హెలెన్’ బీభత్సంతో కోస్తా జిల్లాలు అతలాకుతలమైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ‘హెలెన్’ బీభత్సంతో కోస్తా జిల్లాలు అతలాకుతలమైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. వరుస విపత్తులు రైతును నట్టేట ముంచిన నేపథ్యంలో బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఈ నెల 28 నుంచి ఆయన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి చేపట్టాల్సిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ప్రారంభ తేదీ మారింది. ఈ నెల 30వ తేదీ నుంచి యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత 30వ తేదీ నుంచి సమైక్య శంఖారావాన్ని చేపడతారు.