తెలుగుజాతి కోసమే తెలుగుదేశం
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుజాతి ఉన్నంత వరకు వారి కోసం టీడీపీ పనిచేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి బాబు మాట్లాడారు. 34 ఏళ్ల క్రితం దివంగత ఎన్టీఆర్ స్థాపిం చిన తెలుగుదేశంపార్టీ దేశంలో ఓ ప్రభంజనమని కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేంత వరకు పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిం హులు మాట్లాడుతూ చంద్రబాబు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ 2019లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలను ఈ సందర్భంగా చంద్రబాబు సన్మానించారు. కార్యక్రమంలో నారా లోకేష్‌తో పాటు ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు. అం తకుముందు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లిన చంద్రబాబు, లోకేష్, నేతలు నివాళులు అర్పించారు.
జూన్‌లో రాజధాని నిర్మాణపనులు
‘తెలుగుదేశం పార్టీ మంచి యవ్వనంలో ఉంది. 33 సంవత్సరాల యువకుడికి ఉండే శక్తి, ఉత్సాహం ఉంది. ఇంకా ఈ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీ లేదు’ అని చంద్రబాబు అన్నారు. గుం టూరు జిల్లా తుళ్లూరులోని మేరీమాత ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఆదివారం జరిగిన టీడీపీ ఆవిర్భావ ఉత్సవంలో మాట్లాడారు. మరో పదేళ్లలో స్మార్ట్ రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతానని చెప్పారు. జూన్‌లో రాజ ధాని నిర్మాణపనులు ప్రారంభిస్తామన్నారు.