హెలెన్ దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ పెను తుపాను శుక్రవారం సాయంత్రంలోపు కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. గురువారం రాత్రి 10 గంటల సమయానికి మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 180కి.మీ దూరంలో హెలెన్ కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు.