helen
-
తొమ్మిది నెలలు నడిచాను
సుప్రసిద్ధ నటి హెలెన్ గొప్ప నాట్యగత్తెగా అందరికీ తెలుసు.రచయిత సలీం భార్యగా, సల్మాన్ ఖాన్ మారుతల్లిగా కూడా తెలుసు.కాని ఆమెకు ఒక వెంటాడే గతం ఉంది.తన కుమారుడు అర్బాజ్ ఖాన్ చేస్తున్న తాజా షోలోఆమె ఆ గతాన్ని గుర్తు చేసుకుంది.ఆ జ్ఞాపకాలు కదిలించేవిగా ఉన్నాయి. ‘నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే, సినిమాల్లో నిలబడ్డానంటే దానికి మా అమ్మే కారణం. ఆమె చాలా ఆత్మస్థయిర్యం ఉన్న స్త్రీ’ అని గుర్తు చేసుకున్నారు 84 ఏళ్ల హెలెన్. సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే హెలెన్ నటుడు అర్బాజ్ ఖాన్ టాక్ షో ‘ది ఇన్విన్సిబుల్స్’లోపా ల్గొని మాట్లాడింది. ఆ సందర్భంగా తన బాల్యాన్ని, తల్లిని గుర్తు చేసుకుంది. ‘మా అమ్మది బర్మా (మయన్మార్). నాన్న ఆంగ్లో ఇండియన్. నేను పెద్దదాన్ని. నా తర్వాత తమ్ముడు. చెల్లెలు. 1943లో అమ్మ గర్భంతో ఉండగా నాన్న చనిపోయాడు. అప్పుడే బర్మాను జపాన్ ఆక్రమించింది. అంతటా రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు. బర్మాలో ఉండే పరిస్థితి లేదు. ఆ సమయానికి నాకు ఆరేళ్లు. అమ్మ నన్ను తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకుని ఇండియా వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళితే సరిగ్గా మేము వెళ్లే సమయానికి జపాన్ విమానాలు వచ్చి బాంబులు వేశాయి. ఇక విమానంలో వెళ్లే పరిస్థితి లేదు. దాదాపు 350 మంది నడక ద్వారానే ఇండియాకు బయలుదేరాం. అమ్మ ప్రెగ్నెంట్ అయినా భయపడక నన్ను, తమ్ముణ్ణి, చెల్లెల్ని తీసుకుని ఆ బిడారులో బయలుదేరింది. 9నెలలపా టు నడిచాం. దారిలోని పల్లెల్లో కొంతమంది మాకు అన్నం పెట్టేవాళ్లు. బ్రిటిష్ సైనికులు కనిపించి తినడానికి ఇచ్చేవారు. దారిలో అమ్మకు అబార్షన్ అయ్యింది. చెల్లెలు చనిపోయింది. నేను, తమ్ముడు ఎముకల గూడుగా మారాం. ఇండియా చేరేనాటికి 350 మందిలో సగం మందిమే మిగిలాం. మేము మొదట అస్సాంకు తర్వాత కోల్‌కతాకు చేరాం. ఆ తర్వాతే బాంబే వచ్చి స్థిరపడ్డాం’ అని చెప్పిందామె. మరి సినిమా రంగానికి ఎలా వచ్చారు అని అర్బాజ్ అడగగా– ‘బాంబేలో మేమున్న ఇంటి ఎదురుగా ఒక మణిపూరి డాన్సర్ ఉండేది. ఆమె దగ్గర అమ్మ నాకు మణిపురి నేర్పించింది. ఆ రోజుల్లో కుకూ అనే డాన్సర్ సినిమాల్లో ఫేమస్. ఆమెకు అమ్మతో స్నేహం కుదిరింది. ఆమెలా నేనూ డాన్సర్ అవ్వాలని అమ్మ అనుకుంది. కుకు నన్ను సినిమాల్లోకి గ్రూప్ డాన్సర్‌గా తీసుకెళ్లింది. దేవ్ ఆనంద్ నటించిన ‘బారిష్’ (1957)లోని ‘మిస్టర్ జాన్ బాబాఖాన్’పా టతో ఐటమ్ గర్ల్‌గా మారాను. ‘హౌరాబ్రిడ్జ్’ (1958)లోని ‘మేరా నామ్ చిన్ చిన్ చూ’పా టతో నాకు స్టార్డమ్ వచ్చింది’ అని చెప్పిందామె. ‘మా నాన్న (రచయిత సలీం ఖాన్)తో మీ స్నేహం ప్రేమ, పెళ్లి దాకా ఎలా దారి తీసింది’ అని అర్బాజ్ అడగగా ‘1970లో నా ఆస్తి మొత్తం పోయింది (హెలెన్ మొదటి భర్త పి.ఎన్.అరోరా వల్ల). కోర్టు కేసుల్లో చిక్కుకున్నాను. ఆ సమయంలో మీ నాన్న నా ఇబ్బందిని గమనించి తాను రాసే సినిమాల్లో నాకు వేషాలు వచ్చేలా చూశాడు. అలా ప్రేమ ఏర్పడింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నా కోసం ఆయన తన కుటుంబం నుంచి విడిపోయి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ కలసి ఉండేలా చూడమని గట్టిగా కోరాను. మీ అమ్మ (సల్మా ఖాన్), మీరు ఆ రోజుల్లో ఎక్కువ వేదన అనుభవించి ఉంటారు. నేనైతే మీ అమ్మకు ఎదురుపడటానికి కూడా భయపడేదాన్ని. ఏమైనా కొన్నాళ్లకు మీరంతా నన్ను యాక్సెప్ట్ చేశారు. నన్ను హెలెన్ ఖాన్‌గా గౌరవించారు. సల్మా, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అర్పిత (సల్మాన్ చెల్లెలు) పెళ్లిలో శుభలేఖలో నా పేరు కూడా వేశారు. ఇంతకన్నా ఏం కావాలి?’ అందామె. -
చూపు... రీమేక్ వైపు...
ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణమే. అయితే పాన్ ఇండియా ఫార్ములా వచ్చిన తర్వాత కూడా రీమేక్ మంత్రం వెండితెరపై వినిపిస్తోంది కొందరు తారలు రీమేక్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. రీమేక్ చిత్రాలవైపు ఓ చూపు చూస్తున్న ఆ స్టార్స్‌పై ఓ లుక్ వేయండి. మలయాళ హిట్ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లో ఇటీవల చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. మరో రీమేక్ ‘బోళా శంకర్’లో కనిపించనున్నారాయన. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్గా తమన్నా, చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. 2015లో అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా ‘బోళా శంకర్’ తెరకెక్కుతోందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నారు. మరోవైపు మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ (2019) తెలుగు రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు హీరో–నిర్మాత మంచు విష్ణు. మోహన్‌బాబు మెయిన్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్క నుందని సమాచారం. అలాగే మరో మలయాళ చిత్రం ‘పొరింజు మరియం జోస్’ (2019) తెలుగులో రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాగార్జున హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారట. ఇక హీరో పవన్ కల్యాణ్ కెరీర్‌లోని రీమేక్ చిత్రాల్లో తమిళ చిత్రం ‘తేరి’ కూడా చేరనుందని టాక్. ఈ సినిమాకు దర్శకుడిగా తొలుత సుజిత్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హిట్ సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటైన ‘మానాడు’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తారని ప్రచారం జరిగినా, ఆ తర్వాత రవితేజ, సిద్ధు జొన్నలగడ్డల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ నిర్మాణ భాగస్వామిగా ‘లక్కీ కీ’ అనే సౌత్ కొరియన్ మూవీ తెలుగు తెరపైకి రానుంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా మలయాళ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ తెలుగులో ‘బుట్ట బొమ్మ’గా రూపొందుతోంది. అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు. శౌరి చంద్ర శేఖర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా తమిళ హిట్ ఫిల్మ్ ధనుష్ ‘కర్ణన్’ తెలుగులో రీమేక్ కానున్నట్లు, ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించ నున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు ‘నాయట్టు’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘బ్రో డాడీ’, తమిళ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’, హిందీ ‘డ్రీమ్ గాళ్’, ‘దే దే ప్యార్ దే’ ‘బదాయీ దో’ వంటివి కూడా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు.. ఈ రీమేక్ జాబితాలో మరికొన్ని చిత్రాలు చేరతాయి. -
హిట్ రిపీట్ అవుతుందా?
ఓ భాషలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే, రీమేక్ ద్వారా తమ భాషలోకి తీసుకురావాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. ఈజీ హిట్ ఫార్ములా అనేది ఒక కారణం. మంచి కథను మరో ప్రాంతం ఆడియన్స్‌కు చూపించాలనేది ఇంకో కారణం. హిట్ సినిమా రీమేక్ కూడా హిట్టే అవుతుందా? అంటే చెప్పలేం. చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ సరిగ్గా లెక్క కట్టాలి. ఆ మంత్రం మళ్లీ సరిగ్గా జపించాలి. అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం ఓ భాషలో తయారైన అయిదు సూపర్ హిట్ సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ఆ సినిమాలు – ఆ రీమేక్‌ల విశేషాలు. అయ్యప్పనుమ్ కోషియుమ్ పృథ్వీరాజ్, బిజూ మీనన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఇద్దరు వ్యక్తుల ఈగోకి సంబంధించిన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. సచీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘనవిజయం సాధించింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ► తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు–స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నాగవంశీ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ► హిందీ రీమేక్‌లో ‘దోస్తానా’ కాంబినేషన్ జాన్ అబ్రహామ్, అభిషేక్ బచ్చన్ నటించనున్నారు. నటించడంతో పాటు జాన్ అబ్రహామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ► ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తమిళ రీమేక్‌లో కార్తీ, పార్తిబన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. హెలెన్ రెస్టారెంట్‌లోని ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి అందులో నుంచి ఎలా బయటపడింది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘హెలెన్ ’. అన్నా బెన్ ముఖ్య పాత్ర చేసిన ఈ సినిమాని మతుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేశారు. 2019లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా ‘హెలెన్ ’ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► అన్నా బెన్ చేసిన పాత్రను తెలుగు రీమేక్‌లో అనుపమా పరమేశ్వరన్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ► ‘హెలెన్ ’ తమిళ రీమేక్‌ను ‘అన్బిర్కినియాళ్’ టైటిల్‌తో తెరకెక్కించారు. కీర్తీ పాండియన్ లీడ్ రోల్ చేస్తున్నారు. గోకుల్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ► ‘హెలెన్ ’ హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్ నటించనున్నారు. దర్శకుడు, మిగతా వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దృశ్యం 2 మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ (దృశ్యం 2) విడుదలయింది. మొదటి భాగంలో పని చేసిన టీమే ఈ సీక్వెల్ తెరకెక్కించారు. ‘దృశ్యం 2’ చిత్రం ప్రస్తుతం తెలుగులో, తమిళంలో రీమేక్ కాబోతోంది. హిందీలోనూ రీమేక్ కానుందని టాక్. ► ‘దృశ్యం’ మొదటి భాగంలో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. సీక్వెల్లోనూ వీరే నటించనున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తారు. ► ‘దృశ్యం’ తమిళ రీమేక్ జీతూ జోసెఫ్, కమల్‌హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కింది. తాజాగా ఈ సీక్వెల్‌ను కేయస్ రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కమల్‌హాసన్ ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. మరి ఈ సీక్వెల్లో ఆయనే నటిస్తారా? వేరెవరైనా సీన్ లోకి వస్తారేమో చూడాలి. ► ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. తాజా సీక్వెల్ హిందీలోనూ రీమేక్ అవుతుందని బాలీవుడ్ టాక్. ఓ మై కడవుళే అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా అశ్విన్ మారిముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఓ మై కడవుళే’. జీవితంలో రెండో అవకాశం లభించినప్పుడు ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటించారు. 2020లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్విన్ తెలుగు రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. పీవీపీ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ► హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అశ్విన్ మారిముత్తునే ఈ హిందీ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తారు. ► ‘ఓ మై కడవుళే’ కన్నడ వెర్షన్ లో డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. అతిథి పాత్రలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కనిపిస్తారు. అంధా ధున్ ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధా ధున్ ’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఇప్పుడు ‘అంధా ధున్ ’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. ► తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్, టబు పాత్రలో తమన్నా కనిపించనున్నారు. జూన్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ► తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టబు చేసిన పాత్రను సిమ్రాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అంధగన్ ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ► ‘అంధా ధున్ ’ మలయాళ రీమేక్‌ని ‘భ్రమం’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. ఆయా భాషల్లో విజయం సాధించినట్టు ఈ రీమేక్స్ కూడా విజయం సాధిస్తాయా? ఒరిజినల్లో జరిగిన మ్యాజిక్‌ను రీమేక్‌లోనూ ఆయా చిత్రబృందాలు క్రియేట్ చేయగలుగుతాయా? వెయిట్ అండ్ సీ! -
హిందీ హెలెన్!
హిందీ ‘హెలెన్’గా జాన్వీ కపూర్ కనిపించబోతున్నారా? అంటే అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలయ్యాయనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. 2019లో మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన చిత్రం ‘హెలెన్’. అన్నాబెన్ టైటిల్ రోల్ చేశారు. ఫారిన్ వెళ్లాలనుకునే బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ ‘హెలెన్’ ఇంగ్లీష్ ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటూ ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తుంటుంది. కానీ ఓ రోజు ఆ రెస్టారెంట్‌లోని కోల్డ్ స్టోరేజ్‌లో ఇరుక్కుపోతుంది హెలెన్. అప్పటికే ఆ రెస్టారెంట్ మేనేజర్ తాళం వేసి వెళ్లిపోతాడు. మైనస్ 18 డిగ్రీల చలిలో హెలెన్ తనను తాను ఎలా రక్షించుకుంది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. హిందీలో ‘హెలెన్’ చిత్రం రీమేక్ కానుందట. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ చేయనున్నారని సమాచారం. మరోవైపు ఈ ‘హెలెన్’ చిత్రం తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా రీమేక్ కానుందని తెలిసింది. -
నా పేరు చిన్ చిన్ చూ
ఏదైనా ప్రాంతంలో కథ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన స్పెషాలిటీని కథలో జోడించడానికి ప్రయత్నిస్తుంటారు దర్శక–నిర్మాతలు. ఆ ప్రాంతపు యాస కావచ్చు, లేదా అక్కడ ఫేమస్ పాట కావచ్చు. అదే చేశారు బాలీవుడ్ దర్శకుడు ముద్దాసర్ అజీజ్. సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగి’. 2016లో రిలీజ్ అయిన ‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగి’ చిత్రానికి సీక్వెల్ ఇది. పెళ్లి నుంచి తప్పించుకునే పెళ్లి కూతురికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగనుంది. ఎక్కువ శాతం సినిమా చైనా బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందట. అందుకే 1950లో ‘హౌరా బ్రిడ్జ్’ సినిమాలో హాట్ డ్యాన్సర్ హెలెన్ చేసిన సూపర్ హిట్ డ్యాన్స్ నంబర్ ‘మేరా నామ్ చిన్ చిన్ చూ’ (నా పేరు చిన్ చిన్ చూ) పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. విశేషం ఏంటంటే ఈ పాటలో హెలెన్లా స్టెప్పులేయడమే కాకుండా పాటను కూడా పాడారు సోనాక్షి. ఈ రీమిక్స్ గురించి ఆమె మాట్లాడుతూ –‘‘హెలెన్ ఆంటీ చేసిన సాంగ్‌ను నేను మళ్లీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తనని కాపీ చేయాలనో, తనలా చేయాలనో అనుకోలేదు. ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తూ చేశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. సోనాక్షీ వేసిన స్టెప్పులకు యూనిట్ ఫిదా అయ్యారట. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. -
అన్నపూర్ణ జిల్లాలోని రైతులకు ఆదరణ ఏదీ?
–అందని హెలెన్ నష్టపరిహారం –అడ్రస్సులేని వడ్డీ రాయితీ ఆకివీడు: వ్యవసాయం దండగ అనే రీతిలోనే ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. రైతులను ముప్పేటా ఇబ్బందులకు గురి చేసి వరి సాగు నుండి దూరం చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కన్పింస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ రంగాన్ని అభివద్ధి చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చిన చంద్రబాబు అధికారం చేతికి అందిన తరువాత రైతుల్ని ఛీ«దరించుకుంటున్నారని పలువురు వ్యాఖాన్నిస్తున్నారు. రుణ మాఫీ రైతుకు గుది బండగా మారింది. వడ్డీలతో రైతులకు తలకు మించిన భారంగా పరిణమించింది. రుణమాఫీతో వడ్డీలు చెల్లించని రైతులకు సొసైటీలు, బ్యాంకులు రణాలు ఇవ్వకపోవడంతో సన్న చిన్నకారు రైతులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి వడ్డీలు కడుతున్నారు. కొంత మంది పుస్తెలు కూడా తాకట్టు పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది. అలుపెరుగని అన్నదాత పచ్చని పైరును చూడకుండా ఉండలేక ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారు వస్తువుల్ని తాకట్టు పెట్టుకుంటుంటే, సాక్షాత్తూ ముఖ్యమంత్రే బంగారు ఆభరణాలపై అప్పులు ఇవ్వవద్దుని హుకుం జారీ చేయడం రైతుల్లో కలకలం రేగుతోంది. హెలెన్ నష్టపరిహారం ఏదీ బాబూ! హెలెన్ నష్టపరిహారం నేటికీ అందలేదు. మూడేళ్ల క్రితం మంజూరైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం రైతులకు దక్కనివ్వకుండా ఇతరత్రార ఖర్చులకు వినియోగించుకుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా హెలెన్ నష్టపరిహారం రూ. 160 కోట్ల మేర సొమ్ము రైతులకు అందాల్సి ఉంది. హెలెన్ ఊసెత్తకుండానే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ఇతర జిల్లాల రైతులకు నష్టపరిహారం అందజేస్తామనడంలో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అడ్రస్సులేని వడ్డీ రాయితీ గత ఏడాది రైతులు చెల్లించిన వడ్డీ రాయితీ నేటికీ ఆయా సొసైటీలకు జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా సహకార రంగం ద్వారా రూ. 900 కోట్ల మేర రైతులకు రుణాలు అందజేశారు. దీని తాలూకూ వడ్డీ 7 శాతం రైతుల వద్ద నుండి ముక్కు పిండి మరీ వసూలు చేశారు. సుమారు రూ. 95 లక్షల మేర వడ్డీ రాయితీ సొమ్ము రావలసి ఉంది. ఏడు శాతంలో 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. మరో 3 శాతం కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. సకాలంలో చెల్లించని వడ్డీ రాయితీ సొమ్ముకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా అని రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వడ్డీ రాయితీ చెల్లించని ప్రభుత్వం రుణమాఫీ సొమ్ముకు వడ్డీలు వసూలు చేయడం సిగ్గు చేటని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మింగ మెతుకులేదు. మీసాలకి.. –మల్లారెడ్డి శేషమోహనరంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి. మింగ మెతుకులేదు.. మీసాలకి సంపెంగ నూనె రాసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వ తీరు ఉంది. హెలెన్ తుఫాన్ నష్టపరిహారం ఇవ్వడానికి ఖజానా చిల్లు చూపిస్తున్నారు. మరి గుంటూరు ప్రాంత రైతులకు నష్టపరిహారం ఎక్కడ నుండి తీసుకువచ్చి ఇస్తారు. రైతుల్ని మభ్యపెట్టడం, మోసగించడం చంద్రబాబుకు అలవాటైపోయింది. హెలెన్ నష్టపరిహారం జిల్లాకు రూ. 160 కోట్లు రావలసి ఉంది. గత ఏడాది వడ్డీ రాయితీ రూ. 90 లక్షలు రావలసి ఉండగా ఒక్క రూపాయి విడుదల చేయాలేదు. అన్నపూర్ణ జిల్లాలోని అన్నదాతను ఆదుకునే తీరు ఇదేనా?. రైతులకు వెంటనే హెలెన్ నష్టపరిహారం, వడ్డీరాయితీ ఇవ్వాలి. బంగారు ఆభరణాలపై అప్పులు ఇవ్వవద్దనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలి. హెలెన్ నష్టపరిహారం ఇవ్వాలి –కె.సాయిలక్ష్మీశ్వరి, వ్యవసాయ శాక సంయుక్త సంచాలకులు, ఏలూరు హెలెన్ నష్టపరిహారాన్ని రైతులకు మంజూరు చేయాల్సి ఉంది. -
యోషిదా చేజారిన స్వర్ణం
మహిళల రెజ్లింగ్ 55 కేజీల విభాగంలో సంచలనం నమోదయింది. ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్, జపాన్ రెజ్లర్ సవోరీ యోషిదా శుక్రవారం జరిగిన ఫైనల్లో అమెరికా రెజ్లర్ హెలెన్ చేతిలో 1-4తో ఓటమిపాలైంది. 13 సార్లు ప్రపంచ చాంపియన్ అయిన యోషిదా.. తొలి రౌండ్లో 1-0తో ఆధిక్యాన్ని కనబరిచింది. అయితే రెండో రౌండ్లో పుంజుకున్న మరౌలిస్ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా విజయం సాధించింది. అర్జెంటీనాకే హాకీ కిరీటం పురుషుల హాకీ టైటిల్‌ను అర్జెంటీనా తొలిసారి గెలుచుకుంది. బెల్జియంతో జరిగిన ఫైనల్లో 4-2తో విజయం సాధించింది. ఇప్పటివరకు అర్జెంటీనా మహిళలు నాలుగుసార్లు ఒలింపిక్స్ స్వర్ణం గెలవగా.. పురుషుల జట్టుకు ఇదే తొలి స్వర్ణం. కాగా కాంస్యం కోసం జరిగిన పోరులో జర్మనీ జట్టు నెదర్లాండ్స్‌పై గెలిచింది. హర్డిల్స్‌లో అమెరికా హవా కొనసాగింది. పురుషుల 400 మీ(47.73 సె), మహిళ 400 మీ (53.13 సె) అమెరికా స్వర్ణం సాధించింది. అటు, ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి ఇరానియన్ మహిళగా కిమియా అలీజాదే (57 కేజీల తైక్వాండో)నిలిచింది. పురుషుల డెకాథ్లాన్‌లో డిఫెండింగ్ చాంపియన్ (అమెరికా) ఆష్టన్ ఈటన్ టైటిల్ గెలిచాడు. అటు షాట్‌పుట్‌లోనూ ఒలింపిక్ రికార్డుతో (22.52 మీటర్లు) అమెరికన్ ర్యాన్ క్రౌసర్ స్వర్ణం గెలుచుకున్నాడు. -
కౌన్ బనేగా పూనమ్ కా హీరో
‘నా సరసన హీరోగా నటించే అవకాశం ఎవరు కొట్టేస్తారు?’ అని పూనమ్ పాండే లాంటి హాట్ గాళ్ పిలుపు ఇస్తే ఇంకేమన్నా ఉందా? కుర్రకారు రంగంలోకి దిగి, ఆ అవకాశం కోసం అప్లికేషన్ పెట్టేసుకుంటారు. విషయం ఏంటంటే... పూనమ్ కథానాయికగా ‘హెలెన్’ చిత్రం రూపొందనుంది. కానీ, ప్రముఖ నటి హెలెన్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రం కాదిది. పూర్తిగా వేరే కథ. ఇందులో పూనమ్ సరసన కొత్త అబ్బాయిని హీరోగా నటింపజేయాలని నిర్మాతలు అనుకున్నారట. అందుకని ‘కౌన్ బనేగా పూనమ్ కా హీరో’ అనే పోటీ నిర్వహించారు. ‘కౌన్ బనేగా పూనమ్ కా హీరో’ అని వీడియో పొందుపరిచారు. ఈ అవకాశం సంపాదించాలంటే రెండు నిమిషాల వీడియో చిత్రీకరించి, పంపించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పోటీదారులు వందల్లో ఉంటారు. సునాయాసంగా ఎంపిక చేసేయొచ్చు అనుకున్న నిర్మాతల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంకా 25 వేల వీడియోలు వచ్చాయి. మరి.. పూనమ్మా? మజాకానా? -
రైతుకేదీ బీ(ధీ)మా!
ముగిసిన గడువు లక్షన్నర మంది రైతులకు ఎదురుదెబ్బ పంటల బీమా గడువు ముగిసింది. రుణమాఫీపై ప్రభుత్వం తేల్చకపోవడంతో జిల్లా రైతాంగం బీమా ప్రీమియం చెల్లించ లేకపోయింది. దీంతో జిల్లాలో ప్రతి ఏటా బీమా పరిధిలోకి వచ్చే సుమారు లక్షన్నర మంది రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినపుడు రైతులకు ఎంతో కొంత అండగా ఉంటున్న బీమా ఈసారి లే కుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా పంట రుణాల కింద రూ.వెయ్యి కోట్లు వరకు బ్యాంకులు ఇస్తున్నాయి. పంటల బీమా పరిధిలోకి వచ్చే వరి, చెరకు వంటి పంటలను సాగుచేస్తూ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్న రైతులు జిల్లాలో దాదాపు లక్షన్నర మంది వరకు ఉన్నారు. గతేడాది రూ.లక్ష అప్పు తీసుకున్న రైతు 5 శాతం ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణ లక్ష్యంగా కాగా 1,32,375 మందికి రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే గత రబీ సీజన్లో రూ.200 కోట్లు లక్ష్యానికి గాను 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. దీని ప్రకారం వీరంతా వీరంతా దాదాపుగా బీమా ప్రీమియం కింద రూ.37 కోట్లకుపైగా చెల్లించారు. వీరితో పాటు బ్యాంకు రుణాలు పొందని మరో 230 మంది రైతులు రూ.లక్షన్నర వరకు ప్రీమియం కట్టారు. గడువు ముగియడంతో ఆందోళన హెలెన్, లెహర్ తుపాన్లు, భారీ వర్షాల సమయంలో జిల్లాలో పంటలు నీటమునిగాయి. ఈ సమయంలో 13,341 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనాలు వేశారు. మొత్తం 52,426 మంది రైతులు నష్టపోయారు. వీరికి ఇప్పటి వరకు బీమా పరిహారం రాకపోయినప్పటికీ వస్తుందనే ఆశ రైతుల్లో ఉంది. కానీ ఈసారి బీమా ప్రీమియంను ఆరు శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జూలై 31వ తేదీ తుది గడువుగా ప్రకటించింది. ప్రతి యేటా ఈ సమయానికి రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. దీంతో రుణం ఇచ్చేటప్పుడే ప్రీమియం సొమ్మును బ్యాంకుల మినహాయించుకుంటాయి. కానీ ఈసారి టీడీపీ రుణమాఫీ హామీ కారణంగా పరిస్థితి మారింది. సర్కారు నాన్చుడి ధోరణి వల్ల రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై నెలదాటినా బ్యాంకులు ఇప్పటి వరకు రైతులకు సుమారుగా రూ.4 కోట్లు వరకు మాత్రమే రుణాలుగా అందించాయి. దీంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. గడువు పొడిగించని పక్షంలో రైతులకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోతుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు పెంపు! ముందు ప్రకటించిన విధంగా బీమా గడువు గత నెల 31తో ముగిసింది. కనీసం పదుల సంఖ్యలో కూడా రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో బీమా గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నారు. -
బలపడిన ద్రోణి
సాక్షి, చెన్నై: గత ఏడాది రాష్ట్రంలో వర్షపాతం అంతంత మాత్రమే. నైరుతీ, ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేసినా, పైలీన్, హెలెన్, లెహర్, మాదీ తుపానుల రూపంలో ఓ మోస్తరుగా వర్షం పడింది. రెండు రోజుల క్రితం బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బల పడుతుండటంతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాదిలోని సముద్ర తీర జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. తంజై, నాగైలలో వర్షం: బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో నెలకొన్న ఈ ద్రోణి ఆదివారం వాయుగుండంగా మారింది. శ్రీలంక తీరంలోని యాల్పానం సమీపంలో కేంద్రీ కృతమైన ఈ ద్రోణి రాష్ట్రం వైపు పయనించే అవకాశం కనిపిస్తోంది. గంటకు 45 -65 కి.మీ వేగంతో దూసుకొస్తున్న ఈ ద్రోణి ప్రభావంతో తంజావూరు, నాగపట్నం జిల్లాల్ని వర్షం ముంచెత్తుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలలు ఎగసి పడుతుండటంతో ఆదివారం జాలర్లు చేపల వేటకు దూరంగా ఉన్నారు. సముద్ర తీరవాసుల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారు. కెరటాల జడి: ఈ ద్రోణి ప్రభావంతో సముద్ర తీర జిల్లాలు తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, కడలూరు, నాగప్పటం, తిరువారూర్, తూత్తుకుడి, కన్యాకుమారిల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉంది. తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, తూత్తుకుడి, కన్యాకుమారిల్లో అయితే, అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ కెరటాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. కెరటాల తాకిడి పెరుగుతుండటంతో పడవల్ని భద్ర పరిచే పనిలో జాలర్లు పడ్డారు. నడి సముద్రంలోకి వెళ్లొద్దన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో మర పడవలు, మోటార్ బోట్ల పడవలు కలిగిన జాలర్లు అప్రమత్తమయ్యారు. రామేశ్వరం, నాగై, పాంబన్, పుదుచ్చేరి తదితర హార్బర్లలో ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. వాతావరణ కేంద్రం డెరైక్టర్ రమణన్ పేర్కొం టూ, ద్రోణి బలపడిందన్నారు. వాయుగుండంగా మారిన ఈ ద్రోణి మరింత బలపడి తుపానుగా మారేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని సముద్ర తీర జిల్లాల్లో అత్యధిక శాతం వర్షం పడే అవకాశాలున్నాయని చెప్పారు. మరో 48 గంటల్లో భారీ వర్షాల్ని చూడొచ్చన్నారు. ఈ ద్రోణి తమిళనాడు వైపుగానే పయనిస్తోందని తెలిపారు. గాలుల ప్రభావం క్రమంగా పెరుగుతోందని, అలలు మరింతగా ఎగసి పడనున్న దృష్ట్యా, జాలర్లు నడి సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. -
తల్లడిల్లుతున్న తీరప్రాంతం
రేపల్లె, న్యూస్‌లైన్: వరుస తుపానులతో తీరం తల్లడిల్లిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాదీ తుపాను బలపడి తీవ్రంగా మారుతుందనే హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వేటకు వెళ్లిన మత్య్సకారులు ఒడ్డుకుచేరాలని ఫోన్ మెసెజ్‌లను అందించారు. దీంతో సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా హార్బర్‌కు చేరుకుంటున్నాయి. వరుసగా గత రెండు మాసాలలో పైలీన్, హెలెన్, అధిక వర్షపాతాలు, లెహర్లతో ఇబ్బందులకు గురైన తీరప్రాంత ప్రజలు ‘మాదీ’ తుపాను హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆక్టోబర్ మాసంలో పైలీన్, నవంబర్ మొదటివారంలో హెలెన్, చివరి వారంలో లెహర్ తుపానులు సంభవించడంతో సముద్రపు వేట పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క తుపాను ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరొక తుపాను ముంచుకొస్తుండడంతో తీరప్రాంతంలోని మత్య్సపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. నిజాంపట్నం హార్బర్లో 150 మెక్‌నైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలో 700 వరకు మోటరైజ్డ్ బోట్లలో మత్య్సకారులు నిరంతరం సముద్ర వేట నిర్వహిస్తుంటారు. వరుస తుపానులతో పనులు లేక మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. విపత్కర పరిస్థితుల్లో పనులు కోల్పోతున్న మత్య్సకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. -
మన ప్రభుత్వం వస్తుంది ఓపిక పట్టండి
-
మన ప్రభుత్వం వస్తుంది, ఓపిక పట్టండి: జగన్
నరసాపురం : నాలుగు నెలలు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు, మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. రైతుల రుణాలు మాపీ చేయాలని.. కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం స్పందించినా...స్పందించకున్నా..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో హెలెన్ బాధితులకు ధైర్యం చెప్పి.. వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతలకు భరోసా ఇవ్వడానికి వచ్చారు . నరసాపురం నుంచి బయల్దేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్మణేశ్వరం, సార్వా గ్రామాల్లో హెలెన్ దెబ్బకు నాశనమైన వరిని పరిశీలించారు. ఒక నెలలో రెండు తుపాన్లు తమను రోడ్డున పడేశాయని రైతులు వాపోయారు. పంట పూర్తిగా కొట్టుకుపోయినా..తమనెవరూ పట్టించుకోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణేశ్వరం దేవుని తోటలో తుపాను తాకిడికి దెబ్బతిన్న ఇళ్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఎంత పెట్టుబడి పెట్టారు... ఎంత రాబడి వచ్చిందని రైతులను అడిగి తెలుసుకున్నారు. కుళ్లిపోయిన వరి పంటను..వరి ధాన్యాన్ని అన్నదాతలు చూపించారు. అంతేకాదు...నడవలేని వృద్దులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి రోడ్డెక్కారు. వారిని పెన్షన్లు, ఆరోగ్య శ్రీ గురించి అడిగి తెలుసుకున్నారు . -
పంటలను పరిశీలించిన వైఎస్ జగన్
-
అన్నదాతలకు జగన్ భరోసా
-
పకృతి ప్రకోపానికి బలైపోతున్న అన్నదాత
-
రైతు గుండెల్లో లెహర్రర్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రకృతి కన్నెర్రతో రైతన్న వణికిపోతున్నాడు. అకాల వర్షాలతో ఇప్పటికే రైతులు చాలా నష్టపోయాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరుస తుపాన్లు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మూడు సార్లు విరుచుకుపడిన తుఫాన్ల ధాటికి తట్టుకోలేక కుదేలయిన అన్నదాతలకు... మరోసారి తుఫాన్ రానుందన్న వార్త శరాఘాతమై తగులుతోంది. పై-లీన్, హెలెన్ తుఫాన్ల నుంచి ముప్పు తప్పినా గత నెలలో ఏర్పడిన అల్పపీడనం నిండా ముంచేసింది. అధిక వర్షాలతో ఉద్యాన పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. వరి పంట ఇంటికి వస్తుం దన్న తరుణంలో తాజాగా లెహర్ తుఫాన్ విరుచుకుపడనుంద న్న సమాచారంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పార్వతీపురం డివిజన్లో చాలా చోట్ల వరి కోతలు పూర్తి అయ్యాయి. వరి పనలు ఇంకా కళ్లాల్లోనే ఉన్నాయి. ఇప్పు డు వర్షాలు పడితే తమగతమేం కానని వారు వాపోతున్నారు. విజయనగరం డివిజన్లో కోతలు ప్రారంభం కావలసి ఉంది. అయితే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పంటనుకోసేందుకు ఎవరూ సాహసించడంలేదు. కోతలు కోసేసిన తరువాత వర్షాలు పడితే పంట పూర్తిగా నాశనమవుతుందని, కోయకుండా ఉంటే కొంతవరకైనా రక్షించుకోవచ్చన చివరి ఆశలో రైతులున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు జిల్లాలో రూ.323.4 కోట్ల మేర నష్టం సంభవించింది. వివిధ పంటలు 16,936 హెక్టార్లలో, ఉద్యాన పంట లు 1197.37 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 82 హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంటకు నష్టం కలిగింది. 2,655 ఇళ్లు కూలిపోయాయి. హెలెన్ కన్నా లెహర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించడంతో ఏమవుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పూరి ళ్లు, లోతట్టు ప్రాంతాల వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు పడేటప్పుడు బయట తిరగరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కంట్రోల్ రూమ్‌లు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ సారి ఎన్ఆర్డీఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డులను సైతం సాయంకోసం అందుబాటులో ఉంచారు. మత్స్యకారులూ... వేటకు వెళ్లొద్దు.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పంటలు కోసే ముందు వాతావరణాన్ని చూసుకోవాలని వారు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నంబరు 1077 కొనసాగిస్తున్నారు. తీరప్రాంతాలకు ప్రత్యేకాధికారులను సైతం నియమించారు. ఈనెల 28న తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
వరుస విపత్తులతో వెన్నువిరిగిన అన్నదాత శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, సాక్షి ప్రతినిధులు వరుస విపత్తులు.. ఒకదాని వెనుక మరొకటి ముంచుకొస్తున్న తుపాన్లు.. మొన్న పై-లీన్, నిన్న కుండపోత వర్షాలు.. నేడు హెలెన్.. అన్నదాతను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు లెహెర్ రూపంలో మరో పెను తుపాను తరుముకొస్తోంది! కేవలం నెల వ్యవధిలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి విరుచుకుపడడంతో రాష్ట్రంలో రైతులు విలవిలలాడిపోతున్నారు. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట సరిగ్గా చేతికొచ్చే సమయంలోనే సర్వనాశనమైంది. ఖరీఫ్‌లో వేసిన పంటంతా ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెనునష్టం వాటి ల్లింది. హెలెన్ దెబ్బకు ఈ ఐదు జిల్లాల్లోనే దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరి దారుణంగా దెబ్బతింది. లక్షకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మామిడి, అరటి, జీడి తోటలతోపాటు కాయగూర పంటలు కూడా హెలెన్ దెబ్బకు నేలపాలయ్యాయి. ఈ వరుస విపత్తులతో ఈ ఐదు జిల్లాల్లోనే వరి రైతులకు రూ.1,800 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500 కోట్ల నష్టం జరిగింది. గోరుచుట్టుపై రోకటిపోటులా రైతులపై దెబ్బమీద దెబ్బ పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. నష్టపరిహారం ఊసే మర్చిపోయింది. పెట్టుబడి రాయితీ అందని ద్రాక్షే అవుతోంది. అక్కడక్కడ ఏదో మొక్కుబడిగా కొందరు రైతులకు పరిహారం అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. పశ్చిమగోదావరికి పెను నష్టం.. ఈ ఏడాది పశ్చిమగోదావరి జిల్లాను వరుస తుపానులు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. తాజా హెలెన్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసి 2.73 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అంతకు ముందు పై-లీన్ కారణంగా 34,171 ఎకరాల్లో వరి నాశనమైంది. ఈ రెండు తుపానుల కారణంగా జిల్లాల్లో రైతులు రూ.220 కోట్ల మేర నష్టపోయారు. జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం తప్పితే నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పైసా పెట్టుబడి రాయితీ అందించలేదు. ‘తూర్పు’లో కుదేలైన కొబ్బరి రైతు వరి అత్యధికంగా పండించే తూర్పుగోదావరి జిల్లా వరుస తుపాన్లతో అల్లాడింది. జిల్లాలో హెలెన్ దెబ్బకు దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. కోనసీమలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఒక్క జిల్లాలోనే సుమారు 80 వేల కొబ్బరి చెట్లు కూలిపోవడంతో కోట్లలో నష్టం వాటిల్లింది. బోండాలు రాలిన నష్టమే రూ.28 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మొత్తమ్మీద ఈ జిల్లాలో రైతులు రూ.225 కోట్ల మేర నష్టపోయారు. శ్రీకాకుళంలో అపార నష్టం పై-లీన్, హెలెన్ దెబ్బకు జిల్లాలో ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలు పనికి రాకుండా పోయాయి. వరి, ఇతర పంట పొలాల్లో ఇంకా నీరు నిలిచే ఉండడంతో రైతులు దిగుబడిపై ఆశలు వదులుకున్నారు. అధికారుల అంచనా ప్రకారం పై-లీన్, హెలెన్ కారణంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. కొబ్బరి, జీడి తోటలు నాశనమవడంతో రైతుల గుండె చెదిరింది. రెండు తుపాన్లతో జిల్లాలో రైతులు రూ.312 కోట్ల మేర నష్టపోయారు. విపత్తులతో జిల్లాలో 80 వేల మంది రైతులు నష్టపోయినా ప్రభుత్వం నుంచి వారికి ఇప్పటికీ నయా పైసా సాయం అందలేదు. విశాఖకు ‘నీలం’ సాయమే అందలేదు.. జిల్లాలో గతేడాది నీలం తుపానుతో నష్టపోయిన రైతులకే పరిహారం నేటికీ అందలేదు. తాజాగా వచ్చిన పై-లీన్, హెలెన్ తుపాన్లతో రూ.416.76 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. విపత్తులతో 71,042.5 ఎకరాల్లో రూ.59.62 కోట్ల పంట నష్టం జరిగిందని అధికారులు లెక్క కట్టారు. 61,269మంది రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. ఇప్పటికీ వారికి పెట్టుబడి రాయితీ పూర్తిస్థాయిలో అందలేదు. కృష్ణా జిల్లాలో భారీ నష్టం వరుస తుపాన్లతో కృష్ణా జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నీటిపాలైన పంటలో కొంతైనా దక్కకపోతుందా అనే ఆశతో రైతన్నలు చేల వద్దే రాత్రి పగలు నీటిని తోడుతున్నారు. గూడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కత్తివెన్ను మండలాల్లోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రైతులకు రూ.275 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పై-లీన్ తుపాను కారణంగా నష్టపోయిన 60 వేల మంది రైతులకు ఇప్పటికీ పైసా సహాయం అందలేదు. అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు.. ‘‘నేను రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి వేశా. మొన్న అక్టోబర్‌లో భారీ వర్షాల వల్ల గింజ సరిగా పాలుపోసుకోలేదు. ఉన్నవాటినైనా దక్కించుకుందామనుకున్న సమయంలో హెలెన్ వచ్చింది. పైరు మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు అప్పులు తెచ్చి రెండెకరాలకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టాను. పంట పోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’’ - భూపతి పరశురామయ్య, చినకామనపూడి, కృష్ణా జిల్లా పంటపై ఆశలు వదిలేసుకున్నా.. ‘‘నేను సొంతానికి ఐదెకరాలు, కౌలుకు మరో ఐదెకరాలు సాగు చేస్తున్నాను. ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో పది రోజుల్లో కోతలు కోద్దామని అనుకునే సరికి హెలెన్ ముంచేసింది. పంటపై ఆశలు వదిలేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతలు కోయిస్తే కూలీల ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క గింజ కూడా చేతికొచ్చే అవకాశంలేదు’’ - దున్నాల రామకృష్ణయ్య, వానపల్లిపాలెం, తూర్పుగోదావరి కూరగాయల రైతులకు పరిహారం ఇవ్వాలి ‘‘ఎన్నో ఏళ్లుగా కూరగాయ పంటలు సాగుచేస్తున్నాను. తుపానులు, భారీ వర్షాలతో ఈ ఏడాది మొక్కలు, పాదులు నాశనమయ్యాయి. ఎకరం విస్తీర్ణంలో కూరగాయలకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాను. ఇంత దారుణంగా ఎన్నడూ నష్టపోలేదు. ప్రభుత్వం కూరగాయల రైతులకు కూడా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి’’ - జక్కంశెట్టి రాముడు, జిన్నూరు, పశ్చిమగోదావరి జిల్లా -
26, 27న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ‘హెలెన్’ బీభత్సంతో కోస్తా జిల్లాలు అతలాకుతలమైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. వరుస విపత్తులు రైతును నట్టేట ముంచిన నేపథ్యంలో బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఈ నెల 28 నుంచి ఆయన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి చేపట్టాల్సిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ప్రారంభ తేదీ మారింది. ఈ నెల 30వ తేదీ నుంచి యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత 30వ తేదీ నుంచి సమైక్య శంఖారావాన్ని చేపడతారు. -
అల్పపీడనంగా బలహీనపడ్డ హెలెన్ తుపాను
విశాఖ : మచిలీపట్నం వద్ద నిన్న తీరం దాటిన హెలెన్ తుపాను శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని పయనిస్తోంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తుండటంతో తెలంగాణ, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చిరించింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు 50వేల కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 2 లక్షల హెక్టార్లలో వరిపంట నీట మునిగింది. 350 ఇళ్లు తుపాను ధాటికి కొట్టుకుపోయాయి. -
తుఫానుగా మారిన తీవ్ర తుఫాను హెలెన్
తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన హెలెన్ పెను తుఫాను బలహీనపడి.. తుఫానుగా మారిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది ప్రస్తుతం పశ్చిమదిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటలలో కోస్తా సహా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కాగా, హెలెన్ తుఫానుపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావం వల్ల కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే తుఫాను కారణంగా కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఎమ్మార్వో విధి నిర్వహణకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. తుఫాను, పెను గాలుల వల్ల వరి చేలతో పాటు కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను మొదలుపెట్టామని, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16,290 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. -
నడిసముద్రంలో చిక్కుకున్న మత్యకారులు
ప.గో: తాము నడి సముద్రంలో చిక్కుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మత్యకారులు మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టామని చెబుతున్నాపట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తుందని ఓ మత్యకారుడు 'సాక్షి'కి తెలిపారు. బంగాళఖాతంలో చిక్కకున్న వారంతా కాకినాడకు చెందిన వారేనని తెలిపాడు. వేటకు వెళ్లిన వారు సముద్రంలోకి సహాయం కోసం చూస్తున్నారన్నారని తెలిపాడు. హెల్ప్‌లైన్ సాయంతో అభ్యర్థించినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రావడం లేదన్నాడు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్యకారులను ఒడ్డుకు తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపాడు. అంతర్వేది- చినమైనివానిలంక మధ్య 31 మంది మత్యకారులు చిక్కుకున్నారన్నారు. నాలుగు బోట్లలో వేటకు వెళ్లిన వీరు హెలెన్ తుపానులో చిక్కుకుపోయారు.ఈ విషయాన్ని 'సాక్షి' జిల్లా కలెక్టర్ సిద్దార్ ధ్జైన్ దృష్టి కి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన కలెక్టర్ మత్యకారులతో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పాడ - కాకినాడ బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను దృష్ట్యా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమిలి, కళింగపట్నం ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. ఇక తీరప్రాంతంలో ఉన్న పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... సెలవులో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. -
తుఫాన్‌తో వనుకుతున్న కోన సీమలు
-
మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటిన 'హెలెన్'
మచిలీపట్నం : రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలన్నింటినీ వణికించిన హెలెన్ తుఫాను కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో తీరం దాటిందని జిల్లా కలెక్టర్ రఘునందన్ ప్రకటించారు. తుఫాను తీరం దాటిందని, ఇప్పటివరకు దాని ప్రభావం వల్ల కృష్ణా జిల్లాలో రెండు మరణాలు సంభవించాయని ఆయన తెలిపారు. మరో ఆరు గంటల పాటు అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో దాని ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గంటకు 70 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా ప్రయాణాలు మానుకుని ఇళ్లవద్దే ఉండాలని కలెక్టర్ సూచించారు. మచిలీపట్నం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను ప్రభావంతో కృష్ణాజిల్లాలో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇక మంగినపూడి వద్ద సముద్రం 700 మీటర్లు ముందుకు వచ్చింది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుఫాను కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి సముద్రంలో అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. మచిలీపట్నం, బంటుమిల్లి, బందర్, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ - కాకినాడ బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను దృష్ట్యా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమిలి, కళింగపట్నం ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. ఇక తీరప్రాంతంలో ఉన్న పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... సెలవులో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్దార్ధ జైన్ సమావేశమై పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎనిమిది మండలాల పరిధిలో 37 గ్రామాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇక గుంటూరు జిల్లా పైన కూడా తుపాన్ ప్రభావం నెలకొంది. 39 గ్రామాలకు తుపాన్ ప్రభావం ఉంది. అలాగే నెల్లూరు జిల్లాపై కూడా హెలెన్ తుపాను ప్రభావం చూపుతోంది. హెలెన్ తుపాను హెల్ప్‌లైను నంబర్లు కాకినాడ: 0884 - 2365506 ఏలూరు: 08812 - 230050 నరసాపురం: 08814 - 27699 కొవ్వూరు: 08813 - 231488 జంగారెడ్డిగూడెం: 08812 - 223660 మచిలీపట్నం: 08672 - 252572, 1077 విజయవాడ: 0866 - 2576217 విశాఖ: 1800 - 42500002 శ్రీకాకుళం: 08942 - 240557, 9652838191 నెల్లూరు: 0861- 2331477, 2331261 -
హెలెన్ తుపాను అనుభవాలు పంచుకోండి
ఒక్క పక్క విభజన దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో రాజకీయ సంక్షోభంలో చిక్కిన ఆంధ్రప్రదేశ్ మీద మరో పక్క ప్రకృతి కూడా తన ప్రతాపం చూపిస్తోంది. ఫై-లీన్ తుపాను దెబ్బ మీద దెబ్బగా పెను వాన బీభత్సం, ఇప్పుడు ఈ హెలెన్ తుఫాను. ఒకదాని వెనక మరొకటిగా ముంచుకొస్తున్న తుపాన్లు తీరాలు దాటుతున్నాయి. కానీ, ఆ విలయాల బీభత్సం, చేసిన గాయాలు మిగిలే ఉంటున్నాయి. మీకు ప్రత్యక్ష అనుభవంలోకి వస్తున్న ఈ విషయాల్నిపదిమందితో పంచుకోవాలని ఉందా? మీ ప్రాంతంలో తుపాను కలిగిస్తున్న నష్టాల గురించి సమాచారం, ఫొటోలు, వీడియోలను మాకు పంపండి. మీరు పంపిన సమాచారాన్ని సమగ్రంగా అందరికీ అందిస్తాం. మీరు సమాచారం పంపాల్సిన మెయిల్ ఐడీ..sakshidaily@gmail.com ఆండ్రాయిడ్, ఐఫోన్ల నుంచి సాక్షి న్యూస్ యాప్ ద్వారా కూడా ఈ సమాచారాన్ని మాకు అందజేయొచ్చు. అందుకుసాక్షి యాప్ లో ఉన్న 'ప్రత్యక్ష సాక్షి'అనే లింకును ఉపయోగించండి. దానిద్వారా ఫొటోలు, వీడియోలు పంపండి. మీరు పంపిన కథనాలు, ఫొటోలు, వీడియోలను వాటిని sakshi.com ద్వారా ఈ ప్రపంచానికి మేం అందిస్తాం. -
హెలెన్ తుపానుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హెలెన్ తుపానుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకె మహంతితో పాటు ఉన్నతాధికారులుతో సమీక్ష జరిపారు. సముద్ర తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. జాతీయ విపత్తు నివారణ సంస్థతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. అవసరం అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుర్పూ, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లా అధికార యంత్రాగం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందాలతో కలిసి పనిచేయాలన్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో సముద్రంలో చిక్కుకున్న 20మంది మత్స్యకారులను నేవీ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి -
తూ.గో.జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు
-
మచిలీపట్నానికి చేరువలో హెలెన్
-
మచిలీపట్నానికి చేరువలో హెలెన్ తుపాను
మచిలీపట్నం : తీరానికి మరింత చేరువైన హెలెన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా...140 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం-నర్సాపురం మధ్య... తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ సమయంలో గంటకు 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో తుఫాను తీవ్రత తూర్పు తీరప్రాంతమంతా ఉండనుంది. తీరం వెంబడి సముద్రంలో అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. మచిలీపట్నం, బంటుమిల్లి, బందర్, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ మధ్యాహ్నం మచిలీపట్నం-నర్సాపురం మధ్య తుఫాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు గజగజలాడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ - కాకినాడ బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను దృష్ట్యా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో... 10వ నంబర్ , కాకినాడ ఓడరేవులో 9వ నెంబరు, విశాఖ, గంగవరం, భీమిలి, కళింగపట్నం ఓడరేవుల్లో... 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఇక తీరప్రాంతంలో ఉన్న పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... సెలవులో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్దార్ధ జైన్ సమావేశమై పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎనిమిది మండలాల పరిధిలో 37 గ్రామాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇక గుంటూరు జిల్లా పైన కూడా తుపాన్ ప్రభావం నెలకొంది. 39 గ్రామాలకు తుపాన్ ప్రభావం ఉంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలాగే నెల్లూరు జిల్లాపై కూడా హెలెన్ తుపాను ప్రభావం చూపుతోంది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హెలెన్ తుపాను హెల్ప్‌లైను నంబర్లు కాకినాడ: 0884 - 2365506 ఏలూరు: 08812 - 230050 నరసాపురం: 08814 - 27699 కొవ్వూరు: 08813 - 231488 జంగారెడ్డిగూడెం: 08812 - 223660 మచిలీపట్నం: 08672 - 252572, 1077 విజయవాడ: 0866 - 2576217 విశాఖ: 1800 - 42500002 -
హెలెన్ తుపాను తరుముకొస్తోంది...
-
తుపాను తరుముకొస్తోంది..
నేడు మచిలీపట్నం వద్ద తీరం దాటనున్న హెలెన్ కృష్ణా, గుంటూరు, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం గంటకు 75-120 కి.మీ. వేగంతో గాలులు రేవుల్లో కొనసాగుతున్న ప్రమాద హెచ్చరికలు రాష్ట్రానికి పొంచి ఉన్న మరో ముప్పు దక్షిణ అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం.. తుపానుగా మారే ప్రమాదం.. పంటలు ఏమౌతాయోనన్న ఆందోళనలో రైతులు సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: హెలెన్ దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ పెను తుపాను శుక్రవారం సాయంత్రంలోపు కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. గురువారం రాత్రి 10 గంటల సమయానికి మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 180కి.మీ దూరంలో హెలెన్ కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 75 నుంచి 120 కి.మీ. మధ్య వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు నిజాంపట్నం, వాడరేవు, మచిలీపట్నం రేవుల్లో పదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడలో 9వ నంబర్, కళింగపట్నం, గంగవరం, విశాఖపట్నం, భీమిలి, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు. అంచనాలను తలకిందులు చేస్తూ: హెలెన్ తుపాను అంచనాల్ని తలకిందులు చేస్తూ ప్రయాణిస్తోంది. మంగళ, బుధవారం నాటి పరిస్థితుల్ని బట్టి ఒంగోలు, కావలి ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే గురువారం కల్లా దిశ మార్చుకుని మచిలీపట్నం తీరం వైపు కదులుతోంది. మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉండడంతో ఈ ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపైనా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది తీవ్ర తుపానుగానే ఉందని, పెను తుపానుగా మారే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అధికారులు అంటున్నారు. తుపాను మెల్లగా కదులుతుండడంతో నష్టం స్థాయి ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని, పంట చేతికొచ్చే సమయంలో తుపాను రావడంతో రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉందని రిటైర్డ్ మెట్రాలజిస్ట్ ఎ.అచ్యుతరావు తెలిపారు. తెలంగాణ, రాయలసీమకూ వర్షాలు! తుపాను ప్రభావంతో శుక్రవారం సాయంత్రం వరకు కోస్తాలో భారీ వర్షాలతోపాటు, తెలంగాణ, రాయలసీమల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కళింగపట్నం, టెక్కలి ప్రాంతాల్లో ఒక్కో సెం.మీ చొప్పున వర్షం పడింది. జిల్లాలు బిక్కుబిక్కు: హెలెన్ తుపానుతో కోస్తాంధ్ర జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి. కృష్ణా జిల్లాలో తుపాను తీవ్రత అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ మండలాల్లో 23 వేల కుటుంబాలు తుపాను బారిన పడే అవకాశం ఉందని గుర్తించారు. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధమైంది. 1.37 లక్షల ఎకరాల్లో పత్తి మూడో తీత దశలో ఉంది. ఇప్పుడు వర్షాలు కురిస్తే చేతికందే దశలో ఉన్న ఈ పంటలన్నీ దెబ్బతింటాయని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు జిల్లాలో తీర ప్రాంతంలో అలలు పోటెత్తుతున్నాయి. తీరంలోని ఆరు మండలాలను లోతట్టు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రకాశం జిల్లాకు జాతీయ విపత్తు సహాయ సంస్థ నుంచి 80 మందితో కూడిన ప్రత్యేక బృందం వచ్చింది. 11 తీర ప్రాంత మండలాల్లోని 46 వేల మందిని ఏ క్షణంలోనైనా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో 69 గ్రామాల పరిధిలో చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ, ఓడలరేవు, అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ వద్ద అలలు ఆరడుగుల మేర ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ శివారు సుబ్బంపేట నుంచి ఉప్పుటేరు పెదవంతెన వరకు సుమారు 3 కి.మీ. మేర రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. పెరుమాళ్లపురం నుంచి రెండు బోట్లలో వెళ్లిన 14 మంది, సూర్యారావుపేట నుంచి ఒక బోటులో వెళ్లిన ఏడుగురు సముద్రంలో చిక్కుకున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంక వద్ద సముద్రం 30 మీటర్లు ముందుకొచ్చింది. ప్రాణ నష్టం ఉండరాదు: రఘువీరా, సీఎస్ హెలెన్ తుపాను నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం కోస్తా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ మేరకు స్పష్టంచేశారు. కాగా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాస్తవ రైల్వేలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. పొంచి ఉన్న మరో ముప్పు? హెలెన్ ముప్పు నుంచి ఇంకా బయటపడక ముందే మరో గండం పొంచి ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ అండమాన్ ప్రాంతంలోని మహా సముద్రంలో అల్పపీడనం ఉన్నట్టు అధికారులు అంచనాకొచ్చారు. ఇది మరింత బలపడి తుపానుగా కూడా మారే ప్రమాదం ఉందని, దీని వల్ల కోస్తాంధ్రకూ తీవ్ర స్థాయిలో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉత్తర/ఈశాన్య దిశలో ‘రెయిన్ బ్యాండ్స్’ అధికంగా ఉండడం వల్ల తుపాన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు తుపాన్ల గండం తప్పదని, గతంలో నెలరోజుల వ్యవధిలో మూడుమార్లు తుపాన్లు ఏర్పడిన సందర్భాలున్నాయని వాతావరణ శాఖ మాజీ అధికారి మురళీకృష్ణ చెప్పారు. -
'హెలెన్'ను మార్స్ అర్బిటర్ చిత్రీకరించింది'
ఆంధ్ర ప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న హెలెన్ తుఫాన్ కు సంబంధించిన చిత్రాలను భారత మార్స్ ఆర్బిటర్ పంపింది. మన దేశానికి సంబంధించిన చిత్రాలను మార్స్ అర్బిటెర్ మొదటి సారిగా చిత్రీకరించి పంపిందని ఇస్రో అధికారులు వెల్లడించారు. మొదటి విడుతగా భూమండలానికి సంబంధించిన చిత్రాలను ముఖ్యంగా భారత ఉపఖండం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల చిత్రాను 'మంగళయాన్' పంపించిందని ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్ర తీర ప్రాంతాన్ని కుదిపేస్తున్న హెలెన్ తుఫాన్ కు సంబంధించిన ఫోటోలను మంగళవారం చిత్రీకరించిందని అధికారులు తెలిపారు. స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న పరికరాలను పరిశీలిస్తున్నాం అని అన్నారు. మార్స్ అర్బిటర్ లో అమర్చిన మార్స్ కలర్ కెమెరా ద్వారా మంగళవారం మధ్యాహ్నం 1.50 నిమిషాలకు 67975 కిలోమీటర్ల దూరంలో 3.53 కి.మి రిజల్యూషన్ తో చిత్రీకరించింది అని ఇస్రో తెలిపింది. అధికారికంగా ఒకే ఒక ఫోటోను ఇస్రో వెబ్ సైట్లో పెట్టారు. Photo courtesy: http://www.isro.org/pslv-c25/Imagegallery/mom-images.aspx -
ముంచుకొస్తున్న హెలెన్ ముప్పు
-
తీవ్ర తుఫాన్‌గా మారిన 'హెలెన్'
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న హెలెన్ తుపాన్ తీవ్ర తుఫాన్‌గా మారిందని విశాఖపట్నంలోని వాతావరణశాఖ వెల్లడించింది. ఒంగోలుకు తూర్పు దిశగా 360 కిలోమీటర్ల దూరంలో హెలెన్ కేంద్రీకృతమైందని తెలిపింది. రేపు మధ్యాహ్నం హెలెన్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం కోస్తాంధ్రకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అలాగే దక్షిణ కోస్తాలో కూడా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. సముద్ర తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను తీవ్రత దృష్ట్యా పోర్టులో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ ఓడరేవులో ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నంలలో ఆరో నెంబర్ ప్రమాద హెచ్చరిక...కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. హెలెన్ తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నెల్లూరులో 35 అడుగుల మేర ముందుకు చొచ్చుకుని వచ్చింది. కాకినాడ సముద్రతీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. -
అల్లకల్లోలంగా మారిన సముద్రం