
చండ్రమాకులపలె వద్ద మండుటెండలో నిరీక్షిస్తున్న జనం
పుంగనూరు : చండ్రమాకులపల్లెకు సీఎం చంద్రబాబు గంటకుపైగా ఆలస్యంగా రావడంతో టీడీపీ నాయకులు విసిగిపోయారు. సీఎం సభ కోసం తరలించిన జనం మండుటెండలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలకంటే అధికారులు, పోలీసులే ఎక్కువగా కనిపించారు. ఐదు నిముషాల్లో సభ ముగించడంతో జనం నిరాశచెందారు. అంతేకాకుండా పలు ఆర్టీసీ బస్సులు సీఎం సభకు ప్రజలను తరలించేం దుకు మరలించడంతో ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు.