కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి దుర్మార్గం
సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిపక్షనేతల అభిప్రాయం చెప్పకుండా టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుని దాడులకు దిగడం దుర్మార్గమని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన శాసన మండలి విపక్షనేత షబ్బీర్ అలీతో కలసి విలేక రులతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసులు కలసి దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు.
ప్రాజెక్టులు నిర్మిం చాలా, వద్దా అని అధికారులు ప్రశ్న అడగడమే సరైందికాదని జానారెడ్డి అన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని ఎవరు అంటారు అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని, భూము లు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు కట్టొద్దనేది కాంగ్రెస్ పార్టీ అభిమతం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేయడం భావ్యంకాదన్నారు. భూముల సమగ్ర సర్వే విధివిధానాలను బయటపెడితే సమాచారం తెలుస్తుందన్నారు. భూ సమగ్ర సర్వేపై తాము కూడా నిర్మాణా త్మక సూచనలు చేస్తామన్నారు. భూముల సర్వేను శాస్త్రీయంగా నిర్వహిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని జానారెడ్డి అన్నారు.
పోలీసులకు బుద్ధి రాలేదు: షబ్బీర్ అలీ
నేరెళ్ల సంఘటనతోనూ పోలీసులకు బుద్ధి రాలేదని, వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే చెడగొడుతున్నారని శాసనమండలి విపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. పోలీసులను వాడుకుని ప్రజావ్యతిరేక నిర్ణయా లను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణకు పోలీసు లను మోహరించి, ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తున్నదన్నారు. అనుభవరాహి త్యం, మొండితనంతో కేసీఆర్ పాలనకు ఎదు రుదెబ్బలు తగులుతున్నాయన్నారు. భూముల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు.
ఇప్పుడు సంతోషంగానే ఉన్నా
ఇప్పుడున్న పదవితో సంతోషం గానే ఉన్నానని సీఎల్పీనేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురు వారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏమోకానీ... బతికే తెలంగాణ ఉంటే చాలునని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే చెప్పానన్నారు. కాగా, పీసీసీ చీఫ్ పదవికోసం ఏనాడూ ప్రయత్నించలేదని, ఇప్పుడూ ప్రయత్నించడంలేదని అన్నారు. ‘సీఎల్పీ నేతగా ఉండి చేయలేనిది పీసీసీ అధ్యక్షుడిని అయ్యి ఏంచేస్తా ?’ అని ప్రశ్నించారు. అందరి అభిప్రా యంతోనే పీసీసీ పనిచేస్తుందన్నారు. ఏ పార్టీలో అయినా కొంతమంది నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉం టాయన్నారు. ఇప్పటిదాకా అధిష్టా నాన్ని ఏ పదవీ అడగలేదన్నారు. అధిష్టానం ఏ బాధ్యతలను అప్పగిం చినా నిర్వహిస్తూ వచ్చానని జానారెడ్డి పేర్కొన్నారు.