State formation day
-
లండన్‌లో ఘనంగా "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు"
లండన్: ఎన్నారై తెరాస, టాక్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కార్యవర్గ కుటుంబసభ్యులతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొన్నారు. లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడుగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకున్నారు. కెసిఆర్ గారి నాయకత్వంలోని మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేసారు. అమరుల ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని రత్నాకర్ తెలిపారు. టాక్ సంస్థ చేస్తున్న సంస్కృతిక సేవా కార్య క్రమాల గురించి వివరించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గసభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహా మండలి చైర్మన్ మట్టా రెడ్డి తెరాస లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి పాల్గొన్నారు. ముఖ్య నాయకులు అబూ జాఫర్ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు. టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుశుమన రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్య చిలుముల, అడ్వైసరి చైర్మన్ మట్టా రెడ్డి, టాక్ మరియు తెరాస నాయకులు మల్లా రెడ్డి , సురేష్ బుడుగం, సత్యపాల్, శ్రావ్య , సుప్రజ , స్వాతి బుడుగం, రవి రెటినేని, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్, అబూ జాఫర్,సృజన్ రెడ్డి,ప్రశాంత్,సురేష్ గోపతి, హరి నవాపేట్, మణి తేజ, నిఖిల్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల రిహార్సల్స్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల డ్రెస్ రిహార్సల్స్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ జూన్ 2న పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్స్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిడ్–19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
62 ఏళ్లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర.. తొలిస్పీకర్‌గా తెలుగు వ్యక్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర అవతరించి మే ఒకటవ తేదీ ఆదివారానికి 62 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు నేడు కార్మిక దినోత్సవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాదాసీదాగా జరిపారు. అయితే ఈసారి కరోనా నియంత్రణలోకి రావడంతో ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హుతాత్మ చౌక్ ముఖ్యంగా మంత్రాలయంతోపాటు అనేక చారిత్రాత్మక భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ ప్రాంతాల్లో ప్రజల కోసం వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హుతాత్మ చౌక్‌ను ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. సంయుక్త మహారాష్ట్ర కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారందరి బలిదానంతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. రాష్ట్రం అవతరించి 63వ ఏట అడుగిడుతున్న సమయంలో వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న మహారాష్ట్ర రాష్ట్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. ఆందోళనలలో పాల్గొన్న తెలుగువారు.. సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సంయుక్త మహారాష్ట్ర కోసం ఉద్యమం 1938లో ప్రారంభమైంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముఖ్యంగా 1955 నుంచి సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాటం ఉధృతమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా 1955 నవంబర్ 21వ తేదీన సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన ఆందోళనలలో ముంబైలోని ఫ్లోరా ఫౌంటన్ (నేటి హుతాత్మ చౌక్) పరిసరాల్లో నాటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి ఆదేశాలమేరకు ఆందోళనకారులపై దారుణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికిపైగా ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన అనంతరం మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా 1956 జనవరిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో 90 మంది అమరులయ్యారు. వీరితోపాటు అనేకమంది బలిదానాలతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. ఈ నేపథ్యంలో సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాడి అమరులైన 105 మంది అమరవీరుల జజ్ఞాపకార్థంగా ఫ్లౌరా ఫౌంటన్ పరిసరాల్లో ‘అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ఫ్లోరా ఫౌంటన్ పేరు మార్చి హుతాత్మ చౌక్‌గా నామకరణం చేశారు. అయితే సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరువీరులందరి కుటుంబీకుల వివరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వద్ద నేటికి లేవని తెలుస్తోంది. మరోవైపు సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలను అర్పించిన 105 మంది అమరవీరులలో ముగ్గురు తెలుగు వ్యక్తులున్నారు. వీరి పేర్లు బాలయ్య, ముత్తన్నలుగా తెలిసింది. అయితే మరో తెలుగు వ్యక్తి కూడా అమరవీరులలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం వివరాలేవి తెలియరాలేదు. పెరిగిన జిల్లాలు.. మహారాష్ట్ర అవతరణ అనంతరం ఇప్పటి వరకు ఒకటి రెండు కాకుండా ఏకంగా 10 జిల్లాలు పెరిగాయి. రాష్ట్రం అవతరించిన సమయంలో 26 జిల్లాలున్న మహారాష్ట్ర ప్రస్తుతం 36 జిల్లాలకు చేరుకుంది. 1981 మేలో జాల్నా, సింధుదుర్గా జిల్లా అవతరించగా 1982 ఆగస్టులో లాతూరు, గడ్చిరోలి జిల్లాలు, 1990 అక్టోబర్‌లో ముంబై సబర్బన్ (ముంబై ఉపనగరం), 1998 జూలైలో వాషీం, నందుర్బార్ జిల్లాలు ఏర్పాటుకాగా చివరగా రెండేళ్ల కిందట 2014 ఆగస్టు ఒకటవ తేదీన ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలిస్పీకర్‌గా తెలుగు వ్యక్తి... సంయుక్త మహారాష్ట్ర అవతరించిన అనంతరం 1960 మే ఒకటవ తేదీ మధ్యాహ్నం నూతన మంత్రిమండలి ఏర్పాటైంది. అయితే రాష్ట్రానికి తొలిస్పీకర్ బాధ్యతలు చేపట్టే గౌరవం తెలుగు వ్యక్తి అయిన సీలం సయాజీరావ్‌కు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. -
అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్!
యుపియా: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో చూస్తే అరుణాచల్‌లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పన సాకారమైందని మోదీ అన్నారు. ‘21వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్యప్రాంతం దేశాభివృద్ధికి ఇంజన్‌లా పనిచేస్తోంది’ అని మోదీ అన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సారథ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింతగా కష్టపడి పనిచేయనుంది అనిమోదీ అన్నారు. ‘అరుణాచల్ అద్భుత ప్రగతి దిశగా అడుగులేస్తోంది. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. -
వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
సాక్షి, అమరావతి : ఐదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 2014 ముందు వరకు జరిగినట్టుగానే నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. దేశం కోసం, రాష్ట్ర కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని మహనీయుల త్యాగాలను గుర్తిస్తూ వారి వారసులను రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించారు. వారికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాలువాలు కప్పారు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు అవంతి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురామ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం ఆదర్శాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం: రేవతి, పొట్టి శ్రీరాములు మనవరాలు ‘మా తాత పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేశారు. మేము హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మమ్మల్ని గుర్తుంచుకుని పిలిచి మరీ సన్మానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. ఈ సన్మానాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. సీఎం ఆదర్శాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం.’ అని రేవతి అన్నారు. -
కలిసికట్టుగా పని చేస్తే బంగారు భవిష్యత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నవరత్నాల అమలుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర అవతరణ వేడుకలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాల అవసరాలు తీర్చడంతోపాటు వారి తర్వాతి తరం వారు కూడా సగర్వంగా తలెత్తుకొని తిరిగేలా నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చెప్పిన మాట ప్రకారం ఐదేళ్ల తర్వాత నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మళ్లీ ఘనంగా నిర్వహిస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కడప కోటిరెడ్డి, దామోదరం సంజీవయ్య, గౌతు లచ్చన వంటి ఎందరో మహానుభావులు, కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సాహితీవేత్తలు, పాత్రికేయుల భావాలు అందరికీ ఆదర్శమని ముఖ్యమంత్రి కొనియాడారు. ‘విద్య, వైద్య, వ్యవసాయం’ రూపురేఖలు మార్పడానికే నవరత్నాలు 1956 నుంచి 2014 వరకూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తరువాత 2014లో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో వేరుగా ప్రయాణిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. 13 జిల్లాల ప్రజలు చేసిన శ్రమ అంతా చెన్నై, హైదరాబాద్‌లో మిగిలిపోయిందని పేర్కొన్నారు. 2009 సెప్టెంబర్ 2 వరకూ.. అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ రాష్ట్రం విడిపోయే పరిస్థితులు వస్తాయని ఎన్నడూ ఊహించలేదన్నారు. విభజన తర్వాత ఏ రాష్ట్రం కూడా దగా పడని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదని, వెనకడుగు వేయలేదని, వెన్ను చూపలేదని అన్నారు. అభివృద్ధి తప్ప మన ముందు మరో మార్గం లేదన్నట్లుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. మన రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ సౌధాన్ని పునర్నిర్మిస్తున్నామని వివరించారు. వెనుకబాటుతనం, పేదరికం, నిరక్షరాస్యతను నిర్మూలిస్తేనే మనం ఒక జాతిగా పైకి ఎదుగుతామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్పడం కోసం ఉద్దేశించినవే నవరత్నాలని చెప్పారు. మహనీయుల స్ఫూర్తితో మనమంతా కలిసికట్టుగా కష్టపడితే మంచి రోజులు తప్పక వస్తాయన్నారు. దేవుడి ఆశీర్వాదం, ప్రజలందరి చల్లని దీవెనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తోంది గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వెల్లడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుగు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, పూర్తి నిబద్ధత, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం, వికేంద్రీకృత పరిపాలనతో నూతన రాష్ట్రాన్ని అద్భుతంగా నిర్మించుకోగలరనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఆంధ్రులు ఎంతో ఘనమైన చరిత్ర గలిగిన వారని అన్నారు. అభివృద్ధి చెందాలనే తపన వారి రక్తంలోనే ఉందన్నారు. ఆయన విజయవాడలో రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో ప్రసంగించారు. ‘‘సభికులందరికీ నమస్కారం.. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి, బెజవాడ శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. గొప్ప చరిత్ర, సంస్కృతి, వారసత్వాలు కలిగిన రాష్ట్రానికి తాను గవర్నర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. చారిత్రకంగా ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉందని గుర్తుచేశారు. ఆంధ్రులు భారతీయతలో తమదైన ప్రత్యేకత పొందారని ప్రశంసించారు. -
‘కలిసి ముందుకు సాగుదాం.. అభివృద్ధి సాధిద్దాం’
సాక్షి, విజయవాడ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కలిసి ముందుకు సాగి అన్నింటినీ అధిగమించి అభివృద్ధిని సాధిద్దామని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అవరతణ దినోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తెలుగు తల్లికి, తెలుగు నేలకు, తెలుగువారికి వందనాలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్షకు దిగారని.. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పోరాడిన అందరినీ స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. సంఘ సంస్కర్తలు, కవులు, కళాకారులు మన సమాజానికి పునాదులని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన శ్రమ, పరిశ్రమ హైదరాబాద్‌లోనే మిగిలిపోయిందని అన్నారు. ప్రస్తుతం దగాబడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెనకడగు వేయకుండా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని తెలిపారు. వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నిర్మూలిస్తేనే అభివృద్ధిలో ముందుకెళ్తామని తెలిపారు. పాలనలో నవరత్నాలతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. కలిసికట్టుగా ఇప్పుడు కష్టపడితే.. భవిష్యత్‌కు బంగారుబాటలు వేయగలమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి గవర్నర్‌గా రావడం నా అదృష్టం : బిశ్వభూషణ్ ఏపీకి గవర్నర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యం ఉన్న రాష్ట్రం. పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్పనేల. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన నేతలు గొప్ప పోరాటం చేశారు. సాతంత్ర్య పోరాటంలో చీరాల-పేరాల ఉద్యమం ఎప్పటికీ మరువలేనిది. విజయవాడ నగరాన్ని మహాత్మాగాంధీ ఆరుసార్లు సందర్శించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. భాషాప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు ఉంది. విజయవాడ వాసి పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపొందించి గర్వకారణంగా నిలిచార’ని తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ ఘనంగా సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతల్లో పొట్టి శ్రీరాములు మనవరాలు, పింగళి వెంకయ్య మనవరాలు, టంగుటూరి ప్రకాశం పంతులు మనువడు, మన్నెం దొర అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులు, వావిలాల గోపాలకృష్ణయ్య కుటుంబసభ్యులు, కడప కోటిరెడ్డి కుటుంబసభ్యులు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు కుటుంబసభ్యులు, పల్నాటి సింహం కన్నెగంటి హనుమంతు కుటుంబసభ్యులు, ఆచార్య ఎంజి రంగా కుటుంబసభ్యులు, ఏపీ తొలిదళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులు ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మూడు రోజులపాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
-
నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలను శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు తొలి రోజు శుక్రవారం ముఖ్య అతిథులుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమరజీవిపొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్ల విరామం తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించకుండా రాష్ట్ర విభజన తేదీ జూన్ 2 నాడు నవనిర్మాణ దీక్షలు పేరుతో ఆర్భాటం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ బ్రాండ్ ఇమేజ్ కొనసాగించాలంటే నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనితో పాటు స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను ఘనంగా సన్మానించనున్నారు. రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కోటిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు, బంధువులను ఈ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళల ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రసిద్ధ వంటకాలతో 25 ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకుల కోసం.. వేడుకలను చేనేత కార్మికులు, కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దానికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సందర్శకుల కోసం వివిధ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రం అన్నిరంగాల్లో పురోభివృద్ధి సాధించాలి సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని వారు గురువారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందాలని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని వారు ఆకాక్షించారు. -
నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం
-
‘కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లిలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడు, మందాజగన్నాదం, తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి జెండా ఎగురవేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తుందన్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఒక్క మత కలహాల ఘటన జరగలేదని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మతసామరస్యాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. తెలంగాణ ప్రజలను బాధపెట్టే ఇలాంటి ప్రకటనలు చేయకూడదని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పధకాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రత్యేక ప్రతినిధులు సందర్శించారు. -
కేంద్రమంత్రిగా నా వంతు కృషి చేస్తాను : కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘అన్ని వర్గాల, పక్షాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ఉద్యమంలో కలిసి పనిచేసిన స్పూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ అభివ ద్ధిలో కూడా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని నా విజ్ఞప్తి. ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఉటంకించిన సమాఖ్య స్ఫూర్తితో రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలు ఆధారంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. అందుకు కేంద్రమంత్రిగా నా వంతు కృషి చేస్తానని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా’అని ప్రకటనలో తెలిపారు. -
జయ.. జయహే తెలంగాణ
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాల అనంతరం ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న అవతరించిన తెలంగాణ రాష్ట్రం నేడు ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో వసంతంలోకి అడుగిడుతోంది. ఆవిర్భావ సమయంలో ఉత్పన్నమైన భయాలు, ఆందోళనలు, అనుమానాలను విజయవంతంగా అధిగమించిన తెలంగాణ... నేడు పలు రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా దూసుకుపోతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల సమ్మేళనంతో పాలనలో కొత్త ఒరవడి సృష్టించింది. – సాక్షి, హైదరాబాద్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి కార్యాచరణ... తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆవిర్భావం రోజునే బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతి కార్యాచరణతో కొత్త రాష్ట్రం నిర్మాణానికి పునాదులు వేశారు. కేసీఆర్ మానస పుత్రికలైన రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి బృహత్తర పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమయ్యాయి. గత డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల్లో విజయదుందుభి మోగించి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడానికి దోహదపడ్డాయి. రైతుబంధు, రైతు బీమా పథకాలు ఐక్యరాజ్యసమితి ప్రశంసలను సైతం అందుకున్నాయి. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి సంచలన నిర్ణయాలు యావత్ దేశం దృష్టిని రాష్ట్రంవైపు ఆకర్షింపజేశాయి. కోటి ఎకరాల సాగునీటి సరఫరా కల దిశగా... సీఎం కేసీఆర్ స్వీయ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా కలను సాకారం చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. పాలనా సంస్కరణల కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, కొత్త పురపాలికల ఏర్పాటు చేయడంతో రాష్ట్రం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్ర శాసనసభ 2018 మార్చిలో ఆమోదించిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో రాష్ట్రంలోని 1,177 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీ హోదా వరించింది. పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్–ఐపాస్ పారిశ్రామిక విధానం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంది. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఆతిథ్యమిచ్చి యావత్ ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. విద్య, ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పించేందుకు కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఆదాయ వృద్ధిలో అగ్రగామి... ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా కొనసాగుతోంది. 2014–18 కాలంలో 17.17 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ముగిసే నాటికి 29.93 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. సంక్షేమ రాజ్యం... సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏటా రూ.40 వేల కోట్లను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు అండగా మారాయి. రాష్ట్ర ఆవిర్భావానికి తొలి ఏడాదే వృద్ధాప్య పింఛన్‌ను రూ. 200 నుంచి రూ. వెయ్యికి, వికలాంగులు, పేద వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ. 500 నుంచి రూ. 1,500కు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల తొలి ఐదేళ్లు ఏటా రూ. 5,013.91 కోట్లు ఖర్చు అయింది. సామాజిక భద్రత కోసం అందిస్తున్న పింఛన్లకు వార్షిక ఆదాయ, వయో అర్హత నిబంధనలను సర్కారు సడలించింది. 2018–19లో 39,32,726 మందిగా ఉన్న పింఛనర్ల సంఖ్య ఈ నిర్ణయంతో 47,88,070కు పెరగనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని రకాల పింఛన్లను జూన్ నెల రెట్టింపు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వృద్ధుల పింఛన్లు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళల భృతి రూ. 1000 నుంచి రూ. 2016కు పెరగనుంది. అలాగే వికలాంగులు రూ. 3,016, బోదకాలు బాధితులు రూ. 2,016 పింఛను అందుకోనున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ. 6,787 కోట్ల అదనపు భారం పడనుంది. పింఛన్ల పంపిణీకి ఏటా రూ. 11,843 కోట్ల వ్యయం కానున్నది. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో 2019 ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పెన్షన్లర్ల సంఖ్య 21,60,275కి చేరింది. పేదల ఇంట కల్యాణలక్ష్మి... పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కల్యాణలక్ష్మి ద్వారా 3,56,997 మంది ఎస్సీ, ఎస్టీ, బిసీ, ఈబీసీ లబ్ధిదారులు, షాదీ ముబారక్ ద్వారా 1,09,732 మంది మైనారిటీ వర్గాల పేద ఆడపిల్లలకు ప్రభుత్వం రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇందుకు రూ. 3,750 కోట్లు ఖర్చయింది. 2018 మార్చి నుం చి ప్రభుత్వం ఈ పథకాల కింద అందించే ఆర్థిక సాయాన్ని రూ. 1,00,116కు పెంచింది. పేద విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం... మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్రంలో 3,854 సంక్షేమ హాస్టళ్లలో ఉన్న 7.95 లక్షల మంది విద్యార్థులకు, 28,623 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 23,87,751 మంది విద్యార్థులకు ప్రతి నెలా 12 వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని 16 సంక్షేమ విభాగాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రైవేటుకు దీటుగా గురుకుల విద్య... విద్యాభివృద్ధిలో తెలంగాణ గురుకుల పాఠశాలలు అద్భుత పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 298 (261+37 జనరల్) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఉండగా, గత ఐదేళ్లలో 661 (608 స్కూళ్లు + 53 డిగ్రీ కాలేజీలు) కొత్త గురుకులాలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 959 (906+53 డిగ్రీ కాలేజీలు)కు పెరిగింది. 2018–19 బడ్జెట్లో గురుకులాలకు రూ. 2,283 కోట్లు కేటాయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 8,434 మంది గురుకుల ఉపాధ్యాయులు కొత్తగా విధుల్లో చేరనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకుల విద్యార్థులు ఫలితాలను సాధిస్తున్నారు. రైతన్న కోసం విప్లవాత్మక పథకాలు... రైతన్న సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక పథకాలను అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులపాలు కాకుండా 2018 మేలో ప్రారంభించిన రైతుబంధు పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటల కోసం రెండు విడతల్లో ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 8 వేలు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు పెంచడంతో రైతు ఎకరాకు ఏటా రూ. 10 వేల సాయాన్ని అందుకోనున్నాడు. వానాకాలంలో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలైతే యాసంగిలో 31.92 లక్షల ఎకరాలు. 2018–19 ఖరీఫ్‌లో 51.50 లక్షల మంది రైతులకు రూ. 5,260.94 కోట్లు, రబీలో 49.03 లక్షల మంది రైతులకు రూ. 5,244.26 కోట్లు అందజేశారు. అన్నదాతకు మరిన్ని మేళ్లు... - రాష్ట్రంలోని 57 లక్షల మంది రైతుల్లో అర్హులైన 50 లక్షల మందికి రూ. 5 లక్షల వ్యక్తిగత జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా సొమ్ము అందిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేలకుపైగా రైతు కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధి పొందాయి. - రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాలుగు విడతల్లో రూ. 16,124.37 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో 35,29,944 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఎన్నికల హామీ మేరకు 2018 నాటికి ఉన్న వ్యవసాయ రుణాల మాఫీ కోసం 2019–20 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,000 కోట్లు కేటాయించింది. దీనివల్ల సుమారు 48 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 30 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. 2014లో రుణమాఫీ పొందిన వారికంటే ఈసారి 12.69 లక్షల మంది అదనంగా రుణమాఫీ పొందనుండటం విశేషం. సాగునీరు... తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువు, వలసలను నివారించడానికి ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరు చొప్పున రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఐదేళ్లలో 11.91 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 50 వేల కోట్లకుపైనే ఖర్చు చేసింది. గోదావరి, కృష్ణా నదుల్లో రాష్ట్ర వాటా 1,250 టీఎంసీలు. మరో 150 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోవడానికి కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రైతులకు జీవధారగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు సీఎం కేసీఆర్ స్వీయ పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రూ. 80,190 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 235 టీఎంసీల నీళ్లను మళ్లించనున్నారు. గోదావరి నుంచి 90 రోజులపాటు రోజూ మూడు టీఎంసీల చొప్పున నీటిని మళ్లించి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి. ఇంటింటికీ రక్షిత మంచి నీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సైతం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది చివరిలోగా పనులు పూర్తి కానున్నాయి. పరిశ్రమలు, ఐటీ, విద్యుత్ రంగాలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని రాష్ట్రం ఆరు నెలల్లోనే అధిగమించింది. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో కోతలులేని నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2019 మార్చి నాటికి రూ. 1,58,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్లైన్ విధానం ద్వారా 9,395 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. 2.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2013–14లో రూ. 52.25 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు 2018–19 నాటికి రూ. 1,09,219 కోట్లకు చేరాయి. 2018–19 నాటికి 1,500 ఐటీ/ఐటీఈఎస్ కంపెనీల్లో 5,43,033 మందికిపైగా ప్రత్యక్షంగా, 7 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఉద్యోగాల భర్తీ... రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 1,59,116 ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం... ఇప్పటివరకు 91,790 మందికి ఉద్యోగాలిచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా 17,038, సింగరేణిలో 11,106, ఆర్టీసీలో 5,157, పోలీసుశాఖలో 10,980, వైద్య ఆరోగ్యశాఖలో 1,514, పంచాయతీ కార్యదర్శులు 9,355, వర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో 9,614 ఉద్యోగాల భర్తీని పూర్తి చేసింది. కేసీఆర్ పాలన న భూతో న భవిష్యత్... కేసీఆర్ ఐదేళ్ల పాలన ఓ అద్భుతం. అనన్య సామాన్యం. న భూతో న భవిష్యత్. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణమైన పాలన సాగుతోంది. తెలంగాణ అవసరాలు, సమస్యలు తెలిసిన కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సాగిస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు బీమా, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్ల వంటి అనేక పథకాలు దేశంలోనే ప్రశంసలు అందుకున్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన, చెప్పని పథకాలనూ అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ది. గత ఐదేళ్లలో శాంతిభద్రతలు మెరుగయ్యాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. ప్రపంచం దృష్టి అంతా హైదరాబాద్ మీదే ఉంది. తండాలు గ్రామ పంచాయతీలయ్యాయి. గ్రామాల్లో మౌలికవసతులు పెరిగాయి. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రగతికి బాటలు పడ్డాయి. బంగారు తెలంగాణలో ప్రజలంతా భాగస్వాములవుతున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తై రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి 5 ఏళ్లలోనే 70 ఏళ్ల పనులు... గత 70 ఏళ్లలో చేయని ఎన్నో గొప్ప పనులు గత ఐదేళ్లలో జరిగాయి. రైతుల సంక్షేమం, విద్యుత్ సరఫరా, సంక్షేమ వసతి గృహాలు, ఉద్యోగులకు తొలి పీఆర్సీ అమలు వంటి అద్భుత కార్యక్రమాలే దీనికి నిదర్శనం. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ కూడా రాకపోయేది. ఇప్పుడు 24 గంటల సరఫరా జరుగుతోంది. పేద విద్యార్థులకు దొడ్డు బియ్యం అన్నానికి బదులు సన్న బియ్యం భోజనం, కల్యాణలక్ష్మి కింద రూ. లక్ష ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు కేవలం రాష్ట్రంలోనే అమలవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 50 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఉమ్మడి ఏపీలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పదేళ్లు కొట్లాడితే సర్వే కోసం రూ. 7 కోట్లే కేటాయించారు. తెలంగాణ వచ్చాక రూ. 10 వేల కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి జరగనుంది. – శ్రీనివాస్‌గౌడ్, ఆబ్కారీ, పర్యాటకశాఖల మంత్రి దేశానికి కేసీఆర్ పథకాలు ఆదర్శం... రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం. 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో రాష్ట్రం సుభిక్షమైంది. రైతుబంధు పథకం అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. ఐక్యరాజ్య సమితి సైతం దీన్ని ప్రశంసించింది. రైతులెవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే రైతు బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందుతుంది. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసినట్లయింది. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం దృష్టిని ఆకర్షించారు. దేశం తెలంగాణవైపు చూస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడే సీఎం కావడం వల్ల ప్రజల కష్టాలన్నీ తీరుతున్నాయి. కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమనే చెప్పాలి. – తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధకశాఖ మంత్రి -
ఉపాధి కల్పనలో ‘ఐటీ’ మేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లుగా సాధించిన పురోగతి నివేదికను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ విభాగం వివిధ రంగాల్లో మెరుగైన సేవల కోసం చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఈ నివేదికలో వివరించారు. ‘రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులను రెండేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత నాలుగేళ్లలో జాతీయ స్థాయిలో 170 శాతం వృద్ధి కనిపించగా రాష్ట్రంలో 190 శాతం మేర వృద్ధి నమోదైంది. ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య త్వరలో 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఐటీ రంగానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన టీ–హబ్, టాస్క్, టీ–సాట్, టీ–ఫైబర్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు లక్ష్యాలకు మించి ఫలితాన్ని ఇస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్సార్) మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి టీ–సిగ్ (తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్)ను ఐటీ విభాగానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తాం’అని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో 5.43 లక్షల ఉద్యోగాలను సృష్టించగా గతేడాది ఏకంగా 67,725 మంది వృత్తి నిపుణులకు కొత్తగా అవకాశం లభించిందన్నారు. ఐటీ పురోగతి నివేదికలో పేర్కొన్న అంశాలివీ - మెరుగైన పౌర సేవలు అందించేందుకు ‘మీ సేవ’అధునాతన వెర్షన్‌ను సిద్ధం చేశాం. ఆధార్ అనుసంధాన చెల్లింపుల విధానం (ఏఈపీఎస్)లో మీ సేవ కేంద్రాల్లో నగదు డ్రా చేసుకునే వీలుంటుంది. ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ)లో భాగంగా రూపొందించిన రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ద్వారా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే విధానం సత్ఫలితాలిస్తోంది. - నాస్కామ్ ఫౌండేషన్ రూపొందించిన టెక్నాలజీ ఎంపవరింగ్ గర్ల్స్ (టెగ్) ద్వారా 66 మంది బాలికలకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ విభాగాలు ఐటీ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. - ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్ స్టార్టప్స్‌కు సంబంధించి 78 వేల చదరపు అడుగుల్లో దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ సెంటర్ (టీ–వర్క్స్)ను ఐటీ విభాగం గతేడాది ప్రారంభించింది. - రాష్ట్ర ప్రభుత్వ శాటిలైట్ నెట్వర్క్ ‘టీ–శాట్’ద్వారా 4,612 కార్యక్రమాలను ప్రసారం చేయగా 2.39 లక్షల మంది వీక్షించారు. టీ–శాట్ యూట్యూబ్ చానల్‌కు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. - ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ‘టీ–వెబ్’ద్వారా సగటున ప్రతి నెలా 3 కోట్ల మందిని చేరుతోంది. - తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ద్వారా టైర్–2, టైర్–3 పట్టణాల్లో ఐటీలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తుండగా ఇప్పటివరకు 12 జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. - కార్మిక, పోలీసులు, స్త్రీ నిధి, ఆర్టీసీ, డెయిరీ, పౌర సరఫరాలు, జేఎన్టీయూ తదితర విభాగాల సేవలను ఒకేచోటకు తెస్తూ గతేడాది ప్రారంభించిన ‘టీ–వ్యాలెట్‘ద్వారా 2018–19లో రూ. 1,202 కోట్ల విలువ చేసే 28.8 లక్షల లావాదేవీలు జరిగాయి. 1.72 లక్షల మంది తమ వివరాలను వ్యాలెట్‌లో నమోదు చేసుకున్నారు. - నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘టీ–హబ్’కొత్త ఆవిష్కరణలు, కొత్త వ్యాపార నమూనాలు రూపొందించడంలో విజయవంతమైంది. - ‘టాస్క్’ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది యువత ఏడాది కాలంలో వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ పొందారు. - ఆవిష్కరణ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ‘వీ హబ్’ద్వారా శిక్షణ, అవకాశాల కల్పన తదితరాలపై మద్దతు ఇస్తుండగా 245 మంది వారి ఆలోచనలు పంపారు. వాటిలోంచి 26 వినూత్న ఆలోచనలను ఎంపిక చేశారు. మహిళా ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు యూఎస్ ఇండియా కౌన్సిల్, ప్రాక్టర్ అండ్ గాంబుల్ సహకారంతో ‘బిజ్ అరెనా’పేరిట పోటీ నిర్వహించింది. -
నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఐదు వసంతాలు పూర్తిచేసుకుని ఆరో వసంతంలో అడుగిడింది. ఎన్నో పోరాటాలు, ఎందరో బలిదానాల ప్రతిఫలంగా 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. ఆదివారం ఐదో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో జూన్ 3న 1001 మంది కళాకారులతో పేరిణి మహా నృత్య ప్రదర్శన, 4న 5 వేల మంది కళాకారులతో ఒగ్గు డోలు మహా విన్యాసాన్ని ప్రదర్శించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు.. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సైతం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించే బాధ్యతను రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్ (ఖమ్మం), ఈటల రాజేందర్ (కరీంనగర్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్), మల్లారెడ్డి (మేడ్చల్), ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్), వి.ప్రశాంత్‌రెడ్డి (నిజామాబాద్), జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), నిరంజన్‌రెడ్డి (వనపర్తి), దయాకర్‌రావు (వరంగల్ అర్బన్), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్ లక్ష్మణ్ (జయశంకర్ భూపాలపల్లి), ఏకే గోయల్ (కొమురంభీం ఆసిఫాబాద్), ఏకే ఖాన్ (మహబూబాబాద్), రాజీవ్ శర్మ (మంచిర్యాల), అనురాగ్ శర్మ (నాగర్ కర్నూల్), డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నల్లగొండ), ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (వరంగల్ రూరల్), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్ (జోగులాంబ గద్వాల), దఫేదార్ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్), బాలు నాయక్ (యాదాద్రి భువనగిరి) ఆయా జిల్లాల్లో జరిగే రాష్టర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వినూత్నంగా ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవం అనగానే సీఎం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం, జెండా ఆవిష్కరించడం, సీఎం ప్రసంగం, ఎట్‌హోం కార్యక్రమంలాంటి పలు అధికారిక కార్యక్రమాలు అందరికీ గుర్తుకు వస్తాయి. వాటితో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భాషా సాంస్కృతిక శాఖ విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్, జూబ్లీహాల్, రవీంద్రభారతిలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కవి సమ్మేళనం, ఒగ్గుడోలు కళాకారుల నృత్యం, కూచిపూడి నృత్యం, జయజయహే తెలంగాణ నృత్య రూపకం, పేరిణి నృత్యం, ఒడిస్సీ నృత్యం, అవతరణ ఫిల్మోత్సవం, షార్ట్‌ఫిల్మ్‌ల స్క్రీనింగ్ వంటి పలు కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూలతో అలంకరించిన అమరవీరుల స్తూపం 48 గంటల ‘ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్’ ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్‌కి పదును పెట్టుకుంటూ కొత్త కథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కేంద్రంగా సినీవారం, సండే సినిమా కార్యక్రమాలను రూపొందించారు. ప్రతిఏటా నిర్వహించే పోటీలా కాకుండా ఈ సంవత్సరం అవతరణ ఫిల్మోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 48 గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ మారథాన్ గతనెల 24 సాయంత్రం 7 గంటలకు మొదలై 26 సాయంత్రం ఏడు గంటలకి ముగిసింది. భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్ లేదా కేరెక్టర్ని వాడి నాలుగు నుంచి ఎనిమిది నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయడం ఇందులో ప్రత్యేకత. విజేతలకు జూన్ 3న రవీంద్రభారతి లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. మాధ్యమాల ద్వారా చేరువవుతున్న తెలంగాణ సంస్కృతి ప్రజలకు తొందరగా చేరువయ్యే ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు యువత తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్ప డానికి కృషిచేస్తున్నారు. గానం, నృత్యం, హావభావాలు, వేషధారణ వంటి అంశాలు ప్రస్ఫుటంగా కనిపించేలా షార్ట్‌ఫిల్మ్ తీయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న నెటిజన్ల సంఖ్య, యూట్యూబ్, అంతర్జాలవాడకం వం టి పలు అంశాలను పరిగణనలోకి తీసు కుని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి సంవత్సరం జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ‘ఫిల్మోత్సవం’పేరిట షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. ఈసారి భిన్నంగా వేడుకలు ‘‘రవీంద్ర భారతిలో మూడు రోజులపాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మొదటిరోజు అవార్డుల కార్యక్రమం, రెండోరోజు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యం, గానం, అదేవిధంగా సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, తెలంగాణ గీతాలు, జూన్ 2న ఉదయం కవిసమ్మేళనం, సాయంత్రం చైతన్య గీతాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రతియేటా నిర్వహించే అవతరణ దినోత్సవానికి కొంచెం భిన్నంగా 48 గంటల్లో ఫిల్మ్‌మేకింగ్ ఛాలెంజ్‌ని నిర్వహించాలనుకున్నాం. ఔత్సాహిక యువత తమ ప్రతిభను మెరుగుపరచడానికి సినీవారం, సండేసినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. వారి ప్రతిభను నిరూపించుకునేందుకు ఆసక్తిగల సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.’’ –మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూడాలన్నారు. ‘ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలమానం. రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ నిబద్ధతతో, పారదర్శకంగా అందరికీ అందేలా చూడాలి. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని అన్నారు. -
అన్ని జిల్లాల్లో ‘అవతరణ’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర అవతరణ దిన వేడుకలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, జెండావిష్కరణ చేసే వారి పేర్లను ఆయన ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని జెండావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొంటారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్ (ఖమ్మం), ఈటల రాజేందర్ (కరీంనగర్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్), మల్లారెడ్డి (మేడ్చల్), ఐకే రెడ్డి (నిర్మల్), వి.ప్రశాంత్‌రెడ్డి (నిజామాబాద్), జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), నిరంజన్‌రెడ్డి (వనపర్తి), దయాకర్ రావు (వరంగల్ అర్బన్), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్ లక్ష్మణ్ (జయశంకర్ భూపాలపల్లి), ఏకే గోయల్ (కొమురంభీం ఆసిఫాబాద్), ఏకే ఖాన్ (మహబూబాబాద్), రాజీవ్ శర్మ (మంచిర్యాల), అనురాగ్ శర్మ (నాగర్ కర్నూల్), డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నల్లగొండ), ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (వరంగ్ రూరల్), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్ (జోగులాంబ గద్వాల), దఫేదార్ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్), బాలు నాయక్ (యాదాద్రి భువనగిరి)లు ఆయా జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో పాల్గొననున్నారు. -
పబ్లిక్‌గార్డెన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవాన్ని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని ముఖ్యమం త్రి కేసీఆర్ నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న పబ్లిక్ గార్డెన్‌లోనే ఉమ్మడి ఏపీ తొలి ఆవిర్భావ దినోత్సవం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల లో సమైక్య పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం ఎడారిగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వా త కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ మనోహర్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ ప్రసాద్, పోలీసు అధికారులు, ప్రోటోకాల్ అధికారులు రాజ్ కుమార్, రామయ్య పాల్గొన్నారు. -
ఇబ్బందులు కలగని రీతిలో ఉత్సవాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగని రీతిలో, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు ఎలాంటి యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రస్తుత పద్ధతిలోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయంపై సమావేశంలో చర్చించారు. ‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న జరుగుతుంది. ఆ రోజు విపరీతమైన ఎండ, వడగాడ్పులు ఉంటాయి. ఈ సమయంలో విద్యార్థులను ఇళ్ల్ల నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఎండలో కవాతు చేయడం వల్ల పోలీసులు, విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయి. పరేడ్ గ్రౌండ్ కూడా ఉత్సవాల నిర్వహణకు అనువుగా లేదు’’అని అధికారులు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీ హాల్‌కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రతిపాదించారు. ఇతర అధికారులూ దీన్ని అంగీకరించారు. పోలీసులు, విద్యార్థులతో కవాతు జరిపే పద్ధతికి చాలా రాష్ట్రాలు స్వస్తి పలికాయని, తెలంగాణలోనూ వాటిని మినహాయించడం సముచితమని చెప్పారు. పతాకావిష్కరణ, ముఖ్యఅతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు జరపాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం నాటి సమీక్షలో వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర పండుగలు ఎక్కడ నిర్వహించాలి? ఎలా జరపాలి? ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయాలు, పద్ధతుల్లో ఏమైనా మార్పులు అవసరమా? అనే అంశాలపై సీనియర్ అధికారులతో చర్చించి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సీఎఎస్ ఎస్.కె..జోషిని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం ఖరారు వచ్చే నెల 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంనాటి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ఉదయం 9 గంటల నుంచి వరుసగా పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, సీఎం సందేశం తదితర కార్యక్రమాలుంటాయి. 10.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎట్ హోం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాలులో తెలంగాణ రాష్ట్ర అవతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. అవతరణ ఉత్సవాలకు స్వాతంత్య్ర సమరయోధులను, ప్రజాప్రతినిధులను, ముఖ్యమైన ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కారు ప్రయాణం @ 17
-
ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఆర్కే కళాశాలలో విద్యార్థులకు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్మోహన్ మాట్లాడుతూ దేశ రక్షణలో యువత పాత్ర వహించాలన్నారు. కార్యక్రమంలో అడ్వొకేట్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటి సభ్యుడు బాల్‌రాజ్, నాయకులు స్వామి, నరేందర్‌రెడ్డి, రాహుల్, నారాయణ, నరేశ్, రాజాగౌడ్, అనిల్, ప్రవీన్, భాను తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జెండా ఆవిష్కరణ దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఏబీవీపీ నాయకు లు జెండాను ఎగురువేశారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సమక్షంలో జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు కళాశాల ఆవరణలో స్వచ్చభారత్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏబీవీపీ మండల ప్రతినిధులు మనిదీప్, రణదీర్, రాజు, వేణులు పాల్గొన్నారు. -
జనం సొమ్ముతో స్వీయ భజన
జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నాయ కుడని గెలిపిస్తే నాలుగేళ్ళు గడిచినా వీసమెత్తు పని చెయ్యలేదన్న సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ధ్రువీకరించదల్చుకున్నట్టు కనిపిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఏటా ఒక వారం రోజుల పాటు ప్రజా ధనం వెచ్చించి నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలే అందుకు నిదర్శనం. అసలు ఈ దీక్షలు ఇందుకోసం అన్న స్పష్టత బాబుకు అయినా ఉందా అన్న అనుమానం తాను ఈ సంద ర్భంగా చేసే ప్రసంగాలను వింటే అనిపిస్తుంది. తెలంగాణా ఏర్పడ్డాక ఆ రాష్ట్రం జూన్ రెండున అవ తరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నది. తెలంగాణా పోగా మిగిలిన ఏపీకి కూడా ఒక అవతరణ దినోత్సవం ఉండాలి కదా? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ విషయంలో కేంద్ర హోం శాఖను స్పష్టత కోరగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన 1956 నవంబర్ ఒకటినే అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం సూచించింది. నిజానికి అదే ఏపీకి అవతరణ దినోత్సవం జరుపుకోడానికి సరైన తేదీ ఎందుకంటే విడిపోయింది తెలంగాణా ప్రాంతం కానీ ఏపీ కాదు. పోనీ పూర్వపు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకొన్న సందర్భంగా నిర్ణయమైన తేదీ కాబట్టి ఇప్పుడు నవం బర్ ఒకటిని ఎలా అవతరణ దినోత్సవంగా పరిగణి స్తామనే అభ్యంతరం ఉంటే మద్రాసు ప్రావిన్స్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన 1953 అక్టోబర్ ఒకటి అయినా అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక తేదీన తప్ప కుండా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగా ల్సిందే. ఏపీ ప్రజలు మాత్రం గత నాలుగేళ్ళుగా అవ తరణ దినోత్సవాలు జరుపుకునే అవకాశాన్ని కోల్పో యారు. పెద్ద రాష్ట్రాలు విడిపోవడం భారతదేశంలో ఇవాళ కొత్తగా జరుగుతున్నది కాదు. గతంలో కూడా పలు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. విడిపోయాక రెండు రాష్ట్రాలూ తమతమ వీలును బట్టి అవతరణ దినో త్సవాలు జరుపుకుంటూనే ఉన్నాయి. కాబట్టి ఏపీకి కూడా అవతరణ దినోత్సవం ఉండాల్సిందే. పోనీ తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిన జూన్ రెండో తేదీని అవతరణ దినోత్సవంగా ఖరారు చేసు కున్నారు కాబట్టి ఏపీలో చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదిని అవతరణ దినోత్సవంగా పాటించవచ్చని ఎవరైనా సూచించ వచ్చు. రేపు ఇంకో పార్టీ ఎన్నికల్లో గెలిచి ఇంకో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు అవతరణ దినో త్సవం ఆ ప్రభుత్వానికి అనుకూలమైన తేదీకి మారు తుందా? తెలంగాణకు కూడా అదే వర్తిస్తుంది కదా అని అనొచ్చు. తెలంగాణలో ప్రభుత్వం మారినా అవతరణ దినోత్సవాన్ని ఇంకో రోజుకు మార్చే వీలు లేదు. ఆ సాహసం ఏ రాజకీయ పక్షమూ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అపాయింటెడ్ డేట్‌న కాబట్టి. మొత్తం మీద ఏపీకి అవతరణ దినోత్సవం లేకుండా పోయింది. నవ నిర్మాణం ఎక్కడ? అప్పాయింటెడ్ డేట్ అయిన జూన్ రెండున మొదలు పెట్టి వారం రోజులపాటు అంటే తాను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8 వరకూ ప్రతి ఏటా చంద్ర బాబు నవ నిర్మాణ దీక్ష పేరిట చేస్తున్న జాతర ఒక రూపాయి మందమయినా ఏపీ ప్రజల అభివృద్ధికో, సంక్షేమానికో ఉపయోగపడేది కాదు, పైగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా ఖర్చు అవుతోంది. ఏపీకి నవ నిర్మాణం అవసరమే, దానికి అందరూ దీక్ష బూనాల్సిందే. రాష్ట్రాన్ని కష్టాల్లో నుంచి బయ టపడేసి. మళ్ళీ ప్రగతి బాట పట్టించాల్సిందే. ప్రస్తు తం నవ నిర్మాణ దీక్ష నాలుగోది. వచ్చే ఏడాది ఈ సమయానికి ఎన్నికలు ముగిసి పోయి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త ప్రభు త్వాలు ఏర్పడుతాయి. అధికారం ఎవరికి ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి బాబుకు మళ్ళీ నవ నిర్మాణ దీక్షవారోత్సవం నిర్వహించే అవకాశం వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. నమ్మి నాలుగేళ్లు అధికారం అప్పజెపితే ప్రజలకు ఆయన ఏమీ చెయ్య లేక పోయారనడానికి దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసం గాలే నిదర్శనం. మొదటి మూడేళ్లూ బీజేపీతో స్నేహం కొనసాగింది కాబట్టి దీక్షల్లో ఎన్డీఏ ప్రభు త్వం మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. గొప్ప అభివృద్ధిని కేంద్రం సాయంతో సాధిస్తున్నామని ఊదరగొట్టారు. నాలుగో ఏట నవ నిర్మాణ దీక్ష సమయం వచ్చేసరికి బీజేపీతో చెడింది. ఆ పార్టీని తిట్టడానికీ, ప్రతిపక్షాలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కల్యాణ్‌కూ బీజేపీతో లేని సంబంధం అంటగట్టడానికీ తెగ ఆరాట పడిపోతు న్నారు. నవ నిర్మాణ దీక్ష లక్ష్యం ఏమిటి? ఆయన చేస్తున్నది ఏమిటి? రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి రాజధాని లేక, ఆదాయ వనరులు సరిగా లేక, రూ.16 వేల కోట్ల లోటుతో మిగిలిపోయిన మాట వాస్తవం. అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ బలంగా అందరిలో ఉంది. నిన్నటిదాకా ఆ కోర్కె బలంగా లేనిది చంద్రబాబుకే. నవ నిర్మాణ దీక్షల్లో ప్రతిన బూనాల్సింది రాష్ట్రా నికి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాటం చేస్తా మనీ సాధించే వరకూ ఊరుకోబోమనీ, కానీ చంద్ర బాబు చేస్తున్నదేమిటి? ప్రతిపక్షాలను తిట్టిపో యడం, తనకు తాను కాండక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చు కోవడం, కాసేపు తనకు ఏదో ముప్పు రాబోతున్న దనీ, రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలూ తన చుట్టూ వలయంలా ఏర్పడి రక్షించుకోవాలని భయం నటించడం– వీటితోనే నవ నిర్మాణ దీక్షా కాలం గడి చిపోతున్నది. నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో భాగంగా ఆయన సోమవారం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటలో తాను మాట్లాడిన మాటలు వింటే రాష్ట్ర నవ నిర్మాణం కాదు తెలుగుదేశం పార్టీ ఇంకా మాట్లాడితే బాబు నిర్మాణా నికి జరుగుతున్న ప్రయత్నంగా అర్థం అవుతుంది. ‘సొంత’ క్యారెక్టర్ సర్టిఫికెట్! జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? రాష్ట్ర ఖజానాయే ఆయన జేబులో ఉంటే పిచ్చి పర్సుతో పనేంటి? ఇక ప్రజ లంతా తనకు రక్షణ కవచంలా ఉండాలని కూడా ఆయన వేడుకున్నారు. ప్రజలను పాలకుడు రక్షి స్తాడా, ప్రజలే పాలకుడిని రక్షిస్తారా? ఇంతకూ ఆయనకు రాబోతున్న ముప్పు ఏమిటి? ఆయన మీద జరుగుతున్న కుట్ర ఏమిటి? ఆయనే ప్రజలకు వివ రిస్తే బాగుంటుంది. ఇంకోమాట అదే జమ్మాదేవి పేటలో ఆయన అన్నారు, ‘బీజేతో పొత్తు పెట్టుకున్న వారిని చిత్తుగా ఓడించండి’ అని. అవును ఇప్ప టికయితే ఆయనే కదా బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. తననే ఓడించమని పిలుపు ఇస్తున్నారా ప్రజలకు?ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడటానికి ఆయన కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారంటే అర్థం ఏమిటి? నవ నిర్మాణ దీక్షల్లో చెప్పుకోడానికి గత నాలుగేళ్ళుగా తాను రాష్ట్రానికి చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో ఏదో చేసే ఆలోచన కూడా లేదనే కదా. ఐదు లోక్‌సభ సీట్లకు ఉప ఎన్ని కలొస్తే నంద్యాల తరహా ఆటలు సాగవు! నవ నిర్మాణ దీక్షలను ఆయన ఎన్నికల సభలు చేసేశారు. ఎన్నికలంటే జ్ఞాపకం వచ్చింది ప్రత్యేక హోదా సాధన కోసం లోక్‌సభ సభ్యత్వాలకు అయిదుగురు వైఎస్ఆర్సీపీ సభ్యులు చేసిన రాజీనామాలు ఆమో దం పొంది ఉపఎన్నికలు రావాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అయిదు లోక్‌సభ సీట్లకు మాత్రమే ఎన్నికలొస్తే నంద్యాల స్టయిల్లో నడిపిం చేయవచ్చని అనుకుంటూ ఉండవచ్చు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన పరిస్థితి వేరు. భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి కూడా సరిపోక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడ మోహరింపచేసి తొండి ఆట ఆడిస్తే తప్ప గెలవలేదు. ఈ అయిదు గురు వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు ఒక వేళ ఆమోదం పొందితే జరిగే ఉప ఎన్నికలు నంద్యాల లాంటివి కాదు. ఒక లక్ష్యం సాధించడం కోసం పద వులను తృణప్రాయంగా త్యజించే వారిని ప్రజలు ఎట్లా అక్కున చేర్చుకుంటారో చంద్రబాబుకు అను భవమే కదా గతంలో. కాంగ్రెస్ అవమానాలను భరించలేక బయటికొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉప ఎన్నికలకు వెళ్ళిన నాయకుల విషయంలో కానీ, తెలంగాణా సాధన కోసం అక్కడ రాజీనామాలు చేసి పోటీ చేసిన నాయకుల విష యంలో కానీ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశాం కదా. ఆ రెండు సందర్భాల్లోనూ తెలుగు దేశం పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కూడా పోగొట్టు కున్నట్టు గుర్తు. వ్యాసకర్త: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
రైతుబంధు కాదు... రాబందు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ వేడుకలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరులకు జోహార్లు.. వారి బలిదానాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధన ఆశయాలకు భిన్నంగా పాలక పార్టీ పనిచేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలకు పరిమితమవుతోందే తప్ప అభివృద్ధి సాధించడంలో వెనుకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలు, అప్పులు అరాచకాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత ప్రభుత్వానికే చెందుతుందంటూ ఎద్దేవా చేశారు. మా నాయకత్వం దేశానికే ఆదర్శం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రైతుబంధు కాదు... రాబందు అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని లక్ష్మణ్ విమర్శించారు. రెండు లక్షల కోట్ల అప్పు భారం ప్రజల మీద మోపారని మండిపడ్డారు. ఎదురుతిరిగిన నిరసన గొంతులను నలిపేస్తున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చోటే లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల మీద దాడులు చేస్తూ వారినే జైలుకు పంపిస్తున్నారన్నారు. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడమే మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. లక్ష ఉద్యోగాలని చెప్పి కేవలం 20వేల కొలువులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రైతులకు రైతుబంధు పథకాన్ని తాయిలంగా చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అది రైతుబంధు పథకం కాదు.. రాబందు పథకమని వ్యాఖ్యానించారు. రాజకీయ కొలువుల కోసం వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. మోదీ సర్కారు పేదల పక్షం.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ సమతుల్యతతో దూసుకుపోతోందని లక్ష్మణ్ ప్రశంసించారు. దళారి వ్యవస్థ లేకుండా, అవినీతి లేకుండా పేదల కోసమే మోదీ సర్కారు పనిచేస్తోందని పేర్కొన్నారు. -
తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది
-
అవతరణ దినోత్సవ కానుక: టీఎస్పీఎస్సీ కొత్త నోటిపికేషన్లు
-
నేడే రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. పరేడ్ గ్రౌండ్స్‌లో అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది. శనివారం ఉదయం 10.30కు వేడుకలు ప్రారంభమవుతాయి. సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం సీఎం వేడుకల్లో పాల్గొంటారు. అదే సమయంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వేడుకలు జరుగుతాయి. జిల్లాలవారీగా మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌తో పాటు సీఎస్ వేడుకల్లో పాలుపం చుకుంటారు. రైతు బీమా పథకాన్ని ఈ వేడుకల్లో సీఎం లాంఛనంగా ప్రకటిస్తారు. రైతులందరికీ రూ.5 లక్షల చొప్పున బీమా చేసేందుకు రెండు రోజుల కిందటే ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది. సాధారణ మరణమైనా, ఇతర కారణమేదైనా రైతులు చనిపోతే వారి కుటుంబీకులను ఆదుకునేందుకు వీలుగా పథకానికి రూపకల్పన చేశారు. మరోవైపు 2,786 వివిధ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ అవతరణ దినోత్సవం రోజే నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఏ జిల్లాలో ఎవరెవరు : అవతరణ వేడుకల్లో పతాకావిష్కరణ బాధ్యతలను మంత్రులతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్‌లు, సీనియర్ ఐఏఎస్‌లకు ప్రభుత్వం అప్పగించింది. సీఎస్ వరంగల్ వేడుకల్లో పాల్గొననుండటంతో పరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీజీపీ మహేందర్‌రెడ్డి సారథ్యం వహిస్తారు. ఆసిఫాబాద్–మండలి చైర్మన్ స్వామిగౌడ్, భూపాలపల్లి–స్పీకర్ మధుసూదనాచారి, మహబూబాబాద్– మంత్రి చందూలాల్, వరంగల్ అర్బన్–డిప్యూటీ సీఎం కడియం, రంగారెడ్డి– డిప్యూటీ సీఎం మహ మూద్ అలీ, మేడ్చల్– మంత్రి నాయిని, జనగాం–విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు రాజన్న సిరిసిల్ల–కేటీఆర్, కరీంనగర్–ఈటల, జగిత్యాల–చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి–విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్– జోగు రామన్న, నిర్మల్–ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల–విప్ ఓదెలు, సిద్ధిపేట–హరీశ్‌రావు, మెదక్–పద్మా దేవేందర్‌రెడ్డి, నిజామాబాద్–పోచారం, కామారెడ్డి–విప్ గోవర్ధన్, మహబూబ్‌నగర్–సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్–జూపల్లి, వనపర్తి–ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ నిరంజన్‌రెడ్డి, జోగుళాంబ గద్వాల–తలసాని, ఖమ్మం–తుమ్మల, కొత్తగూడెం–పద్మారావు, నల్లగొండ–నేతి విద్యాసాగర్, సూర్యాపేట–జగదీశ్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి–విప్ సునీత, వికారాబాద్–పి.మహేందర్‌రెడ్డి, వరంగల్ రూరల్–సీఎస్ జోషి, సంగారెడ్డి– ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ.