పాలనలో ప్రజల భాగస్వామ్యముందా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్‌ఎస్ పాలనలో అసలు ప్రజల భాగస్వామ్యముందా.. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందా.. కనీసం అటువంటి ప్రయత్నమేదైనా జరుగుతుందా..’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. గురువారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ద్రోహులు సీఎం కేసీఆర్‌కు ఆప్తులయ్యారన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీల నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను రాజ్యాంగవిరుద్ధంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, పార్టీ ఫిరాయింపుల్లో కేసీఆర్‌కు వంద మార్కులు పడ్డాయని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాక మౌలికమైన మార్పులు సాధించామా? అని ప్రశ్నించుకోవాలన్నారు.