వాయు ’గండం’ గుబులు
వాయు ’గండం’ గుబులు
Published Wed, Nov 2 2016 7:03 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
-4 నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ
-ఆందోళన చెందుతున్న అన్నదాతలు
కొవ్వూరు:
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో గుబులు మొదలైంది.రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో వరిపంట కోత దశలో ఉంది.జిల్లా వ్యాప్తంగా 2.30లక్షల హెక్టార్లులలో నాట్లు వేయగా ఇప్పటి వరకు కేవలం 30వేల ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయ్యాయి.ఈ వారం, పదిరోజుల్లో సగం ఆయకట్టులో కోతలు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది.జిల్లాలో నవంబర్ నెలాఖరు నాటికి వరికోతలు పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో తుఫాన్ ప్రభావంతోఈదురు గాలులు వీస్తే పంటంతా నేలకి ఓరిగే ప్రమాదం ఉంది. వాయుగుండం తీవ్ర రూపం దాల్చితే భారీగా పంటలు నష్టపోవావాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈనెల మూడో తేదీ నుంచే వాయుగుండం ప్రభావం కనిపించే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు బెంబోలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లా పలు మండలాల్లో వర్షాలు పడడంతో రైతుల్లో మరింత ఆందోళన మొదలైంది.అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.ఆరుగాలం శ్రమించి పండించి న పంట చేతికి అందే సమయంలో తుఫాన్ వస్తే నిండా మునిగిపోతా మని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నవంబర్‌లోనే గండం....?
జిల్లాలో 2012లో నీలం, 2013లో హెలెన్ తుపాన్‌లు అక్టోబర్ నెలాఖరు, నవంబర్ మొదటి వారంలోనే వచ్చాయి. మళ్లీ ఇప్పుడు రెండేళ్ల తర్వత బంగాళాఖాతంలో వాయుగుండం రూపంలో మరో విపత్తు పొంచి ఉంది. అప్పట్లో నీలం తుఫాన్ ప్రభావంతో 1,29,368 హెక్టార్లుల్లో రూ.128.27 కోట్లు మేరకు పంటకి నష్టం వాటిల్లింది.ఇంకా 255.21 హెక్టార్లుకు నష్ట పరిహారం నేటికీ అందలేదు. 2013 నవంబర్‌లో హెలెన్ తుఫాన్ జిల్లాలో రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.జిల్లా వ్యాప్తంగా హెలెన్ ప్రభావంతో 78,662.86 హెక్టార్లు లలో రూ.78.66కోట్లు మేరకు పంటనష్టం వాటిల్లింది. మూడేళ్లు గడుస్తున్నా జిల్లాలో ౖరైతులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. ఆ గాయాల నుంచి రైతులు ఇంకా కోలేదు. ఇప్పుడు మరో విపత్తు ముంచుకోస్తుందన్న వార్త రైతుల్ని కలవరానికి గురిచేస్తుంది.
జిల్లాలో 4.3 మి.మీటర్లు సరాసరి వర్షపాతం:
గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో 4.3 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో పెదపాడు మండలంలో గరిష్టంగా 70.4 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది.నల్లజర్లలో 38.4, భీమడోలులో 32.2, కొయ్యలగూడెంలో 26.4, పోలవరం మండలంలో 16.6, ఏలూరులో 15.0 మి.మీటర్లు చోప్పున వర్షపాతం రికార్డయ్యింది. తాళ్లపూడి, గోపాలపురం, పెదవేగి, జీలుగుమిల్లి మండలాల్లో చెదురు మెదరుగా చినుకులు పడ్డాయి.అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి.ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం, ఇదే తరుణంలో బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారునుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Advertisement