Helen cyclone
-
కౌలుదారులకు రబీ రుణాలందేనా?
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌లో పైలీన్, హెలెన్, లెహర్ వరుస తుపాన్లతో జిల్లాలోని కౌలు రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. కానీ వారికి ఎలాంటి నష్ట పరిహారం అందే అవకాశం లేదు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేసి ఖరీఫ్ పెట్టుబడి పెట్టిన కౌలురైతుకు పంటచేతికిరాక నానా ఇబ్బందులు పడుతున్నాడు. రబీ సాగు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రుణ సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వీరికి ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించకపోతే సాగు ప్రశ్నార్ధకమే. అయితే కౌలుదారులకు ఈ రబీలోనూ పంట రుణాలు అందే అవకాశం కనబడటం లేదు. జిల్లాలో 1.60లక్షల మంది కౌలుదారులున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే కేవలం 20వేల మందికే గుర్తింపు కార్డుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. 2010లో 68వేల మందికి గుర్తింపుకార్డులిచ్చిన ప్రభుత్వం 2011లో 35వేల మందికి, ఈ ఏడు 20వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులందజేశారు. ఖరీఫ్‌లోనే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పంట రుణాలు ఇవ్వలేదని కౌలుదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగా కౌలు కార్డులు పొందాలనుకున్నా పొలాలు కట్టుబడికి ఇచ్చిన రైతులు తమకు కార్డులు వస్తే, ఎక్కడ వారి పొలాలు కాకుండా పోతాయోనని తమకు కౌలుకు ఇచ్చినట్లుగా కాగితం రాసి ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస తుపాన్ల దెబ్బకు ఖరీఫ్ సాగులో నష్టపోయి, మళ్లీ బయట అప్పులు చేయాలంటే అధిక వడ్డీలు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని కౌలుదారులు వాపోతున్నారు. -
కలసిరాని కాలం
2013లో నాలుగు రోజులు ముందుగానే నైరుతి వచ్చినా పై-లీన్ తుపాను ప్రభావంతో నిష్ర్కమణ ఆలస్యమైంది. ఈశాన్య రుతుపవనాలు అనుకున్న సమయానికి రాలేదు. కాలం మారుతుంటే పంట ప్రారంభం, ముగింపు సమయాల్లో తేడాలొస్తున్నాయి. మే నెలాఖరుకు రుతుపవనాలు అనుకున్న సమయానికంటే ముందే రావడంతో వానలు మొదలయ్యాయి. జూన్ నెల ప్రారంభంలో చిన్నపాటి జల్లులే కురిసినా వారం గడిచే సరికి భారీ వర్షం పడింది. గతేడాదితో పోల్చితే దాదాపు 15 రోజులు ముందుగానే నాట్లు వేయాలని అన్నదాతలు సంకల్పించారు. జూన్ 13న కాలువలకు నీరు విడుదలవడంతో అనుకున్న విధంగానే జూన్ 15 నుంచి నారుమళ్లకు నీరు మళ్లించి 20 నాటికి నారువేయడం ప్రా రంభించారు. జూలై 10 నాటికి ఆ నారు చేతికందే సమయానికి తుపాను పట్టుకుంది. ముదురునారు వర్షం నీటలో మునిగిపోయింది. నాట్లు వేసేందుకు పలుచోట్ల రైతులు దమ్ములు కూడా చేయించా రు. నారు పాడవడంతో దమ్ములు నిరుపయోగమయ్యా యి. పెట్టుబడి దాదాపుగా రెట్టింపయ్యింది. ఆగష్టు తొలివారానికే జిల్లాలో నాట్లు పూర్తికావాల్సి ఉన్నా సెప్టెంబర్ తొలివారానికి గాని పూర్తికాలేదు. ఖరీఫ్‌లో ముందుగా సాగు చేద్దామనుకుంటే నెల రోజులు ఆలస్యమైంది. ఈసారి అక్టోబర్ కల్లా ఖరీఫ్ ముగించేయాలని రైతులు భా వించినా డిసెంబర్‌కు గాని పూర్తికాలేదు. అసువులు బాసిన అన్నదాతలు హెలెన్ తుపానుతో ఇద్దరు రైతులు బలైపోయారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌కు చెందిన పోతినేని భాస్కరరావు అనే పంటను కాపాడుకునేందుకు రైతు పొలంలో ఉండగా చెట్టు మీద పడి ప్రాణాలు వదిలాడు. తుపాను అనంతరం పాడైన పంటను చూసి పాలకోడేరులో చిలపరశెట్టి కృష్ణమూర్తి అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొనసాగిన కష్టాలు జిల్లాలో నాలుగేళ్లుగా వానలు, వరదలు, తుపాన్లు పంటలను మింగేస్తున్నాయి. 2013 దానికి మినహాయింపు కాలేకపోయింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ‘పై-లీన్’ తుపాను, అధిక వర్షాల ప్రభావంతో 1,31,723 ఎకరాల్లో పంటలు దెబ్బతి న్నాయి. నవంబర్‌లో ‘హెలెన్’ తుపాను ధాటికి 2,74,082 ఎకరాల్లో వరి తుడిసిపెట్టుకుపోయింది. రూ.కోట్లలో నష్టాలు గతేడాది ‘నీలం’ తుపాను నుంచి ఇటీవల లెహెర్ తుపాను వరకు జిల్లా రైతులు దాదాపు రూ.1,300 కోట్ల విలువైన పంట నష్టపోయారు. నీలం తుపాను ఇన్పుట్ సబ్సిడీ రూ.122 కోట్లు మాత్రమే విడుదలైంది. మిగిలిన తుపాన్ల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రూపేణా రూ.108 కోట్లు అందించాల్సి ఉంది. -
హెలెన్ తుపాను బాధితులను జగన్ పరామర్శ
-
విజయనగరం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
లెహర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ గురువారం ఇక్కడ వెల్లడించారు. 19 గ్రామాలు తుఫాన్ ప్రభావం వల్ల తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. అలాగే జిల్లా కలెక్టరేట్‌తోపాటు పార్వతీపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 34 పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఎక్కడ, ఎవరికైన తుఫాన్ వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన 1077, 08922-236947 (కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నెంబర్లు), 08963-221006 (పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం) ఫోన్ చేయవచ్చని జిల్లా ప్రజలకు సూచించారు. తీర ప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగ తదితర గ్రామాలు అత్యంత ప్రభావితమైయ్యే ప్రాంతాలుగా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. -
నాలుగు నెలల్లో మన ప్రభుత్వం
మలికిపురం/ అంబాజీపేట, న్యూస్‌లైన్:‘నాలుగు నెలల్లో రాష్ట్రంలో మన ప్రభుత్వం రాబోతోంది. ఆ ప్రభుత్వం ఇలా ఉండదు. రైతులకు రుణమాఫీ చేస్తుంది. బాధితులకు తక్షణం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హెలెన్ తుపాను వల్ల నష్టపోయిన కోనసీమలో పర్యటించేందుకు మంగళవారం వచ్చిన ఆయన పర్యటన అర్ధరాత్రి దాటి తరువాత కూడా కొనసాగింది. తొలుత ఆయన అంబాజీపేట మండలం మాచవరంలో అరటి తోటను, తరువాత రాజోలు మండలం శివకోడులో తుపాను బాధిత రైతులను పరామర్శించారు. శివకోడులో నియోజకవర్గ కో ఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు తుపాను నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. రైతుల నుంచి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ ప్రభుత్వం ఆ పని చేయకపోతే త్వరలో రాబోయే మన ప్రభుత్వం చేస్తుంది. అధైర్యపడవద్దు’ అని అని భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు కూడా అన్ని విధాలా సహాయం అందిస్తానన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జగన్ శివకోడు వచ్చినా ఆయన రాక కోసం ప్రజలు ఎదురు చూశారు. ఒంటి గంటకు దిండి చించినాడ వంతెన మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరు కృష్ణంరాజు, ముదునూరి ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ కో ఆర్డినేటర్లు చింతలపాటి వెంకట్రామరాజు, మట్టా శైలజ, మత్తి జయప్రకాష్, మిండగుదిటి మోహన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కుచ్చర్లపాటి సూర్యనారాయణరాజు, రైతు విభాగం రాష్ట్ర సభ్యులు జక్కంపూడి తాతాజీ, మండల కన్వీనర్లు యెనుముల నారాయణస్వామి, జిల్లెళ్ల బెన్నీ, బొలిశెట్టి భగవాన్, గుబ్బల నారాయణరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు వేగిరాజు సాయిరాజు, వాసంశెట్టి చిన సత్యనారాయణ, గెడ్డం పిలిఫ్‌రాజు, అల్లూరు రంగరాజు, పోతురాజు కృష్ణ, యూత్ కమిటీ సభ్యులు తెన్నేటి కిషోర్, గుండిమేను శ్రీనివాస్ యాదవ్, కుంపట్ల బాబి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మాచవరంలో ధ్వంసమైన అరటి తోటను జగన్ పరిశీలించారు. కౌలు రైతు మంచాల సూరిబాబును పరామర్శించారు. ఎన్ని ఎకరాలు కౌలు తీసుకొని అరటి సాగు చేస్తున్నావని, అయిన ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ‘ఐదెకరాలలో అరటి సాగు చేశాను. తుపానుకు మొత్తం ధ్వంసమైంది. అరటి తోటను బాగుచేసుకొనేందుకే రూ.20 వేలు ఖర్చువుతుంది’ అని చెప్పాడు. మరో రైతు దొమ్మేటి వెంకటేశ్వరరావును జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ‘తుపానుకు కొబ్బరి చెట్లు విరిగిపోయాయి.. కొబ్బరి దిగుబడులు వచ్చేసరికి మూడేళ్లు పడుతుంద’ని చెప్పారు. 15 నిమిషాల పాటు జగన్ పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పి.గన్నవరం మండల కన్వీనర్ అడ్డగళ్ల వెంకటసాయిరాం, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కన్వీనర్లు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, మిండగుదుటి మోహన్, మందపాటి కిరణ్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గంగలకుర్రు మలుపు వద్ద యూత్ నాయకుడు విత్తనాల శేఖర్ ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. -
ఇది జాతీయ విపత్తే: బాబు
సీఎం అసమర్థత వల్ల రైతాంగానికి నష్టం టీడీపీకి భయపడే విభజన నిర్ణయం సాక్షి, విజయవాడ: తుపాన్ల నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పర్యటన అనంతరం బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నీలం తుపాను నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం దారుణమన్నారు. తుపాన్లతో రైతాంగం రూ.10 వేల కోట్లు నష్టపోయిందన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వస్తాయని తెలిసి కూడా సకాలంలో ఖరీఫ్‌కు నీరు ఇవ్వకపోవడం వల్లే రైతాంగానికి ఈ కష్టాలు వచ్చాయన్నారు. కేంద్ర బృందం వస్తే రాష్ట్రప్రభుత్వం తుపాను నష్టాలపై నివేదిక కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, అసమర్థత వల్ల రైతాంగం నష్టపోవాల్సి వస్తోందన్నారు. హెలెన్ తుపాను నష్టంపై ఇంతవరకూ క్షేత్రస్థాయి పరిశీలనకు రాలేదని సీఎంను విమర్శించారు. పంట రుణాలను, అవసరమైతే అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తే తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తుపాన్లు వెంటాడుతుంటే కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాల్లో బిజీగా ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించడానికి సోనియాకు ఉన్న అర్హత ఏమిటని, ఎక్కడో పుట్టి పెరిగిన వ్యక్తికి దేశ రాజకీయాలు ఏం తెలుస్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై చర్చ జరగాల్సింది ‘టెన్ జనపథ్’లో కాదని, ఆంధ్రప్రదేశ్‌లో జరగాలన్నారు. తాను జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయమంటే రాష్ట్రంలోని పార్టీలను పిలవడమేమిటని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి లభించిన ఆదరణకు భయపడే రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. ‘టీఆర్ఎస్ని విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. జగన్‌ను బయటకు తెచ్చి విభజన ప్రక్రియను ముందుకు తెచ్చార’ని ఆరోపించారు. రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్య పరిష్కారం వచ్చే వరకూ రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. -
మత్స్యకారులకు అండగా ఉంటా : వైఎస్ జగన్మోహన్రెడ్డి
* ‘పశ్చిమ’ తుపాను బాధితులకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి * అధికారంలోకి రాగానేఉప్పు మడులకు గోడౌన్లు *మత్స్యకారులకు రుణాలు, రాయితీలు *ఈ రాష్ట్రంలో ప్రభుత్వముందా లేదా? *పంట నష్టాన్ని పట్టించుకున్న వారేరీ? *ఎకరాకు రూ. 10 వేల పరిహారమివ్వాలి *రైతులకు చుక్క కిరోసిన్, పది గ్రాముల బియ్యమైనా ఇచ్చారా? *ఇంకా ‘నీలం’ పరిహారమే ఇవ్వరా? *బాధిత రైతుల రుణాలు మాఫీ చేయాలి సాక్షి ప్రతినిధి, ఏలూరు: నెల రోజుల్లో రెండు తుపాన్లు రైతులను, మత్స్యకారులను దారుణంగా దెబ్బ తీశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆక్షేపించారు. ‘‘రైతులు పూర్తిగా నష్టపోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దానికి మనసే లేదు. తుపాను బాధితుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నాలుగు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ కష్టాలన్నీ తీరుస్తా. మత్స్యకారులను అన్నివిధాలుగా ఆదుకుంటా’’ అంటూ భరోసా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో హెలెన్ తుపానుతో దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. నరసాపురం మండలం సారవలో రైతు సమస్యలను ప్రస్తావించారు. సముద్ర తీర గ్రామమైన పెదమైనవాని లంకలో మత్స్యకారుల గురించి మాట్లాడారు. ‘గతంలో నేనీ గ్రామానికి వచ్చినప్పుడు మూడు హామీలు ఇచ్చిన విషయం నాకు గుర్తుంది. ఉప్పు మడుల్లోకి దిగి రైతులు పడుతున్న బాధలను గతంలో చూశాను. అది నాకు బాగా గుర్తుంది. అప్పుడు చెప్పినట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పు రైతులకు గోడౌన్లు నిర్మించి ఇస్తాం. గ్రామానికి వచ్చేందుకు ఇబ్బంది లేకుండా ఉప్పుటేరుపై బ్రిడ్జి నిర్మిస్తాం. తరచూ సముద్రపు కోతకు గురవుతున్న పెదమైనవాని లంక గ్రామాన్ని రక్షించేందుకు విశాఖ తరహాలో సముద్రపు ఒడ్డున పెద్ద బండరాళ్లతో అడ్డుకట్ట వేయిస్తాం. మత్స్యకారులకు వలలు, బోట్లతో పాటు రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని హామీ ఇచ్చారు. అంతేగాక మత్స్యకారుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తమ ప్రభుత్వంలో నిర్వహించే రచ్చబండను పెదమైనవాని లంకలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలేవీ? సారవలో నష్టపోయిన రైతులను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. పంట నీటిలో తడిసిపోయినా ఏ కొంచెమైనా మిగులుతుందన్న ఆశతో రైతులు పంటను కోస్తున్నారని, వారికి జరిగిన నష్టం గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బ తిన్న పంటల గురించి లెక్కకూడా రాసుకోలేదని రైతులు తనకు చెబుతున్నారన్నారు. పంట కోల్పోయి బాధలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఒక చుక్క కిరోసిన్, పది గ్రాముల బియ్యం కూడా ఇవ్వలేదని విమర్శించారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. నీలం తుపాను వచ్చి సంవత్సరం దాటినా ఇంతవరకూ చాలామంది రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మనసు లేని ప్రభుత్వమిది రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని జగన్ విమర్శించారు. ‘ఇప్పటికే రెండు తుపానులు వచ్చాయి. మరో తుపాను వస్తుందని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అయినా రైతుల గురించే ఆలోచించకపోవడం దారుణం’ అన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఎలా ఆదుకోవాలో తెలుసుకునేందుకు గతంలో హుడా కమిషన్‌ను వేశారు.ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే. ఆయన అన్నిచోట్లా తిరిగి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని నివేదిక ఇచ్చారు. వాళ్ల పార్టీ వ్యక్తి ఇచ్చిన నివేదిక ప్రకారం రైతులకు పరిహారమివ్వాలనే జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు’’ అని విమర్శించారు. తుపాన్లతో నష్టపోయిన ప్రతి రైతుకూ రుణ మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.10 వేల పరిహారాన్ని వెంటనే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డీ లేని రుణాలతో పాటు 75 శాతం ఇన్పుట్ సబ్సిడీతో రైతులకు విత్తనాలు ఇవ్వాలన్నారు. ఇవన్నీ రైతులకు ఇప్పించేందుకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘ఒకవేళ అప్పటికీ ఇవ్వకపోతే నాలుగు నెలలు ఓపిక పట్టండి. ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు కచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను’ అని రైతులకు హామీ ఇచ్చారు. మరో ప్రకృతి విపత్తు వస్తుందని హెచ్చరిస్తున్నా తనకోసం వేచి ఉండి ఆదరణ చూపించిన వారిని మరచిపోలేనన్నారు. పర్యటనలో జగన్ వెంట వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నరసాపురం, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు తదితరులున్నారు. మునిగిపోయిన వరి చేలను పరిశీలిస్తూ.. నరసాపురం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన జగన్‌కు అడుగడుగునా రైతులు, మత్స్యకారులు, సాధారణ ప్రజలు తమ బాధలు వివరించారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం, సారవ, మోడి, వేములదీవి ఈస్ట్, తూర్పుతాళ్లు, పెదమైనవాని లంక గ్రామాల్లో దెబ్బ తిన్న పంటలను, ఉప్పు మడులను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి పాలకొల్లు మండలం దిగమర్రు వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. ప్రతిచోటా జనం ఆయన్ను ఆపి తమ కష్టాలు వివరించడంతో పర్యటన ఆలస్యమైంది. వరి రైతులతో వారెంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వచ్చింది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీళ్లలో నానుతున్న పొలాల్లోకి సైతం దిగి రైతుల సమస్యలను విన్నారు. రోడ్డుపై వరి పనలను ఆరబెట్టుకున్న రైతులను, పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, మహిళా రైతులను పలకరించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రతిచోటా తమ ఇబ్బందులు చెబుతున్న వారిని ఓదారుస్తూ, త్వరలోనే కష్టాలు తీరతాయని భరోసా ఇస్తూ ముందుకెళ్లారు. పెదమైనవాని లంక వెళ్లేసరికే రాత్రి 7 గంటలైంది. దీంతో నరసాపురం నియోజకవర్గంలో మిగతా గ్రామాల పర్యటనను రద్దు చేసుకుని పాలకొల్లు నియోజకవర్గంలోని దిగమర్రు వెళ్లి దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అనంతరం రాత్రి 10.52 గంటలకు తాడేపల్లిగూడెం నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయల్దేరారు. -
మన ప్రభుత్వం వస్తుంది ఓపిక పట్టండి
-
మన ప్రభుత్వం వస్తుంది, ఓపిక పట్టండి: జగన్
నరసాపురం : నాలుగు నెలలు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు, మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. రైతుల రుణాలు మాపీ చేయాలని.. కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం స్పందించినా...స్పందించకున్నా..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో హెలెన్ బాధితులకు ధైర్యం చెప్పి.. వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతలకు భరోసా ఇవ్వడానికి వచ్చారు . నరసాపురం నుంచి బయల్దేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్మణేశ్వరం, సార్వా గ్రామాల్లో హెలెన్ దెబ్బకు నాశనమైన వరిని పరిశీలించారు. ఒక నెలలో రెండు తుపాన్లు తమను రోడ్డున పడేశాయని రైతులు వాపోయారు. పంట పూర్తిగా కొట్టుకుపోయినా..తమనెవరూ పట్టించుకోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణేశ్వరం దేవుని తోటలో తుపాను తాకిడికి దెబ్బతిన్న ఇళ్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఎంత పెట్టుబడి పెట్టారు... ఎంత రాబడి వచ్చిందని రైతులను అడిగి తెలుసుకున్నారు. కుళ్లిపోయిన వరి పంటను..వరి ధాన్యాన్ని అన్నదాతలు చూపించారు. అంతేకాదు...నడవలేని వృద్దులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి రోడ్డెక్కారు. వారిని పెన్షన్లు, ఆరోగ్య శ్రీ గురించి అడిగి తెలుసుకున్నారు . -
'పశ్చిమ'కు బయలుదేరిన వైఎస్ జగన్
ఇటీవల వరుస తుఫాన్లతో అతలాకుతలమైన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ బుధవారం పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లాకు పయనమైయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పలుప్రాంతాల్లో వైఎస్ జగన్ నిన్న పర్యటించారు. నేలకొరిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని వైఎస్ జగన్ ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు. -
తూర్పు గోదావరి జిల్లాలో నేడు జగన్ పర్యటన
హైదరాబాద్ : ప్రకృతి ప్రకోపానికి గురై విలవిలలాడుతున్న రైతన్నను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తుర్పూ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లావాసులకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘నేనున్నా’నంటూ అందరికంటే ముందుగా స్పందించే ఆయన పుట్టెడు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పేందుకు ఆయన నేడు జిల్లాకు వస్తున్నారు. ఉదయం పదిగంటలకు హైదరాబాద్ నుంచి మధురపూడి చేరుకుని, రావులపాలెం మీదుగా వెళ్లి కోనసీమలో పర్యటించనున్నారు. కొత్తపేట, ముమ్మడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల మీదగా పర్యటన సాగనుంది. అవిడి, చెయ్యేరు, కాట్రేనికోన, ఎన్.కొత్తపల్లి, అంబాజిపేట, మాచవరం, రాజోలు, శివకోడు ప్రాంతాల్లో పర్యటించి తుపానుకు దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలిస్తారు. రైతులు, మత్స్యకారులతో మాట్లాడనున్నారు. కాగా నేలకొరిగిన వరి చేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. తోటల్లో విరిగిపడిన కొబ్బరి చెట్లు అలానే ఉన్నాయి. ఇప్పటీ విద్యుత్ సౌకర్యం లేక వందల ఊళ్లు అంధకారంలోనే ఉన్నాయి. ఈ సమయంలోనే ‘లెహర్’ పేరుతో మరో విపత్తు ముంచుకురావడం జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో హెలెన్ తుపాను బాధితులకు కనీసం సహాయ సహకారాలు అందికపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
పంటచేలపై ‘కారుమబ్బులు’
ఏడాదంతా అన్నదాతను వెంటాడుతున్న తుపానులు ప్రకృతి ప్రకోపంతో తల్లడిల్లుతున్న రైతన్నలు ఆదుకుంటామని..ఆపై మొఖం చాటేస్తున్న నేతలు కొండంత నష్టానికి గోరంత అంచనాలు పరిహారం కోసం పడిగాపులు కాస్తున్న రైతులు ఖమ్మం, న్యూస్‌లైన్: ఈ ఏడాది ప్రకృతి రైతన్నను పగబట్టినట్టుంది. ఒక తుపాను పోయాక మరో తుపాను వెంటాడుతుంటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎడతెగని వానలతో రెండు, మూడుసార్లు నాటుపెట్టిన పంటచేలు దెబ్బతినడంతో రూ.వేలు, లక్షల పెట్టుబడులు ఆ వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. పట్టువదలని విక్రమార్కుడిలా రైతు మళ్లీ పంటను నాటేస్తే...మరోసారి ప్రకృతి ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే పై-లీన్, హెలెన్ రూపంలో రెండు విపత్తులు పంటలను పనికిరాకుండా చేయగా లెహర్ రూపంలో మరో గండం పొంచివుందని తెలుస్తుండటంతో రైతు కిన్నుడవుతున్నాడు. దెబ్బతిన్న పంటలకు ఏమాత్రం నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం...కనీసం అంచనాలను కూడా సరిగా లెక్కించని అధికారయంత్రాంగం...కొండంత నష్టాన్ని గోరంతగా చూపుతున్న వైనాన్ని చూసి కుమిలిపోతున్నాడు. లక్షల్లో నష్టం వస్తే కనీసం వేలల్లో కూడా పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తం తుపాను బీభత్సమే చోటుచేసుకోవడంతో సాగుదారుల పరిస్థితి సంకటంగా మారింది. జూలెనైలలో వచ్చిన గోదావరి వరదలతో పరీవాహక ప్రాంతాలైన వీఆర్‌పురం, కూనవరం, కుక్కునూరు, భద్రాచలం, చర్ల, చింతూరు, వాజేడు, వెంకటాపురం మండలాలతోపాటు మణుగూరు ప్రాంతాల్లో అప్పుడే వేసిన వరి నార్లు, పాటు చేసిన పత్తి, నారుమళ్లు, మిర్చి నారు, కూరగాయలు నీట మునిగాయి. సుమారు లక్ష ఎకరాలకు పైగా పత్తి, వరి, అపరాల పంటలు నాటు వేసే దశలోనే కొట్టుకుపోయాయి. వరదగోదారిలో పంటలు మునగడంలో గుండె చెదిరిన వేలేరుపాడు మండలం పచ్చిమకోటకు చెందిన రైతు ఈడ్పుగంటి నర్సయ్య(55), కుక్కునూరు మండలం ఎల్లప్పగూడెం గ్రామానికి చెందిన రైతు ఆప్కా పెంటయ్య(48) గుండె ఆగి మృతి చెందారు. కుక్కునూరు మండలం రామసింగారం గ్రామానికి చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు కుళ్లిన పత్తి పంటను చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 15న జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన గిరిజన రైతు దంపతులు భూక్యా దీప్లా(38), పద్మ(35) పిడుగుపాటుతో మృతి చెందారు. కొత్తగూడెం రూరల్ మండలం రేగళ్ల పంచాయతీ పరిధిలో పెద్దతండాకు చెందిన ధరావత్ లింగీ (35), టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన మోకాళ్ల భద్రయ్య (38)లు పిడుగు పాటుతో మృతి చెందారు. వర్షం ఓవైపు పంటనష్టాలు చేస్తూ... మరోవైపు పిడుగుపాటుతో ప్రాణాలు బలిగొంది. అధికారులు 22,500 ఎకరాల పత్తి, 12,500 ఎకరాల్లో వరి, ఐదువేల ఎకరాల్లో అపరాలు, మొత్తం 40వేల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయని, వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసిందని లెక్కలు వేశారు. నిజానికి జిల్లాలో మొత్తం రూ.150 కోట్లకు పైగా నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు చిల్లిగవ్వకూడా రైతులకు పరిహారంగా ఇవ్వలేదు. ఒక్కరిద్దరు రైతులకు 50 శాతం సబ్సిడీలపై విత్తనాలు సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు పంటనష్టం పరిహారం ఊసే ఎత్తలేదు. ఆక్టోబర్ 21వ తేదీ నుంచి వారం రోజులుపాటు ఎడతెరపి లేకుండా జిల్లాలో కురిసిన వర్షాలకు తొలిసారి తీసే దశలో ఉన్న 2, 54,570 ఎకరాల పత్తి, 27,600 ఎకరాల్లో కోతకొచ్చిన వరి, 21,775 ఎకరాల్లో మొక్కజొన్న, 15,200 ఎకరాల మిర్చితోటలతోపాటు 18,061 ఎకరాల్లో పొగాకు, వేరుశనగ, కూరగాయల పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో గుండె చెరువైన రైతులు కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన గద్దికొప్పుల రామయ్య(40), కొత్తగూడెం మండలం బేతంపూడికి చెందిన తేజావత్ రాజు సొమ్మసిల్లి పడిపోయాడు. పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన బొప్పిశెట్టి చెన్నారావు గుండెపోటుతో మరణించాడు. వర్షాలకు పంటలు దెబ్బతిన్న సమయంలో అధికారులు, కేంద్రమంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కానీ వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు మాత్రం నిబంధనల పేరుతో కేవలం 76వేల ఎకరాల పత్తి, మూడు వేల ఎకరాల వరి, వెయ్యి ఎకరాల్లో వేరుశనగ, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు వేశారు. శాస్త్రీయపద్ధతిలో అంచనాలు వేయాలనే పేరుతో ఈ అంచనాలను కూడా మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. పై-లీన్, హెలెన్ తుపానులతో జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మరో తుపాను పొంచివుందని వాతావరణశాఖ చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం ఎప్పుడు అందేనో... గోదావరి వరదలు, భారీ వర్షాలతో పంటలను కోల్పోయిన రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించిన అధికారులు, నాయకులు కనిపించకుండా పోయారు. గత సంవత్సరం కురిసిన నీలం తుపానుతో జిల్లా వ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. దీని విలువ రూ. 171 కోట్ల మేరకు ఉంటుందని రైతు సంఘాల నాయకులు, అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పుడు జిల్లాలో పర్యటించారు. పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో రైతులు కన్నీళ్లు పెట్టడాన్ని చూశారు. కేంద్ర బృందం వస్తుంది పంటనష్టాన్ని అంచనా వేస్తుందని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 21వేల మంది రైతులకు కేవలం రూ. 10.5 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక పంపించారు. దీనిపై కూడా ఆంక్షలు విధించి ప్రభుత్వం కోతపెట్టి కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో రూ. 4.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అప్పుడే ఇలా ఉంటే...ప్రస్తుత పరిస్థితుల్లో పరిహారం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో, రాదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోయినా పైసా పరిహారం ఇవ్వలేదు: గత నెలలో కురిసిన పై-లీన్ తుపానుకు ఐదు ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది. ఎకరానికి మూడు క్వింటాళ్ల పత్తి పనికిరాకుండా పోయింది. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు. ప్రభుత్వం ఇంత వరకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఇకమీదట ఇస్తుందన్న నమ్మకం కూడా లేదు. రాయల వెంకటేశ్వర్లు, కొత్తలింగాల, కారేపల్లి మండలం -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ సూపర్ సైక్లోన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి కోరారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలెన్ తుపాను తర్వాత లెహర్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందన్నా రు. లెహర్ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారి ఈ నెల 28 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని చెప్పారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముం దస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, మిలటరీ, నెవీ, కోస్ట్‌గార్డులను సహాయ చర్యల కు వినియోగిస్తామని తెలిపారు. పంట కోతకు వచ్చిన సమయంలో రైతులు మరింత నష్టపోకుండా ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఈ విషయంలో రైతులను అప్రమత్తం చేయాలని కోరారు. స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా 450 మంది ఫైర్ ఆఫీసర్లను, 450 మంది పోలీసు అధికారులకు శిక్షణనిచ్చి సిద్ధం చేశామన్నారు. గతంలో కురిసిన వర్షాలకు చెరువులకు గండ్లు పడిన చోట మరింత అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు కిరోసిన్ ఇతర ఆహార పదార్థాల నిల్వల విషయంలోప్రతిపాదనలు పంపాలని కోరారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని జిల్లాకు పంపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇప్పటికే అన్ని చెరువులు నిండి ఉన్నాయని, వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ప్రభాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఏఎస్పీ రమారాజేశ్వరి, ఇన్చార్జీ డీఆర్ఓ అంజయ్య, ట్రాన్స్‌కో ఎస్ఈ కరుణాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు చంద్రబాబు రాక
సాక్షి, కాకినాడ : జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఉదయం 9.30 గంటలకు మధురపూడి చేరుకునే చంద్రబాబు అక్కడ నుంచి లాలాచెరువు, వేమగిరి, జొన్నాడ సెంటర్, రావులపాలెం, కొత్తపేటల మీదుగా రాకుర్తివారిపాలెం చేరుకుంటారు. అక్కడ తుపాను తాకిడికి నేలకొరిగిన అరటితోటలను పరిశీలిస్తారు. అనంతరం అంబాజీపేట, అమలాపురం బైపాస్, ముమ్మిడివరం మీదుగా గున్నేపల్లి చేరుకొని దెబ్బ తిన్న పంటపొలాలను చూస్తారు. అక్కడ నుంచి కాట్రేనికోన మండలం పల్లం వెళ్లి తుపాను సమయంలో సముద్రంలో చిక్కుకొని క్షేమంగా తీరానికి చేరుకున్న మత్స్య కారులను పరామర్శిస్తారు. అనంతరం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నేల కొరిగిన కొబ్బరితోటలను, అమలాపురం రూరల్ మండలం చిందాడగరువులో పంటపొలాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి అమలాపురంలో పర్యటించి కోనసీమ నేతలతో మాట్లాడి తుపాను నష్టాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం బండార్లంక వీవర్స్ కాలనీలో పర్యటించి మగ్గాల్లో నీరు చేరి, ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులతో మాట్లాడతారు. అక్కడ నుంచి అంబాజీపేట, పి.గన్నవరంల మీదుగా తాటిపాక సెంటర్ చేరుకుని పి.గన్నవరం, రాజోలు ప్రాంత రైతులతో సమావేశమై వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటారు. హెలెన్ ధాటికి కకావికలమైన కోనసీమ దుస్థితికి అద్దం పట్టే విధంగా పార్టీ నేతలు ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అనంతరం దిండి రిసార్ట్స్ చేరుకొని రాత్రికి బస చేస్తారు. మంగళవారం ఉదయం దిండి రిసార్ట్స్నుంచి బయల్దేరి చించినాడ వంతెన మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తారు. హెలెన్ బాధిత రైతులు, ప్రజలకు అండగా నిలిచేందుకు వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని, ఆయన వెంట వేలాదిగా పార్టీ కార్యకర్తలు పాల్గొని బాధితులకు సంఘీభావం తెలపాలని రాజప్ప పిలుపు నిచ్చారు. కాగా చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చినరాజప్ప ఏర్పాట్లపై సమీక్షించి -
‘హెలెన్’విలయానికి చలించిన జగన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : హెలెన్ తుపానుతో జిల్లాలో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానున్నారు. పంటలు కోల్పోయిన రైతులు సహా ఇతర బాధితులను ఆయన పరామర్శించనున్నారు. జిల్లాలోని కోనసీమలో మెజారిటీ మండలాలకు తుపాను కారణంగా తీవ్రంగా నష్టం జరిగిందని పార్టీ నాయకులు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వ్యవసాయంతో సహా వివిధ రంగాలకు నష్టాన్ని జిల్లా నాయకుల ద్వారా తెలుసుకుని చలించిన జగన్ పర్యటనకు రానున్నట్టు తెలిపారు. జగన్ పర్యటన ఏయే నియోజకవర్గాల్లో నిర్వహించాలనే విషయమై పార్టీ జిల్లా నాయకత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజనకు జరుగుతున్న కుట్రలను పార్లమెంటులో అడ్డుకునేందుకు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులను కలుస్తున్న జగన్ ఈ నెల 26 లేదా 27న జిల్లాలో పర్యటించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ తేదీన వచ్చేది, పర్యటన ఎక్కడెక్కడ జరిగేది తదితర విషయాలను సోమవారం ఖరారు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు రానున్న జగన్మోహన్రెడ్డికి తమ గోడును వెళ్లబోసుకునేందుకు బాధితులు సిద్ధపడుతున్నారు. తుపాను తాకిడికి ప్రధానంగా కోనసీమలో వరి, కొబ్బరి, అరటి, కాయగూరల తోటలు తీవ్రంగా నష్టపోయాయి. ఆ రైతులు నేరుగా జగన్‌ను కలిసి జరిగిన నష్టాన్ని వివరించేలా జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13న పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు జిల్లా వచ్చిన జగన్ రెండు వారాలు తిరక్కుండానే మరోసారి జిల్లాకు రానున్నారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దెబ్బతిన్న పంటల పరిశీలన నేడు
విజయవాడ, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటను సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం పరిశీలించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెడన, పామర్రు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే పై-లిన్ తుపానుతో పాటు అకాల వర్షాలకు వరి పంట 50 శాతం మేర దెబ్బతిందని తెలిపారు. వెనువెంటనే హెలెన్ రూపంలో మరో తుపాను డెల్టా రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్ సీపీ దెబ్బతిన్న పొలాలను పరిశీలించే కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. సోమవారం ఉదయం గూడూరు మండలంలోని తరకటూరు నుంచి ఈ పరిశీలన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ బృందంలో తనతో పాటు పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ క్యాడర్ పాల్గొంటారని తెలిపారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరులో ప్రారంభమయ్యే ఈ యాత్ర చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపాలెం, ఆకుమర్రు, మల్లవోలు, పోలవరం, రాయవరం, తుమ్మలపాలెం, శారదాయిపేట, ఆకులమన్నాడు, కప్పలదొడ్డి గ్రామాల్లో సాగుతుందని వివరించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పెడన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఉంటుందని తెలిపారు. తరువాత పెడన మండలంలోని పెడన, కొంకేపూడి గ్రామాల్లో పర్యటిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పామర్రు నియోజకవర్గంలోని ఉండ్రుపూడి, పామర్రు, రాపర్రు, పోలవరం గ్రామాల్లో పర్యటిస్తామని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు పామర్రు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నష్ట తీవ్రతను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగిన విధంగా పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని వివరించారు. పెడన, పామర్రు నియోజకవర్గాల్లోని పార్టీ మండల కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల వారు, రైతులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్ల రామయ్యకు మతి భ్రమించింది తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్యకు మతిభ్రమించిందని ఉదయభాను విమర్శించారు. హఠాన్మరణం చెందిన జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఒక బలహీన వర్గాలకు చెందిన నేతను జిల్లా పరిషత్ స్థానంపై కూర్చబెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కితే అదే నేతను మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తగా నియమించిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కిందని గుర్తుచేశారు. ఆకస్మికంగా మరణించిన వ్యక్తి గురించి అసత్య ఆరోపణలు చేయడం నీతిమాలిన రాజకీయమని విమర్శించారు. సీట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీదేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే ధనవంతులైన సుజనాచౌదరి, సీఎం రమేష్‌లకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్న ఘనత చంద్రబాబుది కాదా అని ఉదయభాను ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ నుంచి కోసూరుకు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడున్నర గంటలు పట్టిందని, ప్రతిచోట జగన్మోహన్రెడ్డిని జనం అక్కున చేర్చుకున్నారని, ఈ ఆదరణ చూసి ఓర్పలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. -
ఎంత కష్టం.. ఎంత నష్టం..
=హెలెన్ తుపానుతో కోలుకోలేని దెబ్బ = పొలంలోనే మొలకెత్తుతున్న ధాన్యం = చేష్టలుడిగిన అన్నదాత = పంట నష్టం అంచనాకు అధికారులు సిద్ధం శ్రమ చేసి.. చెమటోడ్చి.. నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట చేతికొచ్చే దశలో నేలపాలైతే.. ఆ రైతుకు ఎంత కష్టం! అప్పులు తెచ్చి.. పెట్టుబడులు పెట్టి.. ఎన్నో ఆశలతో చేసిన సాగు పొలంలోనే దెబ్బతింటే.. దిగుబడులు దారుణంగా పడిపోయే పరిస్థితి నెలకొంటే అన్నదాతకు ఎంత నష్టం!! ఆశలు అడియాసలవుతున్న వేళ.. ఉన్న పంటనైనా కాపాడుకునేందుకు రైతన్న నానా పాట్లు పడుతున్నాడు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లా రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. పంట చేతికొచ్చే సమయంలో బలమైన గాలులు, వర్షం ధాటికి నేలకొరిగిన పైరు లోలోపలే కుళ్లిపోతోంది. నేలవాలిన వరి కంకులు నీటిలో నానిపోతూ మొలకెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో బీపీటీ 5204 రకాన్ని అత్యధికంగా రైతులు సాగు చేశారు. ఈ రకం విత్తనానికి పై తోలు పలుచగా ఉండటంతో వర్షాలకు తడిచి నీటిలో పడిన ధాన్యం త్వరితగతిన మొలకెత్తేందుకు అవకాశముందని రైతులు చెబుతున్నారు. ఆదివారం కొంతమేర జిల్లాలో వర్షం తగ్గినా పైరు నీటిలోనే నానుతుండటంతో రైతులు ఖరీఫ్ పంటపై ఆశలు వదులుకునే పరిస్థితి దాపురించింది. పంటలను రక్షించుకునేందుకు రైతన్న పాట్లు... తుపాను తాకిడికి నేలవాలిన వరిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. పొలంలో ఉన్న నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పడిపోయిన వరిని జుట్టుకట్టలు కట్టి నిలబెట్టే పనులు చేపట్టారు. నేలవాలిన వరి పైకి పచ్చగానే కనపిస్తున్నా నీటిలో నానుతూ పైరు కుళ్లిపోతోంది. పాలుపోసుకునే దశలో ఉన్న కంకులు నీటిలో రెండు, మూడు రోజులకు మించి మునిగి ఉంటే గింజ గట్టిపడదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో పొలాల్లో నిలిచిన నీటిని బయటికి తరలించేందుకు ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. మరికొన్నిచోట్ల కోతకొచ్చిన పైరును యంత్రాలను కోయిస్తున్నారు. మినుము విత్తనాలు చల్లేందుకు ఆటంకమే... జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. 5.50 లక్షల ఎకరాలకు పైగా వరికోతకు సిద్ధమైంది. హెలెన్ తుపాను ప్రభావంతో 2.25 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. దాదాపు మూడు లక్షల ఎకరాల్లో రెండో పంటగా మినుము (అపరాలు) సాగు చేస్తారు. పైరు నేలవాలటంతో మినుము విత్తనాలు చల్లేందుకు అవకాశం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. పొలంలో నీరు నిలిచి ఉండటంతో మినుము విత్తనాలు ఇప్పట్లో చల్లే అవకాశం లేదని పేర్కొంటున్నారు. మినుము సాగు చేసే 22 మండలాలకు నాలుగువేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పొలంలో నీరు తగ్గితేనే మినుము చల్లేందుకు అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. పంటను ఇలా కాపాడుకోండి... హెలెన్ తుపాను ప్రభావంతో కోత దశలో ఉన్న పైరు నీటమునిగిందని, ఈ పంటను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలని మచిలీపట్నం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పి.అనురాధ, నాగేంద్రరావు పలు సూచనలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పైరు నేలవాలితే పైరుపై లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి కంకుల మీద పిచికారీ చేయాలని తెలిపారు. వల్ల ధాన్యం మొలకెత్తకుండా, రంగు మారకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. కోసిన వరి పనలపై ఉంటే లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. పనలను తరచూ తిప్పుతూ ఆరబెట్టాలన్నారు. తడిచిన పనలను కుప్పగా వేస్తే సిలీంద్ర వ్యాప్తి జరిగి ధాన్యం రంగుమారి ముక్కిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఎకరం పైరును కుప్పవేసే సమయంలో 40 నుంచి 50 కిలోల ఉప్పును కుప్పలో ప్రతి వరుసకు చల్లితే ధాన్యం మొలకెత్తకుండా ముక్కిపోకుండా ఉంటుందన్నారు. కల్లంలో ఉన్న ధాన్యం తడిస్తే క్వింటాలు ధాన్యానికి ఐదు కిలోల ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి పోగు పెట్టాలని సూచించారు. ఇలా చేస్తే తడిచిన ధాన్యం వారం రోజుల వరకు మొలకెత్తకుండా, దెబ్బతినకుంటే ఉండే అవకాశం ఉందన్నారు. హెలెన్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని విజయవాడలో జరిగిన మండల వ్యవసాయాధికారుల సమావేశంలో నిర్ణయించారు. పంట నష్టం అంచనాలను కచ్చితంగా తయారుచేయాలని వ్యవసాయ శాఖ జేడీ బాలునాయక్ ఏవోలకు సూచించారు. -
విద్యుత్ శాఖకు హెలెన్ షాక్
సాక్షి, రాజమండ్రి :హెలెన్ తుపాను కోనసీమలో విద్యుత్ వ్యవస్థను కకావికలం చేసింది. గత నెలలో భారీ వర్షాలు జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.1.13 కోట్ల మేర నష్టాన్ని కలుగజేయగా, ప్రస్తుతం హెలెన్ మరో రూ.కోటి మేర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో ఎక్కువగా కోనసీమలో నష్టం వాటిల్లింది. గ్రామాల్లో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వందల కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు కుప్పకూలిన చెట్లలో చిక్కుకున్నాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించినా.. మరో 48 గంటలు దాటితే మినహా కోనసీమ పల్లెల్లో కరెంటు దీపాలు వెలిగే అవకాశం కనిపించడం లేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి అంధకారం అలుముకుంది. శుక్రవారం నాటికి నగరాలు, పట్టణాలకు అధికార యంత్రాంగం విద్యుత్ సరఫరా చేసింది. శనివారం ఉదయం నాటికి వీటిలో సుమారు రెండు లక్షల సర్వీసులకు కరెంటు సమస్య కొనసాగింది. సాయంత్రం వరకూ లక్ష వరకు సర్వీసులను పునరుద్ధరించగలిగారు. కాగా కోనసీమలో 250 గ్రామాల్లో ఇంకా లక్ష సర్వీసులకు విద్యుత్ సరఫరా లేదు. వీటి పునరుద్ధరణకు మరో 48 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నష్టం తీరు ఇలా.. జిల్లాలో 19 సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 33/11 కేవీ స్తంభాలు 11 నేలకూలాయి. శనివారం సాయంత్రానికి 90 శా తం చక్కదిద్దారు. 15.47 కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ విద్యుత్ పంపిణీ చేసే 559 స్తంభాలు నేలకూలాయి. వీటిని పునరుద్ధరించే చర్యలు వేగవంతం చేశామని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ వైఎల్ఎన్ ప్రసాద్ తెలిపారు. 200 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఎల్టీ సరఫరా స్తంభాలు కూలిపోగా, వాటిని సరిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముం దుగా 11 కేవీ లైన్లు పునరుద్ధరణ పూర్తయితే కానీ గృహ వినియోగ పంపిణీని సరిచేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు తదితర పరికరాలకు వాటిల్లిన నష్టం రూ.88 లక్షలు కాగా, మరో రూ.12 లక్షల మేరకు పంపిణీ పరికరాలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. -
తుపాను బాధితులపై మండిపడ్డ మంత్రి
దొడ్డిపట్ల (యలమంచిలి), న్యూస్‌లైన్ :‘దొడ్డిపట్ల ఏటిగట్టు దిగువన సంభవించిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయి మూడేళ్లు అవుతోంది. ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అడుగుతుంటే ఇదిగో అదుగో అంటున్నారే కానీ స్థలాలివ్వడం లేదు. కూడు పెట్టే ఇసుక ర్యాంపు మూతపడి మూడు నెలలు అవుతోంది. తరచూ వస్తున్న తుపాన్ల వల్ల వేట లేకుండాపోతోంది. హెలెన్ తుపాను దిక్కులేని వాళ్లను చేసింది. ఈ పరిస్థితుల్లో మాకు కూడు ఎలా దొరుకుతుంది బాబూ’ అం టూ దొడ్డిపట్ల మత్స్యకార నాయకుడు శేరు కృష్ణ ఆధ్వర్యంలో మత్స్యకారులు మం త్రి పితాని సత్యనారాయణ ఎదుట వాపోయారు. మత్స్య కారుల ఎదుర్కొంటున్న ఇతర ఇబ్బందులను మం త్రికి కృష్ణ వివరించబోగా, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ దగ్గదకొస్తేనే ఈ విషయూలు చెబుతావా. నా దగ్గరకొచ్చి ఎప్పుడైనా చెప్పావా’ అంటూ మంత్రి ఎదురు ప్రశ్నించారు. దీంతో మత్స్యకార నాయకుడు మాట్లాడుతూ ‘మా ఎమ్మెల్యే బంగారు ఉషారాణి దృష్టికి ఇళ్ల స్థలాలు, ఇసుక ర్యాంపు సమస్యను చాలాసార్లు తీసుకెళ్లామ’ని చెప్పబోగా మంత్రి కలుగజేసుకుని ‘జిల్లాలో ఎక్కడా ఇసుక ర్యాంపు లేకపోతే మీ దొడ్డిపట్ల ఇసుక ర్యాంపే పనిచేసింది. అప్పుడు బాగా దండుకున్నారు కదా’ అనడంతో మత్స్యకారులు బిత్తరపోయూరు. అనంతరం డ్వామా పీడీ నరాల రామచంద్రారెడ్డిని పిలిచి ఈ రెండు సమస్యల్ని నోట్ చేసుకోండని చెప్పిన మంత్రి కుర్చీలోంచి లేచి వెళ్లబోయూరు. ఆ సందర్భంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు అడ్డాల వెంకట రెడ్డినాయుడు ఎదురెళ్లి ఇప్పటికి మూడుసార్లు వచ్చిన తుపానుల వల్ల తమలపాకు రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమలపాకు సాగుచేసే కౌలు రైతులకు పరిహారం ఇవ్వడం ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. డి ఫారం పట్టా భూములను కౌలుకిస్తే పరిహారం రాదని చెప్పారు. ఈసారి కూడా పరిహారం ఇవ్వకపోతే తమలపాకు రైతులకు పురుగుమందే గతి అని రెడ్డినాయుడు అనడంతో మంత్రి ఆయనపై ఒంటి కాలిపై లేచారు. ‘నా ఎదురుగా పురుగుమందు తాగుతారంటావా’ అంటూ రెడ్డినాయుడును మందలించారు. ఆచంట ఏఎంసీ మాజీ చైర్మన్ చేగొండి సూరిబాబు కలుగజేసుకుని పరిహారం ఇవ్వకపోతే రైతులకు చావే గతి అని చెప్పారని సర్ధిచెప్పగా, మంత్రి వడివడిగా కారెక్కి వెళ్లిపోయారు. -
జిల్లాలో నష్టం రూ.323.4 కోట్లు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:గత నెలలో వారం రోజుల పాటు ఏకధాటిగా కురిసి బీభత్సం సృష్టించిన వర్షాలు... అదే స్థాయిలో నష్టాల ను కూడా మిగిల్చాయి. వర్షాలకు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా రూ.113.60 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించగా అది మూడు రెట్లు పెరిగి రూ.323.4 కోట్లకు చేరింది. జిల్లాలో ఇటీవల పర్యటించిన కేంద్రబృందానికి శాఖల వారీగా నష్టం వివరాలను అంద జేశారు. జిల్లాలో అన్నిశాఖలకు సంబంధించి రూ.323.4 కోట్ల మేర నష్టం ఏర్పడిందని, ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వానికి, ఆయా శాఖల ఉన్నతాధికారులకు నివేదించారు. 34 మండలాల్లో నష్టం ఏర్పడగా, వాటిలో 102గ్రామాల్లో నష్టం చాలా ఎక్కువగా ఉంది. పంటనష్టం వివరాలు... వర్ష బీభత్సం వల్ల 16,936 హెక్టార్లల్లో వరి దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. నష్టపరిహారం చెల్లించేందుకు రూ.16.17 కోట్లు అవసరమని నివేదించారు. 1,197.37 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, దీనికి గానూ రూ.1.27 కోట్లు అవసరమని పేర్కొన్నారు. 2,655 ఇళ్లకు నష్టం.... అధిక వర్షాలకు 2,655 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో పక్కా ఇళ్లు 18 పూర్తిగా, 31 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే పూరిళ్లు 67 పూర్తిగా, 259 తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాక్షికంగా 2,068 ఇళ్లు దెబ్బతిన్నట్టు నివేదించారు. అలాగే గుడిసెలు 175 దెబ్బతిన్నాయి. ఇవి కాక మరో 37 ఇళ్లు పాడైనట్టు గుర్తించారు. వీటికి పరిహారం చెల్లించేందుకు రూ.76 లక్షలు అవసరమని పేర్కొన్నారు.నలుగురు మృతి చెంద గా వారిలో ముగ్గురికి పరిహారం అందజేయాలని పేర్కొన్నా రు. 600 పశువులు మృత్యువాత పడ్డాయని వీటి యజమానులకు పరిహారం చెల్లించేందుకు రూ.90 లక్షలు అవసరమని నివేదించారు. 11 పునరావాస కేంద్రాలు నిర్వహించి 896 మందికి పునరావసం కల్పించినట్టు పేర్కొన్నారు. రోడ్లకు భారీ నష్టం భారీ వర్షాలు ఆర్అండ్బీ శాఖకు పెద్ద నష్టమే మిగిల్చాయి. 169.10 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. 10 కల్వర్టు లు, 89 సీడీ వర్కులు దెబ్బతిన్నాయి. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.113.72 కోట్లు అవసరమని నివేదించారు. అలాగే ఐటీడీఏకు చెందిన 87 రోడ్లు పాడవ గా వీటి మరమ్మతుల కోసం రూ.8.91కోట్లు అవసరమని నివేదించారు. పంచాయతీరాజ్‌కు చెందిన 204కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.అలాగే 73సీడీ వర్కులు, 75 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ పనులు చేపట్టడానికిగానూ రూ.92.40 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. మున్సిపాల్టీల్లో మున్సిపాల్టీల్లో 20.28 కిలోమీటర్ల మేర రోడ్లు, 10 కిలో మీటర్ల మేర డ్రైన్లు, మూడు మంచినీటి పథకాలు, 1,060 వీధిలైట్లు, తొమ్మిది మున్సిపల్ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటి మరమ్మతుకు రూ.10.47 కోట్లు అవసరమని నివేదించారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చెరువులు, మదుములు వంటివి 994 దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయడానకి రూ 60.30 కోట్లు అవసరమని పేర్కొన్నారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం... గ్రామీణ నీటిసరఫరా విభాగానికి సంబంధించి 181 పథకాలు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయడానికి రూ. 10.71 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. 81 వలలు, 40 చేపల చెరువులు, 30 టన్నుల చేపలు పాడైపోయాయి. వీటి నష్టం రూ.14.2 లక్షలుగా గుర్తించారు. అలాగే చేప పిల్లల కేంద్రంలో వేసిన పిల్లలు చనిపోవడం , కార్యాలయ భవనం శిథిలం కావడంతో రూ.58.8లక్షల నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. భారీ వర్షాల సమయంలో మందులు సరఫరా చేయడానికి రూ.97 వేలు ఖర్చు చేసి నట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి 165 ట్రాన్స్ఫార్మర్లు, 172 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి వీటి మరమ్మతులకు రూ.87.39లక్షలు అవసరమని నివేదించారు. -
భారీ వర్షాల నష్టంపై..కేంద్ర బృందానికి నివేదిక
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గత నెలలో వారం రోజుల పాటు పడిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా రూ. 323 కోట్ల నష్టం వాటిల్లిందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నష్టాన్ని కేంద్రానికి నివేదించామని, రాష్ట్రం మొత్తానికి వాటిల్లిన నష్టానికి సంబంధించి ఇది వరకే కేం ద్రం నుంచి రూ. వెయ్యి కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నామని తెలిపారు. హెలెన్ తుపాను వల్ల విజయనగరం డివిజన్లో పెద్దగా నష్టం లేనప్పటికీ పార్వతీపురం డివిజన్లో కోతలు కోసి కుప్పలుగా ఉంచిన చేలు నీట మునిగాయన్నారు. తుపాను వల్ల జిల్లాలో పెద్దగా నష్టం వా టిల్లనప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా..ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని అన్ని శా ఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కాగా రాష్ట్ర విభజనను ఆపాల్సిన కాంగ్రెస్ నేతలు ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారేమిటన్న విలేకరుల ప్రశ్నకు ఆయన తీ వ్రంగా స్పందించారు. ‘ప్యాకేజీ ఏమిటి... ప్యాకేజీ...ఇది కార్పొరేట్, వ్యాపారవర్గాలు వాడే పదం. మీరు ఇలా అడగడం మంచిది కాదు. ఒకవేళ రాష్ట్రం విడిపోవాల్సి వస్తే మన ప్రాంతానికి అన్యాయం జరక్కుండా చూడాల్సిన బాధ్య త మనపై ఉంది కదా...అందుకే అడుగుతున్నా రు.’ అన్నారు. ఇలాంటి విపత్తుల కారణంగా నష్టపోయిన వారందర్నీ ఖచ్చితంగా ఆదుకుం టామని స్పష్టం చేశారు. హెలెన్ తుపాను వల్ల విజయనగరంలో వాయిదా పడి న రచ్చబండ సభలను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహిస్తామ ని చెప్పారు. ఆయనతో పాటు కలెక్టర్ కాంతి లాల్ దండే ఉన్నారు. -
తుఫాన్ వల్ల 3.5 లక్షల హెక్టార్ల వరిపంట నష్టం
హెలెన్ తుఫాన్ వల్ల రైతులకు అపారం నష్టం వాటిల్లింది. కోస్తా తీర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడున్నర లక్షల హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని విపత్తు నివారణ శాఖ కమిషనర్ పార్థసారథి చెప్పారు. అకాల వర్షాల వల్ల ఐదు జిల్లాల రైతులకు ఎక్కువగా నష్టం జరిగిందని తెలిపారు. చేతికొచ్చిన పంట నీటిలో మునిగిపోయిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మరణించినట్టు వెల్లడించాడు. విద్యుత్ పునరద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటామని, సాయంత్రం నుంచి పునరావాస శిబిరాలను మూసివేస్తున్నట్టు పార్థసారథి తెలిపారు. -
హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్
హెలెన్ పెను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న కుప్పంలో ప్రారంభించవలసిన సమైక్య శంఖారావం యాత్రను 30వ తేదికి మార్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయం శనివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తు ఈ నెల 28 నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం యాత్రను కుప్పంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హెలెన్ తుఫాన్ బాధితులను పరామర్శించి, ఆ తర్వాత సమైక్య శంఖారావం యాత్ర చేపట్టాలని వైఎస్ జగన్ భావించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. -
పాఠకులు పంపిన హెలెన్ తుపాన్ చిత్రాలు
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన హెలెన్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పాఠకులు పంపిన ఫోటోలు ఎస్ ఆర్ నగర్, కాజులురు మండలం నుండి సిస్టా చలపతి ------------- పంపినవారు ఇచ్చాపురం నుండి చుక్కా ధినకర్, చుక్కా ధిల్లేశ్వర్, చుక్కా దీపిక------------- అకివీడులో హెలెన్ తుఫాను దాటికి నేలకి వకిగిన చేలు - పంపినవారు అకివీడు నుండి ఒక పాఠకుడు------------ ఈ చిత్రం పంపినవారు కంచర్ల పార్ధు------------- నక్కపల్లి చేనేత కాలనీని ముంచెత్తుతున్న గెడ్డ ఇటీవల కురిసిన బారీ వర్షాలకు నీట మునిగిన చేనేత కాలనీ-- -
అల్పపీడనంగా బలహీనపడ్డ హెలెన్ తుపాను
విశాఖ : మచిలీపట్నం వద్ద నిన్న తీరం దాటిన హెలెన్ తుపాను శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని పయనిస్తోంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తుండటంతో తెలంగాణ, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చిరించింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు 50వేల కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 2 లక్షల హెక్టార్లలో వరిపంట నీట మునిగింది. 350 ఇళ్లు తుపాను ధాటికి కొట్టుకుపోయాయి.