జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి?
నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నాయ కుడని గెలిపిస్తే నాలుగేళ్ళు గడిచినా వీసమెత్తు పని చెయ్యలేదన్న సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ధ్రువీకరించదల్చుకున్నట్టు కనిపిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఏటా ఒక వారం రోజుల పాటు ప్రజా ధనం వెచ్చించి నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలే అందుకు నిదర్శనం. అసలు ఈ దీక్షలు ఇందుకోసం అన్న స్పష్టత బాబుకు అయినా ఉందా అన్న అనుమానం తాను ఈ సంద ర్భంగా చేసే ప్రసంగాలను వింటే అనిపిస్తుంది.
తెలంగాణా ఏర్పడ్డాక ఆ రాష్ట్రం జూన్ రెండున అవ తరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నది. తెలంగాణా పోగా మిగిలిన ఏపీకి కూడా ఒక అవతరణ దినోత్సవం ఉండాలి కదా? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ విషయంలో కేంద్ర హోం శాఖను స్పష్టత కోరగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన 1956 నవంబర్ ఒకటినే అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం సూచించింది.
నిజానికి అదే ఏపీకి అవతరణ దినోత్సవం జరుపుకోడానికి సరైన తేదీ ఎందుకంటే విడిపోయింది తెలంగాణా ప్రాంతం కానీ ఏపీ కాదు. పోనీ పూర్వపు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకొన్న సందర్భంగా నిర్ణయమైన తేదీ కాబట్టి ఇప్పుడు నవం బర్ ఒకటిని ఎలా అవతరణ దినోత్సవంగా పరిగణి స్తామనే అభ్యంతరం ఉంటే మద్రాసు ప్రావిన్స్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన 1953 అక్టోబర్ ఒకటి అయినా అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక తేదీన తప్ప కుండా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగా ల్సిందే. ఏపీ ప్రజలు మాత్రం గత నాలుగేళ్ళుగా అవ తరణ దినోత్సవాలు జరుపుకునే అవకాశాన్ని కోల్పో యారు. పెద్ద రాష్ట్రాలు విడిపోవడం భారతదేశంలో ఇవాళ కొత్తగా జరుగుతున్నది కాదు. గతంలో కూడా పలు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. విడిపోయాక రెండు రాష్ట్రాలూ తమతమ వీలును బట్టి అవతరణ దినో త్సవాలు జరుపుకుంటూనే ఉన్నాయి.
కాబట్టి ఏపీకి కూడా అవతరణ దినోత్సవం ఉండాల్సిందే. పోనీ తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిన జూన్ రెండో తేదీని అవతరణ దినోత్సవంగా ఖరారు చేసు కున్నారు కాబట్టి ఏపీలో చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదిని అవతరణ దినోత్సవంగా పాటించవచ్చని ఎవరైనా సూచించ వచ్చు. రేపు ఇంకో పార్టీ ఎన్నికల్లో గెలిచి ఇంకో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు అవతరణ దినో త్సవం ఆ ప్రభుత్వానికి అనుకూలమైన తేదీకి మారు తుందా? తెలంగాణకు కూడా అదే వర్తిస్తుంది కదా అని అనొచ్చు. తెలంగాణలో ప్రభుత్వం మారినా అవతరణ దినోత్సవాన్ని ఇంకో రోజుకు మార్చే వీలు లేదు. ఆ సాహసం ఏ రాజకీయ పక్షమూ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అపాయింటెడ్ డేట్‌న కాబట్టి. మొత్తం మీద ఏపీకి అవతరణ దినోత్సవం లేకుండా పోయింది.
నవ నిర్మాణం ఎక్కడ?
అప్పాయింటెడ్ డేట్ అయిన జూన్ రెండున మొదలు పెట్టి వారం రోజులపాటు అంటే తాను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8 వరకూ ప్రతి ఏటా చంద్ర బాబు నవ నిర్మాణ దీక్ష పేరిట చేస్తున్న జాతర ఒక రూపాయి మందమయినా ఏపీ ప్రజల అభివృద్ధికో, సంక్షేమానికో ఉపయోగపడేది కాదు, పైగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా ఖర్చు అవుతోంది. ఏపీకి నవ నిర్మాణం అవసరమే, దానికి అందరూ దీక్ష బూనాల్సిందే. రాష్ట్రాన్ని కష్టాల్లో నుంచి బయ టపడేసి. మళ్ళీ ప్రగతి బాట పట్టించాల్సిందే. ప్రస్తు తం నవ నిర్మాణ దీక్ష నాలుగోది.
వచ్చే ఏడాది ఈ సమయానికి ఎన్నికలు ముగిసి పోయి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త ప్రభు త్వాలు ఏర్పడుతాయి. అధికారం ఎవరికి ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి బాబుకు మళ్ళీ నవ నిర్మాణ దీక్షవారోత్సవం నిర్వహించే అవకాశం వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. నమ్మి నాలుగేళ్లు అధికారం అప్పజెపితే ప్రజలకు ఆయన ఏమీ చెయ్య లేక పోయారనడానికి దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసం గాలే నిదర్శనం. మొదటి మూడేళ్లూ బీజేపీతో స్నేహం కొనసాగింది కాబట్టి దీక్షల్లో ఎన్‌డీఏ ప్రభు త్వం మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. గొప్ప అభివృద్ధిని కేంద్రం సాయంతో సాధిస్తున్నామని ఊదరగొట్టారు. నాలుగో ఏట నవ నిర్మాణ దీక్ష సమయం వచ్చేసరికి బీజేపీతో చెడింది.
ఆ పార్టీని తిట్టడానికీ, ప్రతిపక్షాలకు, ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కల్యాణ్‌కూ బీజేపీతో లేని సంబంధం అంటగట్టడానికీ తెగ ఆరాట పడిపోతు న్నారు. నవ నిర్మాణ దీక్ష లక్ష్యం ఏమిటి? ఆయన చేస్తున్నది ఏమిటి? రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి రాజధాని లేక, ఆదాయ వనరులు సరిగా లేక, రూ.16 వేల కోట్ల లోటుతో మిగిలిపోయిన మాట వాస్తవం. అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ బలంగా అందరిలో ఉంది. నిన్నటిదాకా ఆ కోర్కె బలంగా లేనిది చంద్రబాబుకే.
నవ నిర్మాణ దీక్షల్లో ప్రతిన బూనాల్సింది రాష్ట్రా నికి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాటం చేస్తా మనీ సాధించే వరకూ ఊరుకోబోమనీ, కానీ చంద్ర బాబు చేస్తున్నదేమిటి? ప్రతిపక్షాలను తిట్టిపో యడం, తనకు తాను కాండక్ట్ సర్టిఫికేట్‌లు ఇచ్చు కోవడం, కాసేపు తనకు ఏదో ముప్పు రాబోతున్న దనీ, రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలూ తన చుట్టూ వలయంలా ఏర్పడి రక్షించుకోవాలని భయం నటించడం– వీటితోనే నవ నిర్మాణ దీక్షా కాలం గడి చిపోతున్నది. నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో భాగంగా ఆయన సోమవారం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటలో తాను మాట్లాడిన మాటలు వింటే రాష్ట్ర నవ నిర్మాణం కాదు తెలుగుదేశం పార్టీ ఇంకా మాట్లాడితే బాబు నిర్మాణా నికి జరుగుతున్న ప్రయత్నంగా అర్థం అవుతుంది.
‘సొంత’ క్యారెక్టర్ సర్టిఫికెట్!
జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? రాష్ట్ర ఖజానాయే ఆయన జేబులో ఉంటే పిచ్చి పర్సుతో పనేంటి? ఇక ప్రజ లంతా తనకు రక్షణ కవచంలా ఉండాలని కూడా ఆయన వేడుకున్నారు.
ప్రజలను పాలకుడు రక్షి స్తాడా, ప్రజలే పాలకుడిని రక్షిస్తారా? ఇంతకూ ఆయనకు రాబోతున్న ముప్పు ఏమిటి? ఆయన మీద జరుగుతున్న కుట్ర ఏమిటి? ఆయనే ప్రజలకు వివ రిస్తే బాగుంటుంది. ఇంకోమాట అదే జమ్మాదేవి పేటలో ఆయన అన్నారు, ‘బీజేతో పొత్తు పెట్టుకున్న వారిని చిత్తుగా ఓడించండి’ అని. అవును ఇప్ప టికయితే ఆయనే కదా బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. తననే ఓడించమని పిలుపు ఇస్తున్నారా ప్రజలకు?ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడటానికి ఆయన కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారంటే అర్థం ఏమిటి? నవ నిర్మాణ దీక్షల్లో చెప్పుకోడానికి గత నాలుగేళ్ళుగా తాను రాష్ట్రానికి చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో ఏదో చేసే ఆలోచన కూడా లేదనే కదా.
ఐదు లోక్‌సభ సీట్లకు ఉప ఎన్ని కలొస్తే నంద్యాల తరహా ఆటలు సాగవు! నవ నిర్మాణ దీక్షలను ఆయన ఎన్నికల సభలు చేసేశారు. ఎన్నికలంటే జ్ఞాపకం వచ్చింది ప్రత్యేక హోదా సాధన కోసం లోక్‌సభ సభ్యత్వాలకు అయిదుగురు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు చేసిన రాజీనామాలు ఆమో దం పొంది ఉపఎన్నికలు రావాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు.
ఆ అయిదు లోక్‌సభ సీట్లకు మాత్రమే ఎన్నికలొస్తే నంద్యాల స్టయిల్‌లో నడిపిం చేయవచ్చని అనుకుంటూ ఉండవచ్చు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన పరిస్థితి వేరు. భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి కూడా సరిపోక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడ మోహరింపచేసి తొండి ఆట ఆడిస్తే తప్ప గెలవలేదు. ఈ అయిదు గురు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఒక వేళ ఆమోదం పొందితే జరిగే ఉప ఎన్నికలు నంద్యాల లాంటివి కాదు.
ఒక లక్ష్యం సాధించడం కోసం పద వులను తృణప్రాయంగా త్యజించే వారిని ప్రజలు ఎట్లా అక్కున చేర్చుకుంటారో చంద్రబాబుకు అను భవమే కదా గతంలో. కాంగ్రెస్ అవమానాలను భరించలేక బయటికొచ్చి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కలిసి ఉప ఎన్నికలకు వెళ్ళిన నాయకుల విషయంలో కానీ, తెలంగాణా సాధన కోసం అక్కడ రాజీనామాలు చేసి పోటీ చేసిన నాయకుల విష యంలో కానీ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశాం కదా. ఆ రెండు సందర్భాల్లోనూ తెలుగు దేశం పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కూడా పోగొట్టు కున్నట్టు గుర్తు.
వ్యాసకర్త: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment