ఇటీవల వరుస తుఫాన్లతో అతలాకుతలమైన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ బుధవారం పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లాకు పయనమైయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పలుప్రాంతాల్లో వైఎస్ జగన్ నిన్న పర్యటించారు. నేలకొరిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని వైఎస్ జగన్ ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు.