సిద్దిపేట టౌన్ : మెదక్ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ పాలనకు రెఫరెండంగా భావించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట శక్తి గార్డెన్‌లో శుక్రవారం రాత్రి బీజేపీ, టీడీపీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్ పరిపాలన వైఖరిపై ప్రజల అభిప్రాయంగా పరిగణించాలన్నారు. ఉప ఎన్నిక ద్వారా సర్కార్‌కు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
మజ్లిస్ భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మూడు నెలలు దాటినా ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేయలేదని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు తెప్పిస్తానని మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ ఇప్పటి వరకూ ఆ ప్రయత్నమే చేయడంలేదన్నారు.
టీడీఎల్పీ ఉపనేత ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ జగ్గారెడ్డిని చూస్తే టీఆర్‌ఎస్‌కు భయమన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ 2019లో జరిగే చారిత్రాత్మక ఎన్నికలకు మెదక్ ఉప ఎన్నిక రిహార్సల్స్ వంటిదన్నారు. బీజేపీ, టీడీపీ సమన్వయ లోపంతోనే గత ఎన్నికల్లో ఓటమి చెందామని ఇక నుంచి కలిసి పని చేస్తామన్నారు. సమావేశంలో రాజ్యసభ్యురాలు గుండు సుధారాణి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విద్యాసాగర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుండు భూపేష్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సిద్దిపేట మండలం చింతమడక నుంచి వంద మంది యువకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
సభ మధ్యలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేతలు వేదికపైకి వచ్చి జగ్గారెడ్డికి మద్దతిస్తున్నట్లు నినాదాలతో ప్రకటించారు. బీజేవైఎం నేతలు కిషన్‌రెడ్డి, జగ్గారెడ్డిలను ఘనంగా సన్మానించారు. సమావేశంలో బీజేపీ నేతలు వంగరాంచంద్రారెడ్డి, గుండ్ల జనార్దన్, రఘునందన్‌రావు, దూది శ్రీకాంత్‌రెడ్డి, వెన్నెల మల్లారెడ్డి, బొజ్జల రామకృష్ణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళ, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఉప ఎన్నిక కేసీఆర్ పాలనకు రెఫరెండమే..
Published Sat, Sep 6 2014 12:03 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement