కలసిరాని కాలం
Published Thu, Dec 26 2013 3:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
2013లో నాలుగు రోజులు ముందుగానే నైరుతి వచ్చినా పై-లీన్ తుపాను ప్రభావంతో నిష్ర్కమణ ఆలస్యమైంది. ఈశాన్య రుతుపవనాలు అనుకున్న సమయానికి రాలేదు. కాలం మారుతుంటే పంట ప్రారంభం, ముగింపు సమయాల్లో తేడాలొస్తున్నాయి. మే నెలాఖరుకు రుతుపవనాలు అనుకున్న సమయానికంటే ముందే రావడంతో వానలు మొదలయ్యాయి. జూన్ నెల ప్రారంభంలో చిన్నపాటి జల్లులే కురిసినా వారం గడిచే సరికి భారీ వర్షం పడింది. గతేడాదితో పోల్చితే దాదాపు 15 రోజులు ముందుగానే నాట్లు వేయాలని అన్నదాతలు సంకల్పించారు. జూన్ 13న కాలువలకు నీరు విడుదలవడంతో అనుకున్న విధంగానే జూన్ 15 నుంచి నారుమళ్లకు నీరు మళ్లించి 20 నాటికి నారువేయడం ప్రా రంభించారు. జూలై 10 నాటికి ఆ నారు చేతికందే సమయానికి తుపాను పట్టుకుంది. ముదురునారు వర్షం నీటలో మునిగిపోయింది. నాట్లు వేసేందుకు పలుచోట్ల రైతులు దమ్ములు కూడా చేయించా రు. నారు పాడవడంతో దమ్ములు నిరుపయోగమయ్యా యి. పెట్టుబడి దాదాపుగా రెట్టింపయ్యింది. ఆగష్టు తొలివారానికే జిల్లాలో నాట్లు పూర్తికావాల్సి ఉన్నా సెప్టెంబర్ తొలివారానికి గాని పూర్తికాలేదు. ఖరీఫ్‌లో ముందుగా సాగు చేద్దామనుకుంటే నెల రోజులు ఆలస్యమైంది. ఈసారి అక్టోబర్ కల్లా ఖరీఫ్ ముగించేయాలని రైతులు భా వించినా డిసెంబర్‌కు గాని పూర్తికాలేదు.
అసువులు బాసిన అన్నదాతలు
హెలెన్ తుపానుతో ఇద్దరు రైతులు బలైపోయారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌కు చెందిన పోతినేని భాస్కరరావు అనే పంటను కాపాడుకునేందుకు రైతు పొలంలో ఉండగా చెట్టు మీద పడి ప్రాణాలు వదిలాడు. తుపాను అనంతరం పాడైన పంటను చూసి పాలకోడేరులో చిలపరశెట్టి కృష్ణమూర్తి అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కొనసాగిన కష్టాలు
జిల్లాలో నాలుగేళ్లుగా వానలు, వరదలు, తుపాన్లు పంటలను మింగేస్తున్నాయి. 2013 దానికి మినహాయింపు కాలేకపోయింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ‘పై-లీన్’ తుపాను, అధిక వర్షాల ప్రభావంతో 1,31,723 ఎకరాల్లో పంటలు దెబ్బతి న్నాయి. నవంబర్‌లో ‘హెలెన్’ తుపాను ధాటికి 2,74,082 ఎకరాల్లో వరి తుడిసిపెట్టుకుపోయింది.
రూ.కోట్లలో నష్టాలు
గతేడాది ‘నీలం’ తుపాను నుంచి ఇటీవల లెహెర్ తుపాను వరకు జిల్లా రైతులు దాదాపు రూ.1,300 కోట్ల విలువైన పంట నష్టపోయారు. నీలం తుపాను ఇన్‌పుట్ సబ్సిడీ రూ.122 కోట్లు మాత్రమే విడుదలైంది. మిగిలిన తుపాన్ల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రూపేణా రూ.108 కోట్లు అందించాల్సి ఉంది.
Advertisement