అన్నపూర్ణ జిల్లాలోని రైతులకు ఆదరణ ఏదీ?
అన్నపూర్ణ జిల్లాలోని రైతులకు ఆదరణ ఏదీ?
Published Tue, Oct 4 2016 5:34 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
–అందని హెలెన్ నష్టపరిహారం
–అడ్రస్సులేని వడ్డీ రాయితీ
ఆకివీడు: వ్యవసాయం దండగ అనే రీతిలోనే ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. రైతులను ముప్పేటా ఇబ్బందులకు గురి చేసి వరి సాగు నుండి దూరం చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కన్పింస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ రంగాన్ని అభివద్ధి చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చిన చంద్రబాబు అధికారం చేతికి అందిన తరువాత రైతుల్ని ఛీ«దరించుకుంటున్నారని పలువురు వ్యాఖాన్నిస్తున్నారు. రుణ మాఫీ రైతుకు గుది బండగా మారింది. వడ్డీలతో రైతులకు తలకు మించిన భారంగా పరిణమించింది. రుణమాఫీతో వడ్డీలు చెల్లించని రైతులకు సొసైటీలు, బ్యాంకులు రణాలు ఇవ్వకపోవడంతో సన్న చిన్నకారు రైతులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి వడ్డీలు కడుతున్నారు. కొంత మంది పుస్తెలు కూడా తాకట్టు పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది. అలుపెరుగని అన్నదాత పచ్చని పైరును చూడకుండా ఉండలేక ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారు వస్తువుల్ని తాకట్టు పెట్టుకుంటుంటే, సాక్షాత్తూ ముఖ్యమంత్రే బంగారు ఆభరణాలపై అప్పులు ఇవ్వవద్దుని హుకుం జారీ చేయడం రైతుల్లో కలకలం రేగుతోంది.
హెలెన్ నష్టపరిహారం ఏదీ బాబూ!
హెలెన్ నష్టపరిహారం నేటికీ అందలేదు. మూడేళ్ల క్రితం మంజూరైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం రైతులకు దక్కనివ్వకుండా ఇతరత్రార ఖర్చులకు వినియోగించుకుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా హెలెన్ నష్టపరిహారం రూ. 160 కోట్ల మేర సొమ్ము రైతులకు అందాల్సి ఉంది. హెలెన్ ఊసెత్తకుండానే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ఇతర జిల్లాల రైతులకు నష్టపరిహారం అందజేస్తామనడంలో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అడ్రస్సులేని వడ్డీ రాయితీ
గత ఏడాది రైతులు చెల్లించిన వడ్డీ రాయితీ నేటికీ ఆయా సొసైటీలకు జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా సహకార రంగం ద్వారా రూ. 900 కోట్ల మేర రైతులకు రుణాలు అందజేశారు. దీని తాలూకూ వడ్డీ 7 శాతం రైతుల వద్ద నుండి ముక్కు పిండి మరీ వసూలు చేశారు. సుమారు రూ. 95 లక్షల మేర వడ్డీ రాయితీ సొమ్ము రావలసి ఉంది. ఏడు శాతంలో 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. మరో 3 శాతం కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. సకాలంలో చెల్లించని వడ్డీ రాయితీ సొమ్ముకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా అని రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వడ్డీ రాయితీ చెల్లించని ప్రభుత్వం రుణమాఫీ సొమ్ముకు వడ్డీలు వసూలు చేయడం సిగ్గు చేటని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
మింగ మెతుకులేదు. మీసాలకి..
–మల్లారెడ్డి శేషమోహనరంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి.
మింగ మెతుకులేదు.. మీసాలకి సంపెంగ నూనె రాసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వ తీరు ఉంది. హెలెన్ తుఫాన్ నష్టపరిహారం ఇవ్వడానికి ఖజానా చిల్లు చూపిస్తున్నారు. మరి గుంటూరు ప్రాంత రైతులకు నష్టపరిహారం ఎక్కడ నుండి తీసుకువచ్చి ఇస్తారు. రైతుల్ని మభ్యపెట్టడం, మోసగించడం చంద్రబాబుకు అలవాటైపోయింది. హెలెన్ నష్టపరిహారం జిల్లాకు రూ. 160 కోట్లు రావలసి ఉంది. గత ఏడాది వడ్డీ రాయితీ రూ. 90 లక్షలు రావలసి ఉండగా ఒక్క రూపాయి విడుదల చేయాలేదు. అన్నపూర్ణ జిల్లాలోని అన్నదాతను ఆదుకునే తీరు ఇదేనా?. రైతులకు వెంటనే హెలెన్ నష్టపరిహారం, వడ్డీరాయితీ ఇవ్వాలి. బంగారు ఆభరణాలపై అప్పులు ఇవ్వవద్దనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలి.
హెలెన్ నష్టపరిహారం ఇవ్వాలి
–కె.సాయిలక్ష్మీశ్వరి, వ్యవసాయ శాక సంయుక్త సంచాలకులు, ఏలూరు
హెలెన్ నష్టపరిహారాన్ని రైతులకు మంజూరు చేయాల్సి ఉంది.
Advertisement