విలేకరులలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రద్యుమ్న
చిత్తూరు కలెక్టరేట్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మట్లాడారు. నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి విచ్చేయనున్నట్లు తెలియజేశారు. వివిధ కార్యక్రమాల అనంతరం హంద్రీ–నీవా, సుజల–స్రవంతి పనులపై అధికారులుతో సమావేశం నిర్వహించే అవకా శం ఉందని ఆయన తెలిపారు. రాత్రికి అక్కడే బసచేసి 8వ తేదీ ఉదయం 8 గంటలకు బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వెళతారని పేర్కొన్నారు.
ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటన?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించే అవకాశం ఉందని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఓడీఎఫ్ సాధనలో జిల్లా ప్రజలు చేసిన విశేష కృషికి కృతజ్ఞతగా ఇక్కడ నుంచే రాష్ట్రాన్ని కూడా ప్రకటించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లు గురువారానికి 3 లక్షలు పూర్తవుతాయన్నారు. గడచిన నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల కిలో మీటర్ల మేరకు సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన పైలాన్‌ను చంద్రమాకులపల్లె బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment