
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద బఫూన్ అంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దిగ్విజయ్‌సింగ్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించడం కన్నా ముందు దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకు స్పెల్లింగ్ తెలుసుకోవాలని చురకలంటించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ట్వీట్ చేశారు. దిగ్విజయ్‌సింగ్ చేసిన ట్వీట్‌లో తెలంగాణను ఆంగ్లంలో ’'Telengana'’ అని రాయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment