ప.గో: తాము నడి సముద్రంలో చిక్కుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మత్యకారులు మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టామని చెబుతున్నాపట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తుందని ఓ మత్యకారుడు 'సాక్షి'కి తెలిపారు. బంగాళఖాతంలో చిక్కకున్న వారంతా కాకినాడకు చెందిన వారేనని తెలిపాడు. వేటకు వెళ్లిన వారు సముద్రంలోకి సహాయం కోసం చూస్తున్నారన్నారని తెలిపాడు. హెల్ప్లైన్ సాయంతో అభ్యర్థించినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రావడం లేదన్నాడు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్యకారులను ఒడ్డుకు తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపాడు. అంతర్వేది- చినమైనివానిలంక మధ్య 31 మంది మత్యకారులు చిక్కుకున్నారన్నారు. నాలుగు బోట్లలో వేటకు వెళ్లిన వీరు హెలెన్ తుపానులో చిక్కుకుపోయారు.ఈ విషయాన్ని 'సాక్షి' జిల్లా కలెక్టర్ సిద్దార్ ధ్‌జైన్ దృష్టి కి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన కలెక్టర్ మత్యకారులతో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉప్పాడ - కాకినాడ బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను దృష్ట్యా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమిలి, కళింగపట్నం ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. ఇక తీరప్రాంతంలో ఉన్న పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... సెలవులో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు.