‘కాళేశ్వరం’పై ప్రజాభిప్రాయ సేకరణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడం లో భాగంగా ఈ నెల 22 నుంచి 26 వరకు 15 జిల్లాల్లోని ముంపు ప్రభావిత గ్రామాల్లో పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుం ది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందేందుకు పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ), పర్యావరణ ప్రభావ నిర్వహణ ప్రణాళిక(ఈఎంపీ)ని తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ వివరాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖలకు అందించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని భూసేకరణ అవస రమైన జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని పీసీబీ సేకరించనుంది. 22న భువనగిరి, మేడ్చల్, నిజామాబాద్, కరీంనగర్, 23న పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, 24న నిర్మల్, జగిత్యాల, మెదక్, 26న భూపాలపల్లి, మంచిర్యాల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంటరీ చేసేందుకు ఇమేజ్‌లే అడ్వర్టైజింగ్ సంస్థకు రూ.14.41 లక్షల పనులు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది.