TRS rule
-
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: భట్టి
కరకగూడెం/పినపాక: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడతో పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన నిధులతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర సోమవారం భద్రాద్రి జిల్లా పినపాక, కరకగూడెం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని గణాంకాలతో బయటపెడుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార దాహంతో టీఆర్ఎస్లో చేరటం అనైతికమని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. పేదల కష్టాలు తీరేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న అవకతవకలతో ఎంతోమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలు ï -
నేటితో కేసీఆర్ పీడ విరగడ: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దు సిఫారసు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ముగిసినట్లేనని, దీంతో రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ పీడ విరగడైనట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కుంభం శివకుమార్‌రెడ్డి తన అనుచరులతో కలసి మాజీ మంత్రి డి.కె.అరుణ నేతృత్వంలో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఉత్తమ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటివరకు నియంత పాలన కొనసాగిందని, టీఆర్ఎస్ను తరిమికొట్టేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువత, మహిళా, రైతు, నిరుద్యోగ, విద్యార్థుల తోపాటు అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందని గతంలో ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి అనేక పథకాలే నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా శివకుమార్‌రెడ్డికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసుబాబు, సలీంలు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శివకుమార్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలు అభిజయ్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్పై భ్రమలు పోతున్నాయి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనపై అన్నివర్గాలకు భ్రమలు పోయినట్టేనని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేత ఆనందం నేతృత్వంలో పలువురు నేతలు శనివారం టీజేఎస్‌లో చేరారు. జన సమితిలో చేరిన వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలను విస్మరించారని విమర్శించారు. వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందన్నారు. విద్య, వైద్యం వంటి మౌళికరంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఉద్యమంలో అగ్రభాగాన ఉండి, రాష్ట్ర సాధనకోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని కోదండరాం విమర్శించారు. రైతులు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులతోసహా ఏ వర్గం అయినా తమ సమస్యల పరిష్కారంకోసం విన్నవించే అవకాశం, నిరసనను వ్యక్తం చేసే వేదిక కూడా లేకుండా పోయిందన్నారు. ఇంత నియంతృత్వంగా ప్రభుత్వం, పాలన ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, డి.పి.రెడ్డి, వెంకటరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పాలనలో అప్పులు రెట్టింపు
కరీంనగర్ జిల్లా : తెలంగాణలో టీఆర్ఎస్ 34 మాసాల పాలనలో అప్పులు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే మార్చి వరకు అప్పు రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని జోస్యం చెప్పారు. ఆంద్ర గుత్తేదార్ల కొమ్ముకాస్తూ మిషన్ భగీరథ పేరుతో రూ.45 వేల కోట్ల అప్పు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని ఒక్కొక్కరిపై రూ.20 వేలు వెచ్చిస్తున్నారని, మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తే ప్రతి గ్రామానికి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వవచ్చునని వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు, తాగు నీటి కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. నీటి సమస్య పరిష్కారానికి వెంటనే ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటితో చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. -
పాలనలో ప్రజల భాగస్వామ్యముందా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ పాలనలో అసలు ప్రజల భాగస్వామ్యముందా.. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందా.. కనీసం అటువంటి ప్రయత్నమేదైనా జరుగుతుందా..’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. గురువారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ద్రోహులు సీఎం కేసీఆర్‌కు ఆప్తులయ్యారన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీల నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను రాజ్యాంగవిరుద్ధంగా టీఆర్ఎస్లో చేర్చుకున్నారని, పార్టీ ఫిరాయింపుల్లో కేసీఆర్‌కు వంద మార్కులు పడ్డాయని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాక మౌలికమైన మార్పులు సాధించామా? అని ప్రశ్నించుకోవాలన్నారు. -
‘2019లో టీడీపీదే అధికారం’
నకిరేకల్ : 2019 ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. నకిరేకల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత టీఆర్ఎస్ పాలనను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. మాదిగ, మాలలు కోటిమందిపైనే ఉండగా తెలంగాణ మంత్రి వర్గంలో ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు. మహిళలకు కూడా కాబినేట్‌లో అవకాశం లేకపోవడం విచారకరం అన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ పాలనపై ప్రజలు తిరగబడాల్సిన సమయం దెగ్గరలో ఉందన్నారు. ఈ సమావేశంలో నర్సిరెడ్డి, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరవెల్లి చంద్రశేఖర్, బిల్యానాయక్, నాయకులు దైద సుధాకర్, పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, వెంకన్నగౌడ్, యాదయ్య ఉన్నారు. -
వామపక్ష పార్టీల ఐక్య పోరాటం
మంకమ్మతోట : రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సర్వశక్తులు ఒడ్డి విశాలమైన కూటమిని ఏర్పాటు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని వైష్ణవి గార్డెన్స్‌లో జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభలకు ఆదివారం ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉండాలని మంచిపాలన కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పాలన ప్రజలు అనుకున్నట్లుగా ఆశాజనకంగాలేదన్నారు. కేటీఆర్ సీఎం కావాలని, టీఆర్ఎస్ గెలవాలని కోరుకున్న సీపీఎం ఒక్కటేనన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే తీవ్ర వ్యతిరేక వచ్చిందని, కేసీఆర్ హామీలకు.. పొంతన లేదన్నారు. విద్యుత్ కోతలు, బ్యాంకుల రుణాలు లేక, వడ్డీ వ్యాపారుల దోపిడీని తట్టుకోలేక ఐదు నెలల్లో 600 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలు పరిష్కరించకుండా విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. ప్రజలు సుఖంగా ఉండి, రాష్ర్టంలో విద్యుత్ కోతలు లేకుండా సస్యశ్యామలంగా ఉంటే పిలవకుండానే విదేశీ పెట్టుబడులు వస్తాయని అన్నారు. అసెంబ్లీలో మందల కొది ఎమ్మెల్యేలు లేకపోయినా.. మనసున్న పార్టీగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు కుంటుబాలకు రూ. 30 కోట్లు ఇవ్వని కేసీఆర్‌కు బిల్డింగ్‌లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం 1500 ఎకరాలు మాత్రమే ఇచ్చారని, ఇలా చేస్తే 150 ఏళ్లు పడుతుందని విమర్శించారు. భూస్వాముల నుంచి ఆక్రమించుకోలేని ప్రభుత్వం ప్రజలకు భూమి కొని ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదోపపట్టించమేనన్నారు. పరిమితి లేకుండా భూమిని రెగ్యూలరైజ్ చేయాలని ప్రభుత్వం విడుదల చేసిన 59 జీవో ఆక్రమణ దారుల కొమ్ముకాసేలా ఉందన్నారు. కొమురంభీమ్, దొడ్డి కొమురయ్య హతమార్చిన వాడు, చాకలి ఐలమ్మ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నైజాం సర్కార్‌ను గొప్పవాడుగా పేర్కొనడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. ఉద్యమాల ఖిల్లాగా.. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న జిల్లాలో పార్టీ బలహీనపడిందని అన్నారు. కమ్యూనిజం అంటే ప్రజా సంక్షేమమేనని ప్రజా పోరాటాలతో పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు సాగర్, జిల్లా కార్యదర్శి జి.ముకుందరెడ్డి, మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు కొముయ్య, జిల్లా కమిటీ సభ్యులు యాకయ్య, భిక్షమయ్య, సాన అంజయ్య, జ్యోతి, భీమాసాహెబ్, ఎరవెల్లి ముత్యంరావు, భూతం సారంగపాణి, యు. శ్రీనివాస్, పంతంరవి, గుడికందుల సత్యం పాల్గొన్నారు. -
ఉప ఎన్నిక కేసీఆర్ పాలనకు రెఫరెండమే..
సిద్దిపేట టౌన్ : మెదక్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పాలనకు రెఫరెండంగా భావించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట శక్తి గార్డెన్లో శుక్రవారం రాత్రి బీజేపీ, టీడీపీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు టీఆర్ఎస్ పరిపాలన వైఖరిపై ప్రజల అభిప్రాయంగా పరిగణించాలన్నారు. ఉప ఎన్నిక ద్వారా సర్కార్‌కు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మూడు నెలలు దాటినా ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేయలేదని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు తెప్పిస్తానని మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ ఇప్పటి వరకూ ఆ ప్రయత్నమే చేయడంలేదన్నారు. టీడీఎల్పీ ఉపనేత ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ జగ్గారెడ్డిని చూస్తే టీఆర్ఎస్కు భయమన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ 2019లో జరిగే చారిత్రాత్మక ఎన్నికలకు మెదక్ ఉప ఎన్నిక రిహార్సల్స్ వంటిదన్నారు. బీజేపీ, టీడీపీ సమన్వయ లోపంతోనే గత ఎన్నికల్లో ఓటమి చెందామని ఇక నుంచి కలిసి పని చేస్తామన్నారు. సమావేశంలో రాజ్యసభ్యురాలు గుండు సుధారాణి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి విద్యాసాగర్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుండు భూపేష్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సిద్దిపేట మండలం చింతమడక నుంచి వంద మంది యువకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. సభ మధ్యలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేతలు వేదికపైకి వచ్చి జగ్గారెడ్డికి మద్దతిస్తున్నట్లు నినాదాలతో ప్రకటించారు. బీజేవైఎం నేతలు కిషన్‌రెడ్డి, జగ్గారెడ్డిలను ఘనంగా సన్మానించారు. సమావేశంలో బీజేపీ నేతలు వంగరాంచంద్రారెడ్డి, గుండ్ల జనార్దన్, రఘునందన్‌రావు, దూది శ్రీకాంత్‌రెడ్డి, వెన్నెల మల్లారెడ్డి, బొజ్జల రామకృష్ణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళ, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తదితరులు పాల్గొన్నారు.