సముద్రంలో చిక్కుకున్న 5 బోట్లు, గాలింపు చర్యలు | Fishermen boats stuck in sea in Kakinada | Sakshi
Sakshi News home page

సముద్రంలో చిక్కుకున్న 5 బోట్లు, గాలింపు చర్యలు

Published Fri, Nov 22 2013 9:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

Fishermen boats stuck in sea in Kakinada

కాకినాడ : కాకినాడ సమీపంలో  వేటకు వెళ్లిన అయిదు బోట్లు సముద్రంలో చిక్కుకున్నాయి. ఈ బోట్లలో 32మంది మత్స్యకారులు ఉన్నారు. గల్లంతు అయిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్తో గాలింపు చర్యలు వీలు కావటం లేదు.

మరోవైపు మచిలీపట్నంలో అలలు ఎగిసి పడుతున్నాయి. బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలపై హెలెన్ తుపాను ప్రభావం అధికంగా ఉంది. రెండు జాతీయ విపత్తు నివారణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

ఇక గుంటూరు జిల్లాపై హెలెన్ ప్రభావం చూపుతోంది. 39 గ్రామలకు ప్రమాదం పొంచి ఉండటంతో ఆరు వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రేపల్లె, బాపట్లలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉండటంతో తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement