం
ఒక భారతీయ మహిళ విషాదభరితమైన మరణం ఐర్లాండ్ చట్టాలనే మారుస్తుందా ? గర్భస్రావంపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు అయిదేళ్లుగా చేస్తున్న పోరాటం ఎలాంటి మలుపు తిరగబోతోంది ? ఐర్లాండ్‌లో అబార్షన్లపై నిషేధాన్ని రద్దు చేయాలా ? వద్దా ? అనే అంశంపై అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణకు వీలుగా ఈ నెల 25 శుక్రవారం రిఫరెండం జరుగుతున్న వేళ ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తల్లి ప్రాణంతో పాటు, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి అత్యంత విలువను ఇస్తూ గర్భస్రావంపై అత్యంత కఠినమైన చట్టాలు ఇప్పటివరకు ఆ దేశంలో అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల కారణంగా కర్ణాటకకు చెందిన సవిత హలప్పనవర నిండు ప్రాణం బలైపోయింది. ఆమె మృతి దేశంలో ఎందరినో కదలించడంతో ప్రభుత్వం రిఫరెండంకు సిద్ధమైంది. అయిదేళ్ల క్రితం ఏం జరిగిందంటే ? కర్ణాటకకు చెందిన దంత వైద్యురాలు సవిత హలప్పనవర (31) ఆమె భర్త ప్రవీణ్‌లు ఐర్లాండ్‌లో నివాసం ఉంటున్నారు. మూడో నెల గర్భవతిగా ఉన్న సవిత విపరీతమైన నడుం నొప్పి రావడంతో 2012 అక్టోబర్ 21న గాల్వే ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భస్రావం చెయ్యక తప్పనిపరిస్థితి ఏర్పడిందని నిర్ధారించారు. అయితే అప్పటికే గర్భస్థ శిశువు గుండెకొట్టుకోవడం ప్రారంభం కావడంతో చట్టపరంగా అబార్షన్ చేయడానికి వీల్లేదని భావించిన వైద్యులు సహజంగా గర్భస్రావం అయిపోతుందేమోనని రెండు, మూడు రోజులు వేచి చూశారు. ఈ లోపే ఆమె గర్భాశయానికి ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్‌గా మారి సవిత ప్రాణాల మీదకి వచ్చింది. దీంతో ఆమెకి మందుల ద్వారా అబార్షన్ చేశారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సవిత అక్టోబర్ 28న తుది శ్వాస విడిచింది. ఐర్లాండ్‌లోని కఠినమైన చట్టాలే సవిత ప్రాణాలు తీశాయంటూ ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సవిత మృతితో దేశవ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు. తల్లి ప్రాణం మీదకి వస్తున్నా లెక్కచేయకపోవడమేమిటంటూ నినదిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. చట్టాల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆ సమయంలో ఆందోళనలు మిన్నంటాయి. సవిత మృతిపై ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ గాల్వే ఆస్పత్రి సిబ్బందిని క్షుణ్ణంగా విచారించి సరైన సమయంలో అబార్షన్ చేసి ఉంటే సవిత ప్రాణాలు దక్కి ఉండేవని, గర్భస్రావం చట్టాన్ని సవరించాలంటూ గట్టిగా సిఫారసు చేసింది. మరోవైపు గర్భస్రావంపై నిషేధాన్ని సమర్థిస్తున్న కొందరు సంప్రదాయవాదులు సవిత కేసు సాకుతో చట్టాలను నీరుకార్చే ప్రయత్నం చేయవద్దంటూ నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం సవిత మృతి వెనుక నిజానిజాలను తెలుసుకోవడానికి రెండో కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ గాల్వే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సవిత ప్రాణాలు పోయాయని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం అబార్లషన్లపై ప్రజాభిప్రాయ సేకరించాలని నిర్ణయించింది. సవితను గుర్తుకు తెచ్చుకోండి : ఓటర్లకు తండ్రి విజ్ఞప్తి ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ కాలంలో తమ కుమార్తె దేశం కాని దేశంలో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో మరణించడం సవిత తల్లిదండ్రుల్ని కుంగదీసింది. తాము సర్వస్వాన్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని సవిత తండ్రి అందనప్ప ఎలగి కన్నీరుమున్నీరవుతున్నారు. ఐర్లాండ్‌వాసులు ఓటు వేసే ముందు తమ కుమార్తెను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, తమ పరిస్థితి మరే తల్లిదండ్రులకు రాకూడదని ఆయన అంటున్నారు. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. మరి రిఫరెండంలో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపిస్తారో మరో రోజులో తేలిపోనుంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అబార్షన్ల కోసం ‘యెస్’ క్యాంపెయిన్..
డబ్లిన్ : సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఐర్లాండ్‌లో మరణించిన భారత సంతతి దంత వైద్యురాలు సవితా హలప్పనావర్ ఫొటో ప్రస్తుతం ఐర్లాండ్ పత్రికల పతాక శీర్షికల్లో దర్శనమిస్తోంది. ఆమె మరణం ఎంతో మంది మహిళలను కదిలించింది... యెస్ క్యాంపెయిన్ పేరిట జరుగతున్న ఉద్యమానికి చిరునామాగా మారింది. ఎందుకంటే ఆమె ఏ రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతోనో మరే ఇతర కారణాల వల్లో మరణించలేదు... అక్కడి కఠినమైన చట్టాలు ఆమెను బలవంతంగా హత్య చేశాయి. యెస్ క్యాంపెయిన్... క్యాథలిక్ దేశంగా పేరున్న ఐర్లాండ్.. స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతించి, చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ప్రసిద్థికెక్కింది. అదే విధంగా మైనారిటీ వర్గానికి చెందిన గేను ప్రధానిగా ఎన్నుకుని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు చేస్తున్న ఐరిష్ ప్రభుత్వం మహిళల విషయంలో మాత్రం కఠినంగానే వ్యవహరిస్తోంది. క్యాథలిక్ దేశానికి చెందిన మహిళలనే కారణాన్ని చూపి అబార్షన్లకు అనుమతివ్వకుండా.. ఎంతో మంది మహిళల మరణాలకు కారణమవుతోంది. అయితే ఆరేళ్ల క్రితం అనారోగ్య కారణాల వల్ల గర్భస్రావానికి అనుమతివ్వాలంటూ సవిత ఐరిష్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ అందుకు వారు నిరాకరించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో సంచలనం సృష్టించిన సవిత మరణం.. గర్భస్రావాల వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఐరిష్ మహిళల్లోని పోరాట పటిమను మరింత దృఢపరిచింది. యెస్ క్యాంపెయిన్ పేరిట అబార్షన్ల వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి ఊపిరులూదింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల(మే) 25న నిర్వహిస్తున్న రెఫరెండంలో ఓటు వేసేందుకు బ్రిటన్, ఇతర దేశాల్లో స్థిరపడిన మహిళలు కూడా రాబోతున్నారు. ఆ నిషేధం ఎత్తివేయాలి... ఐర్లాండ్ రాజ్యాంగంలోని ఎనిమిదో అధికరణకు సవరణ చేయాలన్నదే యెస్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. ఈ అధికరణ ప్రకారం గర్భస్థ శిశువుల జీవించే హక్కు పేరిట ఐర్లాండ్ ప్రభుత్వం అబార్షన్లపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఎంతో మంది మహిళలు అబార్షన్ల కోసం ఇంగ్లండ్, ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లలేని స్తోమత లేనివారు మరణిస్తున్నారు. అయితే సవిత కేసు పత్రికల్లో ప్రముఖంగా ప్రచారమవడంతో అబార్షన్లపై ఉన్న నిషేధ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు ముందుకొచ్చారు. అమె ఫొటోతో క్యాంపెయిన్ నిర్వహిస్తూ తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అసలేం జరిగింది...? భారత సంతతికి చెందిన సవితా హలప్పనావర్ ఐర్లాండ్‌లో దంత వైద్యురాలిగా పనిచేసేవారు. 17 వారాల గర్భవతైన సవిత.. నడుము నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారు. గర్భస్రావం కావడంతో వెంటనే అబార్షన్ చేసి పిండాన్ని తొలగించాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కానీ ఐర్లాండ్ చట్టాల ప్రకారం అబార్షన్ చేయడం నేరం. దీంతో వారం రోజుల అనంతరం తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల కారణంగా సవిత మరణించింది. సంతోషంగా ఉంది : సవిత తండ్రి ఆరేళ్ల క్రితం మరణించిన తన కూతురును, ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తుపెట్టుకున్న ఐరిష్ మహిళలకు సవిత తండ్రి కృతఙ్ఞతలు తెలిపారు. తన కూతురి ఫొటోను యెస్ క్యాంపెయిన్‌కు వాడుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఒకవేళ ఐరిష్ ప్రభుత్వం అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తివేస్తే ఎంతో మంది మహిళల చిరునవ్వుల్లో తన కూతురు బతికే ఉంటుందంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మే 25న నిర్వహించబోతున్న ఓటింగ్‌లో ఐరిష్ మహిళలంతా పాల్గొనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. -
శ్రావణపల్లి ఓసీకి గ్రీన్ సిగ్నల్
కాసిపేట(మంచిర్యాలజిల్లా): మందమర్రి ఏరియాలో మరో ఓపెన్‌కాస్టుకు సింగరేణి బోర్డు అనుమతి లభించింది. దీంతో అధికారులు పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ఎన్నో రోజులుగా తెరపై ఉన్న నెన్నెల మండలం శ్రావణపల్లి ఓపెన్‌కాస్టుకు సంబధించి గతనెల 23న నిర్వహించిన సిం గరేణి బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో ఏరియాలో మరో ఓసీ మంజూరుతో ఉత్పత్తి మరింత పెరగనుంది. ప్రస్తుతం నూతనంగా నిర్మాణంలో ఉన్న కాసిపేట –2ఇంక్లైన్, కేకే–6తో పాటు నూతనంగా కేకే–7 గని, ఓసీ ఏర్పాటుతో సింగరేణిలో మందమర్రి ఏరియా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఉత్పత్తితో పాటు పెద్ద ఏరియాగా మందమర్రి నిలవనుంది. 93.45మిలియన్ టన్నుల నిల్వలు.. నెన్నెల మండలం జెండవెంకటపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టనున్న శ్రావణపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులో 11సీం లలో 93.45టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నా యి. ఏడాదికి 3మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తిని తీసేందుకు యాజ మాన్యం ప్రణాళికలు చేసింది. దీంతో ఓసీ జీవితకాలం 32సంవత్సరాలు కొనసాగనుంది. ఓసీకి అంచనా వ్యయం రూ. 550కోట్లుగా యాజమాన్యం నిర్ణయించింది. 3,640ఎకరాల విస్తీర్ణంలో పనులు.. శ్రావణపల్లి ఓపెన్‌కాస్టుకు సంబంధించి 1455.8హెక్టర్లు(3639.5 ఏకరాలు) భూమి అవసరం కానుంది. అందులో 669.2హెక్టర్లు(1672.5ఎకరాలు) అటవీభూమి కాగా.. మిగతా 1967ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క శ్రావణపల్లి గ్రామాన్ని మాత్రమే నిర్వాసిత గ్రామంగా అధికారులు గుర్తించారు. 70నుంచి 80కుటుంబాలు మాత్రమే ఉన్న గ్రామం కావడంతో ఆర్అండ్ఆర్ పునరావాస ప్యాకేజీ లో ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కల్యాణిఖని ఓసీలో సైతం దుబ్బగూడెం గ్రామాన్ని మాత్రమే పునరావాస గ్రామంగా తీసుకోవడంతో యాజమాన్యానికి కాస్త తలనొప్పి తగ్గినట్లు యింది. శ్రావణపల్లి చిన్న గ్రామం అయి నందున మెరుగైన ప్యాకేజీ, నూతన భూసేకరణ చట్టాలను వర్తింపజేయనున్నారు. యాజమాన్యం పూర్తి వివరాలతో పర్యావరణ అనుమతులకుప్రతిపాదించనుంది. కేంద్ర పర్యా వరణ శాఖ ఆదేశాలతో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిం చి ఓసీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేయనుంది. ఇప్పటికే అక్కడి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఓసీపై అధికారులు అవగాహన కల్పించారు. -
కేటలోనియా స్వాతంత్య్ర కాంక్ష
రెండో ప్రపంచ యుద్ధానికి ముందునాటి పరిస్థితుల స్థాయి కాకపోయినా యూరప్ గత కొన్నేళ్లుగా అస్థిర, అయోమయ వాతావరణాన్ని చవిచూస్తోంది. రెండేళ్లక్రితం గ్రీస్ పార్లమెంటు ఎన్నికల్లో పొదుపు చర్యలకు వ్యతిరేకంగా ఓటేయడం, యూరప్ యూనియన్(ఈయూ) నుంచి తప్పుకోవడానికి అనుకూలంగా నిరుడు బ్రిటన్ రిఫరెండం తీర్పునీయడం, ఇటలీలో కేంద్ర ప్రభుత్వానికి విశేషాధికారాలు కట్టబెట్టే రిఫ రెండంలో అధికార పక్షాన్ని వ్యతిరేకిస్తూ ఫలితం వెలువడటం వగైరా పరిణా మాలన్నీ ఇందుకు ఉదాహరణలే. స్పెయిన్‌లో అక్కడి సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ కేటలోనియా ప్రాంతంలో మొన్న ఆదివారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన రిఫరెండం సైతం ఆ కోవలోనిదే. రాగలకాలంలో స్పెయిన్‌తోపాటు, ఈయూను కూడా ప్రభావితం చేసేదే. ఆ రిఫరెండం కేటలో నియా ప్రాంతం దేశం నుంచి విడిపోవడానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. రాజ్యాంగ న్యాయస్థానం వద్దన్నది కనుక రిఫరెండానికి ‘చట్టబద్ధత’ లేకపోవచ్చు... దీన్ని గుర్తించేది లేదంటూ స్పెయిన్ ప్రభుత్వం చెప్పి ఉండొచ్చు. కానీ ఆ రిఫ రెండంలో వ్యక్తమైన ప్రజల స్వాతంత్య్ర ఆకాంక్షనూ, స్వయం నిర్ణయాధికారం కోసం వారు పడుతున్న తపననూ, అన్నిటికీ మించి నియంతృత్వ పోకడలపై వారి నిరసననూ ఎవరూ కాదనలేరు. రిఫరెండాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటిస్తున్న రాజ్యాంగం 1978నాటిది కాగా, కేటలోనియా స్వాతంత్య్రేచ్ఛ శతాబ్దాల నాటిది. రిఫరెండాన్ని ఆపడానికి పోలీసులు పడిన యాతన అంతా ఇంతా కాదు. ఓటే యడానికొస్తున్న జనంపై ఎక్కడికక్కడ విరుచుకుపడి లాఠీచార్జిలు జరిపి వందల మందిని గాయపర్చినా, పలువుర్ని అరెస్టు చేసినా రిఫరెండం ఆగలేదు. దీనికి కొన సాగింపుగా వచ్చే సోమవారం కేటలోనియా పార్లమెంటు సమావేశం నిర్వహించి స్వాతంత్య్ర ప్రకటన చేయబోతున్నట్టు అధ్యక్షుడు కార్లెస్ పుగ్డిమాంట్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ సమావేశాలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పెయిన్ జాతీయ ప్రభుత్వం ప్రక టించింది. అలాంటి తీర్మానమేదైనా చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని, ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చ రించింది. ఈ విషయంలో పుగ్డిమాంట్తో ఎలాంటి చర్చలూ ఉండవని స్పెయిన్ ప్రధాని మరియానో రజాయ్ చెబుతున్నారు. నిజానికి ఇన్నేళ్లుగా చర్చించకపోబట్టే, ఆ ప్రాంత వాసుల మనోభావాలను గుర్తించకపోబట్టే సమస్య ఇంతవరకూ వచ్చింది. 2014లో రిఫరెండం జరిపినప్పుడు సైతం ఇలాంటి ఫలితమే వచ్చింది. అప్పుడు కేటలోనియా నేతలు చర్చలకు సిద్ధపడ్డారు. కనీసం ఆ తర్వాతనైనా తన విధానాలు మార్చుకుని ఉంటే ఆ ప్రాంత ప్రజల మనసుల్ని గెల్చుకోవడం సాధ్య మయ్యేది. కానీ రజాయ్ మాత్రం మొండికేశారు. ఫలితంగానే ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ రిఫరెండం జరిగింది. 1936–39 మధ్య జరిగిన స్పానిష్ అంతర్యుద్ధంలో నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ అండదండలతో విరుచుకుపడ్డ మితవాదులతో సాగిన పోరాటంలో కేటలోనియాది వీరోచిత పాత్ర. దేశంలోని ఇతర ప్రాంతాలు జనరల్ ఫ్రాంకో వశమైనా అది చాన్నా ళ్లపాటు నిబ్బరంగా పోరాడింది. అయితే 3,500మందిని ఊచకోత కోసి, వేలాది మందిని ఖైదు చేశాక లొంగిపోక తప్పలేదు. అంతమాత్రాన అంతరాంతరాల్లోని దాని స్వాతంత్య్ర కాంక్ష చావలేదు. నలభైయ్యేళ్లక్రితం స్పెయిన్ నియంత జనరల్ ఫ్రాంకో మరణించాక దేశంలో పునరుద్ధరించిన ప్రజాస్వామిక వ్యవస్థ దీన్ని గుర్తించి ఉంటే...అందుకనుగుణంగా ఆ ప్రాంతవాసులకు అక్కడి వనరులపై, ఆ ప్రాంత అభివృద్ధిపై తగినన్ని అధికారాలిచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో! కానీ కేటలోనియాకు అప్పుడు దక్కింది కేవలం నామమాత్ర స్వయం ప్రతిపత్తి. 1977లో వాగ్దానం చేసిన ఆ స్వయంప్రతిపత్తికి 2006లో మాత్రమే చట్టరూపం ఇచ్చారు. తీరా స్పెయిన్ సర్వోన్నత న్యాయస్థానం అందులో కొన్ని అంశాలు చెల్లవంటూ 2010లో కొట్టేశాక వారికి ఆమాత్రం కూడా మిగల్లేదు. నిజానికి కేటలోనియా ప్రాంత భాష స్పానిష్ కాదు...కేటలాన్. వారి సంస్కృతి స్పానిష్ సంస్కృతికి భిన్నమైనది. ఆహార అలవాట్లయినా, అభిరుచులైనా, సంప్రదాయాలైనా, పండుగలైనా పూర్తిగా వారి సొంతం. స్పెయిన్‌తో వారిని ఏకం చేసే అంశం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. కేట లాన్ యూరప్‌లో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఒకటి. కానీ ఈయూ అధికార భాషల్లో కేటలాన్ లేదు. వీటన్నిటికీ తోడు కేటలోనియా భూభాగం సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. స్పెయిన్ ఆర్ధిక వ్యవస్థకది వెన్నెముక. 2008 ఆర్ధిక మాంద్యం సమయంలో స్పెయిన్ ఆర్ధిక వ్యవస్థ తట్టుకున్నదంటే అది కేటలోనియా పుణ్యమే. ఆర్ధిక వ్యవస్థలో దాని వాటా 20 శాతం పైమాటే. అది అటు తయారీ రంగంలోనూ, ఇటు సర్వీసురంగంలోనూ ముందంజలో ఉంది. నిజానికి ఇందువల్లే స్పెయిన్ దాన్ని గుప్పిట బంధించింది. కేటలోనియా స్వతంత్ర దేశంగా ఏర్పడాలంటున్న వేర్పాటువాద పార్టీలు 2015 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు స్పెయిన్ జాతీయ ప్రభుత్వం కాదన్నా అక్కడ స్వాతంత్య్రాన్ని కోరుతూ రిఫరెండం నిర్వహించారు. స్పెయిన్ రాజు ఫెలిప్ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ఐక్యతతో కేటలోనియా సమస్యను ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. పరోక్షంగా సైనిక చర్య ఉండొచ్చునన్న సంకేతాలిచ్చారు. అదే జరిగితే స్పెయిన్ మరోసారి అంతర్యుద్ధంలో చిక్కుకోవడం ఖాయం. రక్తపాతానికి దారితీయగల ఇలాంటి అవాంఛనీయ పరిణామాలకు తావీయరాదనుకుంటే ఈయూ రంగంలోకి దిగాలి. కేటలోనియాపై మౌనం వీడి మధ్యవర్తిత్వం నెరపాలి. అదే జరిగితే ఇతరచోట్ల కూడా వేర్పాటువాదం పెరిగి యూరప్ విచ్ఛిత్తికి దారి తీస్తుందేమోనని మీనమేషాలు లెక్కించడం వల్ల ప్రయోజనం శూన్యం. నాన్చడం వల్ల ఆ ప్రమాదం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. నిజానికి స్పెయిన్ పాలకుల అప్రజాస్వామికతను గుర్తించి సకాలంలో హెచ్చరించి ఉంటే... మొగ్గలోనే తుంచి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు. -
మరోసారి తెరపైకి జమిలి ఎన్నికల ప్రస్తావన
-
చెదరని స్వప్నం
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల సుదీర్ఘ చెరలో నిలువెల్లా క్షతగాత్రగా మిగిలిన ఇరాక్‌లోని కుర్దుల ప్రాంతం స్వతంత్ర రాజ్యంగా ఎదగాలన్న చిరకాల వాంఛను ఫలింపజేసుకునేందుకు తొలి అడుగు వేసింది. ఇరాక్ ప్రభుత్వమే కాదన్నా... ఇరుగు పొరుగునున్న టర్కీ, ఇరాన్‌లు ఆగ్రహావేశాలతో చెలరేగినా... ఐక్యరాజ్యసమితి వద్దని బతిమాలినా మూడు రోజుల క్రితం రిఫరెండం నిర్వహించుకుంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉన్నా ఆ రిఫరెండంలో పాల్గొన్న 93 శాతంమంది పౌరుల్లో అత్యధికులు స్వతంత్ర కుర్దిస్తాన్ ఆవిర్భావానికి అనుకూలంగా ఓటేశారని సమాచారం వస్తోంది. తుది ఫలితం గురువారం అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఇరాక్ ప్రధాని హైదర్ అల్–అబాదీ ఈ రిఫరెండాన్ని ‘వ్యూహాత్మక, చరిత్రాత్మక తప్పిదం’గా అభిర్ణిస్తే... టర్కీ అధ్యక్షుడు ‘నమ్మకద్రోహ’మని మండిపడ్డారు. ఇరాన్ మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు దీన్ని ‘మరో ఇజ్రాయెల్’ స్థాపించడానికి వేసిన ఎత్తుగడగా వ్యాఖ్యానించారు. చిత్రమేమంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఒక్కటే కుర్దుల రిఫరెండాన్ని సమర్ధించింది. ఈ సమర్ధనే రిఫరెండం పర్యవసానాలెలా ఉండబోతున్నాయో సూచిస్తోంది. కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వ అధ్యక్షుడు మసౌద్ బర్జానీ ఇప్పటికిప్పుడు సరిహద్దు రేఖలు గీసే ఆలోచనేదీ లేదని హామీ ఇచ్చినా, ‘మంచి ఇరుగుపొరుగు’గా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సంభాషణలకు ఇది ప్రాతిపదికని చెబుతున్నారు. పశ్చిమాసియాలో తమకంటూ సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవా లని శతాబ్దాలుగా తహతహలాడుతున్నా కుర్దులకు అది నెరవేరని స్వప్నంగానే మిగి లింది. కుర్దు జాతి ప్రజలకంటూ ఇప్పుడు సొంత భూభాగం లేదు. వారుండే ప్రాంతం ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా భూభాగాల్లో కలిసి ఉంది. ఆ జాతి ప్రజలు ఇంకా ఆర్మేనియా, అజర్బైజాన్లలో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇరాక్‌లో కుర్దిష్ భాషకు అధికార భాష హోదా ఉన్నా వేరే దేశాల్లో ఆ పరిస్థితి లేదు. వేర్వేరు దేశాల్లో ఆ భాషకు వేర్వేరు లిపులు కూడా తప్పలేదు. తామంతా ఒకే భూభాగంలో ఉమ్మడి లిపితో, సంస్కృతితో, స్వతంత్రంగా బతకాలని కుర్దులు వాంఛిస్తున్నా అది ఇప్పట్లో నెరవేరే సూచనలు కూడా కనబడటం లేదు. ఉత్తర ఇరాక్‌లోని కుర్దుల ప్రాంతానికి మాత్రం స్వయంపాలిత ప్రభుత్వం ఉంది. అంత కుమించి ఆశించరాదని ఇరాక్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. హద్దు మీరితే చర్య లుంటాయంటున్నది. అందుకు కారణం ఉంది. కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం (కేఆర్జీ) ఏలుబడిలోని ప్రాంతంలో దండిగా చమురు బావులున్నాయి. అక్కడ రోజుకు 6,50,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. ఇది ఇరాక్ చమురు ఉత్పత్తిలో 15 శాతం. ప్రపంచ చమురులో 0.7 శాతం. తన మాట వినకుండా రిఫరెండం నిర్వహించినందుకు కేఆర్జీ నుంచి చమురు కొనుగోలు చేయరాదని ఇరాక్ నిర్ణయించడమే కాదు... ఇకపై చమురు కోసం తమ ఫెడరల్ ప్రభుత్వాన్ని మాత్రమే సంప్రదించాలని ఇరుగుపొరుగు దేశాలకు సూచించింది. అమెరికా ఒత్తిళ్ల పర్యవసానంగా సరే అన్నా చమురు మార్కెటింగ్‌ను కేఆర్జీకి అప్పగించడం ఇరాక్ ప్రభుత్వానికి ఆదినుంచీ ఇష్టం లేదు. చివరకు ఒప్పుకున్నా పలు సందర్భాల్లో అందుకు ఆటంకాలు కల్పించింది. చమురు డబ్బుతో కేఆర్జీ ముందూ మునుపూ పుంజుకుంటుందని భయం. ఈ రిఫరెండంతో టర్కీ కూడా ఆగ్రహించింది. చమురు మార్కెటింగ్‌కు సహకరిస్తున్నందుకు ఇదా ప్రతిఫలమని కేఆర్జీపై అది విరుచుకుపడుతోంది. కుర్దులు నాలుగు దేశాల్లోనూ దశాబ్దాలుగా తీవ్ర అణచివేతనూ, వేధింపులనూ ఎదుర్కొంటున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అటొమన్ సామ్రాజ్యాన్ని రద్దు చేసినప్పుడు స్వతంత్ర కుర్దిస్తాన్ ఏర్పాటుకు హామీ ఇచ్చినా టర్కీ తీవ్రంగా ప్రతిఘటించడంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన అనేక తిరుగుబాట్లను ఆ దేశం అణచివేసింది. ఇరాన్లో సైతం కుర్దులు స్వయంపాలన కోసం పోరా డుతూనే ఉన్నారు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ ఏలుబడిలో వారిపై యుద్ధ విమా నాలు బాంబుల వర్షం కురిపించాయి. హలబ్జా నగరంలో 1988లో విషవాయువు ప్రయోగించడంతో 5,000మంది పౌరులు మృత్యువాత పడ్డారు. 1991లో గల్ఫ్ యుద్ధం సమయంలో ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతం అమెరికా, మిత్రదేశాల కూటమి రక్షణలోకి వచ్చింది. ఇరాక్‌లో, సిరియాలో తన చెప్పుచేతల్లో ఉన్న కుర్దు గ్రూపులకు అమెరికా అండదండలందిస్తున్నా స్వతంత్ర కుర్దిస్తాన్ ఏర్పాటు దానికి ససేమిరా ఇష్టం లేదు. ఐఎస్ పీడ విరగడైందో లేదో తేలకుండానే పశ్చిమాసియాలో మరో కుంపటి రాజుకోవడం అమెరికాకు ససేమిరా ఇష్టం లేదు. కుర్దులకు మద్ద తిస్తే అది నాలుగు దేశాలతో కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇరాక్ పాలకులు ఎదురుతిరగొచ్చు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దూరం జరగొచ్చు. ఇదంతా ఆ ప్రాంతంలో ఇప్పుడున్న తన పలుకుబడిని దెబ్బతీస్తుందని అది భయపడుతోంది. బ్రిటన్, యూరప్ యూనియన్(ఈయూ), అరబ్‌లీగ్ దేశాల భయం కూడా అదే. ఇరాక్‌లో, సిరియాలో, ఇరాన్లో పాశ్చాత్య దేశాలకు పావులుగా పని చేస్తున్నారన్న అపప్రద కుర్దులకున్నా ఒక జాతిగా వారి ఆకాంక్షలు న్యాయమైనవి. వాటిపై నీళ్లు జల్లాలని చూడటం అధర్మం. అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఐఎస్ ఉగ్రవాదులతో రణరంగంలో ప్రత్యక్షంగా తలపడింది కుర్దులే. వారి సహకారం లేకపోతే ఐఎస్‌ను తరిమికొట్టడం అసా ధ్యమయ్యేది. దానికి ప్రతిఫలంగా తాము కోరుకున్న ప్రత్యేక రాజ్యానికి తోడ్పడాలన్నది కుర్దుల వాదన. ప్రశాంతత ఏర్పడ్డాక చూద్దామని అమెరికా సర్దిచెబుతున్నా అదెప్పటికి సాధ్యమన్నది కీలక ప్రశ్న. జాతుల స్వయంప్రతి పత్తిని గౌరవించాలన్న మౌలిక విధానానికి కట్టుబడి ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని, దాని ఆధ్వర్యంలోనే తమ దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభించాలని కుర్దులు కోరుకుంటున్నారు. వాయిదాలతో పొద్దుపుచ్చడం ఇకపై సాధ్యం కాదని ఆ ప్రాంత దేశాలూ, అమెరికా తదితర అగ్రరాజ్యాలు గుర్తించక తప్పదు. -
కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి దుర్మార్గం
సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిపక్షనేతల అభిప్రాయం చెప్పకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకుని దాడులకు దిగడం దుర్మార్గమని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన శాసన మండలి విపక్షనేత షబ్బీర్ అలీతో కలసి విలేక రులతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కలసి దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రాజెక్టులు నిర్మిం చాలా, వద్దా అని అధికారులు ప్రశ్న అడగడమే సరైందికాదని జానారెడ్డి అన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని ఎవరు అంటారు అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని, భూము లు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు కట్టొద్దనేది కాంగ్రెస్ పార్టీ అభిమతం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం భావ్యంకాదన్నారు. భూముల సమగ్ర సర్వే విధివిధానాలను బయటపెడితే సమాచారం తెలుస్తుందన్నారు. భూ సమగ్ర సర్వేపై తాము కూడా నిర్మాణా త్మక సూచనలు చేస్తామన్నారు. భూముల సర్వేను శాస్త్రీయంగా నిర్వహిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని జానారెడ్డి అన్నారు. పోలీసులకు బుద్ధి రాలేదు: షబ్బీర్ అలీ నేరెళ్ల సంఘటనతోనూ పోలీసులకు బుద్ధి రాలేదని, వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే చెడగొడుతున్నారని శాసనమండలి విపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. పోలీసులను వాడుకుని ప్రజావ్యతిరేక నిర్ణయా లను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణకు పోలీసు లను మోహరించి, ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తున్నదన్నారు. అనుభవరాహి త్యం, మొండితనంతో కేసీఆర్ పాలనకు ఎదు రుదెబ్బలు తగులుతున్నాయన్నారు. భూముల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా ఇప్పుడున్న పదవితో సంతోషం గానే ఉన్నానని సీఎల్పీనేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురు వారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏమోకానీ... బతికే తెలంగాణ ఉంటే చాలునని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే చెప్పానన్నారు. కాగా, పీసీసీ చీఫ్ పదవికోసం ఏనాడూ ప్రయత్నించలేదని, ఇప్పుడూ ప్రయత్నించడంలేదని అన్నారు. ‘సీఎల్పీ నేతగా ఉండి చేయలేనిది పీసీసీ అధ్యక్షుడిని అయ్యి ఏంచేస్తా ?’ అని ప్రశ్నించారు. అందరి అభిప్రా యంతోనే పీసీసీ పనిచేస్తుందన్నారు. ఏ పార్టీలో అయినా కొంతమంది నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉం టాయన్నారు. ఇప్పటిదాకా అధిష్టా నాన్ని ఏ పదవీ అడగలేదన్నారు. అధిష్టానం ఏ బాధ్యతలను అప్పగిం చినా నిర్వహిస్తూ వచ్చానని జానారెడ్డి పేర్కొన్నారు. -
నిర్మల్ ప్రజాభిప్రాయంలో ఉద్రిక్తత
పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలి: కాంగ్రెస్, బీజేపీ నిర్మల్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మల్ జిల్లాలో ప్యాకేజీ–27,28 పనులపై గురువారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనల మధ్య కొనసాగింది. పాలక, ప్రతిపక్షాల వాగ్వాదాలు, తోపులాటలతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.కలెక్టర్ ఇలంబరిది అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ఈఈ భిక్షపతి అభిప్రాయాలు స్వీకరించారు. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ నాయకులు వేదిక వద్ద ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న రైతులు, ప్రజలకు పరిహారం ఇవ్వకుండానే పనులు ఎలా చేపట్టారంటూ నిలదీశారు. ఇంతలో పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేస్తూ వేదిక దగ్గరికి వచ్చారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న సమ యంలో అధికార పక్ష నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మధ్య తోపులాట జరిగింది. గొడవ సద్దుమణగక పోవడంతో కలెక్టర్ పోలీసుల సాయంతో కాంగ్రెస్ నాయకులను బయటకు పంపించారు. బీజేపీ నాయకులు తమ వాణి వినిపించి సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపో యారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బలనిరూపణా.. ప్రజాభిప్రాయ సేకరణా?
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను టీఆర్ఎస్ నేతలు బలనిరూపణ కార్యక్రమంగా మార్చారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బాధితులతో బలవంతంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టిస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టం–2013ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో భూనిర్వాసితులకు నష్టపరిహారాన్ని తగ్గించడం దారుణమని జీవన్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచి, కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతున్న ప్రభుత్వం భూ నిర్వాసితులపై అరాచకాలకు, దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు భేషజాలకు పోకుండా రైతులను ఆదుకోవాలనే, కాపాడుకోవాలనే విశాలమైన దృక్పథంతో ఆలోచించాలని కోరారు. -
ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయించండి
కాళేశ్వరంపై కేంద్రాన్ని కోరిన మర్రి శశిధర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి అజయ్‌నారాయణ్ ఝాను కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. శుక్రవారం అజయ్నారాయణ్ను ఢిల్లీలో కలుసుకున్న శశిధర్‌రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను పాటించడం లేదని వివరించారు. అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక, పర్యావరణ, సామాజిక అభివృద్ధిపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను హైదరాబాద్‌లో కూడా నిర్వహించాల్సి ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 15 ప్రాంతాల జాబితాలో హైదరాబాద్ లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రభావానికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రజాభిప్రాయ సేకరణ జాబితాలో ఉన్న ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి వివరాలు లేని ప్రభావ అంచనా నివేదికను అందుబాటులో ఉంచిందన్నారు. ఈ కారణాల వల్ల అభిప్రాయ సేకరణను వాయిదా వేయించి, ప్రభుత్వం పూర్తిగా నిబంధనలు పాటించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడటం సబబుకాదని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి శశిధర్‌రెడ్డి అన్నారు. -
‘కాళేశ్వరం’పై ప్రజాభిప్రాయ సేకరణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడం లో భాగంగా ఈ నెల 22 నుంచి 26 వరకు 15 జిల్లాల్లోని ముంపు ప్రభావిత గ్రామాల్లో పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుం ది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందేందుకు పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ), పర్యావరణ ప్రభావ నిర్వహణ ప్రణాళిక(ఈఎంపీ)ని తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ వివరాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖలకు అందించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని భూసేకరణ అవస రమైన జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని పీసీబీ సేకరించనుంది. 22న భువనగిరి, మేడ్చల్, నిజామాబాద్, కరీంనగర్, 23న పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, 24న నిర్మల్, జగిత్యాల, మెదక్, 26న భూపాలపల్లి, మంచిర్యాల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంటరీ చేసేందుకు ఇమేజ్లే అడ్వర్టైజింగ్ సంస్థకు రూ.14.41 లక్షల పనులు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. -
ప్రజాభిప్రాయ సేకరణ ఇలాగేనా?
అమరావతి: బలవంతంగా తమ భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని సీఆర్డీఏ అధికారులకు ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. బారికేడ్లు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా అని ప్రశ్నించారు. ఉండవల్లిలో భూసేకరణపై ఆదివారం ఉండవల్లిలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు దాటి ముందుకు వస్తే వారిపై చర్య తీసుకునే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. భూములు ఇవ్వని రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధికారుల తీరుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు పెట్టి ప్రజాభిప్రాయం సేకరించడంపై మండిపడ్డారు. అధికారుల వ్యవహరించిన తీరుకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు చేసినా తమకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని రాజధాని ప్రాంత రైతులు అంటున్నారు.