
కేసీఆర్ మరో నీరో చక్రవర్తి: దిగ్విజయ్
సుదీర్ఘకాలంగా ఉన్న తెలంగాణ ప్రజల ఆశలను సోనియాగాంధీ నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని..
సాక్షి, న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా ఉన్న తెలంగాణ ప్రజల ఆశలను సోనియాగాంధీ నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రెండేళ్ల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజలు వడగాడ్పులకు మరణిస్తుంటే కేసీఆర్ వందల కోట్ల రూపాయలు ప్రకటనలకు వెచ్చిస్తూ మరో నీరో చక్రవర్తిలా సంబురాలు చేసుకుంటున్నారు’ అని విమర్శించారు.