Fishermen boats
-
జగన్ కు మద్దతుగా మత్స్యకారులు బోటు ర్యాలి
-
మత్స్యకారుల జీవితంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
AP: ఒడిశా తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం
సాక్షి, విశాఖపట్నం: ఒడిశా తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. విశాఖతీరానికి చెందిన 30 బోట్లు గంజాం పోర్ట్ లో వున్నాయన్నారు. వాతావరణం సాధారణంగా మారిన తర్వాత చేపలవేటకు అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ ఏ మల్లిఖార్జున్ తెలిపారు. మత్స్యకారుల చిక్కుకుపోయారనే సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మత్స్య శాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరిపారు. గంజాం పోర్టులోకి 17 బోట్లను అనుమతించారు. మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు మత్స్యకారులు, వారికి సంబంధించిన బోట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒడిశా సమీపంలో వాయుగుండం సాక్షి, విశాఖ దక్షిణ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాకి పశ్చిమ వాయవ్య దిశగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించి బలహీనపడి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల రెండు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మేఘాలు లేకపోవడంతో ఎండ ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తిరుపతిలో 37.2, కావలిలో 36.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కృష్ణపట్నం: బోటులో చెలరేగిన మంటలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం సమీపంలో మత్స్యకారుల బోటులో మంటలు చెలరేగి దగ్ధం అయింది. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులను రక్షించారు. చెన్నైలోని కాశిమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోటుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టులో చెన్నైకి చెందిన జాలర్లు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. చదవండి: ప్రేమ వ్యవహారం: రాయబారానికి పిలిచి హతమార్చారు! -
సముద్రంలో చిక్కుకున్న 5 బోట్లు, గాలింపు చర్యలు
కాకినాడ : కాకినాడ సమీపంలో వేటకు వెళ్లిన అయిదు బోట్లు సముద్రంలో చిక్కుకున్నాయి. ఈ బోట్లలో 32మంది మత్స్యకారులు ఉన్నారు. గల్లంతు అయిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు వీలు కావటం లేదు. మరోవైపు మచిలీపట్నంలో అలలు ఎగిసి పడుతున్నాయి. బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలపై హెలెన్ తుపాను ప్రభావం అధికంగా ఉంది. రెండు జాతీయ విపత్తు నివారణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇక గుంటూరు జిల్లాపై హెలెన్ ప్రభావం చూపుతోంది. 39 గ్రామలకు ప్రమాదం పొంచి ఉండటంతో ఆరు వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రేపల్లె, బాపట్లలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉండటంతో తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి.