
'ముగింపు వేడుకల్లో' సీఎం, గవర్నర్ దంపతులు
హైదరాబాద్:కొన్ని దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం పీపుల్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకూ నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది. దాదాపు లక్ష మంది ప్రజలతో చేపట్టిన ర్యాలీ కన్నుల పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో , గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.
తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటేలా వివిధ కళా రూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శిస్తున్నారు. ధూంధాం, ఆట, పాటలు, బతుకమ్మలు, బోనాలతో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది.