గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
గుంటూరు: జిల్లాకు హెలెన్ తుపాను ప్రభావం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి శ్రీహరికోట-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం
వున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తీరప్రాంతంలో అలలు భారీ ఎగసిపడే ప్రమాదం ఉందని, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిజాంపట్నం, సూర్యలంక బీచ్‌లలో అలలు ఎగిసిపడుతున్నాయి. నిజాంపట్నం హార్బర్‌లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల్లో పర్యవేక్షణకు అధికారులను నియామించారు. గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు: 0863 2234070, 2234301.