చంద్రబాబు అభిప్రాయ సేకరణ : హాజరైయ్యే రైతులు ఎవరు? | Chandrababu Naidu referendum | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అభిప్రాయ సేకరణ : హాజరైయ్యే రైతులు ఎవరు?

Published Mon, Nov 17 2014 9:21 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

చంద్రబాబు అభిప్రాయ సేకరణ : హాజరైయ్యే రైతులు ఎవరు? - Sakshi

చంద్రబాబు అభిప్రాయ సేకరణ : హాజరైయ్యే రైతులు ఎవరు?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగే రాజధాని గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ సమావేశానికి వచ్చే రైతులు ఎవరనేది గోప్యంగా ఉంచారు.

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగే రాజధాని గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ సమావేశానికి  వచ్చే  రైతులు ఎవరనేది గోప్యంగా ఉంచారు. రేపు మంత్రి మండలి సమావేశం ముగిసిన తరువాత రాజధాని నిర్మించే గ్రామాల రైతులతో ఆయన సమావేశమవుతారు. అయితే ఆ రైతులు ఎవరనేది గోప్యంగా ఉంచారు.

ఒక్కో గ్రామం నుంచి అయిదుగురు రైతులను తీసుకువెళతారని చెప్పారు. అయితే ఇంతవరకు తమకు ఎటువంటి సమాచారంలేదని రాజధాని ప్రతిపాదిత గ్రామాల ప్రజలు చెప్పారు. ఏ అయిదుగురు రైతులను తీసుకువెళతారనేది గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ఎంపిక చేసిన వారితో అభిప్రాయ సేకరణ ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement