కరకగూడెం/పినపాక: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడతో పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన నిధులతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర సోమవారం భద్రాద్రి జిల్లా పినపాక, కరకగూడెం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని గణాంకాలతో బయటపెడుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార దాహంతో టీఆర్‌ఎస్‌లో చేరటం అనైతికమని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. పేదల కష్టాలు తీరేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న అవకతవకలతో ఎంతోమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలు ï
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: భట్టి
Published Tue, Apr 30 2019 12:21 AM | Last Updated on Tue, Apr 30 2019 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment