విజయనగరం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు | Control rooms set up in vizianagaram and parvathipuram due to helen cyclone | Sakshi
Sakshi News home page

విజయనగరం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు

Published Thu, Nov 28 2013 9:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

Control rooms set up in vizianagaram and parvathipuram due to helen cyclone

లెహర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ గురువారం ఇక్కడ వెల్లడించారు. 19 గ్రామాలు తుఫాన్ ప్రభావం వల్ల తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. అలాగే జిల్లా కలెక్టరేట్తోపాటు పార్వతీపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా  ఉన్నట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 34 పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ వివరించారు.

 

జిల్లాలో ఎక్కడ, ఎవరికైన తుఫాన్ వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన 1077, 08922-236947 (కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నెంబర్లు), 08963-221006 (పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం) ఫోన్ చేయవచ్చని జిల్లా ప్రజలకు సూచించారు. తీర ప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగ తదితర గ్రామాలు అత్యంత ప్రభావితమైయ్యే ప్రాంతాలుగా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement