
సాక్షి, విజయనగరం: జిల్లా కలక్టరేట్ వద్ద వివాహిత ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ స్పందన కార్యక్రమంలో ఆమె తన వెంట తెచ్చుకున్న చీమల మందు తిని.. అధికారుల ముందే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. దీనిని గమనించిన అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన పతివాడ వసుంధర (22)గా గుర్తించారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఇటీవల ఆమెను భర్త వదిలేశాడు. దీనిపై 3 నెలలుగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ.. కలెక్టర్ స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో 108 అంబులెన్స్‌లో ఆమెను అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment